శ్రీశ్రీకి అక్షర నివాళి
posted on Apr 30, 2013
శ్రీశ్రీకి అక్షర నివాళి
పదండి ముందుకు పదండి ముందుకు
పోదాం పోదాం పై పైకి
మూడనమ్మకాల ముసుగు తీయండి
పదవి వ్యామోహలు వదలండి
ప్రాణాలొడ్డి ఎదురు నిలవండి
ధైర్యసాహసాలున్న భావిపౌరులు మీరేనండి
దేశ భవిత మీ చేతుల్లో
తెగువ చూపి కదలండి మీ చేతల్లో
నిర్లక్ష్యం, నైరాశ్యం వదలండి
జగతికి స్పూర్తిగా అడుగు ముందుకేసి
గమ్యాన్ని చేరండి
చరిత్రలో మీరు చిరస్థాయిగా నిలవండి.
రచన - శ్వేత వాసుకి