posted on Jan 17, 2014
అరిటాకు, ముల్లు
సామెత నాకెందుకు ?
ఆకులో భోజనం పెట్టు
అది చాలు.
చలికి
మాటలూ గడ్డకట్టినై
వేసవి వస్తేనే
కరిగి వినిపిస్తాయా ?
రవి
చీకటి మురికిని ఉతికేస్తే
విశ్వావరణ వస్త్రం
పారదర్శకం.
డా. వై .రామకృష్ణారావు