Facebook Twitter
కోపం.. ఓపిక

కోపం.. ఓపిక

 

నీలోని కోపాన్ని నువ్వెన్ని సార్లు బయటికి విసిరేసినా
అది ఎంతో ఓపికగా నీ దగ్గరే పడి ఉంటుంది.
నీ కంట్రోల్ లో ఉండే కోపానికే అంత ఓపిక ఉంటే
కోపాన్ని కంట్రోల్ చేయగలిగే నీకు ఎంత ఓపిక ఉండాలి.
కోపానికంటే నీకే ఓపిక ఎక్కువని నిరూపించు.
కోపాన్ని నీలోనే అణిచి ఉంచు.
నువ్వలా నీలోని కోపాన్ని బయటికి విసిరేస్తూ పోతే 
కొన్నాళ్ళకి అందరూ నిన్ను దూరంగా విసిరేస్తారు.
కోపాన్ని నీలోనే అణుచుకొని ఓపికగా ఉంటే 
నువ్వు ఎప్పటికీ ఒంటరివి కావు. 
నీకంటూ కొందరు అండగా ఉంటారు.

                                                                                                                           - గంగసాని