ప్రేమా - బి.ఎల్.ఎన్. సత్యప్రియ
posted on Jan 11, 2012
ప్రేమా-!.....!.....!
-బి.ఎల్.ఎన్. సత్యప్రియ
అనురాగ మొలికిస్తే
అణువువౌతావు
ఆదమరిచేలోగ
ఆకాశామవుతావు
కోరుకున్న వేళల్లో
కొండపైనుంటావు
కాదుపోమ్మన్నపుడు
కాళ్ళ దరికొస్తావు-
అపురూపమని నిన్ను
ఆదరించేవేళ
అందలాలెక్కుతావు
అందకుండ పోతావు
అంధకారంలో
ఆక్రోశించేవేళ
అఖండ జ్యోతివై వెలిగేవు
అనంత వెలుగులే చిమ్మేవు
ప్రణయ రాగాలతో
పరిమళించే ప్రేమా-
పరిహాసమా నీకు
హృదయాల తోటి!