రీసర్చ్ లాబ్ - శారదా అశోకవర్ధన్
posted on Jan 16, 2012
రీసర్చ్ లాబ్
- శారదా అశోకవర్ధన్
కొందరిని చూస్తే నమస్కరించాలనిపిస్తుంది
కొందరిని చూస్తే తిరస్కరించాలనిపిస్తుంది
కళ్లు చెప్తాయి పరికించి చూసి
ఎవరు హితులో ఎవరు కాదో
మనసు చెబుతోంది గుండెలోతుల్లోకి తొంగిచూసి
ఎవరు నెయ్యానికి తగదురో
ఎవరు కయ్యానికి కాలు దువ్వుదురో
మనసూ కళ్ళూ ఇచ్చే గైడెన్సుతోనే
కొందరికి నమస్కరిస్తాను
కొందరిని తిరస్కరిస్తాను
ఎప్పుడో గాని కళ్లు దారి తప్పవు
మనసు మార్గం మరువదు
అంచనా తారుమారు కాదు
మాటలే అఖ్కర్లేదు
మనిషిని చదవడానికి
నా మెదడే ఒక రీసెర్చ్ ల్యాబ్