'ఆమె' - బొమ్మారెడ్డి వెంకట రామిరెడ్డి
posted on Jan 19, 2012
'ఆమె'
- బొమ్మారెడ్డి వెంకట రామిరెడ్డి
ప్రేమకీ ద్వేశానికీ మధ్య
ఆ గోడ అతి చిన్నది
'అటు' దూకితే ప్రేమ!
'ఇటు'దూకితే ద్వేషం!!
నేను ప్రేమికుణ్ణి....
అందుకే అంత అటాచ్ మెంట్
నేను ప్రేమికుణ్ణి....
అందుకే అంత డిటాచ్ మెంట్
ఆమె నడిచిపోతుంది.
హృదయాల మీదుగా!
ప్రేమసాగరం మీది
పెనుతుఫానుగా!!
నీ చూపులు నా కనుల్లో గుచ్చుకుని
గుండెల్లోకి దిగిపోయాయి...
ప్రేమకూడా
కత్తిలోతు పగలాంటిదే కదా!
నీ దుఃఖంలో నా కన్నీళ్ళు
నీ ఆనందంలో నా కన్నీళ్ళు
అంతేకదా ప్రేమికుడి జీవితం....
కవితల కన్నీటి సాగరం!!
సశేషం