posted on Feb 17, 2014
నిన్న మెట్టు అక్కడే,
నేనే పై పైకి,
నేడు నాతో బాటే మెట్టు
ఎస్కలేటర్ !
ఏం చెయ్యాలా అని
రోజంతా ఆలోచిస్తుంటాడు
అందుకే ఆయన
చాలా బిజీ !
ఎక్కడేక్కడివో
ఎన్నెన్ని దినుసుల కలయికో
భోజనం
సహజీవనం !
- రామకృష్ణారావు