ఏకాకి
posted on Dec 28, 2016
ఏకాకి
సీ॥నవ్వుకు తోడైరి।నలుగురు నలుదిక్కు
ఏకాకి తానాయె।నేడ్పు నెపుడు
పాటకు మాటకు।పదిమంది జత గూడు
మౌనంబు గతిలేని।పీను గెపుడు
బడి గుడి లలరించు।బహు బంధ తళుకులై
జంట లేకుండు కా।డొంట రెపుడు
సిరులున్న యింటికె।పరివార మధికంబు
పస్తులే కన్నీటి।నేస్త మెపుడు
ఆ॥పేరుకె నిది జెప్ప।ప్రేమ జుట్టంబన్న
నాటకంబు జూడ।నోటు దెపుడు
నర్సపురని వాస।నటరాజ ఘనమోక్ష
విశ్వ కర్మ రక్ష।వినుర దీక్ష
. పద్య రచన
. రాజేందర్ గణపురం