posted on Jan 23, 2014
పండ్ల భారంతో
కొమ్మలు వంగుతున్నాయి
చేట్టుతల్లికి
మొక్కేందుకేనేమో !
ఆ వాడ
ఊపిరి కోల్పోయింది
ఔను
చెట్లు విరిగి మేడలు మొలిచాయిగా!
నాల్గు తలల యోచన
ఏకోన్ముఖంగా ఉంటుందా
అందుకే సృష్టి
అద్వానంగా...
డా. వై. రామకృష్ణారావు