తెలుగమ్మాయి
posted on Feb 2, 2015
తెలుగమ్మాయి
యతుల జతుల అలజడుల
గొదారి గలగలల
తెలుగమ్మాయి అది తెలుగమ్మాయి
నిండుదనం సంప్రదాయం
తెలుగమ్మాయి అది తెలుగమ్మాయి
బంధాల బాద్యతల
నడుమున ఒదిగిన
తెలుగమ్మాయి అది తెలుగమ్మాయి
మామిడి పిందిలోని ఒగరు
మల్లెపూవులోని సోయగమ్
ఆమెకి సోంతం
తెలుగమ్మాయి అది తెలుగమ్మాయి
తళుకుమనే తారల కన్నుకుట్టి
నేలలోని జాబిలివి నువ్వంటూ
నీ చెంత చేరతామంటు
తెలుగమ్మాయి అది తెలుగమ్మాయి
బాపూ బొమ్మ ఆరణాల అందగత్తె
పదగారణాల పడుచుపిల్ల
తెలుగమ్మాయి అది తెలుగమ్మాయి
- manoharaboga