నవ్వు నవ్వించు

 
 
నవ్వు నవ్వించు
 
 

నవ్వాలి నవ్వాలి నవ్వించాలి
చిన్నారి పాపోలె నవ్వాలి
పొన్నారి పాపోలె నవ్వించాలి
గలగలపారే సెలయేరులా
కిలకిలనవ్వాలి కడుపుబ్బేలా
కిలకిలనవ్వాలి
పకపకనవ్వించాలి భాష్పాలు రాలేలా
   పకపక నవ్వించాలి
నవ్వితే రాలు నవరతనాలు
నవ్విస్తే రావు ఏ కలహాలు
నవ్వుతూ నవ్విస్తుంటే శ్రీమతినెపుడు
     సిరులు యింటకురియు రాశురాశులుగా
నవ్వితే దొరికేది ప్రశాంతచిత్తము
నవ్విస్తే దొరికేది స్నేహహస్తము
నవ్వుల్లో బ్రతకాలి నిండుగ
  నవ్విస్తూ ఎదగాలిమెండుగా
నవ్వుతు నడవాలి ముందుకు
నవ్విస్తూ మెలగాలి అందుకు
నవ్వుకుంటు నీలో నీవెమెల్లగా
నవ్వించు నలుగురు నినుమెచ్చగా
 
- చక్రధరరాజు