బడ్జెట్ అంటే ఏంటి?
posted on Feb 2, 2017
బడ్జెట్ అంటే ఏంటి?
బడ్జెట్ అంటే ఆర్దిక 'క్షార'సాగర మథనం...
ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ తాలూకూ కార్పోరేట్లే 'దేవుళ్లు'!
'కొందరు' ప్రతిపక్ష పార్టీ తాలూకూ 'దైత్య' కార్పోరేట్లు కూడా...
'రాహు, కేతువు'ల్లా లబ్ధిదారుల్లో దూరిపోతుంటారు!
ఇక... 'మోహిని' అంటే... అప్పుడు పదవిలో వున్న 'ఆర్దిక మంత్రే'!
మరి హాలాహలం అంటారా?
సంవత్సరం పొడవునా బడ్జెట్ ఇచ్చే ఎఫెక్టే 'విషం'!
దాన్ని 'భరించే' 'శివుడే'... 'జనం'!
-జేఎస్ చతుర్వేది