ప్రేమకి హారతవ్వనా
posted on Aug 13, 2020
ప్రేమకి హారతవ్వనా
ఎక్కడి నుంచొచ్చిందో
కొమ్మ పై అలసి వాలిందో పిట్ట!
మేఘాన్ని కదా
కాసింత నీడనిద్దామని కదిలా...
తన రెక్కలు చెప్పే వింత కధనంతా విని,
చినుకునై కరిగా,
వర్షించి తన తాపాన్ని తీర్చా..
చెట్టుకీ బలమొచ్చింది
పిట్టకీ ఎగరాలనిపించింది
అదృశ్యమైన నన్ను గమనింపక
ఎగురుతూనే వెళ్తుంది...!
లేని నన్ను వెతుకుతూ,
తన కంటిలో నుంచి నే జారుతూ...!
ఆవిరవ్వనా...
తన ప్రేమకి హారతవ్వనా???!!!
-Raghu Alla