గరుడ వ్యూహం!
posted on Jan 30, 2017
గరుడ వ్యూహం!
పాముకి నేల మీదే బలం వుంటుంది! అందుకే, గ్రద్ధ దాన్ని ఆకాశంలోకి ఎత్తుకెళ్లి ఓడిస్తుంది!
శత్రువుని జయించాలంటే కూడా అంతే... వాడికి బలం వున్న చోట కాకుండా మనకు బలం వున్న దగ్గరికి రప్పించాలి!
( మనిషికి అన్నిటికన్నా ఎక్కువ బలముండేది ఎక్కడో తెలుసా? ఆధ్యాత్మిక ఆకాశంలో! అక్కడ భగవంతుడే గగనం! జ్ఞాన, వైరాగ్యాలే రెక్కలు! దేవుడ్ని నమ్మిన భక్తుడే గరుత్మంతుడు! సమస్యలన్నీ పాములు! )
-జేఎస్ చతుర్వేది