లవ్ స్టోరీ

                     - జి.వి అమరేశ్వరరావు పార్ట్ - 4     అంటూ పక్కనే ఉన్న ప్లాస్క్ ఓపెన్ చేసి తనే స్వయంగా రెండు కప్పులోకి ఛాయ్ నింపాడు. తర్వాత స్వయంగా టేబుల్ మాట ఒకటి ఆమె ముందు దానిమీద ఛాయ్ కప్పు పెట్టాడు.     ఆమె అంతకముందు చిన్న చిన్న జ్వరాలకి, పడిశాలకి చాలామంది డాక్టర్ల దగ్గరకి వెళ్ళింది. వాళ్ళలో చాలామంది పేషెంట్లు ను కసురుకుంటూనో, పేషెంట్ చెప్పే సిస్టమ్స్ పూర్తగా వినకుండానే ప్రిస్పిక్షన్ రాసేసి ఆ తరవాత రావాల్సిన పేషెంట్ కోసం కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తారు. అంతా మెకానికల్ కమర్షియల్ అనిపిస్తుంది.     వాళ్ళందరికీ భిన్నంగా కనిపిస్తున్నాడు ఇంద్రమిత్ర. అతడి ప్రెండ్లీ ప్రవర్తన ఆమెలో వున్న బెరుకుతనాన్ని పోగొట్టింది. ఆమెకి ఇంద్రమిత్ర ఓ డాక్టర్ గా కాక ఒక స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా, అత్మీయుడిగా కనిపించసాగాడు.     ఒక్క శిశిరతోనే కాదు_ తమ మానసిక సమస్యలు చెప్పకోవడానికి తన దగ్గరకి వచ్చే ప్రతి పేషెంట్ తోనూ ఇంద్రమిత్ర ఇదే విధంగా ప్రవర్తిస్తాడు.     "ఛాయ్  లో పంచదార సరిపోయిందా ఇంకాస్త వేయమంటారా?" అంటూ అడిగాడు ఇంద్రమిత్ర.     చిక్కటి పాలల్లో యాలుకులు వేసి తయారుచేసి ఛాయ్ ఘుమ ఘుమ వసల్ని వెలువరిస్తుంది.     మెల్లగా నవ్వింది ఆమె.     "అక్కర్లేదు_ సరిపోయింది."     ఆమెలో కొత్తతనం పూర్తిగా పోయింది అని నిర్దారించుకున్నక అడిగాడు ఇంద్రమిత్ర.     "నన్ను ఒక డాక్టర్ గా చూడవద్దు. మీ స్నేహితుడిగా భావించండి. నేను మీకు చేతనయినంత సహాయం చేస్తాను."     అమె గోళ్ళరంగు వైపు చూస్తూ చెప్పింది.     "నాకింకా పెళ్ళికాలేదు. మామ్మా నన్న నాకు పెళ్ళి సంభందాలు చూద్దాం అనుకుంటున్నారు. అయితే నాకున్న అలవాటు భవిష్యత్తు లో ఏమయినా సమస్యల్ల్ని తీసుకు వస్తుందేమో అని భయపడుతున్నారు.             ఇంద్రమిత్ర చెప్పమన్నట్టు చూశాడు.     "నిజానికి చాలా రోజుల వరకు నా అలవాటును మా అమ్మా నాన్నా వాళ్ళు గమనించలేదు. ఒకసారి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినపుడు నా కజిన్ సిస్టర్ గమనించింది.     క్షణం ఆగి చెప్పసాగింది శిశిర.     "నేను రోజుకు కనీసం పది  పన్నెండుసార్లు స్నానం చేస్తాను. చేతులు, కాళ్ళు, ముఖం కడిగిన దాన్ని కదిగినట్టే వుంటాను.మొదట్లో రెండు మూడుసార్లు స్నానం చేసెదాన్ని. కాని అలవాటు పది పన్నెండు సార్లకి పెరిగింది. ఈ అలవాటు నుంచి కంట్రోల్ చేసుకోవడానికి ఎంత ప్రయత్నించినా నాకు సాద్యం కావడంలేదు. పదే పదే చేతులు, కళ్ళు కడుక్కోవటం, అనేకసార్లు  స్నానం చేయటం చూసిన మా బంధువులు నాకు పిచ్చిపట్టింది అనుకుంటున్నారు. కాని మిగిలిన విషయాల్లో నేను మామూలు గానే వుంటాను.     మొన్న నేను అమ్మా నాన్నలతో కల్సి సినిమాకు వ్వేల్లాను. సరిగ్గా అరగంట తర్వాత నాకు అసహనంగా అనిపించసాగింది. ఏదో అదృశ్యశక్తి పదవాటి వేళ్ళతో నా కఠం నులుముతున్న అనుభూతి. నేను ఇక సినిమా హాల్లో క్షణం కూడా వుండలేకపోయాను మా అమ్మా నాన్నకు చెప్పకుండా ఇంటికి వచ్చి స్నానం చేశాను. అప్పటివరకూ నన్నుపట్టి పిడిస్తున్నా అదృశ్యరాక్షసి కబంధ హస్తాలనుంచి విముక్తి చెందిన ఫీలింగ్ వెంటనే కలిగింది.మళ్ళీ రెండడుగుల తర్వాత మళ్ళీ అసహనంగా, దుఃఖంగా, కోపంగా అనిపిస్తూ వుంటుంది మళ్ళీ స్నానం చేస్తేకాని నా మనస్సు శాంతించదు. చివరకి నా అలవాటువల్ల బయటకు వెళ్ళడం మానుకున్నాను. కాలేజీ చదువుకు స్వస్తి చెప్పాను. డిగ్రీ చదువు అర్దాంతరంగా ఆపేశాను. మా బంధువులు, స్నేహితులు శ్రేయోభలాషులు అందరూ నాకు పిచ్చి పట్టిందనుకున్నారు."     క్షణం ఆగింది శిశిర.     ఆమెకు ఇంద్రమిత్ర మంచి నీళ్ళాగ్లాసు అందించాడు. ఒక్కగుక్కలో గ్లాసు ఖాళీ చేసి తిరిగి చెప్పసాగింది     "నాకు పెళ్ళి కావలసిన చెల్లెళ్ళు మరో ఇద్దరు వున్నారు. నాకు పిచ్చి అని తెలిస్తే మా చేల్లేళ్ళు  క్కూడా పెళ్ళిళ్ళు కావు. అయినా నేను నా అలవాటు మార్చుకోలేకపోయాను. రెండు మూడుసార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాను.     అని చేతుల్లోముఖం పెట్టుకుంది శిశిర.     ఎగిరిపడుతున్న ఆమె భుజాల్నిబట్టి శిశిర రోదిస్తున్నట్టు గ్రహించాడు ఇంద్రమిత్ర.     అతడికి శిశిర సమస్య అర్ధం అయింది. ఆమె చెప్పడం మిగిమ్చే సమయానికి ఆమె మానసిక స్థితికూడా అర్ధం చేసుకున్న ఇంద్రమిత్ర అనునయంగా చెప్పాడు.     "బాగా ఎగ్జయిట్ అయ్యారు. కాసేపు బల్లమీద పడుకుని రిలాక్స్ అవ్వండి."     శిశిర పక్కనే ఉన్న బల్ల వేపు మూవ్ అయింది.     ఇంద్రమిత్ర తాను డెయిలీ మిర్రర్ దినపత్రికకు వ్రాసే వ్యాసాల్లో హిప్నటిక్ షిడిషన్స్ గురించి కూడా వివరంగా తెలియచేశాడు.     ఒక వ్యక్తిని హిప్నటిక్ సజిషన్ లోకి వెళ్ళాల్సిన అవసరం వున్నపుడు ఆ వ్యక్తి సైక్రియాటిస్ట్ కి పూర్తిగా సహకరించాలి. హిప్నాటిజంలోకి వేళ్ళనవసరంలేదు.అని అ వ్యక్తి భావించినపుడు సైకియాస్టిక్ ఇచ్చే సజెషన్స్ వల్ల ప్రయోజనం వుండదు. అ వ్యక్తి ట్రాన్స్ లోకి వెళ్ళడం జరగదు.     శిశిర తాను పూర్తిగా సహకరించటానికి మానసికంగా సిద్దపడిన తర్వాతే ఆమె ఇంద్రమిత్రకు కలిసింది. అతడు వ్రాసే వ్యాసాలు చదివి వుండడంవల్ల తనకు అతడు సజెషన్స్ ద్వారా ట్రాన్స్ లోకి పంపబోతూన్నాడనే విషయం అర్ధం చేసుకుంది శిశిర.     ఆమెను ట్రాన్స్ లోకి పంపడానికి ఇంద్రమిత్రకు రెండు నిమిషాలు కంటే ఎక్కువ సమయం పట్టలేదు.     మానసికంగా ఇంద్రమిత్రఅదేనంలోకి వెళ్ళిన శిశిర తన కధ చెప్పసాగింది.             *    *    *    *  

స్నేహమంటే ఇదే

|| స్నేహమంటే ఇదే ||   స్నేహమంటే ... సాగారాకాశాలదే... యోజనాల దూరంలో ఉన్నా కల్పాలైనా కలుసుకోకున్నా క్షితిజం దగ్గర కలిసినట్లనిపిస్తూ దివారాత్రాలనే భేదం లేకుండా ఒకదానినొకటి చూసుకుంటుంటాయి   ప్రతిఫలాపేక్ష లేకుండా పలకరిస్తుంది గగనం. పగలు... కొన్ని వెలుగురేకులు చల్లుతూ రాత్రి ...  గుప్పెడు చల్లనికాంతులు చిలకరిస్తూ సంద్రం ప్రతిబింబిస్తుంది అంబరాన్ని పగటి కాంతుల మిలలను చూపుతూ తారల తళుకుల అందం చూసుకొనే అద్దమౌతూ. ఆవిరిపూలతో మేఘాలను నిర్మిస్తుంది కృతజ్ఞతలను మౌనంగా తెలియజేస్తుంది కమ్మని స్నేహాన్ని కలకాలం నిలుపుకుంటుంది. స్నేహమంటే పువ్వుదీ...పరిమళానిదే. మొక్కనుంచి వేరైనా నిర్దాక్షిణ్యంగా తుంచేసినా  కడదాకా కలిసే ఉంటాయి వేరుచేయడం అసంభవం. విడివిడిగా చూడానుకోవడం అసాధ్యం స్నేహమంటే మనదే... నీ కన్ను దుఃఖిస్తే నామనసు చమరిస్తుంది నా మనసు శోకిస్తే నీ గుండె భారమౌతుంది. ప్రేమలో ఉండే స్వార్ధాన్ని మన స్నేహం జయించింది. స్నేహంలోని మాధుర్యాన్ని  జగతికి చాటి చెప్పింది.                                                                   ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

లవ్ స్టోరీ

       లవ్ స్టోరీ                      - జి.వి అమరేశ్వరరావు పార్ట్ - 3       అది ఇంద్రమిత్ర అయుష్హుకు సంభందించిన అంశం.ఆ అంశం కింద ఇంద్రమిత్రకు యమగండం వుందనీ, ఆ గండాన్ని దాటగలిగితే, అతడు మరో అరవై తొమ్మిది సంవత్సారాలవరకూ బ్రతికే అవకాశం వుందనీ.     దాదాపు నేలరోజులపాటు వుండే యమగండం కాలాన్ని దాటడానికి రోజూ శివుడుకి బీజక్షరాల జపం చేయాలనీ, యమగుండకాల పరిధి 21-11-1998 నుంచి 19-12-1998వరకూ వుంటుంది. అని వ్రాసివుంది. "అంటే తనకు ప్రాణ గండం నిన్నటినుంచే ప్రారంభం అయిందన్నమాట" అనుకున్నాడు ఇంద్రమిత్ర.     చివరి అంశం చదివిన తర్వాత ఇంద్రమిత్ర పెదవుల మీద చిరునవ్వు ప్రత్యక్షం అయింది. అతడు తన చేతిలోని ఆస్ట్రాలజీ షిట్ ని చించిముక్కలు చేసి డస్ట్ బిన్ లోకి విసిరాడు.     "ఎక్స్ క్యూజ్ మీ " అన్నా పిలుపుతో ఐరిస్ తల ఎట్టి చూసింది. ఎదురుగా దాదాపు ఇరవై సంవత్సారాల వయసున్న యువతి నిలబడి వుంది.     "నా పేరు శిశిర. డాక్టర్ గారితో అపాయింట్ మెంట్ వుంది" అంటూ చెప్పిందా అమ్మాయి.     ఐరిస్ ఆ ఉదయం ఇంద్రమిత్రతో అపాయింట్ మెంట్ వున్నవాళ్ళు లిస్టు వైపు చూసింది.     ముల్క్ రాజ్....     శిశిర....     ఆర్ముగనావలర్....     ఏకనాథన్....     సియోరామ్....     త్రైలోకనాథ్.... కొల్హాట్కర్....     నంబూద్రి....     ప్రసన్నలావ్ జైన్....     అవనింద్రనాథ్....     ప్రతి పేరుకూ ఎదురుగా వాళ్ళ అపాయింట్ మెంట్ టైము కూడా నోట్ చేసి వుంది. ఐరిస్ ఓసారి చేతి గడియారం వంక చూసుకుంది. అప్పటికే ముల్క్ రాజ్ రావలసిన సమయం దాటి అయిదు నిమిషాలు అయింది. రావలసిన మొదటి పేషెంట్ కరెక్ట్ సమయానికి కనక రాకపోతే ఆ తరువాత రెండో పేషెంట్ కనక రాదేగా వుంటే రెండో వ్యక్తిని లోపలకి పంపించమని ఐరిస్ తో ఇంద్రమిత్ర గతంలోనే చెప్పి వున్నాడు.     ఐరిస్ అపాయింట్ మెంట్ నడుస్తూ ఇంద్రమిత్ర మూస్తూ శిశిరతో డాక్టర్ గారు లోపలవున్నారు వెళ్ళండి" అంటూ చెప్పింది.     శిశిర మెల్లిగా నడుస్తూ ఇంద్రమిత్ర రూమ్ వైపు కదిలింది.     ఆమె కనుమేరుగు అయ్యేవరకూ చూస్తూనే వుంది ఐరిస్. ముందు వైపు శిశిర ఎంత అందంగా వుందో, వెనుక వైపు నుంచి కూడా అంతే అందంగా వుంది. అందమయిన ముఖంతో పాటు చక్కటి పర్సనాలీటి వుండే ఆడవాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో వుంటారు. అలాంటి వాళ్ళలో శిశిర ఒకటి.     శరీరం చాయనఛాయా రంగులో ఉన్నా చాలా అందమైన అమ్మాయి శిశిర కన్ సల్తిమ్గ్ రూమ్ లోకి వెళ్ళగానే చూపులు మరల్చుకుని పక్కనే వున్న ఓ వారపత్రిక చేతిలోకి తీసుకుంది ఐరిస్.     లోపలకి వచ్చిన శిశిర చ్వైపు పరీక్షగా చూస్తూ కూర్చావుమంనట్లు కుర్చీ వైపు చెయ్యి చూపించాడు ఇంద్రమిత్ర.     ఆమె ఇంద్రమిత్రకు నమస్కారం చేసి కూర్చుంది.     ఇంద్రమిత్ర తనను పరిచయం చేసుకుంటూ చెప్పాడు_     "నా పేరు ఇంద్రమిత్ర... ఈ మద్యనే ప్రాక్టీస్ ప్రారంభించాను.     శిశిర ...     "అవును.దేయిలే మిర్రర్ పత్రికలో మీ గురించి చదివాను..... మీ ఫోటో కూడా చూశాను" అని ఇంద్రమిత్ర వైపు ఓ సారి చూసింది ఆమె.     నిజానికి ఇంద్రమిత్ర ఫోటోలో కన్నా చాలా హ్యండ్ సమ్గా వున్నాడు. కాలేజీలో చదివినపుడు అయిదు సంవత్సరాల పాటు మిస్టర్ హైదరాబాద్ టైటిల్ కైవశం చేసుకున్నాడు.     బలమయిన శరీరంతోపాటు చురుగ్గా చూసే కళ్ళు, కోటేరుముక్కు, విశాలమయిన నుదురు, వత్తయిన మీసకట్టుతో మీసాలు పెంచిన గీకు వీరుడు హీర్క్యులస్ లా కనిపిస్తుంటాడు.     సైకియాట్రిస్టు ప్రాక్టిస్ మొదలు పెట్టిన ప్రారంభంములో ఇంద్రమిత్ర దగ్గరకి పేషెంట్స్ అట్టే వచ్ఘేవాళ్ళు కాదు. డెయిలీ మిర్రర్ పత్రికలో పాఠకుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంతో ఇంద్రమిత్ర ప్రాక్టిస్ పెరిగింది దాదాపు ఆరు నెలల నుంచీ డెయిలీ మిర్రర్ డెయిలీ ప్రశ్నలకు అసమాదానాలు యిస్తున్నాడు ఇంద్రమిత్ర.     డెయిలీ మిర్రర్ లో న్యూస్ ఎడిటర్ గా పనిచేసే ఘనశ్యాం ఇంద్రమిత్రకు మంచి ప్రెండ్. మొదట్లో ప్రాక్టిస్ బాగాలేకపోవడంతో తాను పనిచేసే పత్రికలో ఏదైనా శీర్షక నిర్వహించమనీ,అందువల్ల ఒకవైపు పత్రికకు అదనపు ఆకర్షణతోపాటు ఇంద్రమిత్ర ప్రాక్టిస్ పెరిగే అవకాశం వుందనీ చాలాసార్లు చెప్పాడు ఘనశ్యాం. చవరకు ఘనశ్యాం మాటను తిసేయలేని ఇంద్రమిత్ర డెయిలీ మిర్రర్ లో 'మీరు మీ మానసిక సమస్యలు' అనే పేరు మీద శీర్షక ప్త్రారంభించటం మొదలు పెట్టాక నాలుగు వారాల్లో అద్భ్తమటిన రెస్పాన్స్ వచ్చింది ఇంద్రమిత్ర బిజీ అయ్యాడు. అల ఇంద్రమిత్ర నడుపుతున్న శీర్షక చదివి అతని ఆడ్రస్ తెలుసుకుని కలుసుకోవడానికి వచ్చింది శిశిర.     ఇంద్రమిత్ర అడిగాడు.     "ఏం తీసుకుంటారు? కాఫీ, ఛాయ్, కూల్ డ్రింక్?"     ఆమె ఇబ్బందిగా కదిలింది.     "పర్లేదు చెప్పండి."     "నేను ఇంతకు ముందే ఛాయ్ తాగి వచ్చాను."     "ఇంకో కప్పు తాగండి. బయట వాన పడేట్టుంది. ఈ వాతావరణలో వేడి వేడి ఛాయ్ తాగితే బావుంటుంది."

అనిత

            అనిత                     - డా|| సి|| ఆనందారామం  పార్ట్ - 1     "ప్రియమైన అత్తయ్యకి,     నేను రేపు బయలుదేరి మీ ఊరు వస్తున్నాను. అక్కడి మా పొలం వ్యవహారాలు పరిష్కరించుకొనే వరకూ మీ ఇంట్లోనే వుంటాను.                      నమస్కారాలు.                     నీకోడలు.                     అనిత......     ఉత్తరం  చదవటం పూర్తి చేసినా  మతిపోయినా దానిలా చూస్తూ కూర్చుంది శారదమ్మ,     "ఏమిటమ్మా అది? ఎవరి దగ్గరనుండి?"     కూతుహలంగా అడిగాడు రాజారావు. ఉలిక్కిపడింది శారదమ్మ.     "అనిత రాసింది. ఇక్కడికి వస్తోందట!"     ఈ మాటలు వినగానే శారదమ్మకంటే ఎక్కువగా వులికి పడ్డాడు రాజారావు.     అతని కనుబొమలు ముడిపడ్డాయి. "అనిత రాసిందా? అక్కడికి వస్తోందా? ఎందుకు?"     "పొలం  వ్యవహారాలు పరిష్కరించుకోడానికట !"         "దానికి ఆవిడెందుకు రావటం! మావయ్య రావచ్చుగా!"     శారదమ్మ  సమాధానం చెప్పలేదు. బేలగాచూసి వూరుకుంది.     "మగవాళ్ళు చేసుకోవలసిన పనులకి తను తయారవటం దేనికి? అంతేలే! ఎవరి సంతానం మరి!"     వెటకారంగా అన్నాడు రాజారావు.     అప్పటికీ శారదమ్మ మాట్లాడలేదు.     "మా ఇంట్లోదిగటానికి వీల్లేదని ఖండితంగా రాసెయ్యి - ఒంటరిగా  పొలం వ్యవహారాలు పరిష్కరించుకోటానికి రాగలిగిన వ్యక్తి ఒంటరిగా  నివసించలేకపోలేదు"     కచ్చితంగా అన్నాడు రాజారావు.     శారదమ్మ ముఖం పాలిపోయింది.     కొన్నిక్షణాలు మాట్లాడకుండా మారుకుని ఎలాగో గొంతు పెగల్చుకుని "పోనీ, రానియ్యరాదురా! కొన్నాళ్ళు మనింట్లో ఉంటుంది. నీ స్నేహితులెంతమంది ఎన్నిరకాల వాళ్ళు మనింట్లో ఉంటుంది. నీ స్నేహితులెంతమంది ఎన్నిరకాల వాళ్ళు మనింట్లికి రావటంలేదూ? సొంత మేనకోడలు! ఆ మాత్రం ఉంచుకోలేనూ?" అంది.     రాజారావు విస్తుపోయి చూశాడు. అతనికి జ్ఞానం వచ్చిన దగ్గిర మండీ చూస్తున్నాడు.     శారదమ్మ ఎన్నడూ ఎవరి మాటలకు ఆవునినకాని కాదనికాని అనలేదు.     ఆవిడ నోట్లో ఎప్పుడూ "అలాగే" అన్న పదం  సిద్దంగా వుంటుంది.     ఎవరేం చెప్పినా  వెంటనే "అలాగే" అనేస్తుంది.     భర్త బ్రతికి ఉన్నన్నిరోజులూ అలాగే అంది. కొడుకు ప్రాజ్ఞు డయి యాజమాన్యం స్వీకరించాకా అలాగే అంటోంది.     తల్లి ఈ బేలతనం చూసి రాజారావు అనేకసార్లు జాలిపడినా అప్పుడప్పుడు చికాకుపడక పోలేదు.     ముఖ్యంగా తండ్రి చేసిన అప్పుల జాబితాలు తలచుకున్నప్పుడల్లా ఈ చికాకు ద్విగుణీకృతమవుతూ వుంటుంది.     తన తల్లి మరీ ఇంత అమాయకంగా అన్నింటికీ 'అలాగే' అనకుండా వుంటే తన తండ్రి ఇంత వ్యసనలోలుడయి ఇన్ని అప్పులు చేసేవాడు కాదేమో! ``     భర్తకు విధేయురాలై ఉండటం భార్య ధర్మం కావచ్చు.     కానీ,     తన గృహాన్ని చక్కదిద్దుకోవటం గృహిణి ధర్మం కాదా?     ఎప్పుడూ అన్నింటికి గాను గెద్దులాగా తల ఊపే తల్లి ఈ నాడు స్వతింత్రించి ఇన్ని మాటలాడేసరికి ఆశ్చర్యంగా చూశాడు.     శారదాంబ ఏదో ఆవేశంలో అన్ని మాటలందేకాని వెంటనే తన మాటలకు తనే ఆశ్చర్యపోయి భయంగా బేలగా కొడుకు వంక చూసింది.     ఆ చూపులకు తట్టుకోలేక పోయాడు రాజారావు.     "సరే! రమ్మని రాయి."     అన్నాడు పొడిగా___     "నీకు కష్టంగా  వుంటే ......"     "నట్టుతూ ఆగిపోయింది శారదమ్మ "నాకు కష్టంగా వుంటే వుంటుంది.  నాకు సాధ్యమయినంతవరకూ నీ యిష్టాన్ని కూడా గౌరవిస్తాను."     నడిచిపోతున్న కొడుకును వెనుకనుండి చూచి లోలోపల నిట్టూర్పు విడుచుకోంది శారదాంబ.     అంతా తండ్రి రూపమే!     కానీ, స్వభావాలతో ఎంత వైరుధ్యం!     "నాకు సాధ్యమయినంతవరకూ నీ యిష్టాన్ని కూడా గౌరవిస్తాను."     "ఎన్నాళ్ళకు వింది తను ఇలాంటి మాట!     మొదటినుండి తనది సాత్త్విక స్వభావమే!     వాదాలకూ యుద్దాలకూ కాలువ తవ్వటం ఏనాడూఇష్టం లేదు.     ఏదో సందర్భంలో భర్త అభిప్రాయానికి వ్యతిరేకంగా ఏదో చెప్పబోయింది.     కస్సుమన్నాడు భర్త.     "బ్రతకటమెలాగో మాకు తెలుసు. ఈ నాడు నువ్వు  నాకు బోధించక్కర్లేదు, నోరు మూసుకుని ఇల్లు చక్కదిద్దుకో!"     తన ప్రకృతి ఎంత సాట్ట్వకమో, మనసంత సున్నితం.     ఆ రోజు మనసు తీవ్రంగా మథనపడింది. ఆ తర్వాత ఏనాడూ ఏ సందర్భాలోనూ తానై కలిగించుకోలేదు.     ఆ యాంత్రికమైన అలవాటు రానురాను తన వ్యక్తిత్వంలో ఒక భాగమై పిల్లల  ముందు కూడా అలాగే నిలబడింది.      ఈ నాటికి తన రాజా  'నీ యిష్టాన్ని గౌరవిస్తాను' అంటున్నాడు.     ఎంతవరకు గౌరవిస్తాడు? తన అంతరాంతరాల్లో కోరిక నెరవేరుతుందా?     ఇంటిముందు ఒక్కసారిగా సందడి చెలరేగింది.     కన్న ఎందుకో అరుస్తున్నాడు.     కమల పకపక నవ్వుతోంది.     సుశీల ఇంట్లోకి వస్తూ కూడా పుస్తకం చదవటం మానలేదు.     పిల్లలంతా ఇంటి కొచ్చారు.     శారదాంబ లేచింది.     పిల్లలకు త్వరగా కాఫీ ఫలహారాలు అందించాలనే ఆరాటంలో ఆవిడ ఆలోచనలు ఎక్కడి వక్కడ ఎగిరిపోయాయి.                 2     "సుశీలా! రమణరావుగారు వచ్చారు. కాస్త ముఖం కడుక్కుని  మంచి చీర కట్టుకుని బయటకురా!"     పిల్లల గదిముందు నిల్చుని అన్నాడు రాజారావు. సుశీల కనుబొమలు ముడుచుకున్నాయి.     అది గమనించి లక్ష్యపెట్టకుండా  "త్వరగా రా! అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లు.     సుశీల విసుగ్గా లేచింది.     రమణరావును తలచుకొంటేనే శరీరం చీదరతో జలదరిస్తుంది సుశీలకు.     రమణరావు తెల్లగానే వుంటాడు.     ఒడ్డూ, పొడుగూ కూడా వున్నాడు.     కానీ, అతని కళ్ళలో ఏదో క్రౌర్యం కనిపిస్తుంది సుశీలకి.     కొంతమంది కళ్ళు ముక్కూనోరూ అన్నీ బాగానే ఉన్నా చూడగానే యేదో విరక్తిభావం కలుగుతుంది.     అతని సమక్షంలో నుండి పరుగెత్తి పారిపోవాలనిపిస్తుంది.     కానీ, ఆ రమణరావుకే తనను కట్టిపెట్టాలని చూస్తున్నాడు అన్నయ్య.     రమణరావు పోలీస్ ఆఫీసర్ కొడుకు. చెప్పుకోదగినంత ఆస్తిపాస్తులు కలవాడు.    

లవ్ స్టోరీ

   లవ్ స్టోరీ                      - జి.వి అమరేశ్వరరావు పార్ట్ - 2     అప్పటికీ వర్షం కొంచెం తగ్గుముఖం పట్టింది. కానీ అంధకారం మరింత దట్టమైంది.     సాధూరం ఆస్ట్రాలజీ సెంటర్ లోంచి రోడ్డుమీదకి వచ్చి ఏదన్నా ఆటో దొరుకుతుందేమో అని చూస్తూ నడవసాగాడు.     రోడ్డుమీద వాన నీళ్ళతోపాటు డ్రైనేజీనీళ్ళు పొంగిపొర్లుతున్నాయి,     అతను రోడ్డు ఎక్కటం చూస్తూనే మోటాడోర్ వాన్  లోంచి దిగిన ఇద్దరు వ్యక్తులు మూవ్ అయ్యారు. సరిగ్గా వీధి మలుపు తిరిగే సమయంలో సాధూరాంకు పెద్ద ఎత్తున పెళ్ళి భజంత్రీలు చెవులకు సోకాయి. ఓ పెళ్ళి వూరేగింపు వీధిలోకి వస్తోంది.     ముందుకు అడుగు వేయబావుయిన సాధూరాం ఆగాడు. అదే సమయంలో అతడిని నీడలా వెంటాడుతూ వచ్చిన ఇద్దర్లో బలంగా కనబడుతున్న వ్యక్తి రెయిన్ కోటు జేబులోంచి పైకి తీశాడు ఎనిమిది అంగుళాల చురకత్తి. పెళ్ళి వూరేగింపు  తాలూకు లైట్లు వెలుగు నీడల్ని స్పష్టిస్తున్నాయి.     రెయిన్ కోటు వ్యక్తి ఒడుపుగా సాధూరాం ఎడంవైపు కిడ్నీలోకి పిడి వరకూదింపాడు చురకత్తి.     ఎర్రటి రక్తం ఒక్కసారిగా చిమ్మికోట్టింది.     ప్రొఫెషనల్ కిల్లర్ గా కనిపిస్తున్నా రెయిన్ కోటు వ్యక్తి చరకత్తిని సర్రున బయటకి లాగి రెండో కిడ్నీలో మరొక్కపోటు  పొడిచాక చురకత్తిని అలాగే సాధూరం బాడీలో వదిలేసి పాదరసంలా వేగంగా మూవ్ అవుతూ సేవ్ మెంట్ మీదకి ఎక్కిచీకట్లో కదులుతూ దూరంగా పార్క్ చేసివున్న సుమో వైపు మూవ్  అయ్యాడు. రెండో వ్యక్తి అతడిని ఫాలో అయ్యాడు.     పెళ్ళి వూరేగింపును చూసి ఆగిపోయిన సాధూరాంకు తనను వెనక నుంచి తోసినట్లు అనిపించింది. అంతలోనే ఎవరో మరొకసారి నేట్టినట్టు అనుపిమ్చాగానే అతడు కోపంగా తల వెనక్కి తిప్పి చూశాడు.     మసక చీకట్లో రెయిన్ కోట్లు ఫెల్డ్ హ్యాట్స్ ధరించిన ఏవో రెండు ఆకారాలు అతడికి కనిపించాయి. సరిగ్గా అదే సమయంలో వీపు దిగువున నుంచి ప్రారంభం అయినా నైప్పి శరవేగంగా శరీరం మొత్తం విస్తరించింది.     సాధూరం పెద్దగా అరవబావుయాడు. అంతలోనే అతడి కళ్ళముందు చీకట్లు కమ్ముకున్నాయి, చిన్న గురకలాంటి శబ్దం అతడి నోటి నుంచి వెలువడింది.శరీరం నేలమీద కూలిపోయేలోపే అతడు ప్రాణాలు వదిలాడు, రోడ్డుమీద మోకాళ్ళ లోతులో పారుతున్న వాననీళ్ళు అతడి రక్తంతో ఎర్రబడసాగాయి.                                                                       *    *    *    *        ఆ మర్నాడు     సైక్రియాటిస్ట్ ఇంద్రమిత్ర ప్రయాణిస్తున్న మారుతి నక్షత్రమండల్ కాంప్లెక్స్ ఎల్లర్ పార్కింగ్ ప్లేస్ లో ఆగింది. ఇంద్రమిత్ర ఇంజన్ ఆఫ్ చేసి,డోర్స్ క్లోజ్ చేసి లిప్ట్ మీదుగా నక్షత్రమండల్కాప్లేక్స్ తొమ్మిదో అంతస్తులో వున్న డబల్ బెడ్ రూమ్ ప్లాట్ అతడు ఒక చిన్న క్లినిక్ నిర్వహిస్తున్నాడు.     ఇంద్రమిత్ర వేగంగా నడుస్తూ తన ప్లాట్ లొకిఉ ప్రవేసించాడు. అప్పటి వరకూ అతడి కోసమే ఎదురుచూస్తున్నది. ఐరిన్. ఇంద్ర మిత్ర ఐరిస్ వైపు చిరునవ్వుతో చూశాడు.     ఐరిస్ కు దాదాపు పదిహేడు సంవత్సరాల వయస్సు వుంటుంది. మోకాళ్ళాకురెండు అంగుళాల పైకి వున్న స్కర్ట్ లోంచి తెల్లటి తోడలు కనిపిస్తున్నాయి. కాలుమీద కలు వేసుకుని కూర్చున్నా ఐరిస్ ఇంద్రమిత్రని చూసి నిలబడి లిప స్టిక్ టీ షర్ట్ లోంచి ఆమె గుండ్రని భుజాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, దట్టమయిన వంకీల జుట్టును వెనక్కి లాగి పావునీతయిల్ కట్టడంవల్ల ఆమె ఫాలభాగం విశాలంగా కనబడుతోంది. నీట్ గా కట్ చేసిన ఐబ్రోస్ చేత్తో గీసినట్టు ఇంద్రధనుస్సులా అర్దచంద్రాకారంలా వంపుతిరిగాయి. దట్టమైన ఐలాసిస్ ఆమె సౌందర్యాన్ని ఇనుమడింపచేశాయి. ఇంద్రమిత్రకు వచ్చే టెలిఫోన్స్ కు సమాధానం చెప్పటం, అతడి వద్దకు వచ్చే పేషెంట్స్ ను ఒక పద్దతిలో లోపలకి పంపించటం, పేషెంట్స్ కేస్ షీట్స్ మెయిన్ టెన్స్ చేయటం ఐరిస్ ముఖ్యమైన పనులు.     ఇంద్రమిత్రను చూడగానే ఐరిస్ లేచినిలబడి చిరునవ్వుతో చెప్పింది.     "సర్! డాక్టర్ అద్వైత్ ఫోన్ చేశారు. తన పేషెంట్ కి మీ గురించి రిఫరెన్స్ యిచ్చారట. అయన రిఫరెన్స్ చేసిన పేషెంట్ పేరు ఇంద్రకూమార్.     ఇంద్రమిత్ర తలపకిస్తూ తన కన్ స్టటేషన్ రూమ్ లోంచి వెళ్ళిపోయాడు. అతడివైపు ఐరిస్ చిరుకోపంతో చూసింది. ఇంద్రమిత్రకు పాతిక సంవత్సరాల వయసుంటుంది. ఎక్సేర్ సైజ్ బడీ అవడంవలన కండలు తిరిగిన శరీరంలో బలంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంటాడు. ఇంద్రమిత్రకు ఎట్రాక్ట్ చేయటానికి ఐరిస్ ప్రయత్నిస్తూనే వుంది. ఎప్పుడూ బీజీగా వుండే ఇంద్రమిత్ర ఆమెను పట్టించుకోవడంలేదు.     తన గదిలోకి వెళ్ళిన ఇంద్రమిత్ర ఆ రోజు చూడాల్సిన కసు తాలూకు ఫైల్స్ చేతిలోకి తేసుకున్నాడు. అదే సమయంలో ఇంటర్ కం గణగణ మ్రోగింది. ఇంద్రమిత్ర రిసీవర్ చెవికి అనించుకున్నాడు.అవతలి వైపు నుంచి ఐరిస్ కంఠం వినిపించింది.     "సర్! నైన్త్ ప్లానెట్ ఆస్ట్రాలజీ సెంటర్ నుంచి ఓ మనిషి వచ్చాడు.     "వెంటనే అతన్ని లోపలకి పంపించు."     నైన్త్ ప్లానెట్ స్త్రాలజీ సెంటర్ పావుప్రయితర్ "కలిపురష్ పాండే" ఇంద్రమిత్రను మంచి ప్రెండ్, ఇంద్రమిత్రకు జాతకం, హస్త సాముద్రికం వంటి వాటిమీద ఏ మాత్రం నమ్మకంలేదు. వద్దని ఎంత చెప్పిన వినకుండా ఇంద్రమిత్ర డేటాప్ బర్త్, పుట్టిన సమయం మొదలైన వివరాలు తీసుకున్నాడు పాండే.ఇది జరిగి దాదాపు మూడు రోజులు అయింది. ఆస్ట్రాలజిస్ట్ గా పాండేకి  ట్వీన్ సిటీస్ లో మంచి పేరుంది.     నైన్త్ ప్లానెట్ ఆస్ట్రాలజీ సెంటర్ నుంచి వచ్చిన వ్యక్తి ఇంద్రమిత్రకు ఓ కవర్ యిచ్చి వెళ్ళిపోయాడు. ఇంద్రమిత్ర కవర్ లోంచి ఓ కంప్యూటర్ ప్రింట్ ఔట్ బయటకి తీసి చదివాడు.     అందులో ఇంద్రమిత్రకు చెందిన నక్షత్రగుణం, అతడు పుట్టిన ప్రదేశం తాలూకు రేఖాంశ, అక్షాంశాల వివరాలు, అతదిఉ జన్మ, లగ్నం, నక్షత్రనాడి, అతడికి కలసివచ్చే దిక్కు, రాశి, భావం, అంశ మొదలయిన వివరాలు వున్నాయి. వాటితోపాటు శుక్ర, ఇంద్ర, రాహు, శని, కేతు, కుజ రాశులు మొదలయిన విషయాలు డిటైల్డ్ గా వ్రాసివున్నాయి. రెండు నిమిషాల్లో చదవడం ముగించాక ఇంద్రమిత్రకు చిట్టా చివరి ఆకర్షించింది.  

వలచి వచ్చిన వనిత - 8

వలచి వచ్చిన వనిత -వసుంధర   పార్ట్ - 8     "నేనునమ్మను సుజాత నాకు బాగా తెలుసు__"అన్నాడా యువకుడు.     "ఇంతకూ మీకు మీరంటున్న సుజాతాకు సంబంధమేమిటి?" అన్నానుచిరాగ్గా.     "అది మీకానవసరం__" అన్నాడతను తడబడుతూ.     "కానీ నాకు అవసరం. ఉమ  నా భార్య అన్నసంగతి మీకు వేరే చెప్పనవసరంలేదనుకుంటాను-"     హల్లో దీపాలారిపోయాయి. నేను ఉమను చేతిమీద నెమ్మదిగా గిల్లి__"అతను తెలుసుకదూ?" అనడిగాను.     "ఊఁ" అన్నదామె.     సినిమానుంచి ఇంటికి వెళ్ళేవరకూ నేను మరి ఆ యువకుని ప్రసక్తి తీసుకురాలేదు. ఇంటికి వెళ్ళేక భోజనంచేసి పడుకునేటప్పుడు ఆమెను అడిగాను__"నీవు చాలా మందితో గడిపిన కారణంగా ఎంతో మందికి ఎన్నోపేర్లతో పరిచయమై ఉంటావు. అందులో నాకేమీ ఆశ్చర్యంలేదు. అయితే నీ వృత్తి తెలుసుండీ ఆ యువకుడు నిన్ను సినిమాలో అలా పేరు పెట్టి పలకరించడానికి కారణం నాకు అర్ధంకాలేదు__"అన్నాను.     ఆమె తమాషాగా నవ్వి_"నన్ను మీరు  ఉమ అని పిలుస్తారు. కానీ తరవాత ఎప్పుడైనా ఎక్కడైనా  ఒక మగవాడి పక్కన తటస్ధపడితే మీరు నన్ను ఉమ  అని పిలిచి పలకరించరు. అప్పుడు నాపేరు రమ అనివిన్నా  ఆశ్చర్యపడరు. కారణం__ మీకు నావృత్తి తెలుసు__" అని ఊరుకుంది.     అంటే ఆ యువకుడికి ఈమె వృత్తి తెలియదన్నమాట! అటువంటప్పుడు ఏ పరిస్ధితుల్లో వీరి పరిచయం సంభవించిందీ అన్న కుతుహలం నాకు కలిగింది. అందుకే ఆమెను మళ్ళీ  ప్రశ్నించకుండా ఉండలేకపోయాను. జవాబుగా ఆమె__"ఇప్పుడు ఇక్కడ నేను రహశ్యంగా మరో యువకుడితో పరిచయం పెట్టుకోవడం జరిగితే అతను నన్ను మీభార్యగా భావిస్తూంటాడు. ఆ యువకుడి విషయంలోనూ అంతే జరిగింది. నాపక్కన భర్తస్ధానంలో మిమ్ముల్ని చూడటం అతనికి ఆశ్చర్యంకలిగించడం సహజమేనని మీకు ఇప్పుడు అర్ధమయి ఉంటుందనుకుంటాను."     ఉలిక్కిపడ్డాను. నా బుర్రలో ఏదో తళుక్కుమన్నట్లయింది. శారదగా వ్యవహరించబడే ఒక అమ్మాయిని నేనూ పార్వతి అనిపిలిచేను. అప్పటి నా స్దితిలోనే ఇప్పటి ఈ యువకుడు ఉండి ఉండాలి.     "బహుశా నన్ను వేధిస్తున్న ఒక ప్రశ్నను సమాధానం  దగ్గర లభించగలదనుకుంటాను. శ్రీధర బాబు అని నాకో మిత్రుడున్నాడు అతని చెల్లెలు పార్వతి అన్నను  చూడటానికి  వచ్చిన   తరుణంలో అక్కడ  నేనుండడమూ, అతను లేకపోవడమూ జరిగాయి. ఆమెతో నాకు పదహారురోజుల పరిచయముంది. ఆ తర్వాత ఆమెను మా ఊళ్ళో శంకర్రావు అనబడే ఒకతని భార్యగా చూసాను. పాతపరిచయాన్ని పురస్కరించుకుని ఆమెను  శారీరకంగా లోంగదీసుకోగలిగినా తను పార్వతి అని ఒప్పించలేకపోయాను. అదినాకు మిస్టరీగా  మిగిలింది. శ్రీధరబాబు చెల్లెలు అనుమాన పరిస్ధితుల్లో ఇంట్లోంచిమాయమైనట్లు నాకు తెలిసింది. మిమ్మల్ని ఎవరు ఎలా  ఏర్పాటు చేస్తున్నారు? ఏదైనా పెద్దముఠా, అందమైన ఆడపిల్లల్ని అపహరించి బలవంతగా వ్యభిచారంలోకి దింపుతోందా?" అనడిగాను.     ఈ పర్యాయం ఆమె బాదగా నవ్వి__"అందమైన ఆడపిల్ల కోసం వేలకొద్ది రూపాయలు కుమ్మరించగల యువకులూ జీవిత భాగస్వామిగా రాబోయే భార్య అంతులేని ధనరాసులు కూడా  తీసుకురావాలనుకునే ఆశపోతులూ, దేశంలో అంతులేని పేదరికమూ__ఉన్నంతకాలమూ ఏ ముఠాలూ అవసరం లేకుండానే మాబోటిగాళ్ళం మాకుమేమై ఈ వృత్తిలో దిగవలసి ఉంటూనే ఉంటుంది.__"అంది.     అంతకుమించి ఆమెనుంచి  నాకు ఏ సమాధానమూ లభించలేదు. కులాసాగా గడపవలసిన సమయాన్ని వృధా చర్చలతో వెళ్ళబుచ్చడం ఇష్టంలేక నేను మరి ఆమెను గురించి వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించలేదు.           ఆరోజు నాకు సరిగ్గా ఏడు వుత్తరాలు వచ్చాయి. ఒకటి మామగారి దగ్గరనుంచీ, ఒకటి నాన్నగారి దగ్గరనుంచీ, రెండు ఓమాదిరీ పరిచయమున్న స్నేహితుల దగ్గరనుంచీ, ఒకటి చందా గడువు తేదీ పూర్తవున్నట్లు ఒక పత్రికనుంచి గుర్తువేస్తూ వచ్చినదీ__మిగిలిన రెండు శుభలేఖలు.     ముందు ఉత్తరాలు చదవడం అయ్యేక శుభలేఖలు తీశాను. ఒకటి గతసంవత్సరందాకా  ఇక్కడ నాకు కొలీగ్ గా  వుండి ట్రాన్స్ ఫర్ మీద మరో నగరం  వెళ్ళిపోయిన  ప్రకాశరావుది. పెళ్ళికి సరీగ్గా పదమూడు రోజుల వ్యవధి ఉంది. వధువు పేరు పార్వతి. ఊరు పేరు చదువుతూంటే తెలిసినట్లుగా అనీపించింది. కానీ  చటుక్కున గుర్తురాలేదు.     రెండవ శుభలేఖ ఫ్రం అడ్రస్ చూడగానే ఆ ఊరు నాకెలా తెలుసో స్పురించింది. ఆ శుభలేఖ శ్రీధర బాబు దగ్గర నుండి వచ్చింది. శుభలేఖలోని వధువు అతని చెల్లెలు పార్వతి వరుడు ప్రకాశరావు!     ప్రకాశరావు నాకు చెప్పుకోతగ్గ స్నేహితుడు పార్వతి వధువుగా కళ్యాణ మంటపం ఎక్కబోతోందన్న వార్త నాకు ఎంత ఆశ్చర్యాన్ని కలిగించందో_ఆమె పెళ్ళాడ బోయేది ప్రకాశారావుని అన్నవిషయం అంత బాధను కలిగించింది. ప్రకాశరావు ఆడవాళ్ళ శీలానికి చాలా ప్రాముఖ్యతనిస్తాడు. అతను కూడా ఎంతో బుద్ది మంతుడు. అలాంటివాడికి పార్వతిలాంటి దుశ్శీల. నెరజాణ__భార్యగారావడం నిజ్మగా దురదృష్టం. ఇందులో నేను చేయగలిగినదేమీ లేదా అని తర్జన  భర్జన చేసుకున్నాక__ఏమీ  లేడనే అనిపించింది. అయినా  మనసు పికుతూనే ఉంది.     మొట్ట మొదటీసారిగా శ్రీధరబాబు ఊరికి వెళ్ళాను. నన్నుచూసి శ్రీధర బాబు చాలా  సంతోషం వెలిబుచ్చాడు. కానీ నా మనసు అదోలాగుంది వేళాకొళానికే కావచ్చు. అతన్నోక్కసారి  బావా అని పిలిచినందుకు తాత్కాలికంగానైతేనేం అతని  చెల్లెలు నా సొంతమయింది. ఈ భయంకర కఠొర సాతుం  సహాయంతో శ్రీధర బాబు  చెల్లెలి వివాహం చెడగొట్టగలను. ఆ విధంగా నన్ను స్నేహితుడిగా నమ్మిన ప్రకాశరావుకు ద్రోహం  చేశాననే వ్యధ నన్ను బాధించకుండా చేసుకోగలను.     కానీ తన చెల్లెల్ని పొరబాటునైనా ఎవరైనా చిన్న ముక్క అవడం సహించలేని శ్రీధర బాబును ప్రళయకాళరుద్రునిగామార్చే అవకాశం కూడా  ఉన్నదని నాకు తెలియకపోలేదు.     నేను ఒక రకమైన ఎక్సయిటెడ్ స్టేట్ లో ఉన్న  కారణంగా ఎప్పుడు  ఏ క్షణంలో ఏంచేస్తానో తెలియకుండా ఉంది. ముహుర్తసమయం సమీపిస్తూన్నకొద్దీ వధూవరులకూ. వారి తల్లిదండ్రులకులేని ఉద్వేగం నాకు కలగసాగింది. నేను మంచి వాడినో చెడ్డవాడినో నీకే తెలియదు కానీ వెయ్యి అబద్దాలైనా ఆడి నిలబెట్టవలసిన పెళ్ళిని ఒకేఒక్క నిజంచెప్పి చెడగొట్టడం మాత్రం చెయ్యలేదు. పార్వతి ప్రకాశరావు భార్య అయింది.     రిసెప్షన్ సమయంలో ప్రకాశరావు పక్క వధువుస్ధానంలో ఉన్న స్త్రీని చూసి షాక్ తిన్నాను. ఆమె నేనెరిగిన పార్వతికాదు. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి కొంత టైము పట్టింది. ఆ తర్వాతా రోజంతా జాగ్రత్తగా పరిశీలించి శ్రీధరబాబు చెల్లెలూ, ప్రకాశరావు భార్యఅయిన పార్వతి నేననుకుంటున్న స్త్రీ కాదని దృవపర్చుకున్నాను.     అంతేకాదు, ఒకప్పుడు పార్వతి ఇతనికోసం ఇల్లు వదిలి పెడితే __ ఏమయిందో తెలియక ఇంటిల్లపాది ఖంగారు పడ్డారనీ తమ వివాహం జరిపించడానికి పెద్దలు అంగీకరించినాకనే ఆమెను ప్రకాశరావు __ తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాడనీ ఒక కొత్త నిజంకూడా తెలుసుకున్నాను.     పెళ్ళిపీటలమీద పార్వతిని నేను సరిగ్గా చూడలేదు. నేను మంటపానికి దూరంగా ఉండడమూ, విపరీతమైన వస్త్ర వేషధారణలతో ఆమెముఖం అష్పస్టంగా ఉండడమూ, తప్పుచేసిన వాడి అనుభూతితో వధూవరులను నేను సూటిగా చూడలేక పోవడమూ _వగైరా కారణాలవల్ల ఈ విచిత్ర సత్యాన్ని ముందుగానే గ్రహించలేకపోయాను.     నేను గ్రహించిన సత్యం నన్నెన్నో బాధలనుంచి విముక్తి చేసింది. అయితే ఒకసందేహం మాత్రం నాకింకా మిగిలిపోయింది. నాకు తెలిసిన పార్వతి ఎవరు?     ఈ ప్రశ్నకు సమాధానం సులభంగా దొరుకుతుందని నేననుకోలేదు. కానీ పెళ్ళినుంచి తిరిగి వెళ్ళాక __ నాకు తెలిసిన పార్వతితోగల అనుభవాలు వివరాలనూ ప్లస్ శ్రీధరబాబు చెల్లెలి పెళ్ళికి  వెళ్ళి షాక్ తిన్న సందర్భమూ__శివరావుకు వివరించి చెప్పగా - అతడు అరటిపండు ఒలిచిన విధంగా నాకు ఏంజరిగి ఉండవచ్చునో చెప్పాడు.     దూర ప్రాంతాల తక్కువ వ్యవధిలో ఉండే ఎండరో యువకులకు ఆడవాళ్ళను సరఫరా చేసే సంస్ధ ఒకటిఉంది, డానికి దేశంనిండా  బ్రాంచిలున్నాయి. నేను ఆ సంస్ధ ద్వారానే ఉమను రప్పించుకున్నాను. శివరావుకు ఆ సంస్ధగురించి చాలా వివరాలు తెలుసు వారివారి సౌకర్యాన్నిబట్టి యువకులు__యువతులను తమకు కావలసిన బందుత్వపు వరుసలలో రప్పించుకావచ్చును.     శ్రీధరబాబు ఆ విధంగా చెల్లెలి పేరుతో యువతులను తమ  అవసరానికి రాప్పించుకుంటూ ఉండి ఉండవచ్చు. చెల్లెలు అనగానే ఎవరూ చటుక్కున తప్పు సంబంధం అంటత్వంలోని నిజా నిజాల విచారణ వ్రసక్తి ఉండదు శ్రిభరబాబు బుక్ చేసుకున్న  అమ్మాయి వస్తున్నట్లు వచ్చిన టెలిగ్రామ్ అతడు లేని సమయంలో నాకు అందడం జరిగింది.     ఆ అమ్మాయికి వ్యాపారరీత్యా ప్రతిరోజుకూడా ముఖ్యం ఆమె చక్కగా నన్ను వినియోగించుకుని __శ్రీధరబాబు లేనప్పటికీ  తన ఆదాయం దెబ్బతినకుండా చేసుకోగలిగింది. ఆమె శ్రీధరబాబుకు చెల్లెలే అయుంటుందన్న అపోహ __ నాకు ఆమె  పట్ల  ఆకర్షణనూ, అంతులేని అతురుతను కలిగించింది.     నా సందేహాలన్నీ తీరిపోయాయి. కానీ ఒక్క విషయం నాకు  చాలా బాధను కలిగించింది. తన చెల్లెల్ని ఎంతగానో అభిమానిస్తున్న శ్రీధర బాబు-ఇతర ప్రాంతాల్లో నలుగురూ  తన చెల్లెలుగా భావిస్తున్నస్త్రీతో కాపురం చేస్తున్నాడు. ఆ విషయం అతను తప్పుగా భావిస్తున్నాడనుకొను. కానీ  అతన్ని తప్పు పట్టబోయేముందు_ నాకటువంటిఅర్హత ఉన్నదా అని కూడా ఆలోచించవలసిఉన్నది. అలా ఆలోచించ వలసిన అవసరం లేనివ్యక్తి నాకు తెలిసినవాళ్ళలో ప్రకాశరావు ఒకడే ననుకుంటాను.     స్నేహితుడి చెల్లెలు అని  తెలిసుండీ అందు బాటులోకి వచ్చినప్పుడు అనుభవించి ఆ తర్వాత మరచిపోవాలని వ్యక్తిని ప్రయత్నించీన నేను! తను నమ్మి తనకోసం ఇల్లు వదిలి వచ్చిన ఆడదాన్ని ఏమాత్రమూ మోసం  చేయకుండా నిగ్రహంతో  వ్యవహరించి__చిట్ట చివరకు ఎలాగో పెద్దలనొప్పించి ఆమెనే వివాహంచేసుకున్న వ్యక్తి ప్రకాశరావు!     బహుశా అందుకే  నన్నుకుంటాను__తన చెల్లెలిపై మాట వీసర బడడం సహించలేని శ్రీధరబాబు-మనిషినే స్వంతం చేసుకోవాలను కున్న ప్రకాశరావు చర్యను క్షమించగలిగాడు. నాబోటి వ్యక్తితో పార్వతి లేచి వచ్చి ఉంటే శ్రీధర బాబు చేతిలో ఆవ్యక్తి హత్యచేయబడి ఉండేవాడనడంలో సందేహంలేదు.     ఎవరు నమ్మినా నమ్మకపోయినా నీతిపరుడి ముందు_ అవినీతి పరుడెన్నడూ బలహీనుడు గానే ఉంటాడన్న సత్యం నా అనుభవంలో మరోసారి రుజువైంది.        

వలచి వచ్చిన వనిత - 7

  వలచి వచ్చిన వనిత -వసుంధర   పార్ట్ - 7     "ఇదిమీకు న్యాయంకాదు, పెళ్ళైన దాన్ని__" అందామె ఇంచుమించు ఏడుస్తూ. ఆమె అసహాయత  నాకు  తెలిసిపోయేక నా ధైర్యం పెరిగింది. "నేను నీకుకొత్తకాదు___" అన్నాను.     ఒక్కప్పుడు పార్వతి నన్ను లోంగదీసుకుంది. ఈ రోజునేనామెను లోంగదీసుకున్నాను.     నేను వెళ్ళిన పని ఏమిటి__ చేసినపని ఏమిటి అనితల్చుకుంటే నాకేసిగ్గు వేసింది పశువులా ప్రవర్తించడమంటే ఆదేనేమో!     అయితే నాసిగ్గూ, పశ్చాత్తాపం కొన్నిక్షణాలు మాత్రమే! మర్నాడు నేను మళ్ళీ  పార్వతి ఇంటికి వెళ్ళాను. తలుపు తీసిన  పార్వతి తలుపువేసు కొబోయింది. ఎలాగో లోపల అడుగు పెట్టాను. ఈరోజు ఆమె నిన్నటికంటే సులభంగా లొంగిపోయింది. మూడు వందల నోట్లుంచిన ఒక కవరు ఆమె గురించి వదిలేసి వచ్చాను.     ఆ తరువాత కనీసం పదిసార్లు పార్వతి ఇంటికి వెళ్ళాను. ఈ పదిరోజుల్లోనూ ఆమెగురించి నేను ఎక్కువగా తెలుసుకున్నదేమీలేదు. పదకొండవసారి ఆమె ఇంటికి వెళ్ళినప్పుడా ఇంటికీ  తాళంవేసి ఉంది.     ఆవేసినతాళం చాలారోజులు అలాగేఉంది. ఒకనెల రోజుల అనంతరం మాత్రం___మళ్ళీతాళం తీసిఉంది. ఆశగా  వెళ్ళితలుపు తట్టాను. తలుపులు తెరుచుకున్నాయి. ఒకముసలమ్మగారు__"ఎవరుబాబూ__" అంటూపలకరించింది.     కాస్తషాక్ తిన్నాను ఈ ఇంట్లో శంకర్రావుగారని ఒక రుండాలి!....."       "ఆయన ఇల్లు కాలీచేసి ఓ వారం  రోజులయుటుందనుకుంటాను నిన్ననే మేము దిగాం " అండా బామ్మగారు.     నేను అక్కణ్ణించి బయట పడ్డాను. దొరికినట్లే దొరికి పార్వతి మళ్ళీమాయమైంది. ఆమెను గురించిన మిస్టరీ  అర్ధం  చేసుకుందుకు ప్రయత్నించవలసిన  నేను అలా చేయలేకపోయాను. నాలోని బలహీనత మరే ఇతర విషయంమీదా దృష్టిని కేంద్రీకరించలేకుండా చేసింది.....................     రోజులు గడుస్తున్నాయి.     ఉద్యోగానికి సంబందించి మళ్ళీ నేను క్యాంపుకు వెళ్ళవలసి వచ్చింది. ఈ పర్యాయం నాతోపాటు నాకోలీగ్ శివరావు కూడా ఉన్నాడు. ఇద్దరం కలిసి కాస్త ఓమాదిరి పెద్ద పట్టణానికే మూడువారాలటూర్ ప్రోగ్రాం మీద బయలుదేరాం.     ఇద్దరం ఒకహొటల్ లో బసచేద్దామనుకుంటే శివరావు అలా వద్దన్నాడు చక్కగా  ఒక  ఫామిలీ పోర్ష్ న్ అద్దెకు తీసుకుందాం " అన్నాడు.     నేను సరేనన్నాను. వెళ్ళినరోజు సాయంత్రం లగేజి క్లోక్ రూమ్ లో పడేసేక శివరావుని అనుసరించాను అతను తిన్నగా  ఒక హొటల్ కు  దారితీశాడు. అక్కడ అతను హొటల్  ప్రొప్రయిటర్ కి తన పేరుచెప్పి_  "నేను  వ్రాసిన ఉత్తరం  అందిందను కుంటాను. అన్నిఏర్పాట్లు చేసే ఉంటారనుకుంటాను__" అన్నాడు.     ప్రొప్రయిటర్ పరిచయ పూర్వకంగానవ్వి ఒక్కసారి ఏదో పుస్తకం తిరగేసి జేబులోంచి ఒకకాగితంతీసి దానిమీద ఓ అడ్రస్ రాసిచ్చాడు.     "పడపోదాం " అన్నాడు  శివరావునాతో.     శివరావు మాఊరు ట్రాన్స్ ఫర్ మీద వచ్చి మూడునెలలే అయిప్పటికీ నాకుత్వరగా  సన్నీహితుడయ్యాడు. అతనికి నాకు తెలియని ఎన్నో విషయాల్లో అనుభవముంది కావడానికి నా వయసువాడే అయినా!     శివరావు ఆ అడ్రస్ పట్టుకుని ఆ ఇంటికి చేరుకున్నాడు. ఇల్లు బాగానే ఉంది. శివరావు "వాటా మనకు కావలసిన విధంగానేఉంది. ఇందులో సులభంగా రెండు కాపురాలు నడపొచ్చు" అన్నాడు.     ఇంటాయనకు అతను వందరూపాయలు ఇచ్చి_" టెంపరెరీగా క్యాంపుపనిమీద ఇక్కడకు వచ్చాం, ఇంత  సౌకర్యముగల ఇల్లు  దొరుకుతుందని మేమూ వినివుంటే కూడా శ్రీమతులను వెంటబెట్టుకు వచ్చిఉండేవాళ్ళం. ఈరోజే టెలిగ్రామ్ ఇస్తాం రెండుమూడు రోజుల్లో మా ఫామిలీస్ రావచ్చు " అన్నాడు.     నేను ఆశ్చర్యంగా శివరావు మాటలు వింటూ ఊరుకున్నాను కానీ ఏమీ  మాట్లాడలేదు.     శివరావు భార్య  ప్రస్తుతం ఏదో జబ్బుతో ఉన్నకారణంగా పుట్టింట్లో ఉంది. ఆమెకు విశ్రాంతి అవసరమనీ సాధ్యమైనంత వరకూ కొద్ది నెలలపాటు భర్తకు దూరంగా ఉండటం మంచిదనీ డాక్టర్లు చెప్పినట్లు అతనునాకు ఇదివరలో చెప్పాడు. నా విషయం సరేసరి! బ్రహ్మచారిని. ఇప్పుడు  మా ఫామిలీస్ ఎక్కణ్ణించి వస్తాయి? ఇదే సందేహాన్ని ఇంటాయన వెళ్ళిపోయాక శివరావు దగ్గర  వెలుబుచ్చాను. శివరావు జవాబుగా నవ్వేశాడు__ "ఇప్పుడు మనం అందుకే వెడుతున్నది!"     ఈసారి ఇద్దరం మళ్ళీ ఒకకొత్త చోటుకి వెళ్ళాం. అది ఒక చిన్నగది. ఆగదిలో ఓకేఒక మనిషి ఉన్నాడు. గది ముందు మాత్రం  యాత్రీకుల సమాచార కార్యాలయం అన్న బోర్డ్ ఉంది. శివరావు అక్కడున్నతనితో__ "నా ఉత్తరం మీకు అందే  ఉంటుందనుకుంటాను__" అంటూ తనపేరూ వివరాలూ చెప్పాడు.     ఆవ్యక్తి నవ్వి పక్కకు కదిలి అక్కడున్న బీరువాతలుపులు తీసి మూడు పుస్తకాలు మా ముందు పెట్టి__ "ఎన్నికచేసుకోండి__" అన్నాడు.     ఆ పుస్తకాలో ఊహించిన విధంగానే ఆడవాళ్ళ ఫోటోలు ఫోటో క్రింద వారి వయస్సు ఉన్నాయి.  శివరావు నా వంకచూసి "నీకు అభ్యంతరమా__" అనడిగాడు. అతని ఉదేశ్యం  అర్ధం చేసుకున్న నేను  లేదన్నట్లుగా తలఆడించాను.     శివరావు ఒక పుస్తకం తిరగేసి తనఎన్నిక పూర్తిచేశాడు. నేను కూడా  పుస్తకం తిరగేస్తున్నాను. కానీ నా చేతులు కొద్దిగా వణుకుతున్నాయి. అనుకోకుండా పార్వతిని అనుభవించడం జరిగింది తప్పితే నేను  వేశ్యలకోసం ప్రాకులాడడం ఇదే మొదలు ఆ పుస్తకంలో ఉన్నఅందరూ అందంగానే ఉన్నారు. నేను చూడలేననిపించి శివరావునే నాక్కూడా ఎన్నిక చేసి పెట్టమన్నాను. అక్కడికి ఆపనీ పూర్తయింది.     "ఏమిటి మీ బందుత్వం?" అనడిగాడావ్యక్తి.     "భార్య! అన్నాడు శివరావు.     ఆవ్యక్తి ఎక్కడికో ఫోన్ చేశాడు. కాస్సేపు ఆగాడు. అతని  బల్లమీది ఫోన్ అయిదు నిముషాల్లో మళ్ళీ మ్రోగింది. అతను  పెన్సల్ తో  కాగితంమీత ఏవో వివరాలు నోట్ చేసుకొని శివరావు వంకచూసి__ "సారీసార్ మరోసారి బుక్స్ తిరగేసి మరెవరినైనా సెలక్ట్ చేసుకోండి మీ కాండిడేట్ ఆల్ రడీ బుక్ అయిపోయింది__" అని నావంకచూసి _" మీనిషయంలో అంతా  రై టై పోయింది _" అన్నాడు.     శివరావు మళ్ళీ పుస్తకాలు తిరిగేయడం మొదలుపెట్టాడు. రెండుపుస్తకాలు చూసి అతను చిరాగా __"బోర్ గా ఉంది__" అన్నాడు. అప్పుడు నేను__" నాకండిడెట్ నీకు నచ్చిందిగదా ఏలాగు నాకు అంత ఆసక్తి లేదనుకో -" అన్నాను.     "కంగారుపడకు మిత్రమా! ఇంకా ఒక పుస్తకముంది మూడువారాలిక్కడ గడపవలసిన  అవసరముంది. నాగురించి నువ్వే కాస్త సెలక్షన్ చేసి పెడుతూ_" అన్నాడు.     మూడవ పుస్తకం  మొదటి పేజీలోనే కళ్ళుజిగేల్ మనిపించే అందంకనపడగా శివరావుకు చూపించాను. "ఫెంటాస్టిక్" అన్నాడు శివరావు. ఆ వ్యక్తి మళ్ళీ ఫోన్ చేశాడు. ఈసారి అన్నీ సరి అయ్యాయి__"రేపు సాయంత్రం అయిదు  గంటలకు__" అన్నాడతను.                ఉమ, నేనూ సినిమా ధియేటర్ లో ఉన్నాం. శివరావు శాంతతో ఎక్కడికో  పోయాడు. ప్రస్తుతం ఉమ ఇక్కడ నాకు భార్యగా  వ్యవహరించబడుతోంది.     సినిమాకు ఇంటర్వల్ వచ్చింది. లైట్లు వెలిగాయి. నేనూ, ఉమా ఏవో కబుర్లు చెప్పుకుంటున్నాం. హఠాత్తుగా  "హలో సుజాతా "అన్న పిలుపువినబడి ఇద్దరం ఉలిక్కిపడ్డాం. ఒకయువకుడు మావైపే వస్తున్నాడు.     "ఎవరండీ మీరు__"అనడిగాను ఆశ్చర్యంగా.     అతను నాప్రశ్న వినకుండా ఉమవంకే గుచ్చి గుచ్చి చూస్తూ_"సుజాతా నువ్వు  ఇక్కడ?" అన్నాడు. ఉమా మాట్లాడలేదు.     నేను ఆ యువకుణ్ణి చూస్తూ మళ్ళీ__"ఈమె పేరు ఉమ. మీరంటున్న సుజాత ఎవరో మాకు తెలియదు_" అన్నాను.  

లవ్ స్టోరీ

            లవ్ స్టోరీ                      - జి.వి అమరేశ్వరరావు     కళ్ళు జిగేల్ మనిపించేలా మెరుపు మెరిసింది.     కర్ణభేరిని అదరకొడుతూ ఆకాశం గర్జించింది.     అప్పటివరకూ తుంపుగా పడుతున్నా వాన ఆకస్మతంగా ఉగ్రరూపం దాల్చింది.వీధుల్లోనూ, షాపుల్లోనూ వెలుగుతున్నా ఎలక్ట్రిక్ లైట్లు ఒక్క సారిగా ఆరిపోవడంతో అంధకారం వ్యాపించింది.     అపుడు సమయం రాత్రి తొమ్మిదిగంటలవుతోంది.     "వాన పడితే చాలు సార్! పవర్ ఫెయిల్ అయిపోతుంది." అన్నాడు ఆటో డ్రయివర్. పాసింజర్ సీట్ లోకూర్చున్న సాధూరం అవునన్నట్టు తల ఊపాడు. మరో అర్దకిలోమీటరు దూరం వెళ్ళిన తర్వాత రోడ్డుకు ఎడం వైపున ఆటో ఆపించాడు సాధూరాం. డ్రయివర్ ఇంజన్ రైజ్ చేసి మీటర్ చూసి ఫేర్ ఎంతయిందో చెప్పాడు. సాధూరాం రెండు పది  రూపాయల నోట్లు ఆటో డ్రయివర్ చేతికి ఇచ్చాక ఎదురుగ్గా కనబడుతున్నా బిల్డింగ్ వైపు చూశాడు.     "నైన్త్ ప్లానెట్ ఆస్ట్రాలజీ సెంటర్"     అనే అక్షరాలు రోడ్డుమీద వేడుతున్నవెహికల్స్ హెడ్ లైట్లు వెలుగులో గోల్డ్ కలర్ లో మెరుస్తూ కనిపించాయి.     సాధూరం రోడ్డు క్రాస్ చేయాలనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా  అరడజను వెహికల్స్ మోకాలలోతున  పారుతున్న నీళ్ళను చిమ్మికొడుతూ దూసుకుపోయాయి.     సరిగ్గా అదే సమయంలో వీధి కార్నర్ లో ఆగిన టాటాసియోలోంచి ఇద్దరు వ్యక్తులు క్రిందకి దిగారు. ఇద్దరు  మోకాళ్ళ క్రిందవరకూ వుండే రెయిన్ కోట్స్ వేసుకుని నెత్తిన వాటర్ ప్రూప్ క్యాప్స్ పెట్టుకుని వున్నారు. వాళ్ళు వేగంగా సాధూరం వైపు మూవ్ అయ్యారు.     సరిగ్గా అపుడు కదిలాడు సాధూరాం ఈడ్చికొడుతూన్న వానజల్లు ముఖానికి తగలకుండా చెయ్యి అడ్డం పెడుతూ రోడ్డు క్రాస్ చేసి ఆస్ట్రాలజీ సెంటర్ లోకి ప్రవేశించాడు.     రిసెప్షన్ లో ఒక టీనేజీ అమ్మాయికూర్చుని వుంది. కొవ్వొత్తి వెలుగులో ఆమె ముఖం అందంగా కనబడుతోంది. ఆమెకు సాధూరాం జేబులోంచి ఓ రీసెట్ తీసి అందించాడు. రిసీట్ మీద వ్రాసి వున్న పేరు ఆమె పెద్దగా చదివింది.     "సాధూరం మడ్కోంకర్"     అవునన్నట్టు సాధూరాం తల వూపాడు.     రిసేప్షస్ట్ డెస్క్ సొరుగులోంచి ఓ వంద వరకూ వున్న కవర్స్ బయటకి తీసింది. వాటిల్లోంచి సాధూరాం పేరు వ్రాసివున్న కవర్ తీసి అతడికి అందించింది.     సాధూరాం అరెంగా కవర్ ఓపెన్ చేసి మడతలు పెట్టిన ప్రింటేడ్ షీట్ ఇకటి బయటకి లాగాడు. సాధూరం జాతక చక్రం. భవష్యుత్ లో అతడి జీవితంలో జరగబోయే మార్పులు వగైరా అందులో ప్రింట్ చేసి వున్నాయి. అతని కళ్ళు అక్షరాల మార్పులు వగైరా పరిగెత్తాయి. ప్రింటెడ్ షీట్ లో అతని పేరు, వయసు, రాశి, నక్షిత్రం, జన్మలగ్నం, అదృష్టసంఖ్య, మక్షిత్ర గానం, నక్షత్రయోని మొదలయినవి అన్నీ వివరంగా వ్రాసి వున్నాయి. వాటితోపాటు అతడికి కలసివచ్చే వారం, అతడు ఎలాంటి రాయి ఏ వేలికి మొదలయిన వివరాలతో పాటు రాశి, అంశ, చక్రాలు కూడా వేసి  వున్నాయి.     దాదాపు అయిదు సంవత్సరాల క్రితం వరకో సాధూరాం హాయిగా గడిపాడు.     సాధూరం తండ్రికి ఐరన్ మర్చంట్ గా మంచి పేరుంది. తండ్రి మరణించిన తర్వాత అతడికి వ్యాపారంలో నష్టం రాసాగింది. ప్రస్తుతం అప్పట్లో పీకలవరకూ కూరుకుపోయివున్నాడు  సాధూరాం. అతడి జీవితములో చోటుచేసుకున్న మార్పులు అన్నీ కంప్యూటర్ జాతకంలో చాలా వరకూ సరిపోయాయి. నేలరోజుల్లో మీ వల్ల మీ కుటుంభానికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.అనే అంశం సాధూరాంకు ఆశ్చర్యపరిచింది.ఆ ఐటం చదివిన వెంటనే సాధూరం పెదవుల మీద చిరునవ్వు ప్రత్యక్షం అయింది.     "ఏమో! జాతకంలో వ్రాసినట్లు తాను త్వరలోనే లక్షాధికారి అవుతాడేమో?" అనుకుంటూ చిట్టచివరి ఐటం చదివిన సాధూరాం భ్రుకటి ముడిపడింది.     అది సాధూరాం అయుష్యుకు సంభందించిన విషయం. అందులో సాధూరం ఆకస్మికంగా బలవన్మరణానికి గురి అవుతాడనీ, హత్య చేయబడవచ్చనీ వ్రాసివుంది.     యమగుండాన్ని తప్పించుకునేందుకు శివుడికి 47 రోజులపాటు బీజాక్షరాలతో జపం చీయాలని ఓ సజెషన్ కూడా ప్రింట్ చేయబడివుంది.     సాధూరాంకు చివరి ఐటం మీద నమ్మకం కలగలేదు అతడు ఆలోచించాడు. తనకు తెలిసీ ఎవరికీ అపకారం చేయల్డు. వ్యాపారంలోకూడా తనకు శత్రువులు ఎవరూ లేరు. అలాంటప్పుడు తనను ఎవరు హత్యచేస్తారు? ఇదంతా ట్రాష్ అనుకుంటూ కవర్ని జేబులో వుంచుకున్నాడు.

వలచి వచ్చిన వనిత - 6

  వలచి వచ్చిన వనిత -వసుంధర   పార్ట్ - 6         "మీరెవరో నాకు తెలియదు_" అంది పార్వతి.     "అబద్ద మాడకు పార్వతీ-..."అన్నాను.     "ఆమె పేరు పార్వతి కాదు__" అన్నాడా యువకుడు.     "ఇంట్లోంచి పారిపోయిన వాళ్ళు పేరు మార్చుకోవడం అసహజం కాదు__"అన్నాను చలించకుండా.     "ఎవరండీ మీరు? అంత నమ్మకంగా మాట్లాడుతున్నారు__ఈమె మీ కేమవుతుంది?" అన్నాడా యువకుడు చిరాగ్గా.     "ఈమె నాస్నేహితుడి చెల్లెలు. ప్రస్తుతం ఈమె  అన్న  ఈమె గురించి అన్వేషణలో ఉన్నాడు." అన్నాను.     "మీరు నిజంగా  పొరబడ్డారు. ఈమెపేరు శారద. మీరనుకుంటున్న పార్వతి ఈమె  కావడం  అసంభవం__" అన్నాడా యువకుడు.     "ఎందువల్ల?" అన్నాను అసహనంగా.     "ఎవరైనా పరాయివాడు మీ ఆవిణ్ణి పార్వతీ అని  పిలిచినప్పుడు__ఆ పేరునిజమో, తప్పో మీకుతెలియదా?" అనడిగింది పార్వతి.     "అంటే__?"     "మే మిదరం భార్యాభార్తలం-" అన్నాడా యువకుడు.     ఆశ్చర్యపడ్డాను. నాకదంతా సంభవం అనిపించలేదు_ "ఎన్నాళ్ళయింది మీవివాహమై?" అనడిగాను.     "పదినెలలు_"     పార్వతిలో ఆ అపూర్వాను భవం జరిగి ఇంకా  రెండునెలల పూర్తికాలేదు. అందుకే "రెండునెలలు క్రితం మీభార్య తన అన్నగారింటికి వెళ్ళడం సంభవించి ఉండాలి! "అన్నాను.      ఆ యువకుడు నావంక జాలిగాచూసి_"మీరు చూడ్డానికి  పెద్ద మనిషిలా కనబడుతున్నారు. మీరనుకుంటున్న పార్వతి  అన్న మీకు నిజంగా  ప్రాణస్నేహితుడై  ఉండాలి, నా భార్యకూ __ఆ పార్వతికీ  పోలికలున్నాయేమో నాకు తెలియదు. ఈమె  పార్వతి కాదనీ  శారద అనీ  మరోసారి  చెబుతున్నాను. గత  ఎనిమిది మాసాలుగా మేమిద్దరం ఒకరిని విడిచి ఒకరు  ఉండడం జరగలేదు. దయఉంచి మీరు మమల్నింక వేధించవద్దు__"అన్నాడు.     "మీ స్నేహితుడి చెల్లెల ఫోటో ఒకటి ఉంటే ఇవ్వండి. అనుకోకుండా ఆమె మాకు తటస్ధ పడితే-మీకు  సహాయ పడాతం-" అంది  నేను పార్వతిగా భావిస్తుంటే కాదు శారదని అంటున్న ఆమె.     పార్వతికి నేను మగవాడు ఆడదానికి అనగలిగినంత దగ్గరా  అయ్యాను. ఆమెను గుర్తించడంలో పొరపాటు చేయలేను. అప్పటికి ఊరుకున్నా  ఈ విషయన్నింతటితో  వదల దల్చుకోలేదు.     టిఫిన్ చేసి బయటకు వచ్చేక__హొటల్ లో ఒక క్డీనర్  కుర్రాడితో మాట్లాడాను వాడికి తరచుగానేను చిల్లర డబ్బులు బక్షీస్ గా ఇస్తుంటాను. ఆ జంట ఇంటి అడ్రస్  తెలుసుకో  వలసిందిగా వాడిని కోరాము ప్రోప్రయిటర్ పర్మషన్ తీసుకు ఆ కర్రవాడు జంట వెంటపడ్డాడు.     మర్నాడుదయం హొటల్ కు వెళ్ళాను. "వాళ్ళు  తిన్నగా   సినిమాకు పోయారుసార్! నేనూ  పోయానుమరి. రాత్రి  పదిన్నరకు  వాళ్ళు ఇల్లు చేరుకున్నారు__" అంటూ కుర్రాడు చిరునామా ఇచ్చాడు వాడికి పదిరూపాయలు ఇచ్చాను.           తలుపు తట్టాను కానీ కాస్త భయంగానే ఉంది. ఆమె నన్ను గురించి ఏమనుకుంటుందో, తనునిజంగా  పార్వతి  కాకపోతే  భర్త లేని  సమయంలో  ఇంటికీ  వచ్చినందుకు-ఏ విధంగా భావిస్తుందోనన్న జంకు నాలో ఉంది.     తలుపులు తెరుచుకున్నాయి. బహుశా  తలస్నానం  చేసిందేమో- జుట్టు  విరబోసుకుని  ఉందామె. సందేహం లేదు__ నేను పొరబడడంలేదు ఈమె పార్వతేనని అనిపించింది.     "మీరా." అందామె తడబడుతూ.     "గుర్తుపట్టారన్నమాట__ "అనినవ్వి__ "లోపలకు  రావచ్చా! "అన్నాను.     "వారు ఇంట్లోలేరు_" అందామెజంకుతూ.         "తెలిసేవచ్చాను-" అంటూ ముందడుగు వేశాను.     "మీకేదైనా పని ఉంటే వారున్నప్పుడు రావచ్చు. సాయంత్రం అయిదు గంటలకు వారు తిరిగివస్తారు__" అందామె.     "అయితే సాయంత్రం అయిదుగంటలవరకూ అతను రాడన్నమాట"! అంటూ  తలుపులువేశారు.     ఆమె బెదురుకళ్ళతో నావంక చూస్తూ __ "మీరే  ఉద్దేశ్యంతో ఇక్కడకు వచ్చినా__నలుగురూ చెడు ఉద్దేశ్యంతో వచ్చినట్లే భావిస్తారు. నా కాపురంలో నిప్పులు పోయకండి-" అందామె.     నేను తడబడ్డాను. నిజ్మగా నేనొక అమాయకురాలిని బాధించడం లేదుకద_ అనిపించింది! అయినా నెమ్మదిగా__"పార్వతిని నేనుమరిచిపోలేదు. ఒకటికాదు రెండుకాదు__ పదహారురోజులు ఆమె నాదానిగా మసలింది. ఆమెతో గడిపిన ప్రతిక్షణం మధురం, అపూర్వం! ఆ పార్వతిని గుర్తుపట్టడంలో నేను పొరపడను. నువ్వుపార్వతివి. కాదనకు. అప్పుడు  నీకు  దూరంగాఉండడానికి ప్రయత్నిస్తే రెచ్చగొట్టిదగ్గరచేసుకున్నావు ఇప్పుడు  దగ్గరకు  రావడానికి ప్రయత్నిస్తూంటే అబద్దాలు చెప్పి__ పోమ్మంటున్నావు. నీ విచిత్ర ప్రవర్తనకు  కారణం  తెలియడంలేదు__" అన్నాను.     "మీ ప్రవర్తనే నాకు విచిత్రంగాఉంది. వివాహితురాలైన ఆడదాని వెంటపడి బాధించడం మీకు భావ్యంకాదు. మీరిలా వచ్చివెళ్ళినట్లు నా భర్త చూస్తే ఏమను కుంటారు"! అందామె ఇంచుమించు కళ్ళనీళ్ళ పర్యంతమై.     "నువ్వు గొప్పనటివి పార్వతీ__" అనుకున్నాను. అదే  సమయంలో ఎవరో తలుపు తట్టాయు పార్వతి కంగారుపడింది "ఎవరో వచ్చారు__ నామీద దయఉంచి మీరుకాస్త ఆ  పక్క గదిలోకి వెళ్ళగలరా" అంది.     "నేను దొంగనుకాదు. దాక్కోవలసిన అవసరంలేదు__" అన్నాను.     "కానీ మిమ్మల్ని  దాచవలసిన అవసరం నాకుంది___ప్లీజ్__" అంటూ ఆమె నా చెయ్యిపట్టుకుని పక్కగదిలోకి  లాక్కువెళ్ళి ఓ బీరువాపక్క నిలబెట్టి__" వచ్చినవాళ్ళు వెళ్ళే  వరకూ__ ఇక్కణించి కదలవద్దు__" అని వెళ్ళిపోయింది.     ఆఖరికి ఏగతి పట్టింది నాకు!     వచ్చిన వ్యక్తి ఆడదని కంఠం చెబుతూనే ఉంది__ "ఎలా  ఉందమ్మా కొత్తకాపురం?" ఆ అడకంఠం కంగుమని మ్రోగుతుంది.     పార్వతి మాట  వినపడలేదు.     "చూడమ్మా__కొత్తగా వచ్చావు. ఈవీధిలో ఎవ్వరూ కలుపుగోరు మనుషులుకాదు. కొత్తగా ఎవరు వచ్చినా ఒకటి రెండురోజులు చూసి నేనే వచ్చి పలకరించి పోతూంటాను. ఏదైనా సాయంకావాల్సివస్తే అడగడానికి సందెహించకూ___" అందాకంఠం మళ్ళీ.     "అలాగేనండి___" పార్వతి కంఠం.     మరోపావుగంట మాట్లాడేక ఆ కంఠం వెళ్ళిపోయింది. తలుపులు వేసి పార్వతి నాదగ్గరకువచ్చింది. "చూశారా__నన్నె లాంటి ఇబ్బందిలో పెట్టారో ___ఆవీడ మీరు లోపలకు రావడం చూసే ఉంటుందని నా అనుమానం __"అంది పార్వతి.     "తప్పులేనిచోట భయంకూడా ఉండదు___" అన్నాను వెటకారంగా.     "అభయం ఆడదానికి తెలుస్తుంది. మగవాడికి అర్ధం కాదు__" అందామె.     "భయపడే ఆడదానికీ. భయపడని ఆడదానికీ తేడా__ మగవాడికి తెలుస్తుంది__" అంటూనేనామెను సమీపించి దగ్గరగా  లాక్కున్నాను. ఒంటరితనం, పూర్వపు చనువు__నాకు  ఆవేశాన్ని కలిగించగా నేను కాస్త ధైర్యం చేశాను. ఆమెమాట్లాడకుండా వణుకుతుంది. మరి భయమో ఏకారణం తెలియదు____ఆమె అరవలేదు కానీ గింజు కుంటోంది వీలైనంత మౌనంగా.     ఆమాత్రం చాలునాకు. ప్రస్తుతం శ్రీధరబాబు చెల్లెలు ఇక్కడెందుకున్నదీ అన్న  వివరంమీద నాకు  ఆసక్తి లేదు. ఆ అవకాశాన్ని వినియోగించుకోవడం మీదనే నా ఆసక్తి!     "ఒకప్పుడు నీ  గురించి రెండువేలు ఖర్చుపెటాను. నాకు డబ్బు లెక్కలేదని గ్రహించే ఉంటావు. నీ భర్త అయిదు గంటల వరకూ రాడుకదా__ మనకుచాలా సమయం ఉంది___" అన్నాను.

వలచి వచ్చిన వనిత - 5

   వలచి వచ్చిన వనిత -వసుంధర   పార్ట్ - 5       నేను సినిమాపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాను. ఆమె ప్రవర్తనలో నాలో క్రమక్రమంగా అదోకరకమైన ఆవేశం చోటు చేసుకోసాగింది. ఆఖరికి ఒకపర్యాయం ఆమె నాచేతిని తన చేతిలోకి తీసుకొని వంగి మృదువుగా పెదిమలతో స్పృశించింది. నా ఆవేశం కట్టలుతెంచుకుంది. ఆమె భుజాలమీదకు చేతులు పోనిచ్చి ఒకసారి దగ్గరగా లాక్కున్నాను. కుర్చీ అడ్డు రాకపోతే నా ఆవేశపు బలానికి ఆమె నాలో ఐక్యం కావలసిందే!     "వాడికి మూడింది!" అన్నమాటలు నాచెవిలో పడగా ఉలిక్కిపడ్డాను. ఎదురుగా వెండితెరపై విలన్ ఆమాటలు అన్నాడు. ఆవిలన్ స్ధానంలో నాకు శ్రీధరబాబు  కనపడ్డాడు. చావుదెబ్బతిని ఓమూల పడిఉన్న పుల్లారావుకూడా నాకళ్ళముందు మెదుల్తున్నాడు.     కేవలం నోటి దురుసుతనం కారణంగా సుదర్శనం, పుల్లారావులాంటివాళ్ళు శ్రీధరబాబు ఆగ్రహానికి గురయ్యారు. చేనింకా ఒక అడుగు ముందుకు వేయబోతున్నాను. ఫలితం ఎలాగుటుందో?     వయసు _ ఆహ్వానించే అందమైన యువతి! ఈ  రెంటికీ అయస్కాంతం, ఇనుములాంటి సంబంధముందేమో! నేను పార్వతికి లొంగిపోతున్నట్లు గ్రహిస్తూనే__అసలు పార్వతి ఈ  విధంగా ప్రవర్తించడానికి కారణమేమై యుంటుందా అని కూడా  ఆలోచిస్తున్నాను. కొంపదీసి ఇదేమైనా పెద్దపథకం కాదుగదా అని నాకు అనింపించసాగింది. శ్రీధరబాబు ఆగ్రహానికి నన్ను గురిచేసి - అతను నన్ను హత్యచేసే పరిస్ధితికి దారితీసే సంఘటన ఏర్పడ్డానికి పార్వతికాని ప్రవర్తించడం లేదుకదా అన్న  అనుమానం  నాకు  కలిగింది. అయితే  అందుకు  కారణమేమై ఉంటుంది? నా శతృవు ఎవడైనా  పార్వతికి ప్రియుడై ఉండవచ్చు. వాడి కోరికపై ఈమె ఇలా  ప్రవరిస్తుండవచ్చు.     ఎంత ఆలోచించినా నాకు ఇంత పథకంవేసి  నన్ను చంపదల్చుకునేటంత శతృవెవడుంటాడో తోచలేదు. నా అనుమానం అర్ధ రహితమనికూడా అనిపించింది. పార్వతివంటి అందమైన అమాయకమైన ఆడపిల్ల ప్రవర్తన వెనుక నేరాన్ని ఊహించడం ఘోరమని కూడా నాకు తోచింది ............     సినిమా అయిపోయింది.     రిక్షాలో ఇద్దరం ఇంటిదగ్గరదిగాక ఆమె తనకున్న  భయాన్ని  వివరించింది. నాకుతెలుసు-ఆ రోజు  రాత్రి ఇద్దరం  ఒకేఇంట్లో నిద్ర చెయ్యవలసివస్తుందని!     ఇద్దరం చేరోగదిలో నిద్రకుపడ్డాం. కేవలం ఇరవై నిముషాలు  మాత్రమె  వ్యవధిఇచ్చి - ఆమె భయంభయంగా నా గదిలోకి  పరుగెత్తుకువచ్చింది. నాకు తెలుసు - ఆమె అలా చేసే  అవకాశమున్నదని!     ఒకే గదిలో ఇద్దరం చెరోప్రక్కపై నిద్రలోపడ్డాం నాకు తెలుసు __ మరికొద్ది క్షణాలలో ఏమి జరుగనున్నదీ!         6     సరిగ్గా అదే జరిగింది!!     చాలా మామూలుగా తెల్లవారింది. నేను నామీదఉన్న ఆమె  చేతిని  పక్కకు పెట్టి లేచాను.     నాకిప్పుడు  శ్రీధరబాబు ఏదో చేస్తాడన్న భయంకంటె అతను త్వరగా వచ్చేస్తాడే మోనన్న బెంగ ఎక్కువగా ఉంది. రాత్రి నా అనుభవం అపూర్వం. ఆ అనుభవం నాకు ఇంకా  ఇంకా! కావాలి. ఇంక  శ్రీధరబాబు రావడానికి ఎంతో వ్యవధి లేదు, నాకు పగలల్లా  ఆఫీసుపని తప్పనిసరి.......     సుమారు మూడురోజులు గడిచాక శ్రీధరబాబు దగ్గర  నుంచి ఒక కార్డు వచ్చింది.  తనపని ఇంకా  కాలేదనీ బహుశా మరి వారంరోజులవరకు  తను  రాలేకపోవచ్చుననీ  అతను రాశాడు ఈ విషయం పార్వతికి చెప్పగా  ఆమె కంగారును వ్యక్తవరుస్తూ "పెద్ద ఇబ్బంది వచ్చిందే!" అని ఊరుకుంది.     నాకేమి ఇబ్బంది అనిపించలేదు, ఆ కార్డు ఇచ్చిన  బలంతో ఆమెని మరికాస్త  దగ్గరగా  లాక్కుని _ "ఇది దేవుడు  నాకిచ్చిన  అపూర్వవకాశం  అన్నాను. ఆమె నావంక ప్రేమగా చూస్తూ_" మీరు  మరోలా అనుకోనంటే అడుగుతాను. అన్నయ్య  వచ్చేవరకు నాకు కాస్త డబ్బు సర్దగలరా?" అంది.     నాకు జాలికలిగి "ఎంతేమిటి ?" అన్నాను.     "చిన్న  మొత్తమయితే నాకు బెంగలేదు. ఈ రోజు  నేను  సాయంత్రం  నాలుగు  గంటల లోపులో ఒక నెక్ లెస్  కొనుక్కో వలసి ఉన్నది. అసలు  నేను అన్నయ్య దగ్గరకి  వచ్చినదే అందుకు-"     "నాకు సరిగ్గా అర్ధం కాలేదు. నెక్ లెస్ కొనుక్కోవడానికి ఒక ప్రత్యేక  మైన టైమెందుకు?" అన్నాను.     ఆమె వివరించింది. ఆమె స్నేహితురాలు అదేరకం నగను ఈ ఊళ్ళో, ఒక స్మగ్లీంగ్ వ్యాపారస్తుని దగ్గర   కొంది. పార్వతి అభిలాష విన్నాక ఆమె స్నేహితురాలు తనకు తెలిసిన  వారిద్వారా ఎంకయ్విరీ చేయించింది. ఈ రోజు  సాయంత్రం నాలుగు గంటల వరకు ఆనగ స్మగ్లర్ వద్ద ఉంటుంది, దాని ఖరీదు పదహారు వందల యాభైఅయిదు  రూపాయలు.     నా దగ్గర ప్రస్తుతం ఆఫీసు డబ్బు పన్నెండు  వేల రూపాయలుంది. ఊళ్ళో నా బ్యాంకు  బేలన్స్ రూపాయలలో అయిదంకెల స్ధానంలో ఉంది. నేను ఆమె అడిగిన మొత్తాన్ని అప్పుగానేం కర్మ-బహుమతిగానే ఇవ్వగలను__"ఇంతకు మీ  అన్నయ్యకు నాగ కొనబోతున్న  విషయం తెలుసా?" అనడిగాను.     "తెలియదు. వాడి దగ్గర  డబ్బుంటుందని మాత్రం  తెలుసు. ఎటొచ్చీ  ఇదంతా  విని ఏమంటాడో మాత్రం  తెలియదు."     నేను కాస్త  గర్వంగా ముఖం పెట్టి__" ఇది కోవడానికి జంకకు. మీ అన్న వద్దంటాడన్న అనుమానం ఉంటే అది  నా కానుకగా  భావించు " అన్నాను.     ఆమె ముందు కాస్త ఆశ్చర్యపడినట్లుగా  కనబడింది. ఆ తర్వాత లేత తామర తూడుల్లాంటి తన రెండు  చేతుల్నీ  నా నడుము చట్టూ చుట్టింది. క్"పార్వతీ- నీ  వంటి ఆడది ఊఁ అనే  అదృష్టం  పట్టాలి గానీ ఈ డబ్బు నాకో లెక్కలోది కాదు-" అనుకున్నాను.         7     నేను అక్కడ మొత్తం  పదహారు రోజులు గడిపాను. శ్రీధర బాబు  ఐపులేడు. పార్వతీ, నేనూ  నెనోఅ విచ్చలవిడిగా విహారాలు సలిపాం/ నాకు పార్వతి గురించి రోఖ్షం రూపేణా అయిన  ఖర్చు రెండు వేలపై  చిలుకు, కానీ  నేనందుకున్న అనుభావవుటనుభూతులు ఊహకందనివి, పార్వతి ఇలటికి వెళ్ళి పోవలసి ఉన్న కారణంగా నేను  నా ఆఫీసుకు ఎక్స్ టెన్షవ్ గురించి రాయవలసిన అవసరం కలగలేదు.     వెళ్ళి పోయేటప్పుడు పార్వతి తన గురించి టెలిగ్రామ్ కాగితం నింపి ఆవల పారేసి__"తను లేని సమయంలో నేనిక్కడకు వచ్చి  పదహారు రోజులు గడిపి వెళ్ళిన సంగతి అన్నయ్యకు తెలియకుండా ఉంచడానికి ప్రయత్నించగలిగితే బాగుంటుంది. "అంది.     అదంత సులభం కాదని నాకు తెలుసు, ఆ వీధిలో ఎంతో మంది ఆమెను  చూశారు. ఆఫీసు పని మీద వచ్చిన  నాకూ ఆమెకూ గల సంబంధం ఏమిటో - ఎంత మందికి  తెలుసునో నాకుతెలీదు. ఇంటాయన లేకపోవడమూ, శ్రీధరబాబుకు పని మనిషి అంటూ ఎవరు ఉండక పోవడమూ బహుశా మా వ్యవహారాన్ని రహశ్యంగా  ఉంచడానికి కొంత  వరకు  సహకరించవచ్చు. ఎటొచ్చీ ఇంటాయన తిరిగి వచ్చేక శ్రీధరబాబు ఆయన్ను కలిసేక అసలు టెలిగ్రామ్ అనేదోకటి వచ్చిన సంగతి తెలుస్తుంది.     మరి పార్వతి ఇంటి దగ్గర  వాళ్ళకు  ఎలాగూ  తెలుస్తుంది కదా-ఆ  అనూమానాన్ని పార్వతి వ్యక్త పరచగా  ఆమె నవ్వి__"ఆ భయం నాకు లేదు. నేను అన్నయ్య   దగ్గరకు  వెడుతున్నట్లుగా ఇంట్లో చెప్పలేదు.  నా స్నేహితురాలితో కలిసి ఎక్కడికో వెడుతన్నట్లుగా ఇంట్లోచెప్పి బయల్దేరి చెరో చోటికీ ప్రయాణమయ్యాం. న్నెఉ ముందు నా స్నేహితురాలిని కలిసేకనే  ఇంటికి వెడతాను." అంది.     "అసాధ్యురాలివే!" అనుకున్నాను. ఇప్పుడు నాకు ఎన్నో ప్రశ్నకు సమాధానాలు లభించాయి-ఒక్క పార్వతి విపరీత ప్రవర్తనకు కారణ మేమిటీ అన్న ప్రశ్నకు తప్పు.     పార్వతి నాగ కొనాలనుకుంది. తను బయల్దేరి వస్తున్నట్లుగా అన్నకు టెలిగ్రామ్ ఇచ్చింది. అన్న లేకపోతే నా దగ్గర  డబ్బు తీసుకుని నాగ కొనుక్కుంది. ఇది అని చెప్పలేని కారణాల వల్ల నాతో కొన్ని రోజులు సంసారం చేసింది. అందుకు ప్రతిఫలం  నాదగ్గర  దనరూపేణా పొందింది. ఇప్పుడు  తిరిగి ఇంటికి వెడుతోంది. అటు అన్నకు. ఇటు  తల్లిద్రండులకు  తన రహస్యం   తెలియకుండా జాగ్రత్త పడుతోంది.     నా ఆఫీసు పని ముగిసింది. పార్వతి వెళ్ళిపోయింది. ఆ కారణంగా నేను తిరుగు ప్రయాణం  చేయవలసి ఉంది. శ్రీధరబాబునించి మళ్ళీ  ఉత్తరం లేదు. ఆ పరిస్దితుల్లో  ఏంచేయాలో తోచక-ఇంటాయనకో రిజిస్టర్ పార్సిల్ లో శ్రీధరబాబు గది డూప్లికేట్ తాళం పంపించి ఒక ఉత్తరం కూడా రాశాను. అందులో  ఎందుకైనా మంచిదని ఒక చిన్న అబద్దం కూడా రాశాను! టెలిగ్రాం ప్రకారం-శ్రీధరబాబు చెల్లెలు రావలసి ఉన్నప్పటికీ ఏ కారణాల వల్లనో ఆమె రాలేదని.     నేను ఇల్లు చేరిన నాలుగు రోజులకు శ్రీధరబాబునించి ఉత్తరం వచ్చింది. అనుకోకుండా ఎదురైన గృహసమస్య కారణంగా తను చిరునామాకూడా ఇవ్వకుండా  మాయమైనాడనీ' అన్యథా భావించవద్దనీ అతను రాశాడు. సేల్సు  వ్యవహారంలో అనుకోకుండా అతను తన ఊరు వెళ్ళడం సంభ వించిందట__అనుమాన పరిస్ధితులలో అతని చెల్లెలు మాయమైందట.     నీకు తెలుసుగదా__నాకు నా చేల్లెలీకీ ఉన్న అనుబంధం, ప్రస్తుతం అన్వేషణలో ఉన్నాను. అన్వేషణ ముగిసే  వరకూ  మరేపనీ చేయలేను.  అందుకే వచ్చి ఇల్లు కాళీచేసి  వెళ్ళిపోతున్నాను. బల్లమీద నీ చిరునామ వదలి వెళ్ళినందుకు ధన్యవాదాలు. చాలాకాలం తర్వాత కలుసుకున్నందుకు సరిగ్గా  గడప లేకపోయాము. మరోసారి మంచి అవకాశం వస్తుందనీ, అది సక్రమంగా వినియోగించుకోగలమనీ ఆశిస్తున్నాను"__ అవిరాశాడతను.           ఆ రోజు అరుణా హొటల్ చాలా రష్ గా ఉంది. నన్ను  బాగా తెలిసున్న సర్వర్-" అలావెళ్ళండి సార్! అక్కడ కాళీ  ఉంది-" అని దారి చూపించాడు.     అది ఫామిలీస్ కోసం ఉద్దేశించబడిన అపార్టు మెంట్. అలాంటి అపార్ట్ మెంట్సు అక్కాడ చాలా ఉన్నాయి. ఒకో  అపార్టు మెంట్లో  నాలుగుసీట్లు  మాత్రం ఉంటాయి. సాధారణంగా బ్రహ్మచారి  యువకులు  ఒంటరిగా వాటిలోకి  వెళ్ళే  అవకాశం  రాదు. సర్వర్ చెప్పాడు కదా  అని నేను  వెళ్ళాను. అక్కడ రెండు సీట్లు కాళీగా ఉన్నాయి. ఒక  సీట్లో కూర్చన్నాక యథాలాపంగా ఎదుటిసీట్లో ఉన్న  జంటను చూశాను. ఉలిక్కి  పడ్డాను పార్వతి!     అప్రయత్నంగా-"పార్వతీ!" అన్నాను.  ఆమెనన్ను  చూసి  ఉలిక్కిపడింది. ఆమె  ప్రక్కనున్న యువకుడు నావంక  గుర్రుగా చూశాడు.     "ఇక్కడి కెప్పుడోచ్చావ్ పార్వతీ!" అన్నాను  నేను.     "ఎవరు మీరు?" అనడిగాడా యువకుడు.     "ఆమెనే అడగండి __"అన్నాను ధైర్యంగా. సర్వర్  లోపలకు వచ్చాడు. వాళ్ళూ నేను  కూడా మా అర్దర్సు చెప్పాం. సర్వర్ మంచినీళ్ళు పెట్టి వెళ్ళిపోయాడు మరో జంట మా అపార్ట్ మెంట్లోకి తొంగిచూసి_ఒకసీటే కాళీ ఉండడం చూసి వెనక్కు వెళ్ళిపోయారు.                  

వలచి వచ్చిన వనిత - 4

   వలచి వచ్చిన వనిత -వసుంధర   పార్ట్ - 4   అయితే నాకుచేతకాదు. మీరే చెప్పాలి!" అన్నాను.     "అర్ధమైందిలెండి __ మీకునాతో మాట్లాడం ఇష్టంలేదు"__అందామె కాస్త కోపంగా.     "అలాగని ఎందుకను  కుంటున్నారు? మీరుమాటాడుతుంటే అలావింటూ ఉండిపోవాలనిపించడం జరగవచ్చుకదా!" అన్నాను.     చప్పట్లు కావాలంటే రెండు చేతులూ కలవాలి. సంభాషణ నడవాలంటే కనీసం ఇద్దరు  మాట్లాడాలి."     "మాట్లాడ్డానికి నాకేమీ అభ్యంతరంలేదు. కానీ ఒక్కమనవి. మీకూనాకూ ఇంతవరకూ ఏవిధమైన పరిచయమూ లేదు. అందులోనూ మీరు ఆడ, నేనుమగ. విచిత్ర పరిస్ధితుల్లో మనమిక్కడ  కలుసుకున్నాం. ఇవన్నీ కాస్తసంకోచానికి సరైన కారణాలు కావంటారా?" అన్నాను.     ఆమె భావగర్భితంగా నావైపుచూచింది__" ఒప్పుకున్నాను కానీ  నేను కాస్త  ధోరణి  మనిషిని. కొత్త, పాత అని లేకుండా ఎవరితోనైనా  నేను గంటలతరబడి మాట్లాడేయగలను. అలా  మాట్లాడాలనే నాకుంటుందికూడా. కానీ  అస్తమానం అవకాశం కలిపిరాదు. మంచి ఉత్సాహంతో కబుర్లు చెప్పుకునే సమయంలో__అబ్బ ఈపెద్దవాళ్ళున్నారు చూశారూ___ పానకంలో పుడకల్లా అడ్డుపడతారు".....................     నేనామెను మధ్యలో ఆపి"__"ఇంతకూ మీఅన్నయ్యకూడామీరంటున్న పెద్దల్లో ఒకడా?" అనడిగాను.     "అనే అనుకోండి__" అందామెనవ్వి. ఆమెస్నానం చేస్తానంది. ఆ సమయంలో నేను  వెళ్ళి తినడానికి ఏమైనా తెస్తానని చెప్పి బయట పడ్డాను.     పార్వతి ప్రవర్తన కాస్త  చిత్రంగానే ఉందినాకు. మనిషి చాలా అందంగాఉంది. కంఠం  తియ్యనిది. డాషింగ్ నేచర్ ఉంది. శ్రీధరబాబు తన చెల్లెలు ప్రసక్తి ఇతరులు తీసుకువస్తే  సహించలేకపోవడానికీ- పార్వతి స్వభావానికీ ఏదైనా సంబంధముందా అన్న అనుమానం నాకు లీలగాతోచింది.     దోసెలూ,ఇడ్లీ పార్సెల్ కట్టించుకుని నేను గదికి వెళ్ళి తలుపు తట్టేసరికి తల ఆరబోసుకుని ఉన్న పార్వతి తలుపు తీసింది. ఆ రూపంలో ఆమె చాలా చాలా అందంగా ఉండడం వల్ల నేను ఒక్కక్షణంపాటు అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాను.     "తలుపులు తీశానుమరి. అయినా మీరు  లోపలకు రావడంలేదు__" అందామె.     ఆమె మాటల్లో నాకు రెండర్ధాలు ధ్వనించాయి. తన  హృదయపు తలుపులు  తెరిస్తే నేను సంకోచిస్తూన్నట్లుగా  ఆమె అన్నట్లు నాకు అనిపించింది. నేను గదిలో అడుగు పెట్టి మళ్ళీ తలుపులు వేసి ముందడుగు వెస్తూ కూడా ఆమె అలా కళ్ళప్పగించి చూస్తున్నాను.      ఆమె మంచం మీద కూర్చుంది. నేను కుర్చీలో కూర్చున్నాను. అప్పుడు  నాకు పార్వతి గురించి టిఫెన్ తెచ్చిన విషయం స్పురణకు వచ్చి  లేచి వెళ్ళి "మీకోసం టిఫెన్ తీసుకవచ్చాను__" అంటూ ఆమెకు పొట్లాలు అందించాను.      ఆ అందించడంలో ఇద్దరి చేతులూ కొద్దిగా తగిలాయి. అస్పర్శలోని మధురాను భూతిని వర్ణించలేను కానీ ఒకసారి  ఆమెను దగ్గరగా లాక్కోవాలనిపించింది. నామెదడులోని ఆలోచన ఇంకా ఒకరూపానికి వచ్చేలోగానే__ సుదర్శనం  గుండెలమీద కూర్చుని అతగాడి గొంతు నులుముతున్న శ్రీధర బాబు రూపం భయంకరంగా స్పష్టంగా ఊహలో కనిపించింది. చటుక్కున వెళ్ళి కుర్చీలో కూర్చున్నాను. పార్వతిని శ్రీధరబాబు చెల్లెలిగా గుర్తించడం జరగడంతో నేను పూర్తిగా వార్మల్ కువచ్చాను.     "ఇంత కొద్దిగా తెచ్చారు. ఇది ఇద్దరికేం సరిపోతుంది?" అందిపార్వతి.     "నేను  తినే వచ్చాను_" అన్నాను.     "నాఅతిధులు హొటల్ లో తినడం నేను సహించలేను. నాతోపాటు ఇంట్లో తిని తీరవలసిందే__" అంటూ ఆమే టిఫెన్ ని రెండు సమభాగాలు  చేసింది. ఆక్షణంలో ఆమే  ఆప్యాయతకు ఒక యువకుడిలా కాక చంటిపిల్ల వాడిలా  లొంగిపోయాను. ఇద్దరం టిఫెన్ తిన్నాం.     ఆమె టైము చూసుకుని__" నిజానికి ఇది భోజనం టైము అంది.     "ఏడుగంటలకు భోంచేయడం నాకు అలవాటులేదు___" అన్నాను.     "అవుననుకోండి. కానీ ఏడుగంటల ప్రాంతంలో  టిఫెన్ తీసుకుంతే రాత్రికీ భోజనం చేస్తారా__ మరిపస్తేనా?" అనడిగింధామె.     "భోజనం తొమ్మిది గంటలకి!"     "అయితే అప్పుడు మళ్ళీ వెళ్ళి భోజనం తీసుకోస్తారా-" అని నాజవాబుకు ఆగకుండానే__ నా అతిథిని అంత రాత్రి వేళ ఒంటరిగా బయటకు పంపడం నాకిష్టముండదు కాబట్టి హొటలుకు నేనూ మీతో వస్తాను_" అంది.     "అతిధిని హొటల్ లో భోంచేయనిస్తారా  మరి___" అన్నాను ఆమెను దెబ్బతీయగలిగినందుకు నంబరపడుతూ.     "భలేవారే __ఆడది ప్రక్కన ఉన్న చోట ఇల్లుకాక హొటలెలా అవుతుందండీ!" అని ఆమె నవ్వేసింది.     ఎనిమిది గంటల ప్రాంతంలో ఇద్దరం గదిలోంచి బయటకువచ్చి కాసేపు వీధులలో విహరించాం. తోమ్మిది గంటల ప్రాంతంలో ఒక హొటల్ లో భోజనం చేశాం. అన్నిచోట్ల డబ్బు నేను ఇచ్చాను. భోజనమై బయటకు వచ్చేక ఆమెతో___మరి నేను  సెలవు తీసుకుంటాను. పునర్దర్శనం మళ్ళీ రేపు  ఉదయం చేసుకుంటాను___" అన్నాను.     "ఒకర్తినీ ఒంటరిగా అంతఇంట్లో నేనుండలేను. అంతగా మీకా ఇంట్లో పడుకోవడం ఇష్టంలేక పోతే నేనూ మీతోనే వచ్చేస్తాను__" అందామె.     అది అమాయకత్వమా లేక జానతనమా అన్నది నాకు తెలియలేదు. నామనసులోని అభిప్రాయాన్ని ఇంకాస్త స్పష్టంగా  చెప్పక తప్పదనుకుని__" శ్రీధరబాబు నాకు స్నేహితుడు. అతని  మనసుకు కష్టం కలిగించే పని ఏదీ నేను చేయలేను_" అన్నాను.     "రాత్రి పూట తన చెల్లెల్ని ఏకాకిగా కొంపలో వదిలేసి పోయిన  స్నేహితుడిని అన్నయ్య క్షమించగలడని నేననుకొను__"     శ్రీధరబాబు సంగతి బాగా ఎరిగున్న నేను వెంటనే ఏమీ మాట్లాడలేదు, తిరిగి మళ్ళీ ఆమే అన్నది__" నన్నెంతసేపు  మీరు  మీ  స్నేహితుడి చెల్లెలుగానే భావిస్తున్నారు తప్పితే  ఒంటరిగా ఉండడానికి భయపడుతున్న ఒక ఆడదానిగా గుర్తించడంలేదు. ఇదేపరిస్ధితిలో మీచెల్లెలూ ఉంటే మీకింత సంకోచమూ ఉండేదా?"     "అవును. నిజమే! 'ఆమే నాలోని లోపాన్ని చక్కగా ఎత్తిచూపించింది. పార్వతిని శ్రీధరబాబు చెల్లెలుగా మాత్రమే నేను గుర్తిస్తున్నాను తప్పితే నాచెలెలిగా భావించలేక పోతున్నాను__ "అప్పుడే  పరిచయమైన వయసులో ఉన్న అందమైన యువతిని చెల్లెలుగా భావించడంలో కష్టం ఫీలవుతున్న నేను అదినాలోపమేనని అంగీకరిస్తున్నాను. కానీ ఏతప్పు చేయకుండా ఉండడంకోసం అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం లోపమని నేననుకొను."     "సరే__ఒక  ప్రశ్న అడుగుతాను మీఉద్దేశ్యం నాకర్ధమయింది. పగలు నాతో ఏకాంతంగా కొన్ని గంటలు గడపడానికి భయపడని మీరు రాత్రి అలా  చేయడానికి జంకుతున్నారు. కారణం తెలుసుకోవచ్చా?     నేను మాట్లాడలేదు. ఆమే ప్రవర్తన నిష్కళంకం కావచ్చు. నేను చాలా బుద్ది మంతుడిలా ప్రవర్తించవచ్చు. కానీ  శ్రీధరబాబు లాంటి వాడికి ఆమే చెల్లెలుకావడం కారణంగా నేను  ఏవిధమైన రిస్కూ తీసుకోదల్చలేదు.     ఆమె మళ్ళీ అంది__"సరే __మీ మౌనమే సమాధానమనుకుంటాను. నేను రాత్రిళ్ళు ఒంటరిగా గడపలేను. అందుకని చిన్న రిక్వెస్టు. మనం సెంకండ్ షో సినిమాకి వెడదాం. వదిలే సరికి ఒంటిగంట దాటుతుంది.  అప్పుడు నన్ను ఇంటిదగ్గర దిగబెట్టి మీరు మీయిష్టంవచ్చిన చోటుకి వెడుదురుగాని. చాలా భాగం రాత్రి గడిచిపోతుంది కాబట్టి__మిగతా భాగం రాత్రి ఎలాగో అలా ఒంటరిగా గడపడానికి నాబాధ నేను పడతాను."     ఒక అరగంట సేపు పార్వతి సినిమా బుది గానే చూసింది. ఆతర్వాతనుంచి కొది కొద్దిగా చిలిపిచేష్టలు ప్రారంభమయ్యాయి. ఉండుండి నావైపు వాలిపోతూండేది. నిద్రవస్తోందని సంజాయిషి ఇచ్చుకున్నప్పటికి ఆమె ముఖంలో ఎక్కడా నిద్రచాయలు నాకు కనపడలేదు ఒకోసారి తన కాలితో  నాకాలు  నొక్కుతూండేది. చాలాపర్యాయాలు నాచేతిని నొక్కింది.

నిశ్చల చిత్రం

నిశ్చల చిత్రం - భవానీ దేవి ముసురుపట్టింది ఆకాశానికే కాదు నా మనసుకు కూడా ! చెట్లు ఆకులన్నీ రాల్చిన లండన్ శిశిరంలో ఆలోచనలు కూడా రాలిపోతున్నాయి రోడ్డంతా రంగులు మారుతున్నా ఆకుల్నద్దుకుని ప్రకృతి ప్రసాదించిన వికృతిలావుంది. ఇక్కడ ఋతువులే కాదు మనుష్యులు కూడా పరిగెత్తే నిశ్చల చిత్రాలే! ఈ నడుస్తున్న సమూహాలలో నా ఒంటరితనం చిక్కుకుని మూలుగుతోంది పలకరింపుల్లో కృత్రిమత ఎప్పుడో ఒక ఎమర్జెన్సీ సైరన్ ప్రాణం ఖరీదును గుర్తు చేస్తూ జారిపోతుంది.... చీకటి పాడుతున్నచల్లని పాటను వింటూ సుదూరపు వేగుచుక్క వెలుగులో చలికాచుకోవాలని అత్యాశ! అనుభూతులు స్పందనలు రాల్చుకుని దీనిని దూరంగా విసిరేయలేను... హృదయం గోడకు తగిలించనూ లేను...

వలచి వచ్చిన వనిత - 3

వలచి వచ్చిన వనిత -వసుంధర   పార్ట్ - 3     చాలా తమాషా అయిన సందర్భం ఏర్పడినట్లు నాకు తోచింది. తీవ్రంగా ఆలోచనలో పడ్డాను.     శ్రీధరబాబు ఉంటున్న వాటా మొత్తంరెండు పెద్ద  గదులు ఒక చిన్న వంటిల్లు. ఎవరైనా ఒక రిద్దరు అతిధులుగా వస్తే  ఆదరించడానికి సరిపడ్డ నివాసమే అతనిది. అయితే అతను లేని సందర్భంలో అతని చెల్లెలు వస్తే  మేమిద్దరం అదే వాటాలో ఉండడం  కష్టమే మరి.     ఇంతకీ ఆమెను స్టేషన్ కి వెళ్ళి రిసీవ్ చేసుకునేదెలా? ఆమెను నేనెన్నడూ చూసి ఉండలేదు. ఆమె తనకు తానుగా  సరాసరి గదికి రాగలదో లేదో తెలియదు. ఈ  పరిస్ధితుల్లో నేనేం చేయాల్సి ఉంటుంది?     ఏంచేయ దల్చుకున్నా బాగా ఆలోచించాకనే ఒక నిర్ణయానికి  రావలసిఉంటుంది. ఎందుకంటే ఇది శ్రీధరబాబు చెల్లెలితో వ్యవహారం!     నేను మళ్ళీ  చొక్కా  వేసుకొని టెలిగ్రామ్ చేత్తో పట్టుకుని  తలుపులు తీసుకుని గది బయటకు వచ్చాను. వెదక  బోయిన  తీగెకాలికి తగిలి నట్లుగా  నిన్ననే నాకు పరిచయమైన ఇంటాయన కనపడ్డాడు. నన్నూ నా చేతిలోని టెలిగ్రామ్ నూ చూస్తూ ఆయన  గాబరాగా-"ఏమిటీ మళ్ళీ  మరో టెలిగ్రామా?" అన్నాడు. ఆయన మాట వినగానే  నాకూ  గాబరా  కలిగింది. శ్రీధరబాబుకి గాని కొంప తీసి ఇంకో టెలిగ్రామ్ వచ్చి ఉండలేదుకదా_అని కంగారు పడ్డాను.     ఇంటాయన నా చేతులోంచి లాక్కొన్న విధంగా టెలిగ్రామ్ తీసుకుని  చదివి తెలిగ్గ్గా నిటూర్చి-"హమ్మయ్య-" అనిఒక్కనిముషం  ఆగి-"పొద్దున్నే నాకు ఓ టెలిగ్రామ్ వచ్చింది__మ ఆవిడకు సుఖప్రసవమై కొడుకును కన్నదని. అంత మంచి వార్త వచ్చిన తర్వాత  మరో టెలిగ్రామ్ వెంటనే వచ్చిందంటే గాబరా కలగడం సహజమే కదండీ! ఏమయితేనేం-మీతో సరదాగా ఓ రెండు రోజులు కాల క్షేపం చేయడానికి లేకుండా  నేను మా అత్తారింటికి వెళ్ళ వలసి వస్తోంది__" అని హఠాత్తుగా ఏదో గుర్తు కొచ్చిన వాడిలా_"ఇంతకీ మీరేదో చెప్పాలని వచ్చినట్లున్నారు!" అన్నాడు.     నిన్ననే ఇంటాయన అన్నాడు నన్నుచూసి__ "నేనూ ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను కాబట్టి ఓ రోజు సరదాగా  మనమంతా అడ్డాటలో కూర్చుందాం___" అని అది  గుర్తుకొచ్చి మన  మెప్పుడేం చేయబోయేదీ మనకే తెలియదుగదా అనుకున్నాను. నేను వచ్చిన  పని ఇప్పుడీయనకు చెప్పి ప్రయోజనంలేదు. శ్రీధరబాబు లేని సమయంలో అతని చెల్లెలు  రాబోతున్న సందర్భం- తెలియనివ్వడం అనవసరమని తోచింది. అందుకే కాస్త మాట మార్చి__"అబ్బే ఏమీలేదు. ఉబుసుపోక వచ్చాను. అంతా నా పాదం మంచిదంటారు. చూశారా, నేను మీ ఇంట్లో కాలుపెట్టాను మీకు కొడుకు పుట్టిన  వార్త అందింది. కంగ్రాట్యూలేషన్స్!" అన్నాను.     "థాంక్సండీ__" అన్నాడాయన.     "ఇంతకీ ప్రయాణమంటున్నారు_ఎన్నాళ్ళేమిటి మకాం!"     "మూడు వారాలు!" అన్నాడాయన.     "హతోస్మి!" అనుకున్నాను.             3     ఇంటాయన తెల్లవారు ఝామునే లేచి వెళ్ళి పోయాడు. నేను ఉదయం పదిగంటల ప్రాంతంలో నా ఆఫీసు పనిమీద బయటకు వెళ్ళాను పార్వతికోసం స్టేషన్ కు వెళ్ళదల్చు కోలేదు కాబట్టి- బయటకు వెళ్ళబోయేముందు__తాళం కప్పుకు ఓ ఉత్తరం రాసి  పెట్టాను. అందులో శ్రీధరబాబు ఊళ్ళోలేని సంగతి రాసి__నేను ఇంటికి వచ్చే టైము కూడా  ఇచ్చాను.     హైదరాబాద్ ఎక్స్ ప్రెస్  అక్కడకు సుమారు నాలుగు గంటలకు వస్తుంది. నా ఆపీసు పని కూడా నాలుగు గంటలకే అయింది.  స్టేషన్ కు  ఫోన్ చేసి__ట్రయిన్ లేట్ ఏమో కనుక్కున్నాను. ఆ రోజు కరెక్ట్ టైమ్ కే వచ్చిందట. నేను టైము గణించు కున్నాను.     పార్వతి స్టేషన్లోదిగి కాసేపు అన్న గురించి ఎదురు చూస్తుంది. ఆ తర్వాత  నెమ్మదిగా ఆలోచించి మరి అన్నరాడని గ్రహించడానికి కనీసం ఒక  అరగంటైనా పడుతుంది. అప్పుడామె విసుక్కుంటూ ఏరిక్షాలోనో గదికి బయల్దేరుతుంది. ఇదంతాజరిగి ఆమె గదికిచేరుకునేసరికి సుమారు అయిదవుతుంది. ఉదయం చీటీలో అయిదున్నరకు వస్తానని రాసినా  ఓపావుగంట ముందుగా వెళ్ళడం మంచిదని తోచింది.     నాలెక్క తప్పలేదు. నేను వెళ్ళేసరికి ఇంటివరండాలో__ఒక యువతి కూర్చునిఉంది. ఆ ఇంటికి అదేవరండా, అదేవీధరుగు అనిచెప్పవచు. ఎదురుగుమ్మం ఇంటాయనది ప్రక్కగుమ్మం శ్రీధరబాబుది!     ఆ యువతిని చూస్తూనే నేను తెల్లబోయాను. ఆమె అందంలో అప్సరస. చూసిన క్షణంలో అంతకు మించి మరే ఆలోచనా బుర్రలో కదలలేదు.     నేనూ  ఆఇంటి వరండాలో అడుగిడుబోతూండడం చూసి  ఆమె అసహనంగా నావంకచూసి__ "మీరేనా అన్నయ్యస్నేహితుడు?" అనడిగింది.     తియ్యని ఆ పలుకులు వింటుకూడా- సమాధానమెలా ఇవ్వగలిగానో నాకు ఆశ్చర్యమే మరి "శ్రీధరబాబు చెల్లెలు మీరే నన్నమాట!" అన్నాను.     "చెల్లెలు అనేఅనుకోండి" అనిఆమె అదొకలానవ్వింది "ఇంతకీ అన్నయ్య ఎప్పుడువస్తాడు?"     "రెండు లేక మూడు రోజులు"     "బాస్ రే!" అందామె చిరాకును వ్యక్తపరుస్తూ.     "ముందుగదిలోకిపదండి!" అన్నాను నేనుముందడుగువేసి.     తలుపు తాళం తీశాను ఆమెలోపలకు ప్రవేశించింది చిన్న సూట్ కేసుతో.     "ఇటువంటి పరిస్ధితి వస్తుందని బాబు ఊహించలేదు. లేకపోతే నీగురించి ఏదోమంచి ఏర్పాటుచేసి ఉండేవాడు. టెలిగ్రాం కూడా  అతను లేని సమయంలో వచ్చింది. మరి ఇప్పుడింకఒక్కటే ఉపాయం. మీరిక్కడహాయిగా మకాం పెట్టుకొండి. మీ అవసరాలన్నీ నేను చూస్తూంటాను. రాత్రిళ్ళునే నెక్కడేనా పడుకునే ఏర్పాటు చేసుకుంటాను"  అన్నాను.     ఆమె తమాషాగానవ్వి__"మొత్తానికిమగవాణ్ణనిపించారు చచ్చి ప్రయాణం చేసి నేనువస్తే మీరు రాత్రిగురించి ఆలోచిస్తునారు"__అంది.     దెబ్బతిన్నాను __అయినా లోంగకుండా__ "నిజంచెప్పాలంటే మీరు ప్రయాణంచేసి వచ్చేరనిపించడంలేదు. పువ్వులా ఇంతపిసరు నలగకుండా వచ్చారు"__అన్నాను.     ఆమెముఖంలో రవంత గర్వంలాంటిది కనబడింది___"బాగానే ఉంది మీ పొగడ్త! కానీ పెళ్ళికాని ఆడది నలిగిన పువ్వులా ఉంటుందని ఎలాగనుకున్నారో నాకు మాత్రం తెలియడంలేదు"__     మళ్ళీదెబ్బతిన్నాను. ఘటికురాలే శ్రీధరబాబు చెల్లెలు అనుకున్నాను.  ఈమెదగ్గర నాకింత పిసరుకూడా  బెరుకు అనిపించడంలేదు. ఈ జీగా మాట్లాడటం కష్టం. ప్రస్తుతం మీగురించి నేనేం చేయవలసిఉందో చెప్పితే అలామసులుకుంటాను." అన్నాను  వినయంగా.     "దారికి వచ్చారు. అయితే ఈగదికినేను యజమానిని. నా అన్నయ్యకు అతిధికాబట్టి మీరు నాకూ అతిధే అవుతారు. అతిధి మర్యాదలు చేయడం నాకు బాగాతెలుసు. ముందు మీరలా కుర్చీలో కూర్చోండి. అతిదుల్ని నిలబెట్టి మాట్లాడకూడదు"___ అందామె చనువుగా.     "నేనువెళ్ళి కుర్చీలో కూర్చున్నాను. ఆమెకదిలి శ్రీధరబాబు మంచంమీద కూర్చుంది."__ ఇప్పుడు మనంకాసేపు ఏవైనా  కబుర్లు  చెప్పుకుందాం"___అందామె అదోకలా వళ్ళు విరుచుకుంటూ.     ఉండిండీ ఉండిండీ ప్రక్కదారులు పడుతున్న మనసును నిలదొక్కుకుంటూ__"కబుర్లా కథలుకూడానా"? అనడిగాను.     "కథలే అనుకోండి__కాకపోతే కథలాంటి కబుర్లు".......  

స్నేహం ఖరీదు...?

            స్నేహం ఖరీదు...?       'పోస్ట్...' పిలుస్తూనే కాలింగ్ బెల్ కొట్టాడు పోస్ట్ మేన్. సెకండ్ సాటర్ డే...కొంచెం ప్రశాంతంగా టి.వి. చూస్తున్న సుమ లేచి వెళ్ళి తలుపు తీసింది.     మామూలు ఉత్తరాలు కాదు. రిజిస్టర్డ్ లెటర్. సంతకం చేసి లోపలికి వచ్చి కవరు ఓపెన్ చేసింది.     గుండె ఆగినట్లయి మళ్ళీ కొట్టుకుంటోంది వేగంగా... ఎందుకిలా జరిగింది. ఎక్కడుంది పొరపాటు. తనకేనా ఈ కోర్టు నోటీసు.. మళ్ళీ మళ్ళీ చదివింది. తనే... అనుమానం దేనికి? ఇంత స్పష్టంగా కన్పిస్తుంటే...     తార ఎంత పని చేసింది. నమ్మించి మోసం చేయటం ఎంత నీచం. కాని ఎవరో అన్నట్లు నమ్మకం ఉన్నచోటే మోసం ఉంటుంది. నమ్మలేని వాళ్ళని ఎవరు మోసం చేస్తారు?     వళ్ళంతా చెమటలు పట్టినట్లయింది. లేచి చల్లని మంచినీళ్ళు తాగింది సుమ. పిల్లలు ఇంకా కాలేజినించి రాలేదు. ఈ విషయం శ్రీధర్ కి తెలిస్తే ఎంత బాధపడ్తాడు. ఎలా రియాక్టు అవుతాడు. స్నేహితురాలని నమ్మి మూడు లక్షల చిట్ కి ష్యూరిటీ సంతకం ఎంత ప్రేమగా చేసింది తను. అసలు తార ఎందుకిలా చేసింది. రెండురోజుల క్రితం ఫోన్ చేస్తే నెంబరు వాడుకలో లేదని టేప్ వచ్చింది. ఇంటికి వెళ్తే ఇల్లు కూడా ఖాళీ చేశారని వార్త. అయినా ఏదో ఆశ... ఈ నోటీస్ తో ఆ కాస్త ఆశ తేలిపోయింది. కోర్టు దాకా చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు వెళ్ళారంటే అన్ని విధాలా ప్రయత్నం చేశాకే గదా! నిట్టూర్చింది సుజాత. మనసు అంతా చేదుగా ఉంది. టి.వి. ఆపేసి బెడ్ మీద వాలిపోయింది. ఆపినా ఆగని ఆలోచనలు. ఎ.సి. ఉన్నా ఆవిర్లెత్తే ఆలోచనలు గతంలోకి ప్రయాణం చేస్తున్నాయి.      స్కూల్లో చదువుకునే రోజులు. తార గలగలా పారే సెలయేరులా అందంగా... చురుగ్గా... అందరినీ ఆకర్షించేది. సగటు మధ్య తరగతి కుటుంబంలో పుట్టి నలుగురు ఆడపిల్లలో ఒక ఆడపిల్లగా కోరికలు నెరవేర్చుకోలేని సుమకు తార అంటే ఆరాధన. తార తండ్రి ఆ వూళ్ళో కాలేజీలో ప్రొఫెసర్. వాళ్ళకి ఒకే ఒక్క సంతానం తార. అల్లారుముద్దుగా... గారాబంగా ఏది కోరితే అది అందించే తల్లిదండ్రులు.     స్కూల్లో అమ్మాయిలంతా తారని చూసి అసూయ పడేవాళ్ళు. ఆ అమ్మాయి పక్కన కూర్చున్నా మాట్లాడినా తరించి పోయామనుకునే వాళ్ళు... డాన్స్, సంగీతం, వీణ... ఎన్ని విద్యలు తెలుసో... తారే కళ్ళు తిప్పుతూ తన టైమ్ టేబుల్ చెప్పేది. లేచింది మొదలు ఇంట్లో పని లేదు. అవీ ఇవీ నేర్చుకోవటమే. స్కూల్లో యానివర్సరీ ప్రోగ్రామ్స్ లో తార నృత్యం తప్పని సరి. ఆ వయసుకే పట్టు వోణీలు, పట్టు చీరలు కట్టే తార అందరికీ స్వప్న సుందరిలా ఉండేది. కొన్నాళ్ళకి తార తండ్రికి బదిలీ కావటాన ఊరు విడిచి వెళ్ళిపోయింది. ఎక్కడో తిరపతిలో తార బిఎస్సీ చదువుతోందని ఒ గాలి వార్త... పెళ్ళి అయిందని మరో వార్త...     జీవన పోరాటంలో అస్తిత్వ సంఘర్షణలో సుమ ఉద్యోగం వేట మొదలెట్టింది. తండ్రికి అసలు ఇష్టం లేదు. స్త్రీకి ఆర్ధిక స్వేచ్చ ఉండటం మీద సుమ తండ్రికి నమ్మకం లేదు. అయినా సుమ పట్టుదలతో గ్రూప్ -టూ పరీక్ష రాసి హైద్రాబాదులో సచివాలయంలో ఉద్యోగంలో చేరింది. సుమ స్మృతుల్లో తార ఒక స్నేహగీతం. సుమ హైదరాబాద్ లోనే ఓ బ్యాంక్ ఉద్యోగిని పెళ్ళి చేసుకుంది. వాళ్ళకి ఇద్దరు పిల్లలు రమ ఇప్పుడు ఇంటర్, కృష్ణ పదో క్లాసు. దైనందిక జీవన వేగంలో సుమకి ఎవరి గురించి ఆలోచించే తీరిక లేదు.     ఆ రోజు మధ్యాహ్నం పూట. ఆఫీసులో అందరూ క్యాంటీన్ లోనూ... చెట్ల కింద కాసేపు సేద తీరుతున్నారు. సుమ సీటు దగ్గరే మరో ఇద్దరు కొలీగ్స్ తో లంచ్ చేస్తోంది. హఠాత్తుగా ఎక్కడ్నుంచో ఆ పిలుపు.     "హలో సుమా... బాగున్నావా! ఎన్నాళ్ళయిందే నిన్ను చూసి" చొరవగా వచ్చి ఎదుటి సీటులో కూర్చున్న ఆ భారీకాయం... ఎవరబ్బా! ఇంత తెలిసినట్లు మాట్లాడుతోంది!     "బాగానే ఉన్నానండి... మీరు..." పోల్చుకునే ప్రయత్నం చేస్తోంది సుమ.     పెద్దగా నవ్వింది ఆమె. ఆ బుగ్గమీది సొట్ట... అవును అది తారే! చిన్ననాటి నేస్తాన్ని చూసిన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది సుమ.     "తారా! నువ్వా! ఎన్నాళ్ళకి ఇలా... ఉండు" చెయ్యి కడుక్కొని వచ్చింది. కొలీగ్స్ నవ్వుతూ వెళ్ళిపోయారు.     "థాంక్స్... నువ్వు నన్ను గుర్తుపడతావో లేదో అనుకున్నా" అంది తార అందంగా నవ్వుతూ.     "నిన్నెలా మర్చిపోతాను. కానీ నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసు" సుమ అంది ఉద్వేగంగా.     "మన వూరు వెళ్ళాను పనిమీద. మీ నాన్నగారింటికి వెళ్తే నీ వివరాలు అడ్రసు చెప్పారు."     "అయినా ఆఫీసుకేంటే! ఇంటికి రా" అంది సుమ ఆప్యాయంగా స్నేహితురాలి చెయ్యి పట్టుకుని.     "ష్యూర్! చాలా కబుర్లున్నాయి" అంటూ తార వెళ్ళిపోయింది.     తర్వాత తార తన కారును సుమ ఇంటికి పంపింది.     "అమ్మగారు తీసుకు రమ్మన్నారు" వినయంగా అన్నాడు తార డ్రైవర్. సుమ ఆనందంగా ఆ విదేశీ కారులో తార ఇంటికి వెళ్ళింది. తార బోలెడు కబుర్లు... నవ్వులు... కేరింతలతో తన జీవితాన్ని విన్పించింది.     తార బిఎస్సీ చదువుతుండగానే ప్రేమించి పెళ్ళి చేసుకుంది. ఆమె భర్త సుందర్. ఫోటో చూస్తే నల్లగా పొట్టిగా అందమైన తార పక్కన దిష్టిబొమ్మలా అన్పించాడు పెద్ద బిజినెస్ మాగ్నెట్ ట. అన్నీ తారే గబగబా చెప్పింది.     అయినా తార ప్రేమించి చేసుకుందంటే మంచి వాడయి ఉంటాడు. ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి శాంతి. డిగ్రీ చదువుతోంది. రెండో పిల్ల సుగుణ ఇంటర్ లో ఉంది.     "అమ్మ పోయింది సుమా" తార దిగులుగా చెప్పింది.     "నాన్నని హోంలో చేర్చాం" తనే అంది.     "ఎందుకు. నువ్వు చూసుకోలేవా" సుమ అడిగింది.     "ఆయన ఒప్పుకోలేదు. ఆస్తి నాకు రాసి హోంలో చేరారు. అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తుంటాను" తార సంజాయిషీగా అంది.     "నువ్విలా ఇరవయ్యేళ్ళ తర్వాత నన్ను వెదుక్కుంటూ రావటం నాకు సంతోషంగా ఉంది. ఎప్పుడైనా తీరికగా ఉన్నప్పుడు మనం ఎక్స్ కర్షన్ వెళ్ళినప్పటి సరదాలు సంగతులు, తల్చుకుంటాను. అదేం పాట నువ్వు పాడే దానివి...?" హఠాత్తుగా అడిగింది సుమ.     'అదా! అవన్నీ నువ్వింక మర్చిపోలేదన్న మాట..'     "సయొనారా... సయొనారా... వాదా నిభావుంగీ సయొనారా". తార మళ్ళీ రాగం తీసింది అల్లరిగా.     "ఈ పాట రేడియోలో... టి.వి. లో ఎప్పుడు ఎక్కడ విన్పించినా నువ్వు గుర్తు వస్తావే" సుమ అంది ప్రేమగా.     "మన క్లాస్ మేట్స్ లో ఉష అనే అమ్మాయి ఉండేది చూడు. 'మనసున మనసై' పాట పాడేదీ..." తార గుర్తుచేసింది.     "ఆ! అవును గుర్తొచ్చింది. ఎక్కడుందో" సుమ దిగులుగా అంది.     "మొన్న ఎయిర్ పోర్టులో కన్పించింది. నేనే గుర్తు పట్టి పలకరించాను." తార చెప్పింది ఇన్వెంటివ్ గా.     "చాలా మంచి గొంతు. ఆ రంగంలో కృషి చేసి ఉంటే మంచి సింగర్ అయి వుండేది" సుమ నిట్టూర్చింది.     "నన్ను చూడు... అన్ని నేర్చుకున్నా ఏదీ లేదిప్పుడు... ఇల్లు... పిల్లలు... బిజినెస్ అంతే..." పక పకానవ్వింది తార.     "నీది వడ్డించిన విస్తరి. నాలా కాదు"     "అలా అనొద్దే. నీది స్వయంకృషి" తార అనునయించింది.     ఇలా స్నేహితురాళ్ళిద్దరూ ఎన్నో కబుర్లు చెప్పుకుని గతస్మృతుల్లో తేలారు. ఒకళ్ళ ఇంటికి మరొకరు రాకపోకలు జరిగాయి. సుమకి తార తిరిగి పరిచయం కావటం చాలా బాగుంది. బాల్య స్నేహం అంటే అపురూపమైంది సుమకి... ఎవరికైనా కూడా...     హఠాత్తుగా ఓ రోజు తార ఫోన్. ఒకటే ఏడ్చింది. పెద్ద కూతురు శాంతికి జ్వరమొస్తే మెడికల్ రిపోర్టులు తీయించారట. బ్లడ్ కాన్సర్... తట్టుకోవటం తారావల్లేమౌతుంది!     సుమ ఆ సాయంత్రం తార దగ్గరికి వెళ్ళి ఓదార్చింది. కొంత వేదాంతం, కొంత కర్తవ్యం కలిపి హితబోధ చేసింది. శాంతిని చూస్తే జాలేసింది. మనసు కలత పడింది. సంబంధాలు చూసి పెళ్ళి చేద్దామనుకునేంతలో ఇలా... తార దుఃఖం ఆపటం కష్టంగానే ఉంది. శాంతి అందమైన పిల్ల. పెద్ద జడ. అంతా కుచ్చులు కుచ్చులు ఊడిపోతుంటే గుండు చేయించింది తార.     సుమకి ఆ రాత్రి నిద్రలేదు. శాంతి ఊరికే గుర్తొస్తోంది. మూడు నెలలు గడిచాయి. శాంతి క్షీణిస్తోందిట; తార విశేషాలు తెలుస్తూనే ఉన్నాయి.     ఆరోజు ఆదివారం. మధ్యాహ్నం ఎండలో తార, భర్త రెండో కూతురితో హడావుడిగా వచ్చింది.     "సుమా! ఈ పేపర్ మీద సంతకం చేయవే" కాయితాలు చేతికిచ్చింది.     అవి చిట్ ఫండ్ కంపెనీకి ష్యూరిటీ ఇస్తున్నట్లు బాండ్ పేపర్లు. ప్రశ్నార్ధకంగా చూసింది సుమ.     "మూడు లక్షల చిట్... శాంతి ట్రీట్ మెంటుకి డబ్బుకావాలి. ష్యూరిటీ గవర్నమెంట్ ఆఫీసర్ చేయాలని చిట్ ఫండ్ వాళ్ళు అంటున్నారు."     "కానీ నేను..."     "ఏం మాట్లాడకే. గంపెడాశతో వచ్చా. పిల్ల చావు బతుకుల్లో ఉంది. ఈ డబ్బుతో దానికి ట్రీట్ మెంట్ చేయించాలి" చేతులు పట్టుకొని ఏడ్చేసింది తార.     "బిజినెస్ లో డిపాజిట్స్ ఫిక్స్ డ్ లో ఉన్నై. రెండు నెలల్లో అన్నీ క్లియర్ అవుతాయి. చేయండి ప్లీజ్" తార భర్త ప్రాధేయపడ్డాడు.     సుమ వణుకుతున్న హృదయంతో సంతకం చేసింది. ఆ కుటుంబం థాంక్స్ చెప్పి వెళ్ళిపోయారు. కొన్నాళ్ళకి శాంతి మరణించిందని తెల్సి తారని పరామర్శ చేయటానికి తారని కలిసింది సుమ. కొంతసేపు గడిచాక...     "చిట్ కడ్తున్నావా" అడిగింది సుమ మెల్లగా.     "రెండు నెలల డ్యూ ఉంది. కట్టేస్తాను" అంది ముభావంగా తార.     మరో ఆర్నెల్లకి ఈ నోటీస్. ఇప్పుడేం చేయాలి. తార ఇల్లు తెలీదు. ఫోన్ నెంబరు లేదు. ఈ రెండున్నర లక్షలు తనెక్కడ్నుంచి తేగలదు.     తెల్సిన ఓ పోలీస్ ఆఫీసర్ సహాయంతో వాకబు చేసింది సుమ.     తార ఎందరినో ఇలా ముంచిందనీ, ఆమె భర్త పచ్చి మోసగాడనీ... రెండు నెలలకో ఇల్లు మారుతుంటారనీ...  ఒక్కొక్కటీ ఒక్కొక్క పిడుగులా సుమ హృదయాన్ని అశాంతికి గురిచేశాయి. ఎంతో ప్రయాసతో తార అడ్రస్ సంపాదించింది సుమ.     ఇల్లు వెదుక్కుంటూ వెళ్ళింది. బతిమాలి అయినా కట్టిద్దామని.     వాకిట్లోనే పనిపిల్ల లంఖిణిలా నిల్చుంది. "అమ్మగారు లేరు. రెండు నెలలు ఊరెళ్ళారు" చల్లగా చెప్పింది.     లోపల కిటికీ కర్టెన్ చాటునించి తొంగి చూస్తున్న కళ్ళు తారవి కావని సుమ ఎలా అనుకోగలదు. అలాగని తోసుకుని ఇంట్లోకి ఎలా వెళ్ళగలదు.     ఎందుకింత వంచన. తనేం పాపం చేసింది. స్నేహితురాలని కష్టంలో ఆదుకుంటే ఇంత మోసమా!     అసలు మళ్ళీ తన జీవితంలోకి ప్రవేశించింది ఇందుకేనా. సుమ దిండు కన్నీటితో తడిసిపోయింది. రెండున్నర లక్షలు తనలాంటి చిన్న ఉద్యోగికి ఎంత కష్టం. పిల్లలు ఏది అడిగినా డబ్బుల్లేవని, ఆఖరికి తన ఆరోగ్యం బాగా లేకున్నా డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు ఖర్చవుతాయని, ఆటో ఎక్కితే ఖర్చని బస్సుల్లో వేళ్ళాడుతూ, అమ్మా నాన్నలకి కొంచెం కూడా సాయం చేయలేక పోతున్నందుకు బాధపడుతూ... చివరికి ఇంత మొత్తం ఇలా ఇరుక్కుపోవటం హృదయాన్ని కోసేస్తోంది.     మోసం వల్ల డబ్బు నష్టం కలగటం సరే! స్నేహంలో మోసపోయాననే భావం సుమని నిలువెల్లా దహిస్తోంది. జీవితంలో ఇంక ఎవరిని నమ్మాలి. స్నేహం శాశ్వతం అంటారు... మధురమైంది అంటారు. అది నిజమైనదైతే! కానీ ఎలా తెలుస్తుంది. తార ఇందరిని మోసగించి డబ్బు సంపాదిస్తుంది కానీ... మళ్ళీ ఆ నిర్మలమైన స్నేహాన్ని పొందగలదా!     కాలింగ్ బెల్ మోగింది. శ్రీధర్ వచ్చాడు. 'ఏమయింది' సుమ మొహం చూసి అడిగాడు. కోర్టు నోటీసు చూపింది సుమ గిల్టీగా.     "సర్లే ఏం చేస్తాం. బాధపడకు. నాకెందుకో ఆవిడ పటాటోపం చూసి అప్పుడే అనుమానం వేసింది. నీ స్నేహితురాలు కదా! నీకు తెలీదా అనుకున్నా. ఏదో ఒకటి చేసి కట్టేద్దాం.." అనునయించాడు శ్రీధర్. సుమ మనసు కుదుటపడినట్లు లేదు.     "ఏమిటిది సుమా! చిన్న పిల్లలా" శ్రీధర్ సుమను దగ్గరకు తీసుకున్నాడు.     "కాదండీ! నేను దాన్ని చిన్నప్పటినుంచీ ఎంతో ప్రేమించాను. అది అడిగితే చేతయినంత సాయం చేసేదాన్ని.... ఇలా."     "కొందరంతే సుమా! నీకు ఇంకా లోకం అర్ధం కాలేదు. వాళ్ళకి డబ్బే అన్నీ..." శ్రీధర్ ఓదార్చాడు. అయినా సుమ సమాధాన పడలేక పోయింది.     చిన్ననాటి నేస్తం గురించి మనసులో దాచుకున్న స్మృతి ఫలకం ముక్కలై పోయిందనే భావం ఆమెను నిలవనీయటం లేదు. స్నేహానికి ఖరీదు కట్టిన తార మాత్రం విలాసంగా విదేశీ కారులో ఎవరితోనో నవ్వుతూ ప్రయాణిస్తోంది. ఆ బుగ్గ మీది సొట్ట అందమైన తాచులా ఈసారి ఎవర్ని కాటు వేస్తుందో మరి!             * * * 

వలచి వచ్చిన వనిత - 2

వలచి వచ్చిన వనిత -వసుంధర   పార్ట్ - 2 శ్రీదర్ బాబు మళ్ళీ ఒక్కక్షణం ఆగి చెప్పసాగాడు.__" స్పహతప్పినా సుదర్శనం చావలేదు. నేను హంతకుణ్ణి కాలేదు. కానీ__సుదర్శనమంతటివాడిని దెబ్బతివిపించిన  మొనగాడిగా స్కూల్లో నాకు పేరువచ్చింది. నాకూ సుదర్శనానికి శత్రుత్వం ఏర్పడలేదు. మేమిద్దరం ఇంకా  మిత్రులయ్యాం. ఒకరి చెల్లెలి జోలికి మరొకరు పోరాదనీ__పార్వతి నా చెల్లెలని తెలియక పోరబాటు చేసినందుకు క్షమింఛవలసిందనీ__సుదర్శనం నన్ను కోరాడు__"     శ్రీధర్ బాబు చెప్పినదివింటూ నేను ఆలోచిస్తున్నాను ఇతగాడికి పరాయి అడదంటే ఏ మాత్రం గౌరవంలేదు. తను అందరి ఆడపిల్లల వెనుక పడలేడు. కానీ__తన చెల్లెలిని ఎవ్వరేమన్నా సహించలేడు. ఏమిటీ విచిత్ర మనస్తత్వం?......నిజం చెప్పాలంటే ఒక్క శ్రీధర్ బాబుకే కాదు-ఇటువంటి మనస్తత్వం ఎంతో కొంత ప్రతి మగవాడిలోనూ కూడా ఉన్నదేమోనని నన్ను నేను ఆత్మవిమర్శ చేసుకోవాలనిపించింది.     "వింటున్నావా__నా చెల్లెలని తెలియక సుదర్శనం పొరబాటు చేసినప్పుడే నేను క్షమించలేకపోయాను. అటువంటప్పుడు తెలిసి ఎవరైనా పొల్లుమాటంటే...."శ్రీధర్ బాబు వాక్యం పూర్తి చేయకుండా నాకేసి చూసాడు. అతని చూపుల్లో ఆ తర్వాత వాక్యం కనిపించింది.     నేనుకాస్త నెమ్మదిగా అన్నాను__"చావంటే నాకు భయంలేదు. అలాగని కోరి చావుని ఆహ్వానించను. కానీ ఒక్క సందేహం ప్రతి ఆడది నీ చెల్లెలిలాంటిదేనని ఎందుకు భావించవు?"     శ్రీధర్ బాబు సినిమా విలన్లా వికటాట్టహాసంచేసి__" చాలా చచ్చు ప్రశ్ననీది. మగాడికి ఆడదాన్నిచూస్తే వెర్రెత్తుతుంది. మీసమున్న మగవాడిగా నాకు తోచినట్లు ప్రవర్తిస్తాను. భావుంటే ఎవడినైనా అడ్డుకోమను. ప్రతి ఆడదానికీ నాకు లాంటి అన్నదోరకడు. అందుకు శిక్ష వాళ్ళనుభావించవలసిందే_" అన్నాడు.     ఆ నాటినుంచి శ్రీధర్బాబు నేను మళ్ళీ ఎన్నడూ వాగ్యుద్ధం చేయలేదు. అతను నన్ను పంతులూ అని మరి పిలవనందువల్ల  నేనతన్ని బావా అనవలసిన అవసరంకూడా రాలేదు. మా స్నేహం క్రమక్రమంగా పెరుగుతూ వచ్చినా శ్రీధర్ బాబుకు మూర్కత్వముందనీ, అతను కాస్త ప్రమాదకరమైన వ్యక్తి అనీ అన్నవిషయం మాత్రం నేను విస్మరించలేదు.....     జరిగిన విషయం ఈ రోజు మధ్యాహ్నం నా చెవినపడింది. నిన్న సాయంత్రం ప్రపుల్ల అనే అమ్మాయిని శ్రీధర్బాబు చేయిపట్టుకుని లాగి కన్నుకొట్టాడట. పుల్లారావు ప్రపుల్లకు అన్న. అతను తన మిత్రబృందం సమక్షంలో శ్రీధర బాబు చెల్లెలికి తనద్వారా నడిరోడ్డుపై__అలనాడు ద్రౌపదికి జరగబోయి ఆగిపోయిన అవమానం __ఆగకుండా జరగబోతోందనీ___అందుకోసం తను బయల్దేరి శ్రీధర బాబు ఊరికి వెళ్ళబోతున్నాననీ ప్రకటన చేశాడు. అ ప్రకటన  రాకెట్  కంటే వేగంగా పయనించి శ్రీధర బాబుని చేరుకుంది.     ఆ రాత్రి గదిలో నావంక చూసి___"వాడికి మూడింది.!" అని  శ్రీధర బాబు అన్నప్పుడు వాడంటే పుల్లరావని నాకు అర్ధమైంది. పైకి  అనకపోయినా ___"శ్రీధర బాబు__నీ ప్రవర్తన మూలంగా నీచెల్లెల్ని నలుగురి నోళ్ళలోనూ పారవేస్తున్నావు.___అనుకున్నాను నాలో నేనే.     ఆ మర్నాడు చావు తప్పి కన్ను  లొట్టపోయిన దశలో బైట పడ్డాడు పుల్లారావు. శ్రీధర బాబు చాలా తెలివిగా వ్యవహరించి మరీ పగతీర్చుకున్నాడు. కొట్టినదెవరో సాక్ష్యం దొరకకుండా పుల్లరావును ఒంటరిగా పట్టాడు. పొలిసు పద్దతిలో వళ్ళంతా కుళ్ళబొడిచి వదిలిపెట్టాడు. ఏమన్నా గొడవ చేసినా మరోసారి తన చెల్లెలి ప్రసక్తి తీసుకువచ్చినా___ప్రాణాలు దక్కవని హెచ్చరించాడు.  

ఎప్పటికీ నీకై

  ఎప్పటికీ నీకై ...                                                 - డా.ఎ.రవీంద్రబాబు                        ఈ మధ్య వేదించే ప్రశ్నలు పెరిగాయి. అన్నిటికీ ఒకటే కారణం. అసలు జీవించండం అంటే ఏమిటి? పుట్టడం, ఈ మార్కులతో జ్ఞానాన్ని కొలిచే చదువులను డబ్బుతో కొని, వ్యాపారంగా చదువుకోవడం. కట్నంతో... పెళ్లి పేరుతో ఓ అమ్మాయిని కొనుక్కోవడం. మేం ప్రేమగా జీవిస్తున్నాం... అని నటించడం. అసలు మనస్ఫూర్తిగా స్త్రీని ప్రేమించగలిగినప్పుడు ధనం అనేది ఎందుకు రిలేషన్స్ ను నడిపిస్తుంది. పెళ్లి కాగానే పిల్లలు. వారిని పెంచి పెద్దజేయడం. వద్దనుకున్నా వదలని ముసలితనం. ఆ పై చావు. ఇదంతా బతుకు నాటకం అని వాగ్గేయకారులు ఎప్పుడో గానం చేశారు. కానీ ఈ వెదవ బతుకుకోసం, బతకడం కోసం... ఎన్ని తంటాలు?. ఎన్ని కష్టాలు.? ఎన్ని కక్షలు, కార్పణ్యాలు, అసూయలు, ద్వేషాలు, దోచుకోడాలు... ధనం అనే పిచాచికై వెంపర్లాటలు. సుఖం సుఖం అని మనసుకు సంబంధం లేని వాటిని సమాజంలో ఉన్నతం కోసం కొనుక్కోవడం. ఇదంతా ఆలోచిస్తే మనసు వేడెక్కుతుంది. బతుకు బరువు అవుతోంది. ఇదేనా జీవితం అనివిస్తుంది. ఇలా బతకడం కోసం, గొప్పలు కోసం, ధనం కోసం, కీర్తికోసం పాకులాడడం చూస్తుంటే నవ్వు వస్తుంది. ఈ జీవితానికి అసలు అర్థం ఉందా? అనే ప్రశ్న వెర్రితలలతో నాలో నర్తిస్తుంది.            అసలు మనషులకు ఏమి కావాలి...? ప్రేమ... ఒకరికి ఒకరు... అనే విడదీయలేని అదిభౌతిక సంబంధం. స్త్రీ, పురుషుల మధ్య ఉండాల్సిన సౌందర్యాత్మక ఆరాధన. గుండెల్ని మండించే ప్రేమ. నీకోసం ఈ ప్రపంచాన్ని ధిక్కరించే మరో హృదయ సౌకుమార్యం. కానీ స్టేటస్ పేరుతో తమను తాము, తమ ఆత్మల్ని తాము ఉరితీసుకుంటున్న ఈ జనాల్ని చూస్తుంటే భయం వేస్తుంది. మొన్న మా బంధువు జ. నిశ్చితార్థానికి వెళ్లాను. నాకు ఆ అమ్మాయితో చిన్నప్పటి నుంచి చనువు ఎక్కువే... నా పిచ్చి ఆలోచనల్లో ఏవో కొన్ని నచ్చి ఉంటాయి. నీకు పెళ్లి కొడుకు నచ్చాడా...? అని అడిగాను. వాళ్లు ఆడోళ్లని బయటకు పంపరు. మర్యాదగా ఉంటారు. టీవీ, ప్రిజ్... ఇంట్లో అన్ని సామాన్లూ ఉన్నాయి. నన్ను బాగా చూసుకుంటాడు. ఆస్తి బాగా ఉంది. అని సమాధానం చెప్పింది. నిన్ను బాగా చూసుకోవడం అంటే...? నీవు ఏం చెప్పినా అలానే నడుచుకోవడం. నీకు అవసరమైన వస్తువులు కొనివ్వడం. ఇంతేనా అన్నాను. అవును... అంతే కదా కావాల్సింది. పైగా మూడు లక్షలు కట్నం అంది.           ఏం చెప్పాలో అర్థం కాలేదు. మూడు లక్షలతో కొనుక్కునే సుఖం. మనసుతో సంబంధం లేని వస్తువులతో ఆనందాన్ని తూచే ప్రేమలు. ఒకరికి ఒకరు లొంగి ఉండే మనస్తత్వాలు... ఇవే కదా నాకు మొదటిన నుంచీ పడనవి. ఇంట్లో నుంచి బైటకు పంపకుండా స్త్రీ స్వేచ్ఛను హరించడం. పంపరు అంటే... బైటకు వెళ్తే అనుమానమా...? లేక అతని కంటే ఎక్కువ స్థాయికి ఎదుగుతుంది అన్న ఈర్ష్యా...? ఏమో... ! ఇన్ని వాస్తవమైన అనుమానాలు నా పాడు బుర్రకి. చలం ఎక్కడో చెప్పినట్లు గుర్తు... చదువుకున్న స్త్రీ సోకులకు, ఉద్యోగాలకు, పై అధికారులకు, వినిమయ వస్తువులకు బానిస అవుతోంది అని. అవును నిజమే కదా...! తెలియకుండానే పురుషాధిపత్యం అంటూ పురుషునితో సమానం అంటూ.., వారిని అధిగమించాలి అంటూ.., వారిని వాళ్లు కోల్పోతున్నారు. అందం పేరిట శరీరాన్ని సరుకు చేసి, మనసుతో బంధాన్ని తెంచేసుకుంటున్నారు. మరి వీరిలో ప్రేమించే గుణాన్ని ఎక్కడ వెతకాలి.? ఒకవేళ నిజమైన ప్రేమకాంక్ష వీరిలో జొరబడితే తట్టుకోలేరు. అయినా ప్రేమను ప్రేమగా తీసుకోడానికి వీరి మనసులో ప్లేసు కూడా లేదేమో...! నాకోసం నీచేయిని కోసుకుని నీవు ఎప్పుడూ నా చేయి మీద గుర్తుగా ఉన్నావు. అన్న నీ మాటలని వీళ్లకు చెప్పినా అర్థంకాదు. శాడిజం అంటారేమో...!           రెండు రోజుల క్రింత ర..కు ఫోన్ చేశాను. ముందే చెప్పాను కదా... స్త్రీల పరిచయాలకు పూర్తి దూరంగా ఉంటున్నానని. కానీ మనసు ఎందుకో చేయాలనిపించింది. శి.ని పెళ్లి చేసుకుందట. ఎన్ని చాడీలు చెప్పింది. రాత్రిళ్లు కూడా వేరే వాళ్లతో తిరుగుతున్నాడని ఎంత గగ్గోలు పెట్టేది. ఉద్యోగం సద్యోగం లేకుండా ఉన్నాడని ఎంత బాధపడేది. వాళ్ల ఇంట్లో ఒప్పుకోరని ఎన్నెన్ని మాటలు చెప్పింది. నేను ఎన్ని సార్లు నచ్చజెప్పాను, ఒదార్చాను. నీకు శి. తగినవాడు కాదని బతిమిలాడాను.. కానీ తప్పో ఒప్పో జరిగిపోయింది. అతడినే చేసుకుంటాను అని తెల్లటి ముఖాన్ని బాధతో ఎర్రగా మాడ్చుకునేది. పైగా 'నేను అతడిని ప్రేమించడానికి నీవు, నీ మాటలే కారణం' అని ఎత్తిపొడిచేది. నేనేం చెయ్యను. మనసును సున్నితంగా ఉంచుకోమనడం, స్వఛ్చంగా ప్రేమను పంచేలా మనిషి జీవించాలి అని చెప్పడం నా తప్పా...! 'అసలు నీ మాటలే  అంత...! ఎవరైనా అంతే...' అని స. వాళ్ల మరదలు అన్నప్పుడు... కాదని చెప్పలేక పోయాను. బహుశా దాచుకోవడం, సమాజంలో అందరిలా నటిండం చేతగాని నా మనసే నాకు ఆ మాటల్ని బహుమతిగా ఇచ్చిందేమో...! అసలు ప్రేమించడమంటే దహించుకపోవడం అని వీళ్ళకు తెలీదు. ఓ సారి ర. ఏమన్నదో తెలుసా... 'శి. వల్లే కాదు, నీ దగ్గర కూడా నీవు చెప్పిన ప్రేమను నే పొందలేదు' అంది. ఎలా పొందుతుంది. నన్ను ఆ దృష్టితో చూడకుండానే... అసలు ప్రేమ విశ్వమానవత్వం అని తెలియకుండానే... మనసులో స్వచ్ఛత లేకుండానే...         నీవు భౌతికంగా నాదగ్గరలేని రోజుల్లో... ఓ రోజు ఉదయాన్నే 5గంటలకు లేచి డ్యూటీకి వెళ్తే... 9 గంటలకు ఫోన్ లో 'ఒక్కదాన్ని రూమ్ లో ఒంటరిగా వదిలేలి వెళ్లావే...' అని అడిగావు. ఆత్మల ఐక్యంతో నిండిన నిజమైన ప్రేమ భౌతికంగా దూరంగా ఉన్నా మనసులు కలిసే ఉంటాయి. అని రుజువైన రోజు అది. అలాంటి మన జీవితాల్లో ఎన్ని... ఎన్నెన్నో...         గుర్తులు, ఇంద్రధనుస్సులోని రంగుల్లా మెరుస్తూనే ఉన్నాయి. కానీ తర్వాత ప్రకృతి సహజంగా వాన వచ్చి చెరిపేస్తుంది. మీ నాన్నను ధిక్కరించిన రోజులు, నాలో ఏకమై నిద్రనుకూడా దూరంగా  తరిమేసిన గడియలు... వానలో తడిసి ముద్దై... విచ్చిన గులాబీల్లా నవ్వుకుని తమకంతో దగ్గరైన క్షణాలు... ప్రేమలు... ప్రేమ.. ప్రే.          ప్రేమంటే సినిమాలు, బైక్ పై రైడింగులు, పబ్ లో తాగటాలు, డిస్కోథెక్ లు, షాపింగులు... అంటూ సహజమైన ప్రకృతికి దూరమవుతూ ప్రేమికుడు, ప్రియురాలు డబ్బులో ప్రేమను వెతుక్కుంటున్నారు. సంతోషానికి, సుఖానికి తేడాని గుర్తించలేక పోతున్నారు. అవసరానికి, కోరికకు మధ్య భేదాన్ని మర్చిపోతున్నారు. ప్రేమ ఓ సహజాతం. సహజమైన మానసిక, శారీరక క్రియ. ఓ నూతనోత్తేజం. తపించే హృదయరాగం. దానిని బిజినెస్ చేస్తే... ఏమో... ఏమో... నిన్నంతా నీవు కొనిచ్చిన చొక్కానే ... నా శరీరాన్ని బంధించి ఉంది. నీ చేతుల్లో చిక్కి అలసి సేదతీరిన నా దేహంలా... నీ హృదయకాంతిని నాలోకి నింపుతూనే... ఈ మానసిక క్షోభ నుంచి బయటపడటానికి... మాత్రమే... ఈ నాలుగు అక్షరాలు... నీవు లేని ప్రంపంచాన్ని దూరంగా నెట్టివేస్తూ... ఎప్పటికీ నాలోకిన నేను ఆత్మావలోకనం చేసుకుంటూనే...                                                            ఎప్పటికీ                                                                         నీ  

వలచి వచ్చిన వనిత - 1

        వలచి వచ్చిన వనిత -వసుంధర   పార్ట్  - 1  "వాడికి మూడింది"_అన్నాడు శ్రీధరబాబు.     శ్రీధరబాబు ఉద్దేశ్యంలో వాడు అంటే పుల్లారావని నాకు అర్ధమయింది.     శ్రీధరబాబుని మాకాలేజీలో మొనగాళ్ళకు మొనగాడని చాలామంది చాటుగాను, కొంతమంది ఎదురుగానూ కూడా అనుకుంటూ, అంటు ఉంటాడు. రౌడి అన్నపేరు కూడా అతనికి లేకపోలేదు.     అతను క్లాసులో బాగా అల్లరిచేస్తాడు. మేష్టర్లని ఏడిపిస్తాడు. ఆడపిల్లల వెంటబడడమూ, వాళ్ళూ వినేలా అసభ్యపదాలు మాట్లాడడమూ అతని హాబీ. ఆడపిల్లలకు శ్రీధరబాబు అంటే సింహస్వప్నం అనవచ్చు.     నేను బుద్దిమంతుడిగా పేరు పడ్డానని చెప్పడంకంటె __కాలేజీలో ఒక అనామకుడినని చెప్పుకుంటే బాగుంటుంది. నన్నుగురించి- ఆఖరికి శ్రీధరబాబు రూమ్ మేటుగా నైనా కూడా  ఎంతోమంది ఎరుగరు. అందుకు కారణాలు లేకపోలేదు. నేను రూమ్ వదిలాక సాధారణంగా అతన్ని తప్పించుకుని తిరగడమే జరుగుతుంటుంది. అనవసరపు టనుమానాలకు లోనుకాగలనన్న భయంతో క్లాసులో అతని ప్రక్కన కూర్చోను నేను. ఆడపిల్లల వెంటబడడం ఊహలో నాకు ఆనందకరంగానే అవిపించే విషయం నిజమే అయినా - ఆ పద్ధతి వల్ల వచ్చే చెడ్డ పేరుకు నేను సిద్దపడని కారణంగా శ్రీధర బాబుతో బయట షికార్లు అట్టే చేసేవాడినికాదు.     అసలు నేనూ, శ్రీధరబాబు హాష్టల్ రూమ్ మెట్సుగా ఆరునెలలు గడపగలడం నన్ను తెలిసన కొంతమంది స్నేహితులకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. అయితే ఒక్కమాట మాత్రం నిజం. నేనూ,  శ్రీధరబాబు నిజంగా స్నేహితులం. ఒకళ్ళ పద్ధతి ఒకరికి నచ్చనట్లు కనపడినా చాలా విషయాల్లో మా అభిప్రాయలు ఒకటే! రూమ్ తో ఉన్నప్పుడు మేమిద్దరమూ గంటలతరబడి మాట్లాడుకుంటూండే వాళ్ళం. నా పరిజ్ఞానాన్ని అతను మెచ్చుకుంటూండేవాడు. అతని  నిర్భాయత్వానికి నేను ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తూఉండేవాడిని.     ఒకరోజు మాటల ప్రసక్తిలో అతను ___"  నీతో. మాట్లాడం కోసం కాకపోతే అసలు నేను రూముకి రావలసిన అవసరమే కనపడదు పంతులూ!" అన్నాడు. అది నాకు కాంప్లిమెంటు.     నాపేరు పంతులు కాదు. కానీ శ్రీధరబాబు రూమ్ మేటుగా వచ్చిన క్రొత్తలో నవ్నలా పిలువడం మొదలు పెట్టాడు. నన్నేడిపించాలన్నది బహుశా అతని ఆభిమతం అయుండవచ్చు. కానీ నేను అపిలుపుకు పలకడం మాత్రమేకాక __ "నీపలకరింపులో ఎంతో సాన్నిహిత్యం కనబడుతోంది __ బావా! అన్నాను. శ్రీధరబాబు ముఖం అప్పుడు అంత బాగాలేదు. అతను నాకేసి అదోకలా చూసి __"బావా  అంటున్నావు __ నీకు ఇంతకీ చెల్లెళ్ళున్నారా పంతులూ__" అన్నాడు.     నేను చలించకుండా __ బావా అని పిలవడానికి నాకే చెల్లెళ్ళుండాలా __ నీకుంటేసరిపోదూ?" అన్నాను.     భయంకరమైన ముఖం అనే పదానికి అర్ధం ఆక్షణంలో నాకు తెలిసింది. శ్రీధరబాబు ఒకసారి కుడిచేతి పిడికిలితో ఎడమ అరచేతిలో ఘట్టిగా కొట్టుకుని ___ నేను నిన్ను నిజంగానే ప్రేమతోనే పంతులూ అనిపిలిచాను. కానీ నువ్వు మాత్రం ఉద్దేశ్యం ఏమైనా __ బావా అని మాత్రం నన్ను  పిలవద్దు. బహుశా నాపదిహేనవ సంవత్సరంలో అనుకుంటాను __ నేను హంతకుడు కావసిలిన సంఘటన ఒకటి కొద్దిలో తప్పిపోయింది. కారణం తెలుసా"? అని ప్రశ్నార్ధకంగా నావైపు చూశాడు.     నిజం చెప్పొద్దూ, నాకక్షణంలో అతని ముఖం చూస్తూంటే భయమేచేసింది. నేను మరి మాట్లాడలేదు.     శ్రీధరబాబు కూడా ఒకటి రెండు నిముషాలపాటు మౌనంగా ఉండి ఆతర్వాత చెప్పడం ప్రారంభించాడు__ "నాకు ఒక్కగా నొక్కచెల్లెలు. పేరు పార్వతి. ఆరుగురు మగపిల్లలతర్వాత లేక లేక మాఇంట్లో పుట్టినాపిల్ల పార్వతి. మగపిల్లల్లో నేనే ఆఖరివాడిని కావడంచేతనూ, పార్వతికీ నాకు ఏణ్ణర్ధం మాత్రమే తేడా ఉండడంవల్లనూ___ మాఇద్దరి అను బంధం ఇంతా అంతాఅని చెప్పలేను. చిన్నప్పట్నించీ ఇద్దరూ ఒకే ప్రాణంగా పెరిగాం"___ శ్రీధరబాబు ఆగాడు     నేను కుతూహలంగా వింటున్నాను భయం కూడా కాస్త తగ్గింది.     అతను మళ్ళీ మొదలు పెట్టాడు ___ "నాకప్పుడు పదిహేను సంవత్సరాలు. ఫోర్త్ ఫారం చదువుతూండేవాడిని. అదే స్కూల్లో పార్వతి సెకండ్ ఫారం చదువుతోంది. నాకప్పుడూ   కాస్త పెద్దపరిచయాలే. చాలా మంది స్కూల్ పైనల్ చదువుతున్న కుర్రాళ్ళతో నాకు పరిచయముండేది. అందులో సుదర్శనం అనే అతనితో నేను చాలా తరచుగా తిరుగుతూండే వాడిని. సుదర్శనం గతమూడు నాలుగు సంవత్సరాలుగా అదే స్కూల్ విద్యార్ది నాయకుడిగా ఉంటూ వస్తున్నాడు. ఒకో తరగతి ఒకసంవత్సరం కంటె ఎక్కువ సార్లు చదవుతూ వచ్చినకారణంగా అతనుక్లాసులోని వయసు సొగసులను మగదృష్టితో చూచివర్ణించగల సమర్ధత అప్పటికే సంపాదించాడు. అతని వర్ణనలువిని ఆనందించడం కోసమే నేనతనితో ఎక్కువగా తిరుగుతూండేవాడిని___" అని ఒకసారి నాకేసి చూసి "వింటున్నావా"? అడిగాడు శ్రీధరబాబు.     "ఊఁ" అన్నాను నేను.     శ్రీధరబాబు చెప్పడం కొనసాగించాడు__" సుదర్శన మంటే స్కూల్లో ఆడపిల్లను హడిలి చచ్చేవారు. అతనితో పాటు నేను కూడా ఎన్నోపర్యాయాలు ఆడపిల్లల వెనక  పడినోటిదురద తీరేలా బూతులు మాట్లాడి సంతోషించేవాడిని. ఒకసారి సుదర్శనం నాకు ముందు చూపుగురించి చిన్నలెక్చరు దంచాడు__" వయసులో ఉన్న ఆడపిల్లలకు తమవెంట మగవాళ్ళు పడతారని గర్వంగా ఉంటుందట. అందుకని సుమారు పన్నెండు పదమూడు సంవత్సరాల వయసుపిల్లలను మచ్చిక చేసుకుంటే___వాళ్ళు అప్పటికి అమాయకంగా చెప్పినమాట వినడమేగాక రెండుమూడేళ్ళు తర్వాత అన్నింటికీ పనికొస్తారు. అందువల్ల ఒక అందమైన ఆవయసు పిల్లని ఇప్పట్నించీ పటుకోవడాన్ని ముందుచూపు అంటారని అతను నాకు చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ"__...     శ్రీధరబాబుముఖం మళ్ళీ కోపంగా మారింది. ఉద్రేకంవల్ల కాబోలు అతని చేతిపిడికిలి బిగుసుకుంది. తడబడతూ అతను"- "ఆరోగ్ , ఆపూల్ , ఆఇడియాట్, ఆరాస్కెల్ ఆస్కోండ్రల్__ సుదర్శనంగాడు ఉదాహరణగా నాకు నా చెల్లెలిని చూపించి"_మన ముందు చూపుకీ అమ్మాయెలా గుంటుందంటావు!" అడిగాడు. నేను షాక్ తిన్నాను. ఆక్షణంలో చటుక్కున పార్వతి నాచెల్లలని వాడికి చెప్పాలని కూడా తట్టలేదు.     నేను గట్టిగా సుదర్శనం చేయి నొక్కి__వెనక్కులాగాను. "నాతోరా!" అన్నాను. మా స్కూల్ వెనకాల ఒక పెద్ద తోటఉంది. అందులోకి వాడిని తీసుకువెళ్ళి__హటత్తుగా అక్కడ వాడిని గట్టిగా ఒక్కతోపు తోశాను. సుదర్శనం క్రిందపడ్డాడు. నేను ఎగిరి వాడిపొట్ట మీద కూర్చుని  గొంతు నులమసాగాను. సుదర్శనం అసహాయుడై తన్నుకుంటున్నాడు. తన చేతులతో నన్ను తోయ్యడానికి విఫలప్రయత్నాలు చేస్తున్నాడు. నా చేతులు అతడి గొంతుకు గట్టిగా బిగుసుకుంటున్నాయి. ఆ  సమయంలో ఎవరో నన్నువెనక్కులాగేరు.  సుదర్శనం మాత్రం  కదల్లేదు. నన్ను లాగినదెవరా అని వెనక్కుతిరిగాను. మాలెక్కల మేస్టారు. ఆయన నాచెంప చెళ్ళుమనిపించాడు......     

కొండచిలువ

            కొండచిలువ   సి. భవానీ       రాత్రి పదవుతోంది. మెగాసిటీ మెల్లగా నిద్రలోకి జారుకునే ప్రయత్నంలో వుంది.     మంచంమీద వాలిందేగానీ పరిమళకు నిద్రపట్టడంలేదు. మనసంతా ఇవాళెందుకో అలజడిగా, అల్లకల్లోలంగా వుంది. ఈ పుట్టినరోజు పార్టీవల్ల ఆనందం కలగడం లేదు. ఏదో పోగొట్టుకున్న వెలితి స్పష్టంగా కన్పిస్తోంది.     రోజూ ఆఫీసులో ఎన్నో ఫైల్సు చూస్తూ ఎంతగా శ్రమించి పనిచేసినా ఎంత లేటుగా ఇంటికి వచ్చినా ఇంత హైరానాగా అన్పించలేదు. అసలు పుట్టినరోజును జ్ఞాపకం చేసుకోవడమే తనకిష్టం వుండదు. రోజురోజుకూ వయసుమీద పడుతుంటే తెలియని గిల్టీగా వుంటుంది.     గిల్టీనెస్ అనవసరం అన్పించినా మనసును సమాధానపర్చుకోవడం కష్టంగానే వుంటుంది. ఫ్రెండ్స్ బలవంతం మీదే ఈ డిన్నర్ ఏర్పాటు చేసింది.     ఆలోచనల్లోంచి తేరుకోకుండానే లేచి వెళ్ళి చీర మార్చుకుని తేలిగ్గా వుండే తెల్లని నైటీ ధరించింది. ఆ నైటీ మీద ప్రింటుచేసిన గులీబీపూలు చూస్తుంటే మనసుకు హాయిగా అన్పించింది.మెళ్ళో వున్న ఒంటిపేట ముత్యాల దండ, గాజులు, వాచీ తీసేసింది. జుట్టుకు పెట్టుకున్న క్లిప్పు తొలగించింది. చల్లని మేఘాల్లా మృదువైన జుట్టు మెడ క్రింద భాగమంతా స్వేచ్చగా పర్చుకుంది.     మొదటిసారిగా చూస్తున్నట్టు పరీక్షగా మొహాన్ని అద్దంలో పరిశీలించుకుంది పరిమళ. డ్రెస్సింగ్ టేబుల్ అద్దం ఆమె నిలువెత్తు రూపాన్ని నిస్సంకోచంగా ప్రకటిస్తోంది.     ఒక్కసారిగా ఉలిక్కిపడిందామె.     విరబోసుకున్న కురులు స్వేచ్చగా ఫ్యాన్ గాలికి ఎగురుతుంటే అంతకంటే స్వేచ్చగా ఎగురుతూ విహరిస్తోందో వెండితీగ. ఆ వెండి వెంట్రుకను చేత్తోలాగి తడిమిచూసింది.     అప్రయత్నంగా గుండెల్లోంచి ఓ నిట్టూర్పు వెలువడింది.     లైటార్పి పడుకుందేగానీ నిద్రపట్టడంలేదు.     వివిధభారతి ట్యూన్ చేసింది.     "యే మేరా ప్రేమ్ పత్ర్ పఢ్ కర్.." రఫీ గొంతు ప్రేమార్ధంగా.     "ప్రేమ!" అంటే ఏమిటో?     కవులు, గాయకులు, రచయితలు ఈ రెండక్షరాల ప్రేమ గురించి ఎన్ని పాటలు. కథలు, కవిత్వం... అంతా ట్రాష్.     పక్కకి ఒత్తిగిల్లి పడుకుంది. రేడియో మోగుతూనేవుంది.      ఇన్ని పరిచయాలున్నా తన హృదయాన్ని కదిలించే వ్యక్తి ఇంతవరకూ తారసపడలేదెందుకో! అసలు తన మనసు తలుపులు తెరిచివుంటే కదూ.     అమ్మానాన్నల ప్రేమ, అన్నయ్య ఆత్మీయత మధ్య ఆటల్లో పాటల్లో చదువులో ఫస్ట్ రావాలని పట్టుదల, తపనలతో అల్మారా నిండా బారులు తీరిన బహుమతులు, మెమెంటోలు, కప్పులు, మెడల్సే లోకంగా పెరిగింది.     అందరు ఆడపిల్లల్లా వంటింటి పన్లంటే పరమ బోర్. ఆ భావనలే ఆమెనొక ఐ.ఏ.ఎస్. ఆఫీసర్ గా ఎదిగేలా చేశాయి. తగిన వరుడికోసం తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.     కాలం తెచ్చిన మార్పును ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేకపోయారు. పెళ్ళి చేసుకోనన్న పరిమళ నిర్ణయానికి నిరసన ప్రకటిస్తూ అమెరికాలో సెటిలయిన కొడుకు దగ్గరికి వెళ్ళిపోయారు. రోజంతా ఫైళ్ళలో మునిగి తేలుతూ కాలం కరిగి పోతున్నా రాత్రిళ్ళు మాత్రం కొండచిలువలా చుట్టుకునే ఒంటరితనానికి పరిమళ మనసు తల్లడిల్లిపోతున్నది. ఈ మధ్య అమ్మ దగ్గర్నుంచి ఉత్తరాలు రావడం కూడా తగ్గిపోయింది.     పెళ్ళంటే రాజీ. అది తనవల్ల కానిపని. ఒక మగవాడికి జీవితమంతా దాసోహం అవటాన్ని తన వ్యక్తిత్వం అసలు అంగీకరించదు.     ఈ సంగతి స్పష్టంగా తెలిశాక అమ్మ నుంచి ఉత్తరాలు లేవు. ఆమె ఆఖరి కోరిక తన పెళ్ళి! బహుశః అది తీరని కోరికై ఆమె మృదు హృదయాన్ని గాయపరిచిందని అర్ధం చేసుకుంది పరిమళ.     తల్లి జ్ఞాపకాలతో నిట్టూరుస్తూ రేడియో ఆఫ్ చేయబోతుండగా 'ముఖ్య ప్రకటన' అనౌన్సుమెంటు విని ఆగిపోయిందామె.     బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురించిన హెచ్చరిక అది.             * * *     తుఫాన్ వార్తలు అందరినీ కలవరపరుస్తున్నాయి. తుఫాన్ ప్రాంతంలో పునరావాస కార్యక్రమాలకు స్పెషల్ ఆఫీసరుగా పరిమళను నియమించడం వల్ల ఆ ప్రాంతాలకు బయలుదేరి వెళ్ళిందామె. ఇప్పుడామె మనసులో ఎలాంటి కలవరమూ లేదు. విధినిర్వహణా ఏకాగ్రతే వుంది.     తుఫాన్ సృష్టించిన బీభత్సాన్ని కళ్ళారా చూస్తుంటే విపరీతమైన ఆవేదన కలిగింది. పిల్లలను కోల్పోయిన తల్లులు, తల్లుల ఒడిలోనే విగతజీవులైన పిల్లలు, ఆసరా కోల్పోయిన వృద్ధులు... అంతా భయానక స్మశాన వాతావరణం.     స్వచ్చంద సంస్థలు అనాథ శవ దహన సంస్కారాలు నిర్వహిస్తూ భూమిమీద ఇంకా మానవత్వం మిగిలివుందని నిరూపిస్తున్నాయి.     కలరా వాక్సినేషన్లూ... మందులు... గాయాలు... ఏడుపులు... ఊపిరాడని పని... ఉక్కిరిబిక్కిరయ్యే పని... ఒంటరితనం మాటే గుర్తులేదు పరిమళకి.     ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంటులో సామాన్లు సర్దుతున్న అటెండరు బెర్తు కిందికి చూసి ఉలిక్కిపడ్డాడు.     "బయటికి రా!" కసిరినట్టుగా అన్నాడు.     బిక్కుబిక్కుమంటూ నాలుగేళ్ళ పాప బయటకు వచ్చింది.     చేతిలో టెడ్డీబేర్ బొమ్మ వుంది. గులాబీ రంగు ఫ్రాక్ దుమ్ము కొట్టుకొని బురద మరకలతో నిండి వుంది. బాబ్డ్ కటింగ్. బొమ్మని గుండెలకి హత్తుకున్న తీరుచూస్తే ఆ బొమ్మ పాపకెంత ప్రియమైనదో తెలుస్తోంది.     కసురుతూ చేయిపట్టి ఆ పాపని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు అటెండరు.     అతడిని వారించి పాపని దగ్గరికి పిలిచింది పరిమళ.     "నీ పేరేంటి పాపా!" లాలనగా అడిగింది. పరిమళ అంత మెత్తగా మాట్లాడడం అటెండరుకే కాదు ఆమెకీ కొత్తగానే వుంది.     పాప ఏడ్వడం మొదలుపెట్టింది. సముదాయించడానికి ప్రయత్నించింది పరిమళ. కొంతసేపటికి పాప ఏడుపు తగ్గింది.     అమ్మానాన్నల గురించిన ప్రశ్నకు "అమ్మా!" అని మళ్ళీ ఏడ్చింది పాప.     "అమ్మ...లేదు...చచ్చిపోయిందిట...ఆంటీ! నాకు అమ్మ లేదు... నాన్నని నేను అసలు చూడలేదు..." పాప వెక్కిళ్ళు పరిమళను నిలువునా ద్రవింపజేశాయి.     పాప మనతో వస్తుంది.." అటెండరు పరిమళ మాటలకు ఆశ్చర్యపోయినా పైకి కన్పించనీయలేదు.     హైదరాబాద్ వచ్చాక పాప బంధువుల గురించి ఆరా తీయడం.. టీ.వి, రేడియో ప్రకటనలు.. పేపర్లో ప్రకటించడం.. ఏం చేసినా ఫలితం లేకపోయింది.     ఈ పదిహేను రోజుల్లో పాప పరిమళకు బాగా దగ్గరైంది.     పరిమళ ఆఫీసు నుంచి ఇంటికి రాగానే పరుగెత్తుకుంటూ వికసించిన ముఖంతో ఎదురొస్తుంది పాప. ఇల్లంతా ఇప్పుడు నవ్వులతో కళకళలాడుతోంది... కానీ ఎన్నాళ్ళిలా?...     పాపను అనాథ శరణాలయంలో చేర్చాలి...పాప అనాథ. ఎవరూ లేనిది. తనకి మాత్రం ఎవరున్నారు? తను అనాథ కాదా? రకరకాల ఆలోచనలు పరిమళను చుట్టుముట్టేస్తుంటే అలాగే మరో పది రోజులు గడిచాయి.             * * *     ఆరోజు ఎలాగైనా పాపను అనాథ శరణాలయంలో చేర్చాలన్న ఆలోచనతో ఇంటికి వచ్చింది పరిమళ. ఎక్కడా అలికిడి లేదు. రోజులా పాప ఎదురు రాలేదు. గదిలో జ్వరంతో మూలుగుతూ పడుకుని వున్న పాపని చూస్తే పరిమళకి కాళ్ళూ చేతులాడలేదు.     డాక్టర్ కి ఫోన్ చేసింది. డాక్టర్ వచ్చి చెకప్ చేసి ప్రిస్కిప్షన్ వ్రాసిచ్చాడు.     వారం రోజులు సెలవు పెట్టి రాత్రింబవళ్ళు పాపకి సేవచేస్తున్న పరిమళను చూసి పనివాళ్ళంతా ఆశ్చర్యపోయారు.     "ఆంటీ.. నేను చచ్చిపోతే అమ్మ దగ్గరికి పోతానా! నాకిక్కడ ఎవరూ లేరు కదా!"     "తప్పు పాపా! అలా అనకూడదు. నీకు మేమంతా లేమూ!" పాప తల నిమురుతూ ఎన్నోసార్లు ధైర్యం చెప్పింది పరిమళ.     పాపని అనాథ శరణాలయంలో చేర్చే ఆలోచన మరో పదిరోజులు వాయిదా పడింది.     పాపకి జ్వరం పూర్తిగా తగ్గింది. మునుపటిలా ఇల్లంతా కలియ తిరుగుతోంది. ఆరోజు సాయంత్రం పాపను తయారుగా వుంచమని పని మనిషికి చెప్పి ఆఫీసుకు వెళ్ళింది పరిమళ.     సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చేసరికి పాప ఎదురు రాలేదు. పనిమనిషిని పాప గురించి అడిగింది.     "ఇప్పటిదాకా ఇక్కడే ఆడుకుందమ్మా! చూసొస్తానుండండి" అంటూ పనిమనిషి పాపను పిలుస్తూ తోటలోకి వెళ్ళింది.     "పాపా! పాపా!" ఇల్లంతా వెదికినా పాప జాడలేదు. చివరికి పాప ఎక్కడుందో... పరిమళే పసిగట్టింది.     అల్మారా వెనక నుంచి చేయి పట్టుకుని పాపని బయటికి లాగింది పరిమళ.     పాప ముఖం చూస్తే నవ్వాగడంలేదు. దట్టంగా పౌడరు పులుముకుంది. బుగ్గల నిండా ఎఱ్ఱని లిప్ స్టిక్. సర్కస్ లో జోకర్ లా వుంది. పరిమళకేసి బెదురు చూపులు చూస్తోంది. ఒక్కసారిగా రెండు చేతులు పరిమళ మెళ్ళో దండలాగా వేసి పెనవేసుకుపోయింది పాప.     "ఆంటీ! నన్ను ఇక్కడినుంచి పంపిస్ తావా! నేను నీదగ్గరే వుంటాను. నాకు అమ్మ లేదు" ఏడుస్తూ కౌగిలించుకున్న పాపను అప్రయత్నంగా రెండు చేతులతో గుండెలకు హత్తుకుంది పరిమళ.      పరిమళ కళ్ళనిండా నీళ్ళు.     పాప వచ్చాక తనతో ఇంతకాలం సహజీవనం చేస్తున్న ఒంటరితనం తనకి తెలియకుండానే పారిపోయింది. ఈ చిన్న ప్రాణంతో అనుకోకుండా అందమైన అనుబంధం ఏర్పడింది.     'ఆంటీ! నన్ను పంపించేత్తావా!' పరిమళ గడ్డం పట్టుకుని పాప అడుగుతోంది మళ్ళీ.     పరిమళ మనసును చుట్టుకున్న కొండచిలువ పూర్తిగా వదిలేసి మాయమయిందిప్పుడు.     పాపను గట్టిగా హృదయానికి హత్తుకుని ముద్దుల వర్షం కురిపించింది. ఆ చిట్టి చేతుల్లో తన మొహం దాచుకుని తెలియని ఆనందం అనుభవించింది.     "లేదమ్మా! నిన్నెక్కడికీ పంపను. నాకు నువ్వు.. నీకు నేను.. సరేనా! నువ్వింక నా దగ్గరే వుంటావు"     "థ్యాంక్యూ ఆంటీ" సున్నితంగా పరిమళ బుగ్గపై ముద్దు పెట్టింది పాప.     పరిమళకిప్పుడు తన జీవితంలో నిజంగా పరిమళం నిండినట్లనిపిస్తున్నది. తోటలోని పూలన్నీ పాప నవ్వుతో శ్రుతి కలుపుతున్నాయి.

ఎదను తడిపిన పుట

ఎదను తడిపిన పుట                                                  డా.ఎ.రవీంద్రబాబు       కాలం ఎప్పుడూ ఇంతే...! నా మనసులాగా ఎన్నో వింతలు, గమ్మత్తులు చేస్తుంది. చల్లని సాయంత్రాలు, శీతాకాలం నాటి వెచ్చని కౌగిళ్లు పంచిన వెన్నెల రాత్రులు వెళ్లిపోయాయి. వేసవి తాపాలు ఎక్కువయ్యాయి. అసలు, ఈ వేసవి తాపాన్ని తట్టుకోలేక 'శిశిరానికి చివరెందుక'ని ప్రేమికులు ప్రశ్నించారని ఎక్కడో యవ్వనపు తొలి రోజుల్లో చదివిన గుర్తు. కానీ కాలచక్రం ఆగదు. నీ జ్ఞాపకాలు చక్రం కింద నలుగుతున్న నా హృదయ సవ్వడిలా...!         వేసవి అనగానే పచ్చటి మామిడి వాసనలు మదిని తాకుతాయి. మల్లెలు మొగ్గలై ఎదను పురికొల్పుతాయి. ఏ మధన మనోహరుడో, తన మనోహరికి బహుమతిగా ఇవ్వడానికి ఈ మల్లెలను కనిపెట్టి ఉంటాడు. అసలు సృష్టికర్త బ్రహ్మే ప్రేమికుల విరహాన్ని, తృప్తిని కవ్వించడానికి వీటిని భూమ్మీద పుట్టించి ఉంటాడు. శరీరం మొత్తాన్ని తెలియని మైకంతో కమ్మేసే ఆ సువాసనా పరిమళాన్నిఎంతమంది కవులు అనుభవాలతో గానం చేశారో...! అప్పుడే స్నానం చేసిన నీ కురల మధ్య నే దాక్కుని నీ చెవిలో రహస్యాన్ని విప్పుతున్నప్పుడు, కొబ్బరాకు సందుల్లోంచి చంద్రుడు వినటానికి ఎన్ని ప్రయత్నాలు చేసేవాడో కదా...! అయినా వేసవి రాత్రులు, మల్లెల పరవశాలు, వెన్నెల చినుకులు... ఇలా మన ప్రేమకు ఎన్ని కానుకుల్ని ప్రకృతి ప్రసాదించింది ఆ రోజుల్లో.           గుర్తుందా... మిద్దెమీద మనిద్దరమే చుక్కలు లెక్కపెట్టాడానికి పోటీ పడి అసలసి పోయేవాళ్లం. చివరకు లెక్కలు కూడా మర్చిపోయేవాళ్లం. అలసి నీ ఒడిలో సేదతీరే నా శరీరాన్ని...! అయినా నీకేనా, ప్రతి స్త్రీకి అంత గొప్ప హృదయం ఉంటుందా...! బహుశా... స్త్రీ హృదయానికే సృష్టికర్త అంతటి బహుమానం ఇచ్చి ఉండాలి. నీ కొంగును నా కళ్లకు కప్పి, చంద్రుడ్ని మసగ్గా చూపిస్తూ ఆటలాడేదానివి. తెల్లటి నీ నడుము వొంపు చంద్రవంకతో పోటీ పడుతుంటే, నా చేతి వేళ్లు సరాగాలు పోయేవి. అప్పుడు భావావేశంలో ఏ షెల్లీనో, కీట్స్ నో గుర్తు చేస్తే...! ముఖం చిన్నబుచ్చుకునే దానివి. నిన్ను ఆటపట్టించడం నాకు బాగా సరదా. అప్పుడు నీ ముఖం బలే ఉంటుంది. ఎన్నో సౌందర్య రహస్యాల్ని నింపుకుని పురి విప్పిన నెమలిలా...! మన గిల్లికజ్జాలు చూడలేక చంద్రుడు కూడా మబ్బుల్లోకి వెల్లిపోయేవాడు.            అవును, గుర్తుల ఎడారిలో ఒయాసిస్సులు పలకరించవు. ఎండమావులు మాత్రమే భ్రాంతిని కలిగిస్తాయి. నిన్న ఆఫీసు నుంచి వస్తున్నా...! బస్సులో నా ముందు సీట్లో ఓ అల్ట్రామోడ్రన్ అమ్మాయి మల్లెపూలతో కూర్చొంది. పచ్చని మెడపై తెల్లగా అవి నవ్వుతున్నాయి. ఆశగా వెక్కిరిస్తున్నాయి. ఆ అమ్మాయి పైటకు, జీన్స్ కు మధ్య వారధిలా అనిపించింది నాకు. డిగ్రీ చదివే రోజుల్లో హిస్టరీ లెక్చరర్ ప్రైవేటు క్లాసు తీసుకుని మరీ నోట్స్ చెప్తుంటే... ఉ. నా ముందు మల్లెల జడతో వచ్చి కూర్చొంది. ఇక నాబాధ ఎవరికి చెప్పుకోను. ఆ మత్తులో ఎన్ని తప్పులు నా నోట్స్ లో దొర్లాయో...! అనాలోచితంగా ఉ. జడ కదిలిస్తుంటే...! నా చిన్న ప్రాణం...! పునర్జన్మ మీద నాకు నమ్మకం లేకపోయినా...! ఏ హృదయగతపు పురావాసనలో నా నిండి ఉండాలి.           ఇలా... వడపోతల మీద వడపోతలు చేసి మనసును మొద్దు బారిద్దామని ప్రయత్నం చేస్తుంటే...! అది మాత్రం మరీ సున్నితంగా, సుకుమారంగా తయారవుతుంది. ఈ మధ్య ఎక్కువసార్లు నాలోకి నేనే పరకాయ ప్రవేశం చేస్తున్నాను. నన్ను నేను మరీమరీ తొవ్వుకుంటున్నాను. అలా అయిన ప్రతి సారీ నువ్వే నాలోకి వచ్చేస్తున్నావు. కావాలనిపిస్తావు. చూడాలనిపిస్తావు. నీతోనే ఉండాలనిపిస్తావు. ఆరాధన, ఆర్తి, అభిమానం, మమకారం, ప్రేమ, స్నేహం, విరహం, తపన, తమకం... ఇలా ఆ భావనకు ఎన్ని పేర్లైనా చెప్పొచ్చు. అసలు భాషకందనిది ప్రేమ. దానికి పేరు పెట్టి దాని శక్తిని, ఉధృతిని, కాంక్షని తగ్గిస్తున్నారు ఈ పిచ్చి జనం. నిజమైన ప్రేమ ఈ కపట మనుషులకు దొరికితేనా...! అది వీళ్లని కాల్చి చంపుుతంటే తట్టుకోేగలారా...! నిజం చెప్పు. కాల్చి పుటం పెట్టదూ, మృధుత్వాన్ని దహించే అమృతం కదా అది. ఈ పిచ్చి వేదాంతులు పెట్టుకున్న అద్వైత భావన కన్నా గొప్పది. అసలు ప్రేమను తెలియజేయడానికి మాటలు, పదాలు, వాక్యాలు, చివరకు భాషే సరిపోదు.             ఎక్కడో చదివిన గుర్తు. ఓ ప్రేమికుడు తన ప్రేమను ప్రియురాలికి ఎలా చెప్పాలో తెలియక, ప్రేమదేవత గూర్చి కఠోర తపస్సు చేశాడట. చివరకు దేవత ప్రత్యేక్షమైతే తన బాధ చెప్పుకున్నాడట. అప్పుడు ప్రేమదేవత 'వెళ్లు అధరాల మృధుత్వాన్ని అధరాలే గ్రహిస్తాయి. నాలుక రుచిని నాలుకే స్వీకరిస్తుంది. దంతాలు సైతం తమ శక్తిన ధారాదత్తం చేస్తాయి. నీలో నుంచి అమూల్యమైన మాధుర్యం నేరుగా ఆమె లోకి ప్రవేశిస్తుంది.' అని చెప్పిందట. సరిగా అప్పుడే ఈ భూలోకంలో ముద్దు అనేది పురుడు పోసుకుందట. ఎంత అందమైన ఊహ...! కాదు వాస్తవమే....! నీవు నా దగ్గర ఉంటే ఈ వెచ్చని వేసవి రాత్రిని మల్లెలతో అభిషేకింతును కదా...!   నీకో విషయం చెప్పనా...! నీతో ఇన్ని ప్రేమ జ్ఞాపకాలను పంచుకుంటున్నానా...! మల్లెపువ్వుల్లాంటి అన్నం నల్ల గులాబీలా తయారైంది. నా చీకటి జీవితాన్ని గుర్తుకు తెస్తూ...                                                                   సెలవు ఇవ్వని నా మనసుతో...                                                       నీ         

వినిమయం

            వినిమయం సి. భవానీ     మమత మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ఆవేదన ఉంది. కళ్ళల్లో మాటిమాటికీ నీళ్ళు ఊరుతున్నై. తుడుచుకుంటున్న జీవనదుల్లా ఆ కన్నీళ్ళు....     తనమీద తనకే కోపంగా నిస్సహాయంగా అన్పిస్తుంది.     నీరసంగా లేచి చిన్నాకి స్నానం చేయించింది.     పౌడర్ వేసి కొత్త చొక్కా వేసి పాలు పట్టింది.     ఎంత ఆకలి వేసిందో చిట్టి తండ్రికి. బుజ్జి పొట్టలో పాలు పడగానే సొమ్మసిల్లినట్లు ఆదమరిచి నిద్రపోయాడు.     ఒక నిర్ణయానికి వచ్చినట్లు లేచింది మమత. కంప్యూటర్ ఓపెన్ చేసి ఇ మెయిల్స్ చెక్ చేసింది. తను పనిచేస్తున్న కంపెనీకి ఇ మెయిల్ ద్వారా రాజీనామా పంపింది. రవికి ఫోన్ చేసింది.     "రవీ! కాస్త త్వరగా రాగలవా!" మమత గొంతులో దిగులు రవిని కదిలించింది.     "ఏంటి మమతా! ఎనీ ప్రాబ్లెమ్..?" టెన్షన్ గ అడిగాడు 'నో' ప్రాబ్లెం వస్తే హ్యాపీ' అని ఫోన్ డిస్కనెట్ చేసింది.     చిన్నా హాయిగా నిద్రపోతున్నాడు. అమ్మ వళ్ళో పడుకున్నంత ఆనందం ఇంకెక్కడ దొరుకుతుంది. వాడి చిట్టి గుప్పెటలో మమత చున్నీ కొసలు గట్టిగా పట్టుకున్నాడు. తను లేస్తే చిన్నాకి నిద్రాభంగం అవుతుందని అలాగే వాడి పక్కనే పడుకుంది మమత. అలాగే ఆలోచనల్లోకి జారిపోయింది.     రవి, తను అప్పుడు ఎమ్.టెక్ చదువుతున్నారు. పరస్పరం ఆకర్షణ, ప్రేమ. అది అవగాహన, పరిణతిలో ఉన్నదే గాని తాత్కాలిక ప్రలోభాలు కావు. చదువు పూర్తయ్యాక పెళ్ళిచేసుకోవాలనే తమ ఆలోచనను పెద్దవాళ్ళ అంగీకారంతో పెళ్ళిపుస్తకంగా శ్రీకారం చుట్టారు.     ఇద్దరికీ సాఫ్ట్ వేర్ రంగంలో మంచి ఉద్యోగాలు వచ్చినై. అన్యోన్యంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా....     రవికి తండ్రి లేడు. అత్తగారు తమ దగ్గర ఉంటుందని పెళ్ళికి ముందే రవి చెప్పాడు. ఆవిడ పెళ్ళిచూపులకి వచ్చినప్పుడు అడిగిన ప్రశ్నలతోనే పూర్తిగా అర్ధమైంది మమతకు.     "వంట వచ్చా?" అనే ప్రశ్నకు నిలువూ అడ్డం కాకుండా తలూపింది మమత.     "ఈ ప్రశ్నను ఆడపిల్లల్నే అడుగుతారు మగపిల్లల్ని ఎందుకు అడగరు. వాళ్ళకీ ఆకలేస్తుంది. వాళ్ళు కూడా తింటారు కదా! మరి వాళ్ళకీ వంట రావాలి కదా!" మమత ఆలోచనల్ని ఎవరితో పంచుకోగలదు.     'సంగీతం వచ్చా?' మరో ప్రశ్న కాబోయే అత్తగారినుంచి.     'రాదు' అంది ముక్తసరిగా మమత.     'కనీసం నాలుగు మంగళ హారతులైనా..' ఆశగా అడిగిందావిడ.     'సినిమా పాలు కొద్దిగా... తెలుసు' అందామనుకుంది.     రవి చేసిన హెచ్చరిక గుర్తొచ్చి జవాబును గొంతులోనే దాచుకుంది.     ఈ ప్రశ్న కూడా ఆడపిల్లలే ఎదుర్కొంటారు. మగపిల్లల్ని 'సంగీతం వచ్చా' అని ఆడ పెళ్ళివాళ్ళు అడగరు. అయినా మనసుకు నచ్చిన పాటను హాయిగా ఎవరైనా హమ్మింగ్ చేసుకోవచ్చు. మొక్కుబడిగా ఎవరూ వినకపోయినా పాడే మంగళ హారతులు నేర్చుకోవటం మమతకే కాదు. ఏ అమ్మాయికి మాత్రం ఆసక్తిగా ఉంటుంది. అలా పాడే వాళ్ళని చూస్తుంటే జాలేస్తుంది కూడా!     అత్తగారు తమతో ఉండటం మమతకి బాగానే ఉంది. ఓ పెద్ద దిక్కు... తోడు. పైగా రవి తల్లి. కానీ రోజు రోజుకీ ఆవిడ మనస్తత్వమే అర్ధం కాకుండా పోతోంది. ఏ పనీ తనని చెయ్యనివ్వదు. చేసినా ఏదో ఒక వంక పెడుతుంది. రవికి అన్నం పెట్టాలన్నా హడావుడిగా తనే ముందుకు వస్తుంది.     "అదేమిటి మమతా! అన్ని పాలు పోశావు... నువ్వుండు. నేను కలుపుతా." అని కాఫీ కలపనీయదు.     ఓ ఆదివారం బజ్జీలు చేస్తుంటే "నీ చేయి ఎక్కువ నూనె పీల్చేలా చేస్తుంది. నేచేస్తా నుండు" అంటూ తనని పక్కకి జరిపి ఆమే చేసేసింది.     రవి తరపు చుట్టాలెవరో వస్తే వాళ్ళతో చాటుగా అత్తగారన్న మాటలు విన్నాక మమత మనసు కకావికలమై పోయింది. "చదువుకున్న కోడలు, ప్రేమించాడు, సంపాదించి పెడుతుందన్న మాటేగానీ.... నాకే సుఖం ఉంది చెప్పు. ఆ పిల్లకి నిద్రలేవటం అదీ లేటుగా... తయారవటం, వెళ్ళిపోవటం. రాత్రి పొద్దు పోయి వాళ్ళిద్దరూ వచ్చేసరికి నేను పడుకుంటూనే ఉంటాను. ఆయన అలా దాటిపోయారు. ఈ చాకిరీ నా పాలబడింది" అని కళ్ళొత్తుకుంటున్న అత్తగారి ద్విముఖ వ్యూహం మమతకి చూచాయగా తెల్సిపోయింది.     చూసే వాళ్ళకి తను పనిచేతగాని అసమర్ధురాలుగా కన్పించటానికి వంటమనిషి దోహదం చేస్తుంది. మిగిలిన పనిలో అత్తగార్కి తన అజమాయిషీ ఎక్కడ చేజారి పోతుందోననే అభద్రతా భావం కన్పిస్తుంది.     అందుకే తనేదీ పట్టించుకోకుండా ఉండటం అలవాటు చేసుకుంటూ ఉద్యోగానికే పరిమితంగా ఉంది. చదువుకుని ఉద్యోగం చేస్తున్నా వంట, పిల్లల పెంపకం, చుట్టాలకి మర్యాదలు, వృద్ధుల బాధ్యత, బ్యాంక్ పోస్టాఫీస్ పన్లు, పిల్లల హోంవర్కు, పేరెంట్స్ మీటింగ్స్ కి హాజరు కావటం అన్నీ భార్యే చేయాల్సి వస్తోంది. అప్పుడూ ఇప్పుడూ మగవాళ్ళకి ఉద్యోగం తప్ప మరో పని లేదు. చదువుకొని ఉద్యోగాలకి రావటం వల్ల స్త్రీలు ఏం సుఖపడ్తున్నారు. అన్నిటా ప్రవీణత చూపించే ఈ 'సూపర్ ఉమెన్' అవతారం ఆమెకెంతో భారంగా పరిణమించి ఆమె ఆరోగ్యాన్నీ, ఆనందాన్నీ హరించి వేయటం లేదా?     వీకెండ్ పార్టీలు, సినిమాలు, జీవితం జాలీగా ఉంది కానీ బోర్ గా కూడా ఉంది.     హృదయంపై తల వాల్చి పడుకున్న మమత పరధ్యానంగా ఉన్నదని రవి గ్రహించాడు.     "ఏంట్రా! వంట్లో బాగా లేదా" తలమీద ప్రేమగా నిమిరాడు.     "బాగానే ఉంది"     "ఎందుకీ డల్ నెస్" గడ్డం కింద చెయ్యివేసి తలెత్తి కళ్ళలోకి సూటిగా చూస్తూ మనసును చదివే ప్రయత్నం చేశాడు.      "లైఫ్ బోర్ గా ఉంది" చిన్నగా నవ్వింది.     తనూ నవ్వాడు చిలిపిగా. "ఓ పనిచెయ్. జూనియర్ రవి నివ్వు" అల్లరిగా అన్నాడు.     మమత నిజంగా సిగ్గు పడింది.     "అరె! నీకు సిగ్గుపడడం వచ్చన్నమాట. నేను సీరియస్ గానే చెప్తున్నా"     "మరి నా జాబ్. సెలవు దొరకదు" మమత ఆలోచిస్తూ అంది.     "ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయినాక మళ్ళీ ఇంకొకటి వెతుక్కోవచ్చు" సరదాగా అన్నాడు రవి మమత పొట్టమీద మునివేళ్ళతో రాస్తూ. ఆమె సీరియస్ నెస్ గమనించి మళ్ళీ తనే చెప్పాడు.     "మమతా! పిల్లల్ని కనే వయసులో కనేయాలి. తర్వాత ప్రాబ్లెమ్స్ రావచ్చు. కెరీర్ ముఖ్యమే. ఫ్యామిలీ కూడా ముఖ్యమే. మనకో జూనియర్ వద్దా మరి...?" ఆమె కళ్ళలోకి లోతుగా చూశాడు.     'సరే!' అంది నిశ్చింతగా.     మరో సంవత్సరానికి పండంటి బాబుకు తల్లయింది. అత్తగారి హడావుడి చూస్తుంటే ఆశ్చర్యంగా అన్పించింది. చనిపోయిన మామగారే ఇలా పుట్టాడని ఆవిడ నమ్మకం. బారసాల... వగైరా... వైభవంగా జరిగాయి. బాబుని ఒళ్లోంచి దింపట్లేదావిడ. వాడి పన్లన్నీ ఆవిడే చేస్తోంది.     వాడికి క్రమంగా మూడో నెల వచ్చింది. వాడి బోసి నవ్వులతో ఇల్లంతా పండగ వాతావరణం.     ఇంక ఉద్యోగంలో చేరవచ్చనిపించింది. నాలుగైదు అప్లికేషన్స్ పంపించింది. ఒక మంచి సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం త్వరగానే దొరకటం మమతకి ఎంతో ఆనందాన్నిచ్చింది. ఇంటిల్లిపాదీ సంతోషించారు.     మమత రోజూ ఉద్యోగానికి పోయి రావటంతో బాగా అలసిపోయేది. టార్గెట్ వర్క్ ఉద్యోగాల్లో వత్తిడి ఎక్కువగా ఉండటం సహజం కూడా.     ఓ రోజు రాత్రి పొద్దుపోయాక వచ్చిన ఫోన్ కాల్ పిడుగులాంటి వార్తని అందించి ఇంటిని శోకసముద్రంలో ముంచేసింది. ఆడబడుచు పద్మ భర్త శేఖర్ యాక్సిడెంట్ లో పోయాడని.     అత్తగారు కుప్పకూలి పోయింది.     అంతా కలిసి రాజమండ్రి వెళ్ళారు. అన్ని కార్యక్రమాలు రవి దగ్గరుండి జరిపించాడు. తమతో వచ్చేయమనీ పిల్లల్ని హైద్రాబాదులోనే చదివిస్తామంటే పద్మ ఒప్పుకోలేదు. భర్త ప్రేమగా కట్టించిన ఇంట్లో అలాగే ఉంటూ తన టీచర్ ఉద్యోగంలో అలాగే కంటిన్యూ అవుతానంది. అత్తగారు కూడా ఆ పరిస్థితిలో పద్మకి సాయంగా ఉండిపోయింది.     భారమైన మనసుతో వెనక్కి తిరిగి వచ్చారు మమత, రవి దంపతులు. అసలు సమస్య హైద్రాబాదుకి వచ్చాక భూతంలా ఎదుట నిల్చింది. బాబుని ఎవరు చూస్తారు. తను వెళ్తే సాయంత్రమో రాత్రో వచ్చేది. క్రచ్ లో చేర్చుదాం అనుకొని కొన్నిచోట్ల వెళ్ళి విచారించింది. కానీ అక్కడి పరిస్థితులు, వాతావరణం నచ్చలేదు.     చివరికి తెల్సినవాళ్ళ ద్వారా ఇంట్లో ఉండి బాబుని చూసుకునే ఆయాను కుదుర్చుకుంది. బాబు అలవాట్లు అవసరాలు ఆయాకి నేర్పి ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టింది మమత.     అంతా బాగానే జరిగిపోతోంది. బాబు కూడా పెద్దగా పేచీ పెట్టకుండా ఆయాకి మాలిమి అయ్యాడు. ఆరోగ్యంగా ఉన్నాడు.     ఓ రోజు ఇంటికి వచ్చేసరికి బాబు మురికిగా చిరిగిన చొక్కాతో కనపడేసరికి మమతకి చాలా కోపం వచ్చింది.     "ఆయా! ఈ చొక్కా ఎక్కడిది. తీసేసిన చొక్కానా! చిరిగింది వేశావే? స్నానం చేయించలేదా" తీవ్రంగా అడిగింది.     "అయ్యో! చిరిగిందా! చూడలేదమ్మా" అంటూ హడావుడిగా స్నానం చేయించి మంచి చొక్కా వేసింది ఆయా!     బాబు మొహం వాడిపోయి ఉంది.     "బాబుకి వంట్లో బాగా లేదా" నుదుటిమీద చేయి వేసి చూసింది మమత. నులివెచ్చగా ఉంది.     "బాగానే ఉన్నాడమ్మా! ఇప్పటిదాకా బాగా ఆడాడు" సంజాయిషీగా చెప్పింది ఆయా.     మమతకి మాత్రం ఆ సమాధానం తృప్తినివ్వలేదు. జవాబు దొరకని ప్రశ్నలేవో తల్లి హృదయాన్ని వేధిస్తున్నాయి.     ఆరోజు మధ్యాహ్నం నుంచి మమతకి కడుపులో నొప్పి... వాంతులు. ఇక ఆఫీస్ లో కూచోలేక లీవ్ లెటర్ ఇచ్చి వెంటనే ఇంటికి బయలుదేరింది. కారు డ్రైవ్ చేస్తోందన్న మాటేగానీ సౌఖ్యంగా లేదు. చికాకుగా ఉంది.     లిబర్టీ దగ్గర ఎర్ర లైటు పడింది. కారు ఆగగానే చుట్టూ ఈగల్లా బిచ్చగాళ్ళు.     "ఈ బెగ్గర్స్ తో వేగలేక ఛస్తున్నాం. రోజూ ఇదే రూటులో వస్తాం. రోజూ ఎందుకు. నెలకోసారి తీసుకో" టూ వీలర్ వ్యక్తి విసుక్కున్నాడు.     కారు అద్దాల్లోంచి దూరంగా ఓ బిచ్చగత్తె. మెడచుట్టూ తిప్పి కట్టుకున్న పాతచీర జోలెలోంచి పసివాడి బుల్లి కాళ్ళు, చేతులు అస్పష్టంగా కన్పిస్తున్నాయి. కార్లు చీమల్లా కదుల్తున్నయ్. గాలికి జోలె చీర అల్లల్లాడింది. ఆ పసివాడ్ని, ఆ బిచ్చగత్తెని ఎక్కడో చూసినట్లనిపించింది.... మమతకి... అదేంటి... అదే... వాడు... వాడు... గుండె బద్దలైంది. బ్రేకుతో కారు ఆగింది. వెనకనించి ఒకటే హారన్లు.     ఒక్క ఉదుటున ఇంట్లోకి వచ్చి పడింది. మెయిన్ డోర్ కి తాళం కప్ప వెక్కిరిస్తోంది.     దడదడలాడుతున్న మనసుతో తాళం తీసి బెడ్ రూంలోకి వచ్చి మంచం మీద వాలిపోయింది. కన్నీటితో దిండు తడిసిపోతోంది. కడుపునొప్పి ఏమయిందో.... కన్నపేగు మెలి తిరిగి బాధ పెడ్తోంది.     మరోగంటలో ఆయా బాబుతో వచ్చింది. తాళం తీసి ఉండటంతో కంగారుపడింది.     ఆయా కట్టుకున్న చిరుగు పాతచీర తనెప్పుడూ చూసింది కాదు. బాబు వంటి మీద పాతచొక్కా కూడా వాడిది కాదు.     పచ్చని బాబు వళ్ళు అంత నల్లగా...     ఆయా చేతుల్లోంచి ఆవేశంగా బాబుని లాక్కుంది మమత. మమత కోపం చూసి హడలిపోయింది ఆయా.     "బాబు ఏడుస్తుంటే పార్కుదాకా... అలా..." నసిగింది ఆయా.     "నోర్ముయ్... ఇంకో మాట మాట్లాడావంటే పోలీసులకి పట్టిస్తాను.. సిగ్నల్ దగ్గర నీ నాటకం చూళ్ళేదనుకుంటున్నావా? ఎంత ధైర్యం నీకు" మమత కళ్ళు నిప్పులు కురిసాయి.     "గెటౌట్ ఇడియట్..." అరిచింది మమత. ఆయా జారుకుంది తలొంచుకుని.     కాలింగ్ బెల్ శబ్దానికి ఆలోచనల్లోంచి బయటపడింది మమత.     తలుపు తీస్తే... ఎదుట రవి.     "ఎలా ఉంది మమతా.." అంటూ లోపలికి వచ్చిన రవిని కౌగిలించుకుని ఒకటే ఏడుపు.     "అదేంట్రా... కొంచెం వంట్లో బాగాలేకపోతే ఇంత భయమా. అమ్మని పిలిపించనా, బాబు ఏడీ..." సోఫాలో కూర్చొని బూట్లు విప్పుతున్న రవి పక్కన కూర్చుని కళ్ళు తుడుచుకుంది మమత.     మమతకేసి పరిశీలనగా చూశాడు రవి. తను ఇంతగా బాధపడ్తున్నదంటే బలమైన కారణం ఉండే ఉంటుంది. మెల్లగా వివరాలు రాబట్టాడు. కొయ్యబారిపోయాడు. ఇలాంటి మానవమృగాలుంటాయా! పసివాణ్ణి వ్యాపారవస్తువు చేయటం ఎంత అమానుషం. కోపంతో అతని దవడ ఎముక బిగిసింది. కాస్త తమాయించుకున్నాడు.     "పోన్లే మమతా! మనకిప్పుడైనా తెలీటం మన మంచికే. ఇంకా ఏమేం జరిగేవో! నీ నిర్ణయం కరెక్టే. సూపర్ ఉమన్లా అన్ని పన్లు ఎలా చేస్తావ్. పిల్లలకి ప్రేమానురాగాలు ఇవ్వలేని జీవితం ఎందుకు. డబ్బు సంపాదించుకోవచ్చు. వాడి బాల్యం మళ్ళీ రాదు. వాడు పెద్దయితే మనల్ని ప్రేమగా చూడాలనుకోమూ" అంటూ మమత చేయి పట్టుకొని బాబు దగ్గరికి తీసికెళ్ళాడు.     నిద్రలో బాబు ఉలిక్కిపడ్డాడు.     మమత బాబు పక్కనే కూర్చుని మెత్తగా జో కొట్టింది. వాడి పెదవులపై సన్నని చిరునవ్వు సంతృప్తిగా వెలిగింది.     కంప్యూటర్ కలల నుంచి కన్నబిడ్డ చిరునవ్వుకు ప్రయాణించిన మమతను చూస్తుంటే రవి మనసు అంకెలకందని ఆనందంతో నిండిపోయింది.             * * *