ఒక సాయంత్రపు వేళ


 

ఒక సాయంత్రపు వేళ
నీ సరసపు బిగి కౌగిలి అనుభూతిని
నే నీ పలుకుల తియ్యందనంలో..
అనుభవైకవేద్యమై పులకరిస్తున్నప్పుడు,
ఒడిలో నన్ను ఒంపుకోని..
వెన్నెలనంతా నీవు దోసిటతో తెచ్చి,
నా నుదిటిపై చిలకరించే వేళను
ఏమని పిలవను?

నువ్వు చెప్పగలవా?
నా కనులెంత సోలిపోయా‌‌‌యో..

ఆ క్షణాలలో చెప్పటానికి,
చందురుడు సైతం
మబ్బుల చాటు నక్కి
వెక్కిళ్లు తెచ్చుకున్నాడని,
నీ ముంగురల చలనపు సిగ్గులకు తెలియదా!
నీ మునిపంటి ముగ్గులనడుగు మరి!!
నిజమో కాదో!!!

 

 

 

Raghu Alla