అద్దె గర్భం

అద్దె గర్భం

 



సీ॥ముద్దు లాడెను తల్లి।యద్దింటి బిడ్డతోఁ
దిద్దును తిలకము।పొద్దు వలెను
మూడుముళ్ళ నెలలు।మోయను బరువని
మోమును జూపెట్లు।ముదిత తాను
చనుబాల నివ్వని।తనకేమి బంధము
తీయగఁ యమ్మన్న।తృప్తి గాదు
మోవంగ తానెంత।మురిపాలఁ నొలికిన
జన్మనివ్వని తల్లి।జనని గాదు
ఆ॥ఎదిగి యెరుగు నాడు।ఏదినా తల్లని
పరుగిడు నిను వీడి।పడతి నిజము
నర్సపురని వాస।నటరాజ ఘనమోక్ష
విశ్వ కర్మ రక్ష।వినుర దీక్ష


 


- పద్య రచన
 రాజేందర్ గణపురం