తెలుగంటే రాజసానికి చిరునామా - అభిలాష
posted on Jan 19, 2012
తెలుగంటే రాజసానికి చిరునామా
భగ భగ మండుతోంది గుండె మన మాతృ భాషను చులకన చేస్తే....
సల సల మరుగుతోంది రుధిర జ్వాల తెలుగుని తేలిక గా చూస్తే....
కసి కసి గా ఉడుకేత్తుతోంది నరం నరం నా తెలుగు తల్లిని బాధిస్తే...
అణువణువులో రగులుతోంది ఆగ్రహం పరాయి భాషకు పెద్ద పీట వేసి సత్కరిస్తే...
మనసు పొరల్లో పోటెత్తుతోంది పెను ప్రకంపనం ఈ తెలుగు గడ్డ మీద పుట్టి ఆ ఘనత చాటి చెప్పకపోతే....
ఎవడబ్బ సోమ్మో మనకెందుకు దండగ....
మన సొత్తు మన ముంగిట్లో వుండగా....
ఎవడి అక్షర ఆస్తినో నువ్వు మోసేదేంది వెర్రిగా...
మన అక్షర లక్షలు మన గుండెల్లో కొలువుండగా....
ఏ అరువు తెచ్చుకున్న డాబుసరులు ఎందుకు నీకు వగరుగా....
మన దర్పం దర్జా సలక్షణంగా మన పుట్టుకతోనే మెరిసిందిగా....
వాడెవడినో చూసి నువ్వు వాత పెట్టుకోకు హీనంగా....
నీ ఘనత నీ రక్తంలో ప్రవహిస్తోంది చూసుకో కళ్ళు తెరచి విప్పరగా....
గుండె చప్పుడైన స్పందించేది నీ మాత్రుభాషలోనేగా....
మరెందుకు మనకి ఈ వేకిలితనపు పిచ్చి కూతల రాతల మరో వేరొ ఎవరో సొత్తు అయిన పరభాషా హోరు ,ఇది నయవంచనేగా....
చేతులారా మనల్ని మనం అమ్ముకుంటున్నాం ఇది నీ మది గ్రహించలేద....
అవసరానికి మించి అనవసరాన్ని పోషించి మన భాషని మనమే కాటికంపుతున్నాం, పెంచుకో విజ్ఞత...
వద్దు మనకి ఆ దద్దమ్మల దారిద్ర్య లేకితనం...
వుందిగా మనకి రాజసంగా డాబు దర్ర్పం దర్జా కలగలసిన తెలుగు గాంబీర్యం....
మన తెలుగుని బ్రతికించుకుందాం...
మన వెలుగుని నలువైపులా ప్రసరిద్దాం....
మన భాషని గర్వంగా మారుమ్రోగిద్దాం....
మన పొగరుని సాటి లేని ఘనతగా చాటి చెప్పుకుందాం....
మన ధీరత్వాన్ని తల ఎత్తి గర్వంగా ప్రజ్వలించుదాం....
జై తెలుగు... జై జై తెలుగు...
నీకు సాటి ఏది లేదు ఇక్కడ దర్జాగా వెలుగు....
-------- అభిలాష