మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? నాలపట్ బాలామణి అమ్మ మలయాళం

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? నాలపట్ బాలామణి అమ్మ మలయాళం   బాలామణి అమ్మ త్రిసూర్ కేరళలో పుట్టింది. ఆమెను 'Grandmother of Malayalam Poetry " అంటారు. ప్రఖ్యాత రచయిత్రి కమలా దాస్ తల్లి. ఈమెకు ఎటువంటి విద్యా లేదు. మలయాళం, ఇంగ్లీష్ ఇంట్లోనే నేర్పిచ్చారు. ఈమె తండ్రి చిత్తనూర్ కోవిలకం, కున్ హున్ని రాజా - పండితుడూ, కళల పట్ల ఉన్నతమైన అభురుచులు కలవాడు. కేరళ నాయిర్ తరవాడు సాంప్రదాయం ప్రకారం ఆడవారు చదువుకోవడానికి వీలు లేదు. ఇంట్లో ట్యూటర్ని పెట్టడమే ఎంతో గొప్ప విషయం. తండ్రి అభిరుచులవల్ల, మామ నారాయన మీనన్ కవి అవటం వల్లా, మామ ఇంట పెట్టిన పెద్ద గ్రంధాలయం లాంటి పుస్తక సేకరణ ఒక మేధావిగా ఎదగడానికి ఆమెకెంతో ఉపయోగపడ్డాయి. ఆమె మామ నారాయన మీనన్ ప్రభావం ఆమె మీద చాలా ఉంది. పదిహేడేళ్ళ వయసులో ఆమె తన మొదటి కవిత అర్ధాంతరంగా చనిపోయిన తన స్నేహితురాలికోసం దుఖంతో రాసింది. అది చూసినప్పటినుంచి ఆమె మామ ఆమెనెంతో ప్రోత్సహించాడు. ఆయనకు ఆమెలో ఒక గొప్ప రచయిత్రి కనిపించింది. ఇంటికి వచ్చే మామ స్నేహితులూ ఆసమయంలో ఉన్న గొప్ప కవులూ, సంభాషణలు, సమావేశాలు ఆమెకు ఒక గొప్ప అక్షర ప్రపంచ వాతావరణాన్నిచ్చాయి. ఇరవై ఏళ్ళకు ఆమెకు వివాహమైంది. భర్త కలకత్తాలోని ఒక యూరోపియన్ కంపెనీలో అత్యున్నత పదవిలో ఉండేవాడు. తరవాత మాతృభూమి అనే పత్రికకు ఎడిటర్గా కూడా పని చేసాడు. ఆయన రచనలో భార్య ఆసక్తి గమనించి ఆమెనొక రూంలో కూర్చొని రాసుకో, ఇంటివిషయాలన్నీ నేను చూసుకుంటానని ఆమెకు పూర్తి స్వేఛ్చనిచ్చేవాడట. ఆఖరికి చాకలి పద్దు కూడా తనే చూసి ఇచ్చేవాడట. అది ఆమె అదృష్టం. అంత ప్రోత్సాహానికి ఆమె పూర్తి న్యాయం చేసింది. అది ఆమెకొచ్చిన బిరుదులు, పురస్కారాలూ చూస్తే తెలుస్తుంది. అంతే కాదు, ఆయన ప్రతిరోజూ సాయంత్రం ఆమె రోజంతా ఆమె రాసిన కవితలను బిగ్గరగా చదివి అందరికీ వినిపించేవాడట. ఇదొక సాంప్రదాయం ఆ ఇంట్లో ప్రతి సాయంత్రం. ఎంతో కష్టపడి, ఎవరికీ తెలియకుండా, లేకపోతే నరకప్రాయమైన జీవితాన్ననుభవించిన రచయిత్రులనే మనం ఇంతవరకూ చదువుకున్నాము. దానికి భిన్నంగా ఇంత ప్రేమించే, సహకరించే, భార్య అభిరుచిని గౌరవించి ప్రోత్సహించిన భర్త గురించి తెలుసుకోవడం ఆనందంగా ఉంది. ఆడవారికన్నా, మగవారు సంతోషించాల్సిన విషయం ఏమొ. కనీసం ఒక పది సంకలనాలైనా ఆమె మాతృత్వం అనే అంశం మీదే రాసింది. ఈ కింది కవిత మాత్రం కమలా దాస్ తీవ్ర అస్వస్తతతో ఆసుపత్రిలో చేరినప్పుడు రాసిందట. మలయాళంలో రాసిన తన పోయెమ్ని ఆమే ఇంగ్లీష్లోకి అనువదించింది. In this dew-wet courtyard, reading your poems I wonder, did your spirit which causes life to flower Hurt you more than the body which grew in me like a blossom. These cocoons you formed to put to sleep The worms gnawing at your core, burst open. And wings, rising, fluttering and jostling, Swarm my mind. Your mind may grow restless with sad thoughts, Your body may be weary of household tasks, But about you I hold no fear. Your power of turning worms into butterflies Comforts me. ఆమె ఒక 20 కవితా సంకలనానలు రాసింది. మొత్తం 500 కవితలు. తరవాత ప్రపంచంలోని కుళ్ళు, హింస, ద్వేషం గురించి స్పందిస్తూ తన కవితల్లో వాటికి సమాధానాలని సూచించే ప్రయత్నం చేసింది. చివరిగా రాసిన Mazhuvinte kathe ( The Story of the Axe ) పురాణకాలంలోని పరశురామిని కథను ఇప్పటి కాలపరిస్తితులతో పోల్చి పరిశీలించి హింస ఎల్లవేళలా సమాధానం కాదని చెప్పే ప్రయత్నం. కవితలే కాకుండా, ఇతర వచనం, అనువాదాలు కూడా చేసిందట. ఏమైనా ఇంటివద్ద భాషలు నేర్చుకుని, ఇంట్లో ఉన్న పుస్తకాలనుంచే ప్రపంచం చూసి అర్ధం చేసుకుని, తనకంటూ ఇంత గొప్ప స్థానాన్ని పురుషులు మాత్రమే ఏలుతున్న ఆనాటి మలయాల సాహిత్య ప్రపంచంలో ఏర్పరుచుకోగలగటం, ఏ రకంగా చూసినా మలయాళ స్త్రీ ప్రపంచమే కాకుండా మొత్తం భారత దేశంలో స్త్రీలు గర్వించదగ్గ విషయమేమో. కేంద్ర, రాష్ట్ర సాహిత్య ఎకాడమీ ఎవార్ద్స్, కేరళ ప్రభుత్వ అత్యున్న సాహిత్య పురస్కారమయిన Ezhuttachan పురస్కారం, సరస్వతి సమ్మాన్, వల్లతొల్ పురస్కారం, వల్లతొల్ సాహిత్య సమితి నుండి, ఇంకా పద్మభూషణ్ ఆమెను వరించాయి ఆమె ప్రతిభకు తార్కాణంగా. ఆమె ముథాసి (Grandmother) అనే సంకలనానికి ఆమెకు సాహిత్య ఎకాడమీ ఎవార్డ్ వచ్చింది. తరవాత సాహిత్య ఎకాడమీ ఫెల్లోషిప్ ఆమె స్వఛ్చమైన పారదర్శకమైన అదే సమయంలో ఎంతో లోతైన భావాలతో, గాఢతతో రాసిన కవిత్వానికి పొందిన అత్యున్నత కీర్తి కిరీటం. కొన్ని మలయాళంలో రాసిన కవితల్ని ఆమే ఇంగ్లీష్ లోనికి అనువాదం చేసింది. కానీ ఆమె కున్న ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం అద్భుతమైన కవితల్ని అనువదించడానికి సరిపోలేదని విమర్శకుల అభిప్రాయం. Alzheimersతో ఐదేళ్ళు బాధపడి 2004 లో కన్ను మూసింది. -Sharada Sivapurapu

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? సరస్వతి బాయి రాజ్వాడే

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? సరస్వతి బాయి రాజ్వాడే   సరస్వతి బాయి ఉడిపి దగ్గర బాలాంజలా అనే గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టింది. ఈమె మొట్టమొదట కన్నడ రచయిత్రుల్లో ఒకరు. ఈమె మూకీ సినిమాల్లో కూడా నటించింది. ఇప్పటి వాళ్ళకు ఈమె తెలియక పోయినా, ఈమెను చాలా గౌరవంతో గుర్తుచేసుకుంటారట ఆమె తరం వాళ్ళు. ఈమె గిరిబాలె అనే కలం పేరుతో రచనలు చేసింది. ఉడిపిలో జరిగిన ఒక సాహిత్య సమ్మేళనంకి ఆమె అధ్యక్షత వహిస్తే జ్ఞానపీఠ్ గ్రహీత కోట శివరామ కరంత్ వోట్ అఫ్ థాంక్స్ చెప్పారట. ఆమె కున్న గుర్తింపు అటువంటిది. ఆమె పదవ తరగతి ఆమె 25వ ఏట పాస్ అయ్యింది, అదీ ఆమె రచనలు అచ్చవ్వటం మొదలియిన పదేళ్ళకు. మహారాష్ట్రా నుండి ఉడిపి వచ్చి స్థిరపడింది ఆమె కుటుంబం. ఇక్కడ ఆమె రెండేళ్ళు స్కూల్ కెళ్ళింది. ఈ రెండేళ్ళలో ఆమె ఎంత కన్నడ నేర్చుకుందంటే, అది ఆమె రచనన్లు చెయ్యగలిగేంత. పేదరికం కారణంగా 15 ఏళ్ళ సరస్వతిని 51 ఏళ్ళ వ్యక్తికిచ్చి పెళ్ళి చేసారు. పేద కుటుంబంలో పుట్టినా డబ్బున్న వ్యక్తితో వివాహం జరగటంవల్ల ఆమె రెండూ అనుభవించింది. అత్తవారింట జీవితం చాలా కష్టంగా ఉండేదట. కఠినమైన నియమ నిబంధనలు. కొన్నేళ్ళకే భర్త చనిపోయాడు. జీవితం ఇంకా నరక ప్రాయమైపోయింది. ఈరకమైన జీవితానుభవాలే ఆమె రచనల్లో, వాదననీ, తిరుగుబాటు ధోరణినీ, ఆడవారి సమస్యల గురించి ఆలోచించి, ఆకాలంలో వివాదాస్పద మైన సమాధా నాల్ని వెతికేట్టుగా చేసాయి ఆమెను. ఆమె ఒక 70 కధలు, వ్యాసాలు, కవితలూ, విమర్సలూ రాసింది. అంతే కాకుండా, మరాఠీ,హిందీ, తమిల్ నుంచి కన్నడకి అనువాద రచనలు కూడా చేసింది. పేరుపొందిన కధల్లో, బాదవర కన్నిర కతె, కులవధు, కాలి అనేవి. సుప్రభాత అనే పత్రికకు ఎడిటర్ గా పనిచేసింది కొన్నాళ్ళు. అందులో ఆడవారిని కధలు రాయడానికి ప్రోత్సహిస్తుంది. కథావళి, నిసర్గ అనే పత్రికల్లో రెగ్యులర్ కాలమిస్ట్ గా పని చేసింది. ఆమె కధలు ఎంతో వైవిధ్యంతో కూడుకున్నవి. మగవారు చేసే మోసాల్ని వాటిని ఎదుర్కొన్న స్త్రీ పాత్రలు చేసే తిరుగుబాటుని చిత్రించే ప్రయత్నం ఎంత సాహసవంతంగా ఉంటుందో ఈ కధలో తెలుస్తుంది. ఒక కపట సన్యాసి తన కామ తృష్ణ తీర్చుకోవడం కోసం రహస్యంగా అతని భక్తుల్లో ఒకామెను పెళ్ళిచేసుకుంటాడు. ఈ స్త్రీ పాత్ర పేరు సీత. సీత తను ఒక్కతే ఈ సన్యాసి భార్య అనుకొని చాలా గుంభనంగా బయటి ప్రపంచానికి తెలియకుండా అతనితో సంసారం చేస్తుంటుంది. కాని ఒకరోజు ఆమెకు అతని మీద అనుమానం వచ్చి చూస్తే అతనికి తన లాగే ఇంకో ఐదారుగురు భార్యలున్నట్లు తెలియడం, పైగా వాళ్ళు కూడా తామొక్కరే సన్యాసి భార్యనన్న భ్రమలో ఉండటం తెలుస్తుంది. అతన్ని రెడ్ హేండెడ్ గా పట్టుకుని నిలదీస్తే, నీకు సమాధానం చెప్పే అవసరం నాకు లేదు, నీకు నన్నడిగే హక్కు లేదని తృణీకరిస్తాడు. దాంతో మోసపోయామని తెలిసిన ఆమె ప్రతీకారం తీర్చుకోవడం కోసం అతన్ని చంపేస్తుంది. అయితే ఈ కధ అక్కడ ఆగదు. పొలీస్ విచారణ, ఆ సన్యాసి నడిపే ఆశ్రమానికి వారసుడిని వెతకటం, అతని శిష్యులంతా ఈమెను పిచ్చిదని సాక్ష్యం ఇవ్వడం ఇలా నడుస్తుంది. నీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటారని నీకు బాధగా ఉంటే, నాకెంత బాధగా ఉండాలి, నా గుండె కూడా ముక్కలయ్యింది అంటూ ఆమె చివరికి తనను తాను కత్తితో పొడుచుకుని చనిపోతుంది. ఎలాగైనా చావు తప్పని పరిస్తితుల్లో, బ్రతికినా అది చావు కంటే హీనమైనదైనపుడు, చనిపోయేముందు ప్రతీకారం తీర్చుకోవడం అనేది అలాటి మగవారికి ఒక భయంకరమైన గుణపాఠం. చివరికి విచారణలో ఇంకా ఎనిమిది మంది సీత లాంటి వారే ఆశ్రమంలో ఉన్నారని తేలుతుంది. ప్రతీకారం తీర్చుకోవడంతో కధ ముగించకుండా, తిరుగుబాటు చేస్తే మొత్తం సమాజం మగవాడి పక్షం ఎలా తీసుకుంటుందో, ఆడవారికి రక్షణ కాదు కదా సానుభూతి కూడా ఎలా ఉండదో చూపిస్తుంది. ఆమె రాసిన కాలంస్ లో ఆమె రాయని విషయమoటూ లేదట. స్త్రీ విద్య, వరకట్నం, విధవ స్త్రీల పరిస్తితులు , జుట్టు తియ్యడం గురించి, ఆరోగ్యం, అందానికి చిట్కాలు ఇలా చెప్పుకుంటూపోతే పెద్ద లిస్టే. మఠాధిపతులని విమర్శించడానికి కూడా ఆమె వెనుకాడలేదు. అయితే ఒక విషయంలో ఆమెను అంతా విమర్శించారట. అదేంటంటే ఆడవారి నగ్న చిత్రాలు వేసే ఒక పత్రికకి ఆమె రాసినందుకు. అయితే ఆమె ఆ విమర్శని కూడా ధైర్యంగా ఎదుర్కొంది. ప్రకృతి ఇచ్చిన శరీరం గురించి సిగ్గుపడటానికేముందని ప్రశ్నించిందట. అయితే రచయితలకే ఆమెను, ఆమె పూర్తి వ్యక్తిత్వాన్నీ అర్ధం చేసుకోవడం కొంచం కష్టమయ్యింది. ఆమె వ్యక్తిత్వ వికాసం భిన్న దిశల్లో జరిగింది. సాహిత్యం, జర్నలిజం , సమాజ సేవ, యువతకి మార్గ నిర్దేశం ఇలా. నిజానికి 19వ శతాబ్దం ఆరంభంలో స్త్రీలు పేరు ప్రతిష్టల కోసమో, డబ్బు కోసమో రాయలేదు. తమ జీవితాల్లో ఉన్న దుఖం, అంతంలేని చాకిరీ, అణిచివేతల నుంచి, పురుషాధిపత్యమ్నుంచి స్వేఛ్చ కోరుతూ, తమను తాము రక్షించుకోవడం కోసం చేసిన భావ ప్రకటన ఇలా ఎన్నో రకాలుగా బయటపడింది. తమ జీవితాల్లో ఉన్న ప్రేమ రాహిత్యం, లేని ఆనందాన్ని వెతుక్కునే ప్రయత్నం, అర్ధం లేకుండా సాగే తమ జీవితాలకొక సార్ధకతనివ్వడం కోసం, వ్యధాభరిత జీవితాన్నుంచి పారిపోయేందుకు చేసిన ఒక ప్రయత్నమే రచన. అది రోజులో కొంచం సేపయనా సరే. చాలా మంది రచయిత్రులు తమ జీవితాల్లో లేని దాని గురించి రాయ లేదు. ఉన్నదాని గురించే రాసారు. తమ జీవితాల్లో ఉన్నదే అందరు స్త్రీల జీవితాల్లో కనపడితే బాధతో రాసారు.    -Sharada Sivapurapu

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? రొకెయ్యా బేగం

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? రొకెయ్యా బేగం - బెంగాలి     రచయిత్రి,, సంఘ సంస్కర్త రొకెయ్యా బేగం ఒక చిన్న గ్రామం రంగ్పూర్ అనే జిల్లా బెంగాల్లో ఒక జమిందారీ కుటుంబంలో పుట్టింది. సహజంగానే ఆ ఇంట, చాలా కఠిన నియమాలు స్త్రీలకి ఉండేవి. పర్దా మగవాళ్ళనుంచే కాదు, బయటి ఆడవారిముందు కూడా. తల్లికీ బిడ్డకీ మధ్యన కూడా పర్దా ఎంత అంటే నాకు నా తల్లి గురించి ఏమీ గుర్తు లేదు పర్దా తప్ప అని రొకెయ్యా అనేంతవరకూ. ఆ ఇంట ఆడవాళ్ళు చదువుకోవడం నిషేధం. కానీ రొకెయ్యాకి ఆమె అక్కకీ చదువు మీద ఎంతో ఆసక్తి. బంగాలీ నేర్చుకోవడం ఇష్టం లేదు ఆమె తండ్రికి. కానీ మగపిల్లలు లోకల్గా మంచి పదవుల్లో ఉండాలంటే బంగాలి రావడం తప్పనిసరి కాబట్టి తండ్రి వారికి బంగాలీ నేర్పిస్తాడు. రొకెయ్యా అన్నగారు కొంచం అభ్యుదయ భావాలు కలిగి ఉండటం అక్కచెల్లెళ్ళిద్దరికీ ఉపకరిస్తుంది. ఇంట్లో అందరూ ముఖ్యంగా తండ్రి నిద్రపోయేవరకూ ఆగి అప్పుడు ఇద్దరికి బెంగాలి ఇంకా ఇంగ్లీష్ నేర్పేవాడట. వీరిద్దరి చురుకుదనం అతనికెంతో నచ్చుతుంది. ఒకసారి రొకెయ్యా అక్క బెంగాలి స్టోరీ బుక్ చదువుతూ తండ్రికి పట్టుబడిపోతుంది. తండ్రి కోప్పడతాడన్న భయంతో మూర్ఛ పోతుంది. ఆమె అంత భయపడటం చూసి తండ్రి కూడా వీరిద్దరిను చదువుకోనిస్తాడు. తండ్రికి అరబిక్, పెర్షియన్, పుష్తున్, ఉర్దూ, ఇంగ్లీష్, హింది, బెంగాలి భాషల్లో ప్రవేశం ఉంటుంది. అదే పిల్లలకూ వస్తుంది. రొకెయ్యా భర్త ఆమె కన్న చాలా పెద్దవాడు. పదహారేళ్ళ వయసులో ఉన్న రొకెయ్యాకు ముప్పైలు పైబడిన రెండోపెళ్ళివాడిని కేవలం ఆమె అన్నగారికి అతను బాగా నచ్చడం వల్ల ఇచ్చి పెళ్ళి చేసారు. అయితే గుడ్డిలో మెల్ల ఏంటంటే, అతనికి చాలా విశాల హృదయం అభ్యుదయ భావాలు కలవాడు. రొకెయ్యాను రాయడానికీ, చదువుకోవడానికి ప్రోత్సహించి ఆమె తోటి ముస్లిం ఆడపిల్లలకు కూడా చదువు చెప్పాలని ప్రోత్సహించి అందుకు కావాల్సిన డబ్బు కూడా కూడబెట్టి ఇస్తాడు. సమాజంలో మార్పు రావాలంటే ఆడవాళ్ళు చదువుకోవడం చాలా ముఖ్యమని అతను భావిస్తాడు. అతని ప్రోత్సాహంతోటే ఆమె తన 21వ ఏడు నించి రాయటం మొదలుపెడుతుంది. సమాజంలో మార్పు రావాలంటే ఆడవాళ్ళు చదువుకోవడం చాలా ముఖ్యమని అతను భావిస్తాడు. అతని ప్రోత్సాహంతోటే ఆమె తన 21 వ ఏడు నించి రాయటం మొదలుపెడుతుంది. అప్పటి స్త్రీల సమస్యలూ, సామాజ వాతావరణం గురించి ఆమె రాసిన వ్యాసాలు The Indian Ladies Magazine లో అచ్చవుతాయి.. ఆమె రాసిన వ్యాసాలు "The Female Half”, “The Veil”, “The Ideal Housewife” అన్నింటిలోనూ ఆమె ఆడవారిని పరదా వెనక ఇంట్లో కూడా దాచి, వారిని విద్యకి దూరం చెయ్యడాన్ని నిరసిస్తుంది. ఒక గృహిణిగా వారి పాత్రను ప్రశ్నిస్తుంది. వారికి విద్య ఉంటే అది వారిని భార్యగా, అమ్మగా వారి పాత్రల్లో ఎలా ఉన్నతంగా మారుస్తుందో రాస్తుంది. రొకెయ్యా వ్యక్తిగత జీవితంలో చాలా దుఖం ఉంది కాని దాన్ని ఆమె, ఆమె భర్త ఆశయమైన విద్య ద్వారా స్త్రీల జీవితాలు మెరుగుపరచడం, వారి కొక గుర్తింపు, గౌరవం తీసుకురావడమనే దానికి అడ్డు రానియ్యలేదు. ఆమెకు పాతికేళ్ళ వయసులో భర్త చనిపోయాడు. ఇద్దరు ఆడపైల్లలు కూడా చంటిపిల్లలుగానే చనిపోయారు. భర్త పోయిన 5 నెలల్లోనే ఆమె అతని గుర్తుగా షెఖావత్ గల్స్ హై స్కూల్ బీహార్లో భాగల్పూర్లో 5 గురు స్టూడెంట్స్తో మొదలుపెడుతుంది పదివేల రూపాయల పెట్టుబడితో. కానీ ఆమె స్కూల్ పెట్టిన ప్రాపర్టీ మీద భర్త తరపు బంధువులు వివాదం రేపడంతో ఆ స్కూల్ మూతబడి ఆమె కొల్కట్టాలో మళ్ళి 1911 లో స్కూల్ మొదలు పెడుతుంది 8 మంది విద్యార్ధులతో. నాల్గేళ్ళలో ఆ సంఖ్య మెల్లిగా 84 కి చేరుతుంది. స్కూల్లో మొదట, ఉర్దూ రాయటం, చదవటం, మొక్కల పెంపకం, కుట్టుపని, వ్యాయామం, ముస్లిం సంస్కృతి పద్ధతులూ నేర్పుతుంది. తరవాత బంగాలి, ఇంగ్లీష్ కూడా నేర్పుతుంది. మిగిలిన స్కూల్స్లో బోధనా పద్ధతులూ ఏయే విషయాల్లో శిక్షణ ఇస్తున్నారన్న విషయాలు ఆమె స్వయంగా అన్ని స్కూల్స్కి వెళ్ళి తెలుసుకుని మరీ తన స్కూల్లో అమలు పరిచేదట. పరదాకి తను వ్యతిరేకమయినా, పరదా వేసుకునే వారిని ఆమె ఎన్నడూ కాదనలేదు. ఇందువల్ల ఉన్నత ముస్లింస్ కుటుంబాలు తమ ఆడపిల్లలను ఈ స్కూల్కి పంపడానికి అభ్యంతరపెట్టలేదు. వారిని పరదాలో ఇంటినుండి స్కూల్కి మళ్ళా ఇంటికి దింపడానికి ఆమె గుర్రపు బళ్ళు ఏర్పాటు చేసిందట. పిల్లలను స్కూల్లో చేర్చమని ఇంటింటికీ వెళ్ళి ప్రాధేయపడేదట. అప్పట్లో ఆడపిల్లలకి కొరాన్ మాత్రం నేర్పేవారు అది కూడా ఎటువంటి తాత్పర్యం లేకుండా, ఒక ఆడవాళ్ళు ప్రవర్తించాల్సిన పద్ధతుల మీద తప్పించి. పరదాను వ్యతిరేకించినందుకు ఆమె చాలా విమర్శను ఎదుర్కొంది. కాని చిత్రం ఏమిటంటే ఆమె కూడా పబ్లిక్ ప్లేసెస్ లో బురఖాలోనే ఉండేదట. తన స్కూల్లోనూ స్నేహితులూ బంధువుల వద్ద మాత్రం బురఖా వేస్కునేది కాదట. మనుషులందరూ ఏదో ఒకరకమైన ముసుగులు వేస్కుంటేనే ఉంటాము వేరే వేరే సందర్భాలలో, వేరే వేరే మనుషుల వద్ద. అయితే అది కంపల్సరీ కాదు. మనిష్టం. ఏ ముసుగూ లేకుండా కూడా ఉండచ్చు. కానీ ఇలా ఎల్లప్పుడూ ముసుగులో ఉండాలంటే, ఇంట్లో బయటా ఏదో తప్పు చేస్తున్నట్టు, ఒక శరీరం కలిగి ఉండటమే పాపమయినట్లు, ఎంత కష్టం. ముస్లింస్లో ఇంత తక్కువమంది మాత్రమే దీన్ని వ్యతిరేకించడం కూడా కొంచం ఆశ్చర్యమే. విద్య ఒక్కటే సరిపోదనీ ఆర్ధిక స్వావలంబన కూడా అవసరమని గుర్తించిన ఆమె ఆడవారికి ఇంటినుంచే చేసుకునే కొన్ని చేతిపనుల్లో శిక్షణ ఇచ్చింది. ఎన్నో ఎన్ జీ ఓస్ స్థాపనను కూడా ఆమె ప్రోత్సహించింది. ఎన్నో స్త్రీల హక్కులు, సమస్యలమీద పోరాడే, పనిచేసే సంస్థలకి ఆమె నేతృత్వం వహించింది. ఆమె 22 ఏళ్ళ పాటు నడిపిన స్కూల్ని తరవాత గవర్నమెంట్ చేపట్టింది. రొకెయ్యా గౌరవార్ధం చాలానే జ్ఞాపక చిహ్నాలున్నాయి. ఢాకా వుమెన్స్ యూనివర్సిటీ హాల్ ని రొకెయ్యా హాల్గా పేరు మార్చి పెట్టారు. ధాకా పార్లమెంట్ దగ్గర ముఖ్య రహదారికి ఆమె పేరు పెట్టారు. స్త్రీజనోద్ధరణకి పాటుబడిన స్త్రీల సేవలకి గుర్తింపుగా రొకెయ్య పదక్ ఎవార్డు ప్రభుత్వం ప్రకటించింది. రంగ్పూర్ లోని కాలేజీకి 1963 బేగం రొకెయ్య కాలేజ్ అని పేరు పెట్టారు. అక్కడ ఒక యూనివర్సిటీకి బేగుం రొకెయ్యా యూనివర్సిటీ అని పిలుస్తారు. The Department of Women and Gender Studies, Dhaka University బేగం రొకెయ్య లెక్చర్స్ ప్రతి డిసెంబర్ 9 వ తారీకునా ఏర్పాటు చేస్తారు. ఆ రోజును రొకెయ్యా దివస్ గా జరుపుతారు. 1994 నుంచి Bangladesh ప్రభుత్వం కూడా రొకెయ్యా దివస్ గా 9th డిసెంబర్ను జరుపుతోంది. ఇక ఆమె రచనల సంగతి చూద్దాం. పరదా మీద ఆమె రాసిన వ్యాసాలు ఎన్నో ఇంగ్లీష్లోకి అనువదించబడ్డాయి. ఆడవారి ఆలోచనా పరిధిని విస్తరించే దిశగా ఆమె ఎన్నో వ్యాసాలు, కధలూ నవాలలూ బెంగాలిలో రాసింది. ఆమె రాతల్లో హాస్యం, విమర్శ, వ్యంగ్యం ఉండి, చదువరులను ఆలోచింపచేసేవిధంగా ఉండేవట. ఇస్లాం అర్ధాలని వక్రీకరించి ఆడవారిని అణగదొక్కడానికి వాడుకునేకన్నా వారి సామర్ధ్యాన్ని పూర్తిగా వాడుకోగల్గే సుహృద్భావ వాతావరణం సమాజంలో సృష్టించడమే అల్లా సందేశాన్ని అమలు చేయడం అంటుంది. శ్రమ విభజన లింగ భేదం మీద ఆధారపడి ఉండకూడదని ఆమె వాదించింది. ఆడవారు లింగ వివక్షని బయట ప్రపంచంలో తిప్పి కొట్టాలంటే, వారు చేసె వృత్తిని వారు సమర్ధవంతంగా నిర్వహించగలిగేట్లు ఎదగడానికి కృషి చేయడమే మార్గం అంటుంది. అది మాత్రమే వారికి బయట గౌరవం, గుర్తింపు ఇస్తాయని అంటుంది. మతం పేరిట ఆడవారికి విద్య లేకుండా చెయ్యటం అన్యాయమని వాదిస్తుంది. ఆమె రాసిన నవలల ఇతర రచనల లిస్ట్ ఇది.     Pipasha ("Thirst", 1902).     Motichur (essays, 1st vol 1904, 2nd Vol. 1922). The second volume of Matichur includes stories and fairy tales such as Saurajagat (The Solar System), Delicia Hatya (translation of the Murder of Delicia, by Mary Corelli), Jvan-phal (The Fruit of Knowledge), Nari-Sristi (Creation of Women), Nurse Nelly, Mukti-phal (The Fruit of Emancipation), etc.     Sultana's Dream, (satire, 1908) a notable early work of feminist science fiction involving a utopian male/female role-reversal. It is a satirical piece, a feminist utopia, set in a place called Lady Land, a world ruled by women. Later translated as Sultanar Swopno.[4]     Saogat (1918, poetry). Her poem titled ‘Saogat’ was published on the first page of the first issue of the Saogat in Agrahayan.     Padmarag ("Essence of the Lotus", novel, 1924). A feminist utopia.     Oborodhbashini ("The Secluded Women", 1931)     Boligarto (short story).     Narir Adhikar ("The Rights of Women"), an unfinished essay for the Islamic Women's Association     God Gives, Man Robs, 1927, republished in God gives, man robs and other writings, Dhaka, Narigrantha Prabartana, 2002     Education Ideals for the Modern Indian Girl, 1931, republished in Rokeya Rachanabali, Abdul Quadir (editor), Dhaka, Bangla Academy, 2006 సుల్తానా'స్ డ్రీం లో ఇప్పుడున్న ప్రపంచం తిరగబడినట్టు ఒక ఊహా చిత్రం. లేడీస్ లేండ్ అనే కల్పిత ప్రపంచంలో ఆడవారే అధిపతులు, మగవారిమీద ఆధిపత్యం చెలాయిస్తూ, ఆడవారు చేసే పనులన్నీ మగవారు చేస్తున్నట్టుగా సాగే హాస్యభరిత వ్యంగ్య రచన. ఎంతో పాప్యులర్ అయిన రచన. ఆమె తన 52వ ఏట చనిపోయంది. మరొక రచయిత్రి పరిచయం వచ్చే వారం చేసుకుందాం   -Sharada Sivapurapu

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? గీతా సానే

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? గీతా సానే - మరాఠీ గీతా సానే ఆమ్రవతి జిల్లా, మహారాష్ట్రలో పుట్టింది. తల్లితండ్రులిద్దరూ అభ్యుదయ భావాలున్నవారే. అందువల్ల చదువుకి ఏ ఆటంకమూ లేదు. తండ్రి స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. ఆరోజుల్లో ఆమే మొట్టమొదటి సైన్స్ పట్టభద్రురాలు. తల్లితండ్రులెంత అభ్యుదయ భావాలున్నవారంటే ఆరోజుల్లో వారు ఇద్దరి ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎంతో నిరాడంబరంగా చేసారట. వారి వివాహాలకి ఒక రూపాయి కూడా ఖర్చయుండదని ఆమె తరవాత చెప్తుంది ఒకసారి. కాలేజీ రోజుల్లోనే ఆమె మార్క్సిస్మ్ పట్ల ఆకర్షితురాలైంది. ఆమె కాలేజీలో ఒక ముస్లిం యువకుడు, హిందు యువతి ప్రేమించుకుని పెళ్ళి చేసుకోవడం పెద్ద దుమారం లేపుతుంది. ఆఖరుకి పత్రికలు కూడా ఈ వివాహాన్ని ఖండిస్తాయి. ఆ దుమారానికి వ్యతిరేకంగా, ఆ మతాంతర వివాహాన్ని సమర్ధిస్తూ ఆమె ఆ పత్రిక ఎడిటర్ కి ఒక ఉత్తరం రాస్తుంది. అదే ఆమె మొదటి రచన. ఒక స్త్రీవాదిగా ఆమె మాతృస్వామ్యాన్ని సమర్ధించింది. పెళ్ళయ్యాక పేరు మార్చుకోవడాన్ని, బొట్టూ, నుదుటి మీద సింధూరం పెట్టుకోవడాన్ని, తాళి బొట్టూ, నల్లపూసలు వేస్కోవడాన్ని కూడా పురుషాధిక్యతకి తలవంచడమే అంటుంది. ఆమె భర్త నరసిమ్హ ధగంవర్ కూడా స్వాతంత్రోద్యంలో పాల్గొంటూ, జైలు శిక్ష అనుభవించాడు ఆమె ఏడు నవలలు రాసింది. అన్నీ కూడా స్త్రీవాద రచనలే. ఆమె రచనలు చాలా వైవిధ్యంతో, అప్పటి రాజకీయ వాతావరణంతో స్త్రీల సమస్యలను, వారి జీవితాలనూ ముడిపెడుతూ రాసిన అద్భుత రచనలైనా, ఈమెకు అంతగా పేరు రాలేదు. ఆమె ఉద్దేశ్యంలో వ్యక్తిత్వ వికాసం, జీవన సాఫల్యం, జీవిత పరమార్ధ సాధన ఇవన్నీ ఆడవారి జీవితాలకి ఆమడ దూరంలో ఉండిపోయిన విషయాలు. ఆడవారికి పంతొమ్మిదో శతాబ్దం మొదాల్లోనే కాదు ఈ ఇరవయ్యో శతాబ్దపు మొదల్లో కూడా వారి సమయాన్ని వారి అభిరుచుల కోసం వెచ్చించాలంటే అంత తేలిగ్గా కుదర లేదు, ఇప్పుడు కూడా కుదరట్లేదు. అలా చేయాలనుకున్న పక్షంలో ఆమె వివాహానికీ కుటుంబానికీ దూరంగా ఉండాల్సిందే. నిజానికి స్త్రీకి ఏడవటానికీ, చావటానికీ ఉన్న స్వేఛ్చ తనకిష్టమైనట్టు బ్రతకటానికి లేదు. ఇష్టం లేని పెళ్ళి, పెళ్ళాం అంటే తన కోరికను తీర్చుకునేందుకు, ఆమె ఇష్టాఇష్టాలతో పనిలేకుండా వాడుకునే వస్తువే తప్పించి, మనసున్న మనిషిగా చూడలేని మొరటు భర్త. గర్భం వస్తే, మాతృత్వం కూడా తనమీద రుద్దబడిందనే భావన తప్ప, పుట్టబోయే బిడ్డ మీద కూడా ఎటువంటి ఇష్టం కలగని ఒక స్త్రీ పాత్ర. చివరికి ఆ పుట్టిన బిడ్డ చనిపోయి డిప్రెస్ అయినపుడు, ఆమె కోరుకునే సానుభూతి ఆమెకు కానుపు చేసిన నర్స్ ద్వారా పొందుతుంది. ఆ పరిస్తితిలో ఆమె ఒక నిర్ణయం తీసుకొని తన భర్తకు ఇంకో భార్యని తనే వెదికి వేరే వెళ్ళి చదువుకుంటుంది. పట్టుదలతో మాస్టర్ డిగ్రీ చేసాకా ఆమెకు అసలు షాక్ తగులుతుంది. భర్త నుంచి విడిపోయిన ఆడది బరితెగించిన ఆడది కాబట్టి, ఆమెకి ఉద్యోగం దొరకదు ఎంత ప్రయత్నించినా. ఆ నిరాశతోటి ఆమె పిచ్చిదయి చివరికి చనిపోతుంది. ఈ ముగింపు నిరాశాజనకంగా ఉన్నా అప్పటి సమాజ వాస్తవికతకు అద్దం పడుతుంది. Mist and Due Drops (1942) అనే నవలలో స్త్రీలకి సంబంధించిన ప్రశ్నలు, అప్పటి రాజకీయ వాతావరణానికి సంబంధించిన ప్రశ్నలు ఎలా ముడిపడి ఉన్నాయో చెప్తుంది. ఈ నవల 1942 లో అంటే కాంగ్రెస్ నేతృత్వంలో జరుగుతున్న పోరాటాలు జోరుగా ఉన్నా, వివిధ సిద్ధాంతాలను అనుసరించి జరుగుతున్న పోరాటాల బలా బలాలను ఆమె విశ్లేషిస్తుంది, ముఖ్యంగా గాంధీ గారి అహింసావాదం, కమ్యూనిజం . ఈ నవలలోని ముఖ్యపాత్ర తన కాలేజీ రోజుల్లో తను ప్రేమించిన వ్యక్తిని పెళ్ళి చేసుకుని జీవితంలో స్థిరపడాలని అనుకుంటుంది. కాని అతను ఆమెను సమాజ సేవ చెయ్యడానికి ప్రోత్సహిస్తాడు. ఆ ప్రేరణతో ఆమె ఒక కేర్ సెంటర్ మొదలు పెడుతుంది. ఆ క్రమంలో ఆమె ఒక మార్క్సిస్ట్ భావాలున్న డాక్టర్తో స్నేహం చేస్తుంది. అతని ద్వారా కేవలం దానాలు ఔదార్యం చూపటం వల్లనే సమాజాన్ని ఉద్ధరించలేమని దానికి ఒక శాస్త్రీయమైన పరిష్కారం కమ్మ్యూనిజం ద్వారా చూపచ్చని నమ్ముతుంది. ఆ సమయంలో అక్కడ బీడీ కార్మికులు సమ్మె చేస్తారు. అయితే అహింసతో స్వాతంత్రం సాధిస్తామనే గాంధియన్ వాదులు ఆ సమ్మెని ఎంత హింసాత్మకంగా అణిచివేస్తారో చూసాకా ఆమెకు గాంధీగారి అహింసావాదం మీద అనుమానాలు కలుగుతాయి. ఒకరకంగా ఈ నవల అప్పటి సామాజిక రాజకీయ అంశాలు స్త్రీల సమస్యలని ఎలా ప్రభావితం చేస్తున్నాయన్న విషయంపై నిశితంగా చేసిన ఒక పరిశీలన. అసలు పేరు పొందిన రచయిత్రులంతా తమ రచనల్లో స్త్రీలు ఎదుర్కొనే వివక్ష, వారి జీవితాలు, బాధలు, స్త్రీల పట్ల సమాజం యొక్క నిర్లక్ష్యం, నిర్దయ తప్పించి వేరే అంశాలని ఎక్కువగా రాయలేకపోయారంటేనే అర్ధం చేసుకోవాలి ఈ అంశం యొక్క పరిధి, విస్తృతి దాని విశ్వరూపమూనూ. ఈ వివక్ష జీవితాన్ని ఇంతగా ఆక్రమించాకా, ఇంక ఏమైన ఎలా కనిపిస్తుంది, ఎందుకు కనిపించాలి, అందులోనూ స్త్రీలకి ? అందుకని ఎంతమంది రచయిత్రుల గురించి రాసినా ఒకేలాగా ఉన్నాయని మీరనుకుంటే, చదవడానికి విసుగుగా అనిపిస్తే అది రచయిత్రుల తప్పు, నా తప్పూ మాత్రం కాదు. పురుషస్వామ్య, పురుషాధిక్య సమాజం ఇంతలా వేళ్ళూనుకునేందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల ఏళ్ళుగా తోడ్పడిన, తోడ్పడుతున్న అందరిదీ తప్పు. Under the grass in a green lawn అనే నవలలో ఒక సంభాషణ ఇలా జరుగుతుంది. "స్వేఛ్చ అనే దాంతో నాకెప్పుడూ పరిచయం లేదు. ఇంట్లో ఎవరికీ ఒక ఆడపిల్ల గురించి పట్టదు, ఇంట్లోని ఆవు గురించి పట్టినంతగా. అదైనా దాని బోజనం దాని హక్కులా అడుగుతుంది. ఒక ఆవుని చంపితే ఇప్పటికీ గొడవలే జరిగిపోతాయి. మరి అమ్మాయి? అమ్మాయికేమైనా అయితే అసలెవరైనా పట్టించుకుంటారా? బ్రహ్మని కూడా తన అందంతో వశం చేసుకున్న మాయలాడి ఆడదంటే . ఆడపిల్ల పుట్టి ఇంకా కళ్ళైనా తెరవక ముందే ఆ పిల్ల పెళ్ళెలా చేయాలా అని తల్లితండ్రుల బాధ పడటం మొదలు పెడతారు. ఆ పిల్ల ఎప్పుడు, ఎక్కడ ఎలా నవ్వకూడదో, నడవకూడదో, ఏం చేయొచ్చో, ఏం చేయకూడదో అనే దాని మీద ఆ పిల్ల ఇంకా పెరగకుండానే పెద్ద పెద్ద గొడవలే అవుతుంటాయి ఇంట్లో. పుట్టిన ఇంట్లో బేవార్సుగా తినేసి, పెళ్ళయ్యాకా వేరే ఇంట్లో తన సేవలందిచ్చే అమ్మాయి ఆ ఇంటికి ఒక భారమే, పీడే ఉన్నంతవరకూ. పనికిరాని పశువుల్ల్లాగా పెరుగుతారు ఆడపిల్లలు.” గీతా సానే కేవలం స్త్రీ సమస్యల మీదే రాయలేదు. అన్ని సామాజిక సమస్యల మీదా ఆమె వ్యాసాలు రాసింది. అసలు స్త్రీల సమస్యలు అప్పటి, సామాజిక, రాజకీయ పరిస్తితులతో ఎలా అల్లుకుని ఉన్నాయో ఎత్తి చూపడమే ఆమె రచనల్లోని ప్రత్యేకత. రచనలతో పాటుగా చురుకైన సామాజిక కార్యకర్తగా రాజకీయ చైతన్యం నిండి ఉండడం ఆమె ప్రత్యేకత.   -Sharada Sivapurapu  

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? లలితాంబికా అంతర్జనం

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? లలితాంబికా అంతర్జనం     లలితాంబికా అంతర్జనం కొల్లాం డిస్ట్రిక్ట్ కేరళలో పుట్టింది. చాలా ఛాందసవాద నంబూద్రి బ్రాహ్మణ కుటుంబం. ఆమె రాసిన ఒకే ఒక నవల "అగ్నిసాక్షి" కేంద్రీయ సాహిత్య అకాడమీ ఎవార్డ్ కి ఎంపికయ్యింది 1977లో. అదే నవలని సినిమా కూడా తీసారు. ఆమె చేసిన ఇతర రచనలు 9 కధా సంకలనాలు, 6 కవితా సంకలనాలూ, ఒక ఆత్మ కధ. ఈ "అత్మకధాక్కొరు అనుఖం" అనే ఆత్మకధ చాలా చాలా ముఖ్యమైన రచనగా పరిగణిస్తారు. మహాత్మా గాంధీ వల్ల ఆమె చాలా ప్రభావితమైంది. స్వాతంత్రొద్యమంలో పాల్గొనాలని ఆమె కోరిక, కాని స్వాతంత్రోద్యమంలో కాకున్నా తరవాత తీరింది. ఆమె కాంగ్రెస్ పార్టీలో పనిచేసి తరవాత కమ్యూనిస్ట్ పార్టీలో చేరి చురుగ్గా పనిచేసింది. ఆమె రచనలన్నీ అప్పటి సమాజంలోని ఆడవారి దైన్య స్తితికి సానుభూతి వ్యక్తం చేస్తూ, వారి పరిస్తితులను బాగు చెయ్యడానికి ప్రయత్నించినవే. ఒక రచయిత్రిగానే కాకుండా తనున్న సమాజాన్ని సంస్కరించడానికి చేసిన ప్రయత్నం కొనియాడదగ్గది. ఎందుకంటే ఆమె పుట్టిన, పెరిగిన వాతావరణం ఆడవారిని నాలుగు గోడలమధ్య అత్యంత కఠినంగా బంధించింది. కనీసం బయటి ప్రపంచాన్ని ఇంట్లోని కిటికీ లోంచి తొంగి చూడటం కూడా శిక్షార్హమైన నేరం. ఆమె పుట్టినపుడున్న సమాజం గురించి ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం. నంబూద్రి కుటుంబాల్లో మొదటి మగపిల్లవాడు మాత్రమే వాళ్ళ కులంలో పెళ్ళి చేసుకోడానికి అర్హుడు. మిగతా మగపిల్లలు బయట కులాల్లో సంబంధాలు చేసుకోవాల్సిందే. అంటే బయట సంబంధాలు చేసుకున్న మగపిల్లల నుంచి వారి భార్యలకుగానీ వారి పిల్లలకు కానీ ఆస్తి సంక్రమించదు. అందువల్ల నంబూద్రి కుటుంబాల్లో ఆడపిల్లలు పెళ్ళి సంబంధాలు దొరకక అవివాహితులుగానే ఉండిపోయేవారట. ఇక వీరి పరిస్తితి ఎంత ఘోరమంటే, వీరు చాలా కఠిన పరదాల వెనక ఉండేవారు. బయటికి వెళ్ళకూడదు. బయటికి తొంగికూడా చూడకూడదు. ఆఖరికి వారిపై సూర్యరశ్మి కూడా సోకకుండా తమ శరీరాల్ని కాపాడుకుంటూ నాల్గు గోడల మధ్య ఇంటి చాకిరీలోనే వారి జీవితమంతా గడపాలి. ఒకవేళ బయటికి వెళ్ళక తప్పని పరిస్తితే వస్తే వళ్ళంతా కప్పుకుని ఆకులతో చేసిన గొడుగు ఒకటి వేస్కొని, పైగా ఆ గొడుగు వారిని తలపైనుంచి నడుము వరకూ కప్పేస్తే, వారు తమ పాదాలను మాత్రమే చూసుకుంటూ నడవాలి. అలా వెళ్ళాలి, అగ్ర కులస్తుల స్త్రీలు . ఇందుకు భిన్నంగా నిమ్న కులాల స్త్రీలు మాత్రం తమ నడుము పైభాగంలో ఎటువంటి బట్టలూ ధరించకూడదు అగ్రకులాల మగవారి ముందు. ఈ నియమం ఉల్లంఘిస్తే కఠిన శిక్షలే. ఎటువంటి అనుమానాస్పద పరిస్తితులలోనైనా పట్టుబడ్డ ఆడవారిని మగ వారు వారి కోర్ట్లో విచారించి, సంఘ బహిష్కరణ, వెలివేత లాంటి శిక్షలు వేస్తే వారు తిండికి కూడా దిక్కూ మొక్కూ లేక అలమటించి చావాల్సిందే. ఇందువల్ల స్త్రీలని బ్లౌసు ధరించే వరకూ సంస్కరించడానికి సంఘ సంస్కర్తలూ, క్రైస్తవ మిషనరీలూ చాలా కష్టపడ్డాయట 19వ శతాబ్దం మొదటి వరకూ. మొదటగా క్షత్రియులైన రాజ వంశీకులు తమ ఆడవారిని బ్లౌసు వేస్కునేందుకు అనుమతించారట. లలితాంబికకు ఎటువంటి ప్రాధమిక విద్యా లేదు. ఆమె తనంతట తను కష్టపడి నేర్చుకున్నది రాయటం చదవటం. ఆరోజుల్లో అదే చాలా గొప్ప విషయం. పైగా ఇది బాహాటంగా చేసే పని కాదు. రహస్యంగా చెయ్యాలి. నంబూద్రీలు ధనిక భూస్వామ్య వర్గానికి చెందినవారే. కానీ ఆడవారిపట్ల ద్వంద్వ నీతి, దౌర్జన్యం, హింస, అణగదొక్కడమే చేసారు. బయటికి వెళ్ళి చదువుకోవడం ఆడవారికి నిషిద్ధం. కేవలం ఆమెకున్న ఆసక్తితో, బయట జరిగే విషయాల్ని ఇంట్లోని మగవారిని అడిగి తెలుసుకునేదట. 1926 లో ఆమెకు వివాహం అవుతుంది. పెళ్ళితో ఉన్న ఆ కాస్తమాత్రం స్వేఛ్చ కూడా పోతుంది. రోజంతా ఇంటి పని, వంటపనితోనే సరిపోతుంది. దీనికి తోడు, ఇంట్లోని ఆడవారిమధ్య సహజంగా ఉండే రాజకీయాలు, ఈర్ష్యాసూయలూ, అభద్రతా భావాలు. నాల్గు గోడల మధ్య, సూర్య రశ్మి కూడా సోకని చిత్తడి పెరళ్ళలోనే జీవితం. వంట పొయ్యి ఊది ఊది పొగలో పనిచేయడం వల్ల కళ్ళు కూడా దెబ్బ తింటాయి. తెల్లవారుఝాము నుంచి రాత్రి దాకా పని అయ్యాక, పిల్లల్ని నిద్రపుచ్చాకా, చిన్న గుడ్డి దీపం వెలుగులోనే ఆమె రాసేదట. కళ్ళు నీరుకారిపోతూ చూడలేకపోతే కళ్ళు మూసుకుని రాసేదట. సహజమైన ప్రోత్సాహకరమైన వాతావరణం లేకుండా, స్వంతంగా రాయటం చదవటం నేర్చుకుని తను చెప్పదల్చుకున్నది ప్రపంచానికి తన కవితల, కధల రూపంలో పెట్టి చెప్పడానికి ఇంత కష్టపడే పట్టుదల ఎంత మందికి ఉంటుంది? లలితాంబిక రచనల్లోని ముఖ్యాంశం కూడా స్త్రీల లైంగిక స్వేఛ్చే. ఈమె తరవాత అదేరకమైన సమాజంలో పుట్టిన కమలాదాస్ స్త్రీ లైంగిక స్వేఛ్చ గురించి అంత నిర్భీతిగా రాసిందంటే ఎంతో ఆశ్చర్యమే కలుగుతుంది. ఇటువంటి సామాజిక నేపధ్యంలో స్త్రీల బ్రతుకుల్ని బాగుచెయ్యడానికి ఆమె నిశితంగా పరిశీలించిన, అనుభవించిన స్త్రీ జీవితాన్ని ప్రపంచం ముందుపెట్టి నిలదీసింది. ఇక ఆమె నవల అగ్నిసాక్షి కొస్తే పెళ్ళయిన తర్వాత స్త్రీలని కట్టిపడేసే కట్టుబాట్లూ, ఆచారాలు, వారి భౌతిక ప్రపంచాన్నే కాక, వారి పుట్టింటి తరపు మానవ సంబంధాల్ని నిర్లక్ష్యం చెయ్యాల్సిన పరిస్తితి కల్పించడాన్నీ, వారి ఆధ్యాత్మిక తాత్విక అలోచనలకి పరిధుల్ని విధించే కట్టుబాట్లనీ వ్యతిరేకించే క్రమంలో ఒక భార్య భర్త మధ్య జరిగే సంఘర్షణని అద్భుతంగా చిత్రించింది. సినిమా తీయబడిన ఈ నవల ఎన్నో ఎవార్డులనీ, పురస్కారాలనీ అందుకుంది. దేవకీ, ఉన్నిలు పరస్పరం ఒకరినొకరు ప్రేమించుకునే భార్యా భర్తలు. కానీ వీరిద్దరి ప్రేమకీ అడుగడుగునా కుటుంబంలోని ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లూ, సంప్రదాయాలు, అడ్డొస్తూ ఉంటాయి. ఉన్ని దేవకి ఆశించే భర్తగా ఉండాలన్నా మిగిలిన కుటుంబ సభ్యులని వ్యతిరేకించలేక, అలా ఉండలేక పోతుంటాడు. అదే సమయంలో, బయట స్వాతంత్ర పోరాటం జోరుగా సాగుతుంటుంది. ఎన్నో రకాల మార్పులు వస్తుంటాయి. కానీ ఉన్ని కుటుంబం మాత్రం ఒక పెద్ద సంప్రదాయాల కోట గోడ కట్టుకుని లోపల ఎటువంటి మార్పులనూ రానివ్వకుండా జాగ్రత్త పడుతుంటుంది. ఈ వాతావరణంలో ఇమడలేక ఎంతో అభ్యుదయ భావాలున్న దేవకి నలిగిపోతుంటుంది. ఆమె తల్లి మంచం మీదుంటే కుటుంబం ఒప్పుకోకపోయినా చూడటానికి పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఈ తప్పుకి క్షమాపణ చెప్పే పక్షంలోనే తిరిగి రావచ్చంటారు ఉన్ని కుటుంబం వాళ్ళు. కానీ దానికి ఇష్టపడక ఆమె పుట్టింట్లోనే ఉండిపోతుంది. భార్య మీద ఎంత ప్రేమ ఉన్నా ఉన్ని ఆమెను తీసుకు రావటానికి వెళ్ళడు. అదే సమయంలో ఆమె పూర్తిగా స్వాతంత్రొద్యమంలోకి దిగిపోతుంది. ఆమె మరిది కూడా ఉద్యమంలో పాల్గొంటాడు కానీ, డబ్బు, పదవీ కాంక్షతో పెడదారులు పడతాడు. ఇవన్నీ దేవకిని ఉన్ని కుటుంబానికి ఇంకా దూరం చేస్తాయి. ఉన్ని సవతి చెల్లెలు దేవకితో చాలా సన్నిహితంగా మెలుగుతూ ఉంటుంది. ఉన్ని ముసలివాడయి దేవాలయాల్లోనే తన సమయం గడుపుతుంటాడు. చివరికి అతను చనిపోయినపుడు, అతని అస్తికలు గంగలో కలపడానికి అతని చెల్లెలు హరిద్వార్ వెళుతుంది. అక్కడ ఆమె దేవకిని ఒక సన్యాసిని రూపంలో చూస్తుంది. మొత్తం కధ అంతా వీరిద్దరి మధ్య సంభాషణల్లో ఫ్లాష్ బ్యాక్లో నడుస్తుంది. ఈనవల ఆరోజుల్లో కేరళలో సంచలనమే సృష్టించిందట. స్త్రీలుగానీ, స్త్రీలు సృష్టించిన స్త్రీ పాత్రలు గానీ స్వేఛ్చని కోరుకుంటే సంచలనమే మరి.   -Sharada Sivapurapu

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? సావిత్రి బాయి ఫూలే మరాఠీ

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? సావిత్రి బాయి ఫూలే మరాఠీ     సావిత్రి బాయి ఫూలే 1831 లో ఖండాలా, సతారా జిల్లా, మహారాష్ట్రాలో పుట్టింది. 9 ఏళ్ళ సావిత్రీ బాయిని 12 ఏళ్ళ జ్యొతీ రావ్ ఫూలే కిచ్చి వివాహం చేస్తారు. చదువులేని సావిత్రికి భర్తే మొదటి గురువయి, మరాఠీ, ఇంగ్లీష్ నేర్పిస్తాడు. 1847 లో ఆమె అధ్యాపకురాలిగా శిక్షణ పొందుతుంది. పూనే లో భిడే వాడా అనే చోట మొట్టమొదటి బాలికల పాఠశాల ఆరంభిస్తారు భార్యాభర్తలిద్దరూ కలిసి. అందులో మొట్టమొదటి మహళా అధ్యాపకురాలిగా సావిత్రి పని చేస్తుంది. ఆమె ఇచ్చే శిక్షణ ఇప్పుడు మనం కోరుకునే విధంగా సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడేదిగా ఉంటుంది. దళిత వర్గాల ఆడపిల్లలూ, అగ్రకులాల ఆడపిల్లలూ మెల్లి మెల్లిగా అందరూ ఆమె దగ్గర చదువు కోవడానికి వస్తారు. కాని దళితులు అందునా స్త్రీలు చదువుకోవడం పాపం, అనర్ధదాయకం అనే మూఢనమ్మకం బాగా ప్రచారం చేసి వారి మనసుల్లో ఒకరకమైన భయాన్ని నింపిన మనువాద బ్రాహ్మణ కుతంత్రాలు ఆమెకు అడుగడుగునా అవరోధాలు సృష్టిస్తూనే వచ్చాయి. ఆమె పాఠశాలకి వెళ్ళేటప్పుడు ఇంకొక చీర పట్టుకుని వెళ్ళేదట. ఎందుకంటే, ఆమె మీద పేడ, చెప్పులు, కోడిగుడ్లు లాంటివి విసిరి, తిట్లూ శాపనార్ధాలూ పెట్టేవారట. పాఠశాలకెళ్ళాకా చీర మార్చుకునేదట. పిల్లలకి కేవలం పాఠాలే కాకుండా, వాళ్ళకి కధలు, అవి కూడా, వారి జీవితాలకి సంబంధించి అంటే ఆడవారి జీవితానికి సంబంధించినవి వారికి ఆసక్తి కలిగేట్లుగా చెప్పేదట. వెళ్ళిపోయేటప్పుడు మిఠాయిలు పంచేదట. ఎవరికైన ఒంట్లో బాగోలేక స్కూలికి రాకపోతే స్వయంగా వారింటికి వెళ్ళి, అనారోగ్యం కారణమైతే, వైద్య సహాయం అందేట్లు చూసేదట. అందుకే ఆమంటే గౌరవం ఆమె పాఠశాలలకి ఆదరణ లభించాయి బడుగు వర్గాల నుండి. 1849 లో ఆమె వయోజనులకు స్కూల్ ప్రారంభించింది. అక్కడా ఆమే మొదటి అధ్యాపకురాలు. ఆతరవాత అంటరానివారికోసం ఇంకో స్కూలు అలాగే అనేక ఇతర చోట్ల కూడా విద్యాలయాలు స్థాపించి చదువు నేర్పుతుంది. జ్యోతీ రావ్ ఫూలే స్థాపించిన సత్య శోధక్ సమాజ్ లో ఆమెదే చురుకైన పాత్ర. వీరిద్దరూ మహారాస్ట్రా నుంచి తరవాత తారాబాయి షిండే, పండిత రమాబాయి సరస్వతి, ఆనందీ బాయి జోషీ లాంటి ఎందరో సంస్కర్తలకి స్పూర్తి, ప్రేరణ అయ్యారు. అప్పట్లో బాల్యవివాహాలవల్ల విధవలైన బాలికలు ఎక్కువగా ఉండేవారు. సహజంగానే వీరు, వారి బంధువర్గంలోని మగవారికి లైంగికంగా బలైపోయేవారు. గర్భనిరోధక పద్ధతులు లేకపోవటం వల్ల గర్భం తీయించుకునే అశాస్త్రీయ పద్ధతులవల్ల ప్రాణాలు పోగొట్టుకునే వారు, లేదా పుట్టిన బిడ్డల్ని చంపేసే వారు. ఇలాంటి వారి కోసం ఆమె ఒక శిశుహత్యా నిరోధ గృహమొకటి స్థాపించి అక్కడ ప్రసవించిన పిల్లల్ని అక్కడే వదిలి వెళ్ళే ఏర్పాటు చేసి వారి సమ్రక్షణ భారాన్ని తను తీసుకుంది. అటువంటి పిల్లల్లో ఒకరైన, ఒక బ్రాహ్మణ విధవకి పుట్టిన ఒక బాబుని తను పెంచుకుంది. అతనే తర్వాత వైద్యుడైన యశ్వంత్రావ్. ఇతనికి కులాంతర వివాహం చేస్తుంది. 1897 లో వచ్చిన భయంకరమైన ప్లేగు వ్యాధి బాధితులకి తన కొడుకు ఆసుపత్రి లోనే వైద్యం చేయిస్తుంది. ఒక వ్యాధిగ్రస్తుని సేవలోనే తను కూడా ప్లేగు వ్యాధి సోకి 1897 లో మరణిస్తుంది. మహారాష్ట్రలో స్త్రీలకు ముఖ్యంగా అట్టడుగు వర్గాల స్త్రీలకు, అంటరానివారి జీవితాల్లో విద్యా జ్యోతి వెలిగించిన మొదటి మహిళా అధ్యాపకురాలు ఆమె. కానీ ఆమె బ్రతికి ఉన్నన్నాళ్ళు ఆమెకు ఎటువంటి గుర్తింపు, గౌరవాలూ దక్కలేదు. తరవాత కూడా ఆమెకు ఆమెకు రావల్సినంత గుర్తింపు రాలేదు. లింగ వివక్షకి, కుల వివక్షకీ వ్యతిరేంగా ఆమె ఎన్నో పోరాటాలు చేసింది. మంచినీటి కోసం అగ్రవర్ణాల బావులవద్ద వారి అనుమతి కోసం పడిగాపులు పడుతూ, నానా అగచాట్లూ పడే దళిత స్త్రీలను ఆమె తన ఇంటి బావి నుంచి, ఎప్పుడైనా, ఎంతయినా నీటిని తోడుకోమని ఆహ్వానిస్తుంది. విధవలైన బాలికల, స్త్రీల తలలు గొరగకూడదంటూ మంగలి వారిని ఒప్పించి, పురుషవాద చాందసవాదుల ఆగ్రహాన్ని ఎదుర్కొంటుంది. అలాగే వరకట్న సమస్య పరిష్కరించడానికి సామూహిక వివాహాల ఏర్పాటు చేయడమూ సంఘ వ్యతిరేకతని రేపుతుంది. సంఘ సేవలో ఇంత నిర్విరామంగా కృషి చేస్తున్నా ఆమె కవితలు కూడా రాసింది. అందులో కూడా ఆధునిక కవిత్వం మరాఠీలో రాసిన మొదటి మహిళ ఆమే. ఆమె కవితలు మొదట తన విద్యార్ధుల కోసం రాసినా, తరవాత అందులోఅ అనేక సామాజిక అంశాలు వస్తువులయ్యాయి. ఆమె రాసిన రెండు ఇంగ్లీష్ అనువాదాలకు, నేను చేసిన తెలుగు అనువాదం మీకోసం కింద ఇస్తున్నాను. Rise, to learn and act Weak and oppressed! Rise my brother Come out of living in slavery. Manu-follower Peshwas are dead and gone Manu’s the one who barred us from education. Givers of knowledge– the English have come Learn, you’ve had no chance in a millennium. We’ll teach our children and ourselves to learn Receive knowledge, become wise to discern. An upsurge of jealousy in my soul Crying out for knowledge to be whole. This festering wound, mark of caste I’ll blot out from my life at last. In Baliraja’s kingdom, let’s beware Our glorious mast, unfurl and flare. Let all say, “Misery go and kingdom come!” Awake, arise and educate Smash traditions-liberate! We’ll come together and learn Policy-righteousness-religion. Slumber not but blow the trumpet O Brahman, dare not you upset. Give a war cry, rise fast Rise, to learn and act. మేల్కొని, నేర్చుకొని, వ్యవహరించు. పీడితులూ, బలహీనులూ అయిన నా తమ్ములారా లేవండి బానిస బ్రతుకులనుండి బయటపడండి. మనువు అనుయాయిలైన పీష్వాలు మరణించారు, ఇపుడు లేరు విద్యనుంచి మనను వెలివేసినవాడు మనువు. జ్ఞానం పంచే ఆంగ్లేయులు వచ్చారు. నేర్చుకో, యుగాలుగా లేని అవకాశం. మనం నేర్చుకుందాం, మన పిల్లలకూ నేర్పుదాం పొందిన జ్ఞానంతో శోధిద్దాం. నా ఆత్మలో ఉప్పొంగిన అసూయ ఒకటి సంపూర్ణ జ్ఞానం కోసం ఆక్రోశిస్తున్నది ఈ సలుపుతున్న గాయాన్ని, కులం మచ్చనీ చివరిగా నా జీవితం నుంచి చెరిపేస్తాను. ఈ బలికోరే రాజ్యంలో మనం జాగరూకులమై ఉందాం మన ఘనమైన స్థంబంపై జెండా వికసించనీ, ప్రకాశించనీ మనమందరం మన దీనావస్థ పోయి మన రాజ్యం రానీ అందాం! లేవండి లేవండి చదువుకోండి సంప్రదాయాలను బద్దలు కొట్టి స్వేఛ్చ పొందండి! మనమందరం ఒకటయి నేర్చుకుందాం న్యాయబద్ధమైన విధానాలూ, మతమూ. మత్తులో తూగకు, ఢంకా బజాయించు ఓ బ్రాహ్మణుడా, నువ్వడ్డుకుంటే చూడు... త్వరగా లేచి యుద్ధ భేరీ మ్రోగించు మేల్కొని, నేర్చుకొని, వ్యవహరించు. So says Manu… “Dumb are they who plough the land, Dumb are the ones who cultivate it”, So says Manu. Through religious diktats, The Manusmriti to the Brahmin tells, “Do not your energy, on agriculture, waste!” “Those born as Shudras, All these Shudras!, Are paying in this life, For the sins of their past lives” Thus they create A society based on inequality, This being the inhuman ploy, Of these cunning beings. మనువిలా అంటాడు "నేలను దున్నే వారు మూగవారు పొలం పండించే వారు మూగవారు" అని మనువంటాడు. మత గ్రంధ నిబంధనల ద్వారా మనుస్మృతి బ్రాహ్మలకి చెప్తుంది, "వ్యవసాయం మీద నీ శక్తి వృధా చేయకు”, శూద్రులుగా పుట్టినవారున్నారు! "ఈ శూద్రులంతా ఈ జన్మలో వారి గతజన్మ పాపాలకు పరిహారం చెల్లిస్తున్నారు". అంటూ ఒక అసమానతల సమాజాన్ని సృష్టిస్తున్నారు. ఈ కుత్సిత మనుషుల అమానుష కుతంత్రం ఇది. Xxxx కుల వివక్ష చూపడానికైనా, భరించడానికైనా స్త్రీలు అతీతులు కారు. ఇది గమనించే ఆమె ఒక మహిళా మండలి ఏర్పాటు చేస్తుంది. స్త్రీలందరూ అక్కడ కూడి మాట్లాడుకోవటానికి. కానీ కేవలం మాటల వల్ల ఏమీ జరగదని, స్త్రీల దుస్తితినీ పురుషాధిక్యతనూ ఎదుర్కోవాలంటే వీరిని సంఘటిత పరిచి కలిసికట్టుగా పోరాటం చెయ్యడానికి కావల్సిన గ్రహింపు వారికి కలగాలని తెలుసుకుంటుంది. ఈ దిశగా ఆమె నాయకత్వం వహించి ఎన్నో సామాజిక కార్యక్రమాలను పితృస్వామ్యాన్నీ, బ్రాహ్మణ ఆధిపత్యాన్నీ వివరిస్తూ, నిరసిస్తూ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది. నిజానికి ఒక రచయిత్రిగా కన్నా ఒక సంఘ సంస్కర్తగా, స్త్రీ విద్య కోసం, స్త్రీ స్వేఛ్చ కోసం, పురుషుడి బానిసత్వం నుంచి స్త్రీని రక్షించేందుకు ఆమె నడుంకట్టుకున్న అభ్యుదయవాదిగా ఆమెకు ఎక్కువ గుర్తింపు. ఏమైనా, ఈ వంకనైనా ఈమె పరిచయం అందరూ మరొక్కమారు చేసుకుంటే, అది స్త్రీలకు ఆమె చేసిన సేవలకి ఒక చక్కని నివాళి అనిపించింది. ఆమె దగ్గర విద్యనభ్యసించిన ఎందరో మహిళల వల్ల ఈరోజున మహిళల పరిస్తితి మెరుగ్గా ఉందనటానికి ఎటువంటి సందేహం అక్కరలేదు. ఒక చక్కని అవగాహనతో, నిబద్ధతతో, కార్యశీలతతో, తన ఆశయాల సాధనకే తన జీవితాన్ని అర్పించిన త్యాగ మూర్తి ఆమె. ఈ పరిచయం చెయ్యడం నాకెంతొ గర్వంగా కూడా ఉంది. ఇంకొక రచయిత్రి పరిచయంతో మళ్ళీ కలుసుకుందాము. -Sharada Sivapurapu

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? సుభద్ర కుమారి చౌహాన్

  మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? సుభద్ర కుమారి చౌహాన్ సుభద్ర కుమారి అలహాబాద్ లో పుట్టింది. చాలా చిన్నప్పటినుంచే స్వాతంత్రోద్యమంలో పాల్గొంది. ఆమె కొద్దిమంది స్త్రీ సత్యాగ్రాహుల్లో ఒకరు. రెండు సార్లు 1923 లో ఒకసారి, 1942 లో ఒకసారి బ్రిటిష్ గవర్నమెంట్ జైల్లో పెట్టింది. ఆమె రచనలన్నీ స్వతంత్రోద్యమానికి స్పూర్తిదాయకాలే. అన్నీ కవితలే ముఖ్యంగా. కొన్ని చిన్న కధలూ రాసింది. 44 యేళ్ళ చిన్ని జీవితంలో తనదంటూ ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకుంది హిందీ సాహిత్యంలో. ఈమె రాసిన ఝాన్సి కీ రాని చాలా పాపులర్ అయ్యింది. ఆమె రచనలన్నీ ముఖ్యంగా వీర రస ప్రధానమైనవే. ఇదే వీర రస ప్రధానంగా రసినవి "వీరోన్ కా కైసా హొ బసంత్, రాఖీ కి చునౌతి, విదా" ముఖ్యంగా స్వతంత్ర పోరాటం గురించి రాసినవే. "సేనాని క స్వాగత్" అనే పోయెం యువతని పోరాట మార్గంలోకి ఆకర్షించేందుకు ఎంతో ప్రేరణ కలిగించిందని చెప్తారు. ఆమె రాసిన కధలన్నీ మధ్య తరగతి జీవితం గురించి. హిందీ సాహిత్యంలో ఆమె కున్న పేరు, ఆమె పేరుతో పోస్టల్ స్టాంప్ విడుదల చేసారంటే అర్ధమవుతుంది. అంతే కాదు ఆమె రచనలు స్వతంత్ర పోరాటానికి ఎంత స్పూర్తి నిచ్చాయో మన ఇండియన్ కోస్ట్ గార్ద్ షిప్, ఆమె పేరుతో "సుభద్రా కుమారి చౌహాన్" అని పిలవబడుతుందంటే అర్ధమవుతుంది. జబల్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ఆమె విగ్రహాన్ని కూడా పెట్టారు. కవులని విప్లవాత్మక అలోచనలు వ్యక్తపరిచినందుకు, హేతువాద వ్యాఖ్యలు చేసినందుకు కాల్చి చంపేస్తున్న నేపధ్యంలో ఇది చదవటం ఆనందదాయకంగా ఉంది. ఆమె 7 కవితా సంకలనాలు రాసింది. అన్నిటిలోకీ పేరు తెచ్చుకున్న "ఝాన్సీ కి రాని" హిందీ మరియు ఇంగ్లీష్ అనువాదంతో సహా కింద ఇచ్చాను. తెలిసినదే అయినా చివరికి ఝాన్సీ లక్ష్మీ బాయి చనిపోయిన విధానం కళ్ళనీళ్ళు పెట్టిస్తుంది. “ Jhansi Ki Rani (The Queen of Jhansi) inhasan hil uthey raajvanshon ney bhrukuti tani thi, budhey Bharat mein aayee phir se nayi jawani thi, gumee huee azadi ki keemat sabney pehchani thi, door phirangi ko karney ki sab ney man mein thani thi. Chamak uthi san sattavan mein, yeh talwar purani thi, Bundeley Harbolon key munh hamney suni kahani thi, Khoob ladi mardani woh to Jhansi wali Rani thi. Kanpur key Nana ki muhn boli bahen chhaveeli thi, Lakshmibai naam, pita ki woh santaan akeli thi, Nana key sangh padhti thi woh Nana key sangh kheli thi barchhi, dhal, kripan, katari, uski yehi saheli thi. Veer Shivaji ki gaathaayen uski yaad zabani thi, Bundeley Harbolon key munh hamney suni kahani thi, Khoob ladi mardani woh to Jhansi wali Rani thi. Lakshmi thi ya Durga thi woh swayan veerta ki avatar, dekh Marathey pulkit hotey uski talwaron key vaar, nakli yudh-vyuh ki rachna aur khelna khub shikar, sainya gherna, durg todna yeh they uskey preeya khilwad. Maharashtra-kul-devi uski bhi aaradhya Bhavani thi, Bundeley Harbolon key munh hamney suni kahani thi, Khoob ladi mardani woh to Jhansi wali Rani thi. Huee veerta ki vaibhav key saath sagai Jhansi mein, byah hua ban aayee Rani Lakshmi bai Jhansi mein, rajmahal mein baji badhai khushiyan chhaee Jhansi mein, sughat Bundelon ki viroodaavalee-si woh aayee Jhansi mein. Chitra ney Arjun ko paya, Shiv sey mili Bhavani thi, Bundeley Harbolon key munh hamney suni kahani thi, Khoob ladi mardani woh to Jhansi wali Rani thi. Udit hua saubhagya, mudit mahalon mein ujiyali chhayee, kintu kaalgati chupkey-chupkey kali ghata gher laayee, teer chalaaney vaaley kar mein usey choodiyan kab bhaayee, Rani vidhva huee hai, vidhi ko bhi nahin dayaa aayee. Nisantan marey Rajaji, Rani shok-samani thi, Bundeley Harbolon key munh hamney suni kahani thi, Khoob ladi mardani woh to Jhansi wali Rani thi. Bujha deep Jhansi ka tab Dalhousie man mein harshaaya, Raajya hadap karney ka yeh usney achhaa avsar paaya, fauran fauj bhej durg par apna jhandaa phehraya, lawaris ka waris bankar British Raj Jhansi aaya. Ashrupurna Rani ney dekha Jhansi huee birani thi, Bundeley Harbolon key munh hamney suni kahani thi, Khoob ladi mardani woh to Jhansi wali Rani thi. Anunay vinay nahin sunti hai, vikat shaasakonki maaya, vyapari ban daya chhahta tha jab wah Bharat aaya, Dalhousie ney pair pasaarey, ab to palat gayee kaaya Rajaon Nawwabon ko bhi usney pairon thukraaya. Rani daasi bani, bani yeh daasi ab Maharani thi, Bundeley Harbolon key munh hamney suni kahani thi, Khoob ladi mardani woh to Jhansi wali Rani thi. Chheenee rajdhani Dilli ki, Lucknow chheena baaton-baat, Qaid Peshwa tha Bithur mein, hua Nagpur ka bhi ghaat, Udaipur, Tanjore, Satara, Karnatak ki kaun bisaat? jabki Sindh, Punjab Brahm par abhi hua that vajra-nipaat. Bengaaley, Madras aadi ki bhi to vahi kahani thi, Bundeley Harbolon key munh hamney suni kahani thi, Khoob ladi mardani woh to Jhansi wali Rani thi. Rani royee rinvason mein, Begum gum se thi bezaar, unkey gehney kapdey biktey they Calcutta key bazzar, sarey aam nilaam chhaptey they angrezon key akhbar, "Nagpur key zewar le lo, Lucknow key lo naulakh haar". Yon pardey ki izzat pardesi key hath bikani thi Bundeley Harbolon key munh hamney suni kahani thi, Khoob ladi mardani woh to Jhansi wali Rani thi. Kutiya mein bhi visham vedna, mahalon mein aahat apmaan, veer sainikon key man mein tha apney purkhon ka abhmaan, Nana Ghunghupant Peshwa joota raha tha sab saamaan, bahen chhaveeli ney Ran-Chandi ka kar diya prakat aahvaan. Hua yagna prarambh unhey to soyee jyoti jagani thi, Bundeley Harbolon key munh hamney suni kahani thi, Khoob ladi mardani woh to Jhansi wali Rani thi. Mahalon ney di aag, jhonpdi ney jwala sulgayee thi, yeh swatantrata ki chingari antratam sey aayee thi, Jhansi cheti, Dilli cheti, Lucknow laptey chhayi thi, Merat, Kanpur, Patna ney bhari dhoom machayi thi, Jabalpur, Kolhapur, mein bhi kuchh hulchul uksani thi, Bundeley Harbolon key munh hamney suni kahani thi, Khoob ladi mardani woh to Jhansi wali Rani thi. Is Swatantrata Mahayagna mein kayee veervar aaye kaam, Nana Ghunghupant, Tantya, chatur Azeemullah sarnam, Ahmedshah Moulvi, Thakur Kunwar Singh, Sainik Abhiram, Bharat key itihaas gagan mein amar rahengey jinkey naam. Lekin aaj jurm kehlati unki jo Qurbani thi, Bundeley Harbolon key munh hamney suni kahani thi, Khoob ladi mardani woh to Jhansi wali Rani thi. Inki gaatha chhod, chaley hum Jhansi key maidanon mein, Jahan khadi hai Lakshmibai mard bani mardanon mein, Lieutenant Walker aa pohoncha, aagey bada jawanon mein, Rani ney talwaar kheench li, hua dhandh asmanon mein. Zakhmi hokar Walker bhaga, usey ajab hairani thi, Bundeley Harbolon key munh hamney suni kahani thi, Khoob ladi mardani woh to Jhansi wali Rani thi. Rani badhi Kalpi aayee, kar sau meel nirantar paar, ghoda thak kar gira bhoomi par, gaya swarg tatkaal sidhaar, Yamuna tat par angrezon ney phir khayee Rani sey haar, vijayee Rani aagey chal di, kiya Gwalior par adhikar. Angrezon key mitra Scindia ney chhodi rajdhani thee, Bundeley Harbolon key munh hamney suni kahani thi, Khoob ladi mardani woh to Jhansi wali Rani thi. Vijay mili, par Angrezon ki phir sena ghir aayee thi, Abkey General Smith sammukh tha, usney munhki khayee thi, Kaana aur Mandra sakhiyan Rani key sangh aayee thi, Yudh kshetra mein un dono ney bhari maar machayi thi. par peechey Hughrose aa gaya, Hai! gheeri ab Rani thi, Bundeley Harbolon key munh hamney suni kahani thi, Khoob ladi mardani woh to Jhansi wali Rani thi. To bhi Rani maar kaat kar chalti bani sainya key paar, kintu saamney naala aaya, tha woh sankat visham apaar, ghoda adaa, naya ghoda tha, itney mein aa gaye avaar, Rani ek, shatru bahuterey, honey lagey vaar-par-var. Ghayal hokar giri Sinhni, isey veer gati paani thi, Bundeley Harbolon key munh hamney suni kahani thi, Khoob ladi mardani woh to Jhansi wali Rani thi. Rani gayee sidhaar chita ab uski divya sawaari thi, mila tej se tej, tej ki woh sachchi adhikaari thi, abhi umr kul teis ki thi, manuj nahin avtaari thi, humko jeevit karney aayee ban Swatantrata-naree thi, dikha gayee path, sikha gayee humko jo seekh sikhani thi, Bundeley Harbolon key munh hamney suni kahani thi, Khoob ladi mardani woh to Jhansi wali Rani thi. Jao Rani yaad Rakhengey yeh krutagna Bharatwasi, yeh tera balidaan jagavega Swatantrata avinasi, hovey chup itihaas, lagey sachchai ko chahey phansi, ho madmaati vijay, mitaa dey golon sey chahey Jhansi. Tera Smarak tu hi hogi, tu khud amit nishaani thi, Bundeley Harbolon key munh hamney suni kahani thi, Khoob ladi mardani woh to Jhansi wali Rani thi. “ Jhansi Ki Rani (The Queen of Jhansi) 1 The throne got shook, and the tension erupted among the Raajvanshs, the royal heirs of the throne, In aged India, a new wave of youth was spreading, All the inhabitants of India had realized the worth of their lost freedom, All of them had decided to get rid of the British rule, The old swords started glittering again like new ones in the form of the freedom movement in 1857. From the mouths of the Bandelas and the Harbolas (Religious singers of Bandelkhand), we heard the tale of the courage of the Queen of Jhansi relating how gallantly she fought like a man against the British intruders: such was the Queen of Jhansi. 2 She was as dear to the Nana (Nana Ghunghupant ) of Kanpur as her real sister, Her name was Laxmibai and she was the only daughter of her parents, She had been with Nana from her early childhood, since she was a school student. Spear, knife, sword, axe (all different types of weapons used in her time) were her companions all the time. She had learned by heart the valorous stories of shivaji (a renowned king of Maharashtra). From the mouths of the Bandelas and the Harbolas (Religious singers of Bandelkhand), we heard the tale of the courage of the Queen of Jhansi relating how gallantly she fought like a man against the British intruders: such was the Queen of Jhansi. 3 No one could guess whether she was Laxmi or Durga devi ( Durga Goddess , also called Bhavani ) or reincarnation of Devi durga, Her expertise in using a sword made the people of Marathward (Pulkit) wonder, They learned the war strategy of how to attack the prey, To ambush her prey and to break the vanity were among her favorite supports, Maharashtra-kul-Devi (The goddess of the Maharashtra ) was as dear to her as Bhavani (Durga Devi ) From the mouths of the Bandelas and the Harbolas (Religious singers of Bandelkhand), we heard the tale of the courage of the Queen of Jhansi relating how gallantly she fought like a man against the British intruders: such was the Queen of Jhansi. 4 With valor in a grand festival, she got married in Jhansi, After her marriage, Laxmibai came to Jhansi as a queen with shower of joy, A grand celebration took place in the royal palace of Jhansi. That was a good luck for Bandelos that she came to Jhansi, That was as Chitra met with Arjun or Shiv had got his beloved Bhavani (Durga). From the mouths of the Bandelas and the Harbolas (Religious singers of Bandelkhand), we heard the tale of the courage of the Queen of Jhansi relating how gallantly she fought like a man against the British intruders: such was the Queen of Jhansi. 5 She came as a good luck to the royal palace of Jhansi and for a log time the palace remained decorated with lighting candles in celebration. But as days passed the dark clouds of misfortune covered the royal palace. She stopped wearing bangles for that was the time for a battle. The queen got widowed and her fate was very unkind to her. The royal king had no children when he died and the queen was grief stricken. From the mouths of the Bandelas and the Harbolas (Religious singers of Bandelkhand), we heard the tale of the courage of the Queen of Jhansi relating how gallantly she fought like a man against the British intruders: such was the Queen of Jhansi. 6 So the candle of the royal castle blew off and Dalhousie (a British governor) became very happy in his heart about the situation (that the royal palace had no king or someone strong to defend the throne). He thought that the time was right to usurp the kingdom. He sent his soldiers to Citadel and raised the British flag on the royal palace. The British rule came to Jhansi as the guardian of an orphan. The Rani saw everything with tears in her eyes that how Jhansi got deserted. From the mouths of the Bandelas and the Harbolas (Religious singers of Bandelkhand), we heard the tale of the courage of the Queen of Jhansi relating how gallantly she fought like a man against the British intruders: such was the Queen of Jhansi. 7 Strong (and Cruel) kings do not care about the cajoling. They (The British Rulers) came to India in the disguise of poor merchants. The British governor (Dalhousi) then extended his influence in India and so the fate of India turned over. He insulted even the feudal and heads of state of India. The queen took the gesture of a maidservant; the maid was the real queen. From the mouths of the Bandelas and the Harbolas (Religious singers of Bandelkhand), we heard the tale of the courage of the Queen of Jhansi relating how gallantly she fought like a man against the British intruders: such was the Queen of Jhansi. 8 First of all Indian rulers lost the capital of India, Delhi and subsequently they lost the control of Lucknow. Peshwa was imprisoned in Bithur and then the Nagpur tragedy occurred. After the fall of Nagpur, it was not a big task for the intruders to take the control of Udaipur, Tanjore satara and Karnatak. They already had the control of Sindh, Punjab and Assam. The tale of fall of Bengal, Madras and many other states was also the same. From the mouths of the Bandelas and the Harbolas (Religious singers of Bandelkhand), we heard the tale of the courage of the Queen of Jhansi relating how gallantly she fought like a man against the British intruders: such was the Queen of Jhansi. 9 Rani(the queen) wept in her quarter for all that disaster. She was rather lost and was sick of the situation. Her ornaments and royal clothes were being sold in the markets of Calcutta. The advertisements for the sale of the royal stuff were being published in the daily newspapers of the British Government. “Buy the ornaments of Nagpur, Buy the Naulakha locket of Lucknow” had been the highlights of such advertisements. In this manner the honor of the royal ladies had to be sold to foreigners. From the mouths of the Bandelas and the Harbolas (Religious singers of Bandelkhand), we heard the tale of the courage of the Queen of Jhansi relating how gallantly she fought like a man against the British intruders: such was the Queen of Jhansi. 10 The cottages of poor were full of grief and the royal houses were also full of insult (the royal ladies were maltreated and insulted by the British intruders whereas the poor folk were also in the clutches of the atrocities by the British rulers). Brave soldiers of India had in their mind the prestige of their ancestors. The name of Ghunghupant and Nana, the titles of the great warriors and their weapons, they have lost all such treasure as well. The beloved sisters of Nana (queen of Jhansi- Rani) invited Nana to visit Ran-Chandi. The ritual of the holy war of freedom started because they had to awake the divine spirit of the people of India, which had been sleeping so far. From the mouths of the Bandelas and the Harbolas (Religious singers of Bandelkhand), we heard the tale of the courage of the Queen of Jhansi relating how gallantly she fought like a man against the British intruders: such was the Queen of Jhansi. 11 The fire of revolt started from royal palace, which became hot like burning sun when reached to the houses of the poor or common folk. This spark of freedom started from the inner soul of the people. It captured Jhansi first then spread in Delhi and also engulfed Lucknow. The freedom struggle was also in full swing in Merat, Kanpur and Patna. The people of Jabalpur, Kolhapur were also being inspired from others. From the mouths of the Bandelas and the Harbolas (Religious singers of Bandelkhand), we heard the tale of the courage of the Queen of Jhansi relating how gallantly she fought like a man against the British intruders: such was the Queen of Jhansi. 12 In that great freedom struggle, many brave brothers lost their lives. Among them were Nana GhunGhupant, Tantya, great Azeemullah, And many others like Ahmedshah Moulvi, Thakur Kunwar singh, Sainik Abhiram. Their names will always be shining in the heavens of the ancient history of India, but they were considered rebels at that time and their great sacrifice was considered a crime against the state of British India. From the mouths of the Bandelas and the Harbolas (Religious singers of Bandelkhand), we heard the tale of the courage of the Queen of Jhansi relating how gallantly she fought like a man against the British intruders: such was the Queen of Jhansi. 13 Well, leave the tale of the bravery of those great men and let us go to the battlefields of Jhansi, Where Laxmibai is standing boldly like a man among the other brave men. Lieutenant Walker reached there and proceeded further in the people’s army of the brave men, Rani drew her sword, the beating of the drums started in the heavens, Walker ran away from the battlefield as Rani defectively wounded him. He was astonished on the agility of Rani. From the mouths of the Bandelas and the Harbolas (Religious singers of Bandelkhand), we heard the tale of the courage of the Queen of Jhansi relating how gallantly she fought like a man against the British intruders: such was the Queen of Jhansi. 14 Rani preceded further and reached Kalpi after taking a hard journey of hundreds of miles. The horse got exhausted and fell to the ground and the rider (Walker) also fell down immediately . In the field of Yamuna again Rani was defeating the British. The victorious Rani proceeded further and took the control of Gawalior. The British thus left the Vsindia (capital of Gawalior) and their rule ended in Gawalior. From the mouths of the Bandelas and the Harbolas (Religious singers of Bandelkhand), we heard the tale of the courage of the Queen of Jhansi relating how gallantly she fought like a man against the British intruders: such was the Queen of Jhansi. 15 Although the freedom fighters had won, the British army was again getting organized. This time, general smith was in command but he was also being defeated by the brave freedom fighters – he had to be defeated. Kaana and Mandra (the associates of Rani) were also accompanying her in the war zone. In the battlefield they both were fighting furiously. But a British commander, Hughrose came from the backside to help his soldiers – Alas! The British soldiers surrounded the Rani from all sides. From the mouths of the Bandelas and the Harbolas (Religious singers of Bandelkhand), we heard the tale of the courage of the Queen of Jhansi relating how gallantly she fought like a man against the British intruders: such was the Queen of Jhansi. 16 Though Rani was deeply wounded, still she was fighting and had managed to get through the British army, But she got stuck because a sewerage canal was there on the other end and she was in deep trouble, Her horse got stuck there - the horse was untrained, in the mean time, the British soldiers, riding on their horses reached there. Rani was all alone while enemies were numerous who were attacking her with their sword from all sides, Rani, who was fighting like a lioness, succumbed to the wounds and fell down. She had to achieve a glorious death in war ( Martyrdom ). From the mouths of the Bandelas and the Harbolas (Religious singers of Bandelkhand), we heard the tale of the courage of the Queen of Jhansi relating how gallantly she fought like a man against the British intruders: such was the Queen of Jhansi. 17 Rani was martyred in the battlefield.Her departed soul was then riding a divine vehicle, moving towards heavens the Light of her divine soul met with the divine light in the heavens, she was the real heir of divinity, She was only thirty years of age. She was not a human; rather she was divine spirit (a holy being), Who did come, in the gesture of a female freedom fighter, to give us a respectable life of light and freedom , She showed us the path of freedom, and taught us the lesson of courage, she taught us what we might have learned. From the mouths of the Bandelas and the Harbolas (Religious singers of Bandelkhand), we heard the tale of the courage of the Queen of Jhansi relating how gallantly she fought like a man against the British intruders: such was the Queen of Jhansi. 18 The people of India will remember this debt of yours (O! Rani Laxmaibai), may you be blessed, dear Rani, Your this life sacrifice will awake an indestructible soul of freedom in the people, History may be made silent or if truth is hanged or killed, or if the drinkers become victorious or if they destroy jhansi with cannonballs, You, by yourself be the memorial of Rani (queen of Jhansi) because you had been an eternal token of courage. From the mouths of the Bandelas and the Harbolas (Religious singers of Bandelkhand), we heard the tale of the courage of the Queen of Jhansi relating how gallantly she fought like a man against the British intruders: such was the Queen of Jhansi.        -Sharada Sivapurapu

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? విభావరి శిరూర్కర్ (మాలతీ బేడేకర్ )

  మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? విభావరి శిరూర్కర్ (మాలతీ బేడేకర్ )   మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామంలో పుట్టంది ఈమె. తండ్రి ఉపాధ్యాయుడు. తన కూతుళ్ళందరూ చదువుకోవాలని ఆశించిన వాడు. ఆమె డిగ్రీ పూర్తి చేసి ప్రిన్సిపాల్గా ఒక గర్ల్స్ స్కూల్లో పనిచేని తరవాత 1937 లో ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో (Department of Education and Welfare) చేరుతుంది. ఇక్కడ అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ చేత నేరస్తులుగా ముద్రవేయబడి, ఆ కారణంగా బంధింపబడి ఒక ప్రదేశంలో శిక్ష అనుభవిస్తున్న గిరిజనులుండే చోట ఈమె పని చేస్తుంది. వీరి జీవితాల మీద రాసిన నవల ఒకటి వివాదాస్పదమవుతుంది. ఇదే కాదు ఆమె రచనలన్నీ వివాదాస్పదమే. ఎందుకంటే అప్పటివరకూ ఎవరూ రాయని అంశాలన్నిటి మీద, సెక్స్, విధవా వివాహం, వారి హక్కులు, స్త్రీ పురుష సమానత్వం ఇలా అనేక ఇతర అంశాలపై ఆమె రచనలు సాగుతాయి. ఇవన్నీ ఎంత వివాదాస్పదమంటే ఛాందసవాదులు ఆమెని చంపేస్తామని బెదిరించే వరకూ. విభావరి ఆమె కలం పేరు. ఈపేరుతో ఎవరు రాస్తున్నారో ఎవరికీ తెలియదు. కానీ గిరిజనుల జీవితాలపై నవల రాసాకా అది రాసింది తనేనని ధైర్యంగా, పబ్లిక్గా చెపుతుంది. ఆమె అసలు పేరు మాలతి. ఆమె పేరున్న నవాలా రచయిత, సినిమా నిర్మాత అయిన విశ్రాం బేడేకర్ ని వివాహం చేసుకుంటుంది. మహారాష్ట్ర సాహిత్యంలో ఒక శక్తిమంతమైన స్త్రీ గళం వినిపించిన రచయిత్రి ఆమె. ఆమెకు 1964 లో మహారాష్ట్ర స్టేట్ ఎవార్డ్ వచ్చింది. మాలతి మొదటీ పుస్తకం కల్యంచి నిష్వస్ (The Sighs of Buds ) 1933 లో అచ్చయ్యింది. ఇది ఒక కధల సంకలనం. అన్నీ కూడా యువతుల గురించి, స్వేఛ్చ కోరుకునే యువతుల గురించి. స్వేఛ్చ తమ తండ్రుల ఇళ్ళనుంచి, కట్నం సంకెళ్ళనుంచి, సమాజం ఆడవారిపై విధించే బంధనాల నుంచి. ఈ కధలు ఆడవారిని ఆర్ధికంగా, శారీరకంగా దొపిడీ చేసే మగవారికి, పురుషాధిక్యతకూ వ్యతిరేకంగా గొంతెత్తి అంతవరకూ ఎవరూ రాయని విధంగా రచింపబడినవి. ఇవి అప్పటి సమాజాన్ని ఎంత షాక్కి గురి చేసాయంటే, రాసిందెవరో తెలియలేదు కానీ, తెలిస్తే చంపేసే వారే. ఆమె తన అసలు వివరాలన్ని తరవాత 1946 లో గాని బయటపెట్టలేదు. ఆమె రాసిన శబరి అనే నవల సగం ఆత్మ కధేనంటారు. పెళ్ళి అనే బంధంలో చిక్కుకున్న ఒక విద్యావంతురాలైన స్త్రీ, పెద్దలు చేసిన పెళ్ళి లోని ప్రేమా, భంగపాటు, నైరాశ్యం గురించి, జెనరేషన్ గేప్ గురించి, బాధ్యతలు బరువుల గురించి ఎక్కువ సెంటిమెంట్, డ్రామా లేకుండా రాసిన విధానం ఆమె ఉన్న కాలానికి చాలా ముందున్నది. అలాగే ఆమె వివాహం బయట స్త్రీ పురుష సహజీవనాన్ని సమర్ధిస్తూనూ, వివాహం చేసుకోకుండా తండ్రి ఇంటనుండకుండా స్వంతంగా, స్వతంత్రంగా జీవించే హక్కులు ఆడవారికి కావాలని కాంక్షిస్తూ రాసిన రచనలూ కూడా అంతే వివాదాస్పదమయ్యాయి. 1930-40 ల్లో ఆమె ఇంత విప్లవాత్మకమైన భావాలు వెలిబుచ్చితే అప్పటి సమాజం ఇచ్చిన స్పందన అర్ధం చేసుకోవడం అంత కష్టమేమీ కాదు, ఇప్పటికీ పెరుమాల్ మురుగన్, అనంత మూర్తి, కలబుర్గిలకి ఎటువంటి స్పందన తిరస్కారాలు లభిస్తున్నాయో, లభించాయో చూసాకా. 1980 లో మరాఠీ సాహిత్యంలో ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ పనిచేసిన ఒక సాహిత్య సమ్మేళన్ కి ఆమె నాయకత్వం వహించింది. మొత్తంగా ఆమె ఒక పది నవలలు రెండు నాటకాలు రాసింది. రాసింది మరీ ఎక్కువ కాకపోయినా, వాటి లోని కధా వస్తువులు విప్లవాత్మకంగా ఉండటం, సమాజ ధిక్కారం చేయడం, ఎన్నాళ్ళనుంచో పాతుకుపోయిన మూఢాచారాలని, స్త్రీ బానిసత్వాన్ని, పురుషుడి స్వేఛ్చని ప్రశ్నించడం వల్ల స్త్రీవాద రచయిత్రిగా, బలమైన స్త్రీ వాద గొంతుకని వినిపించి మరాఠీ సాహిత్యంలో తనకంటూ ఒక ముఖ్యమైన స్థానాన్ని సుస్థిరపరచుకున్నది. విర్లేలే స్వప్న అనే నవల ఇద్దరు ప్రేమికుల డైరీ ఎంట్రీల్లా మొదలయి అక్కడక్కడా మొనోలొగ్ లాగా సాగుతుంది. ఇందులోని రోహిణి అనే అమ్మాయి అలోచనలు ఎంతో ప్రోగ్రసివ్ గా ఉంటాయి. "ప్రతి అమ్మాయి తను ప్రేమించిన వాడు అందరికన్నా వేరే అనీ ఎంతో మంచివాడనీ, ఉన్నతుడనీ అనుకుంటుంది. పంచుకునే ఎమోషన్ కన్నా కూడా పంచుకునే అలోచనలే ప్రేమని జీవితాంతం కట్టిపడేస్తాయి. అయినా పెళ్ళి అనే బంధంలో ఒక స్త్రీకి దక్కేదేంటి. పెళ్ళి చేసుకున్న కొంత కాలానికే మగవాడికి ఆమె మీద మోహం పోతుంది. ఆమె బిడ్డల్ని కనే యంత్రంలా వారిని పెంచడంలోనూ, అతని ఇంటిని నడపడంలోనూ మునిగి బంధీ అయి కాస్త స్వేఛ్చ కోసం కొట్టుకుంటూ ఉంటుంది. అతడు మాత్రం తనకున్న స్వేఛ్చతో బయట తన జ్ఞాన తృష్ణని కానీ, ఇతర మోహ బంధాల్లో కానీ ఆనందం వెతుక్కుంటాడు. అతను డబ్బు తెచ్చివ్వడంతో అతని బాధ్యత అయిపోతుంది. అతను ఆమె చేసే పనికి డబ్బు ఇస్తాడు కానీ అది ఆమె చేసే దానికి ఏమాత్రం సరిపోదు. ఇంత చేసినా ఆమె కెటువంటి స్వతంత్రం ఉండదు. అతనిమీద ఆధారపడాల్సిందే. కానీ అలా అని పెళ్ళి చేసుకోకుండా ఒకరంటే ఒకరికున్న మోహ బంధాన్ని అలానే ఉంచుకుంటే చివిరివరకూ బాగుంటుందా? అప్పుడు మగవాడు స్త్రీని మోసం చెయ్యడని భరోసా ఏమైనా ఉందా? ఈ నిజాలన్నిటికీ కళ్ళు మూసుకుని బ్రతకటం సాధ్యమేనా? అప్పుడు ఈ తెలిసినతనం యొక్క బాధ తప్పుతుందా?” ఇలా అనేక అలోచనలు ఆమె మనసులో తిరుగాడుతుంటాయి. ఆమె రచనలెన్ని వివాదాలు రేపినా మరాఠీ సాహిత్యంలో ఆమెకు మాత్రం మొట్టమొదటి స్త్రీవాద రచయితల్లో ఒకరుగా ఆమెకు పేరుండిపోయింది.   -Sharada Sivapurapu

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? కుంతలా కుమారి సబత్

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? కుంతలా కుమారి సబత్   జగ్దల్పూర్, బస్తర్ లో పుట్టిన కుంతలా కుమారి తల్లి మోనికా, తండ్రి డేనియెల్ 14 ఏళ్ళ వరకూ బర్మాలో పెరిగింది. కానీ తండ్రి రెండో పెళ్ళి చేసుకోవటంతో తల్లి తో బాటుగా ఇండియా తిరిగి వచ్చి, కుర్దా డిస్ట్రిక్ట్ లో స్థిరపడింది. కటక్ లో మెడిసిన్ చేసింది. ఈమె ఒక పేరు పొందిన లేడీ డాక్టర్. అయితే ఈమె స్కూల్ వయసునుంచే కవిత్వం రాస్తూ వచ్చింది ఒరియా, హిందీ భాషల్లో. బెంగాలీ, ఇంగ్లీష్ లో కుడా రాసిందట. ఎన్నో ఒరియా జర్నల్స్ కి వ్యాసాలు రాసేదట. 1928 లో ఒక డాక్టరుని కులాంతర వివాహం చేసుకోవడం కోసం బ్రహ్మొ సమాజంలో చేరుతుంది. వ్యక్తిగత జీవితానికొస్తే నలుగురు పిల్లలు కానీ, ఆమె చనిపోయేనాటికి ఇద్దరే మిగిలారు. ఆమె జీవితంలో ఇంత దుఖం ఉన్నా దాన్నిఆమె తన జీవితాశయాలకి ఏమాత్రం అడ్డు రానియ్యలేదు. ఆమెకు వచ్చిన పురస్కారాలు: "ఉత్కల్ భారతి”, ఇచ్చినది ఒరిస్సా పొయెట్స్ ఎస్సొసీషన్ "భారత్ కవినెత్రి,”, ఇచ్చింది హిందీ ప్రచార్ సభ ఆమెను "నైటింగేల్ ఆఫ్ ఒరిస్సా" గా ముద్దుగా పిలుచుకుంటారట. ఆమె రచయిత్రిగానే కాకుండా, రాజకీయాల్లో కూడా చాలా చురుకుగా పాల్గొనేది. పైగా అప్పుడు, స్వతంత్రోద్యమం దేశమంతటా ఊపందుకుంటున్న రోజులు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాన్ని ఒరిస్సాలో ఏర్పాటు చెయ్యడంలో ఆమెదే ముఖ్య పాత్ర. కొన్నాళ్ళ పాటు ఆమె ఢిల్లీలో ఉంది. ఆ సమయంలో అక్కడి కవులతో చురుగ్గా సమావేశాల్లో పాల్గొనడం, అంతే కాకుండా, బెనారస్ యూనివర్సిటీలో లెక్చర్స్ ఇవ్వడానికి ఆమెను ఆహ్వానించేవారట. ఆమె అలిగర్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కూడా. ఆమె విధవ స్త్రీల పునర్వివాహాలకీ, బాల వివాహాలరికట్టడానికీ పని చేసే ఒక ఆర్గనైజేషన్ కి కూడా ప్రెసిడెంట్. ఆమె నిజమైన గాంధీ అనుయాయి. ఆయన సిద్ధాంతాన్ని జీవితంలో తూచ తప్పకుండా పాటించినది. తన కవితల్లో ఎప్పుడూ గాంధీగారాశించిన గ్రామ స్వారాజ్యాన్ని, సమ సమాజాన్ని, స్త్రీ స్వేఛ్చనీ, కార్మిక కర్షక ప్రగతినీ కలలు కన్నది. తన వంతు ప్రయత్నం ఎటువంటి లోపం లేకుండా చేసింది. ఆమె రాసిన కవితా సంకలనాలు: బారామాలా ఇన్ హిందీ 1922 ఉచ్చ్వాస్ 1924 అర్చన 1927 : పేద, వెనుకబడ్డ వర్గాల గొంతుల ప్రతిధ్వని స్ఫుల్లింగ్ 1929 : స్వాతంత్రోద్యంలో పాలు పంచుకోవడానికి యువతకిచ్చిన పిలిపు. గతాన్ని మరిచి వారి భవిష్యత్తుకి పునాదులు వేస్కోవటానికి ప్రేరణ. ఆహ్వాన్ 1930 : దేశం మొత్తానికి గాంధియన్ మూవ్మెంట్లో జాయిన్ అవ్వటానికి పిలుపు ప్రేం చింతామని 1930 ఒరియంక ఖండన 1937 గర్జత్ క్రిషక 1939 : పేదలు, కర్షకులు ధనిక వర్గాల చేతుల్లో దోపిడీకి గురవ్వడం గురించి ఆమె బాధని వ్యక్తం చేస్తుంది. అలాగే డాక్టరుగా Human Anatomy ఒకటే కాకుండా సామ్రాజ్య వాద కలోనియల్ ప్రభుత్వం బానిస దేశపు శరీరంపై చేసే దోపిడీ ఎనాటమీ కూడా ఆమెకు బాగా తెలుసు. మచ్చుకి ఆమె రాసిన పోయెం ఒకటి ఇక్కడ ఇస్తాను. ఇదొక భాగం మాత్రమే పూర్తి పోయెంలో. Oh my compatriet!! The man is not born To die of reminiscence or to sink in somewhere It is never a human fate that gets terminated through a happiness, living After being condemned to The fretful glooms of failure In a deprived morbid prison of ever-disciplined humiliating; Thus great earth is Never a decaying caravan Or a lady nurturing death. Xxx ఆమెకు ప్రకృతి, దాని అందం, ప్రేమా సహజత్వం ఎంతో ఇష్టం. మనిషితో సహా ఆమె అన్నిటిలోనూ ఒక ఆధ్యాత్మిక కోణం చూడగల్గటం ఆమె రచనల్లోని ఒక ప్రత్యేకత. స్వేఛ్చగల ప్రపంచం సాధించాలంటే, ప్రేమలో, మంచితనంలో, జ్ఞానంలో, సత్యంలో నమ్మకముండడం ముఖ్యమని ఆమె విశ్వాశం. అందుకే ఆమె పొయెట్రీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. అందుకే నైటింగేల్ అఫ్ ఒరిస్సాగా పిలువబడింది. సరోజినీ దేవి నాయుడూని, కుంతలా కుమారినీ పోలుస్తారు చాలా విషయాల్లో. కాకపోతే, సరోజినీ దేవి నాయుడూలా విదేశాల్లో విద్యాభ్యాసం చేసె అరుదైన అవకాశాలు లభించేంత అదృష్టం ఈమెకు లేదు. ఇద్దరూ కవయిత్రులే, ఇద్దరూ స్వాతంత్రోద్యమకారులే. ఇద్దరూ గాంధీ అడుగుజాడల్లో నడిచిన వారే. సరోజిని దేవి నిజం చెప్పాలంటే సిద్ధాంత పరంగా గాంధీ గారి కన్నా, గోఖలే గారి వల్ల ఎక్కువ ప్రభావితమైంది. చాలా విచిత్రంగా, సరోజినీ దేవి స్వాతంత్రం వచ్చిన అనంతరం, నిజాం పాలిత ప్రాంతం భారత్ లో చేరకుండా స్వయం ప్రతిపత్తిగల సంస్థానంగా ఉండడాలని కోరుకోడాన్ని సమర్ధించింది. ఇది కేవలం ఆమె లండన్ చదువుకి, నిజామే ఆర్ధిక సహాయం అందిచడం కావచ్చు. ఆమె తండ్రి స్థాపించిన హైదరాబాదు కాలేజ్ కూడా నిజాం కాలేజ్ గా పేరు మార్చుకుంది. పైగా ఆమె కుటుంబానికి నిజాంతో దగ్గర సంబంధాలు ఉండేవట. అయితే స్వయం ప్రతిపత్తి ఇవ్వడానికి ఇది కారణం కాకూడదు. ఈ రకంగా చూస్తే, కుంతలా కుమారిలో ఇటువంటి వైరుధ్యాలు లేవు. అయినా సరోజినీకి వచ్చిన కీర్తి ప్రతిష్టలూ, పదవులూ గౌరవాలూ ఆమెకు దక్కలేదు. నిజానికి దక్కడానికి ఆమె జీవించి కూడా లేదు. ఆమె కవితల్లో అంధ విశ్వాశాలకీ, మూఢ నమ్మకాలికీ వ్యతిరేకంగా ధ్వజం ఎత్తింది. ఆమె ఎప్పుడూ ఒక నూతన సమాజాన్ని గురించి రాసింది ఆమె కవితల్లో. ఆమె కీర్తి కవయిత్రిగా, దేశభక్తురాలిగా దేశమంతా వ్యాపించింది ఆ రోజుల్లో. ఆమె 5 నవలలు కూడా రాసింది 1923 – 1933 మధ్య కాలంలో. 1.భ్రాంతి 2.నా తుండి 3.కాలి బహూ 4.రఘు అరాఖిత 5.పారస్మని రఘు అరాఖిత్ అనే నవలకి ఆమె అతి ముఖ్యమైన ఒవుట్ స్టాండింగ్ వర్క్ గా పేరు. ఈ నవల పెళ్ళి యొక్క సామాజిక లక్షణాన్ని వివరిస్తూ, ఒక పెళ్ళికూతురి కుటుంబానికి పరిహారం చెల్లించడాన్ని గురించి రాసింది. కాలి బహు అనే నవల అప్పటి సామాజిక వాతావరణానికి అద్దం పడుతుంది. ఒక నల్లటి ఒంటి రంగున్న లక్ష్మి అనే పిల్లకి వాళ్ళ నాన్న ఏడేళ్ళకి పెళ్ళి చేస్తే పదేళ్ళకల్లా విధవయి తిరిగి వస్తుంది. తల్లి లేని పిల్ల. తండ్రి నల్గురు భార్యలు అందులో చివరి ఇద్దరు భార్యలూ ఇంచుమించు లక్ష్మి వయసువారే. ఇక్కడ లక్ష్మికి విధవ పాటించాల్సిన కఠిన నియమాలు నిష్టలూ, చప్పిడి కూడూ అయితే ఆమె కళ్ళ ముందే, ఆ నల్గురు సవత్తల్లులూ ముత్తైదువలుగా దర్జా వెలగ బెడుతుంటారు. లక్ష్మిని రాచి రంపాన పెడుతుంటారు. ఇదొక ఎత్తైతే, హఠాత్తుగా తండ్రి చనిపోతాడు. అప్పుడు లక్ష్మి బతుకు ఇంకా హీనమైపోతుంది. ఇంతే కాకుండా లక్ష్మి వెంటపడి వేధిస్తుంటాడొకడు. ఇవన్నీ తట్టుకోలేక బృందావనం లోని విధవాశ్రమానికి పారిపోతుంది. కానీ అక్కడ బయటికి నియమానుసారంగా జీవిస్తున్నట్టు నటిస్తూ, లోపల విలాసాలలో మునిగి తేలే విధవ స్త్రీలను చూసి అక్కడ ఉండలేక వేరే దారి లేక నదిలో దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఈమెనొక స్వామీజీ రక్షించి తన ఆశ్రమానికి తీస్కెళతాడు. ఆయన అభ్యుదయ భావాలు, విధవ స్త్రీల పునర్వివాహం కోసం ఆయన చేసే కృషి చూసి, ఆమె ప్రభావితమై చదువుకుంటూ, ఆయన కార్యక్రమాల్లో సేవల్లో చురుగ్గా పాల్గొంటుంది. స్వామీజీ ప్రవచనాలతో ప్రబావితుడైన ఒక యువకుడు లక్ష్మిని వివాహం చేసుకోవడానికి ముందుకొస్తాడు. కుటుంబ వ్యతిరేకత ఉన్నా ఇద్దరూ పెళ్ళి చేసుకుని స్వమీజీ నిర్వహించే అభ్యుదయ కార్యక్రమాల్లో భాగంగా సమాజ సేవలో మునిగి, తమ ఆశయ సాధనలో తృప్తిగా జీవితం గడుపుతారు. అలా ఒక మూఢాచారాల్లో మురుగుతున్న కుటుంబ వాతావరణంలో సమాజానికి పనికిరాకుండా పోయిన కాలిబహు అదే సమాజోద్ధరణకి కృషి చేయడానికి ఎలా పనికొస్తుందో చూపిస్తుంది. మిగిలిన నవలల్లోని కధాంశాలు కూడా సమకాలీన సమాజానికి అద్దం పడుతూ, చక్కటి పరిష్కారాలను సూచించేవే.

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? కాశీబాయి కనిట్కర్ - మరాఠీ

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? కాశీబాయి కనిట్కర్ - మరాఠీ కాశీబాయి కనిట్కర్ ఒక ధనిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తుంది. 9 ఏళ్ళకే పెళ్ళి ఆమె కంటే 7 ఏళ్ళు పెద్ద అయిన గోవింద్ వాసుదేవ్ కనిట్కర్ తో. ఈమెకు విద్యాభ్యాసం లేదు. కాని భర్త అభ్యుదయ భావాలున్న వాడవటం వల్ల ఈమెకు కూడా తనతో పాటు ఇంట్లో చదువు నేర్పిస్తాడు. మరాఠీ, సంస్కృతం, ఇంగ్లీష్ భాషలు నేర్పిస్తాడు. స్వతహాగా స్పురదౄపి అయిన కాశీబాయి ఈ మూడు భాషలూ క్షుణ్ణంగా నేర్చుకుంటుంది. 15 వ శతాబ్దంలోని కణో పాత్ర అభంగ్లు పండరి నాధుడి మీద రాసింది. ఆమె తరవాత మరాఠీలో, నవల్లూ, కధలు రాసి ఒక రచయిత్రిగా పేరు తెచ్చుకుంది కాశీబాయి. ఆమె స్త్రీ విద్య కోసం చాలా పాటు బడింది. స్త్రీలు అన్ని రంగాల్లోనూ రాణించాలని ఆశ పడింది. ఆమె ఉన్న రోజుల్లో సామాజిక పరిస్తితులను ఒకసారి చూద్దాం. ఈమె రోడ్డు మీద షూస్ వేసుకుని గొడుగు పట్టుకుని నడుస్తూ వెళ్ళిందని రాళ్ళేసి కొట్టే వారట జనం, మగ రాయుడిలా వెళ్తోందని. అలాగే ఈమె చుట్టాల్లో విధవ అయిన ఒక స్త్రీ మామగారు అభ్యుదయ భావాలున్న వ్యక్తి అయి కోడలికి శిరోముండనం చెయ్యనివ్వకుండా అడ్డుపడితే, ఆయన ఊరి నుంచి బయటికెళ్ళినపుడు, అత్తగారు కోడలి శిరొముండనానికి చక చకా ఏర్పాట్లు చేస్తుంది. ఈ విషయం కోడలు తన మామగారికి తెలిపినప్పుడు ఆయన ఇంకెవరినో పంపి ఆ ప్రయత్నం ఆపిస్తాడు. ఇది అత్తగారికి కోడలి మీద అయిష్టం కన్నా సమాజ వత్తిడి తట్టుకోలేని అశక్తతగా భావించవచ్చేమో. సమాజ భీతి అలాంటిది మరి. అటువంటి రోజుల్లో ఈమె స్త్రీలకి సాయంత్రం వేళల్లో కలుసుకుని వారి బాగోగుల గురించి చర్చించుకునేందుకు ఒక క్లబ్ పెడుతుంది. అయితే సహజంగానే అందులోకి వచ్చే స్త్రీలందరు హైక్లాస్ వారే. జాన్ స్టువర్ట్ మిల్ రాసిన Subjugation of Women అనే వ్యాసం ఈమెనెంతో ప్రభావితం చేసింది. ఆ ప్రభావమే ఆమె రచనలన్నింటిలోనూ కనిపిస్తుందట. ఆమె రచనలనిండా స్త్రీ అభ్యున్నతికి సంబంధించిన అంశాలే. ఆమె రెండు నవల్లు, "రంగా రావ్" "పాలకిచ గొండ" మరాఠీలో రాసింది. అలాగే రెండు కధా సంకలనాలు అచ్చయ్యాయి. ఆమె నవల "రంగారావ్" చాలా మంది పాఠకుల్ని సంపాదించుకుంది. అలాగే ఆమె ఇంకొక ముఖ్య రచన బయొగ్రఫి, డాక్టర్ ఆనందీ బాయ్ జోషీ ది ఇంటర్ నేషనల్గా కూడా చాలా పేరు తెచ్చుకుంది. డాక్టర్ ఆనందీ బాయ్ జోషీ ఆమె సమకాలీనురాలు. మొట్టమొదటి లేడీ డాక్టర్ భారత దేశంలో. అమెరికా లోని పెన్సిల్వేనియా లో ఉన్న స్త్రీ వైద్య విశ్వ విద్యాలయంలో ఈమె మెడిసిన్ చేసింది. ఆనంది కూడా ఒక ఉన్నత బ్రాహ్మణ కుటుంబంలో పుడుతుంది. కానీ ఆస్తులన్నీ పోయిన నేప్ధ్యంలో ఆమెను 9 ఏళ్ళకే ఒక భార్య చనిపోయిన రెండో పెళ్ళివాడైన, ఇరవై ఏళ్ళ పెద్దయిన గోపాల్ రావ్ జోషి కిచ్చి పెళ్ళి చేస్తారు. ఇతను పోస్టల్ డెపార్టుమెంట్లో క్లర్క్. పధ్నాలుగేళ్ళు వచ్చేసరికి ఆనంది ఒక బిడ్డకి జన్మనిస్తుంది కానీ పుట్టిన పది రోజులకి బిడ్డ చనిపోతుంది సరయిన వైద్యం లేక. అప్పుడు ఆనంది డాక్టరవ్వాలని నిర్ణయించుకుంటుంది. భర్త కూడా ప్రోత్సహిస్తాడు. మొదట ఇద్దరూ అమెరికా వెళ్ళడానికి నిశ్చయించుకుని ఒక మిషనరీ ని సహాయం అర్ధిస్తారు. కాని క్రిస్టియానిటీ పుచ్చుకుంటేనే సహాయం చేస్తామంటే ఆ ప్రయత్నం విరమించుకుంటారు. కానీ ఆ మిషనరీ ఈ విషయాన్ని ఒక అమెరికన్ మేగజిన్ లో అచ్చేస్తాడు. అది చదివిన అమెరికా లోని ఒకామె ఆనందికి సాయం చెయ్యడానికి ముందుకొస్తుంది. అప్పుడు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలలో వీరిద్దరూ హిందూఇజంకి సంబంధించి ఎన్నో విషయాలను చర్చిస్తారు. మొత్తానికి ఆనంది ఒక్కర్తే అమెరికాకి షిప్ లో వెడుతుంది. అది 19 ఏళ్ళ వయసులో. కానీ ఈలోపల ఆమె స్త్రీ అయుండి చదువుకొడానికి అమెరికా వెళ్ళడాన్ని తప్పు పడుతుంది హిందూ సమాజం. అప్పుడు ఆమె ఇచ్చిన ఒక ప్రసంగంలో తను ఎందుకు వెడుతున్నదీ, దాని వల్ల జరిగే మేలేంటి అన్నీ వివరిస్తుంది. అర్ధం చేసుకున్న్న కొంత మంది ఆమెకు ఆర్ధికంగా సహాయ పడతారు. అలా చేతిలో చిల్లిగవ్వ లేకుండా మెడిసిన్ చెయ్యాలని నిర్ణయించుకుని, ఒంటరిగా ప్రయాణించి ఆమె పెన్సిల్వేనియా వైద్య విద్యాలయంలో చేరుతుంది. మూడేళ్ళలో మెడిసిన్ పట్టా పుచ్చుకుంటుంది. కాకపోతే, వెళ్ళకముందునుంచే బాగోలేని ఆరోగ్యం అక్కడకు వెళ్ళాకా ఇంకా క్షీణిస్తుంది అక్కడ చలికి సరయిన తిండి లేకపోవటం వలన. భారత దేశం తిరివచ్చి కొల్హాపూర్లో Lady డాక్టర్గా నియమితురాలైన కొద్ది నెలల్లోనే అరోగ్యం క్షీణించి, క్షయ రోగంతో ఆమె మరణిస్తుంది. ఆమెతొ పాటుగా వైద్య విద్య నభ్యసించి మరో ఇద్దరు స్త్రీలు ఒకరు జపాన్ నుంచి ఇంకొకరు సిరియా నుంచి. జపాన్ మహిళ డాక్టర్గా ఒక హాస్పిటల్లో నియమించబడ్డా అప్పటి జాపాన్ రాజుకి ఒక స్త్రీ పనిచేయడం నచ్చక పోవటం వలన ఆమె ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకుంటుంది. సిరియన్ స్త్రీ సంగతి వివరాలు లభ్యమవవు. మనం ఊహించుకోవచ్చు. మన దేశంలోనే కాక, ఇతర దేశల్లోనూ ఇంచుమించు అవే పరిస్తితులు స్త్రీలకి. కాకపోతే మొట్టమొదట 1850 ల్లో స్త్రీల కోసం స్థాపించిన వైద్య విశ్వ విద్యాలంలో అమెరికా వెళ్ళిన మొదట్రి హిందూ స్త్రీ, మొదటి స్త్రీ డాక్టరుగా ఆనంది పేరు తెచ్చుకుంది. అయితే ఏడెనిమిది ఏళ్ళలో ఆనంది జీవితంలో జరిగిన విషయాల్ని, తిరిగిన మలుపుల్ని ఎందరో రాసారు. శ్రీ క్రిష్ణ జనార్ధన్ జోషి ఆనందీ గోపాల్ అనే నవలగా ఆనంది జీవితాన్ని గురించి రాశారు. ఈ నవలని ఆషా దాంలే ఇంగ్లీష్ లోకి అనువదించారు. Carolene Wells Haley Dall, 1888 లో ఆనందీ బాయ్ బయొగ్రఫి రాసింది. 1889 లో కాశీ బాయి రాసిన వందేళ్ళకి అంజలీ కీర్తనె అనే ఆమె రిసెర్చ్ స్టూడెంట్ కూడ ఆనందీ బాయి బయొగ్రఫీ రాసింది. అయితే ఎస్ జె జోషీ రాసిన బయొగ్రఫి మీద విమర్శ ఏంటంటే, ఆయన గోపాల్రావ్ ని ముఖ్య పాత్రగా చిత్రిస్తూ ఆనందీ ని కేవలం గోపాల్రావ్ తర్ఫీదిచ్చిన రేసు గుర్రం లాగే చూపెట్టే ప్రయత్నం చేసాడని. ఇది చాలా మంది ఫెమినిస్ట్ ల విమర్శకు లోనయింది. ఇక కేరొలిన్ దాల్ రాసిన బయిగ్రఫి కొస్తే, ఆమె ఆనందీ తోటీ, గోపాల్రావ్ తోటీ పరిచయం ఉన్న వ్యక్తి. గోపాల్రావ్ వ్యక్తిత్వాన్ని స్వయంగా పరీక్షించిన వ్యక్తి. ఆనందీ లేకపోతే భారత దేశంలో ఉండటం కష్టంగా ఉందని చైనా నుంచి అమెరికా షిప్ లో వెళ్ళి, తీర అక్కడ తన భార్యని చూసి ఓర్వలేక కొంత, పురుషాధిక్య ధోరణితో కొంత ఆమెను వేధించి, అప్రస్తుత ప్రసంగాల్లో వెస్టర్న్ రేసిజ్మ్ గురించి లెక్చర్స్ దంచి, క్రిస్టియానిటీని దుయ్యబడితే, అక్కడ తన చదువుకోగల్గడానికి వారి సహాయాన్నే అర్ధించి కాలం గడుపుతున్న ఆనందికి ఇది చాలా ఇబ్బందికరంగా మారి, ఆ ఇమోషనల్ స్ట్రెస్ తోటే మరణించి ఉండవచ్చని తేల్చింది. ఆమెది గోపాల్రావ్ మీద కోపం. వీరిద్దరు అమెరికన్ ధాతృత్వాన్ని ప్రప్రంచానికి చూపే మస్కొట్స్ లాగా పనిచేయాలనే వారి ఎక్స్పెక్టేషన్ తీర్చలేదని ఆమె బాధ. అంతే కాకుండా ఆమె ఆనంది చదువుకి, ఆరోగ్యం కోసం అయ్యే ఖర్చు కోసం ఇచ్చిన డబ్బుని దుర్వినియోగం చేసినట్టు కూడా చూపింది. ఇక అంజలీ కీర్తనే బయొగ్రఫీ కొస్తే, ఆమెకు ఒక విద్యావంతురాలు, ధనిక అర్బన్ బేక్గ్రౌండ్ నుంచి వచ్చే సౌకర్యాలన్నీ ఉన్నాయి. ఆమె కూడా దాల్ రాసిన బయొగ్రఫి లోంచి గోపాల్రావ్ కేరక్టర్ మలిచిన తీరునే అధారంగా చేసుకుని, ఆనందిని తన ఆశలని ఆశయాలని, ఒక అమెరికన్ ప్రపంచం ఇచ్చే స్వేఛ్చ్ తో రెఫైన్ అయిన వ్యక్తిత్వాన్నీ, నిస్సహాయంగా, తనకంటే ఎంతొ పెద్ద వాడైన భర్త ఆధిక్యతకి బలిచేసుకున్న స్త్రీగా చూపెట్టింది. ఇది ఒక అతిగా ఫెమినిస్ట్ కోణంలో రాసినదిగా విమర్శకి లోనయ్యింది. అయితే కాశీబాయి రాసిన బయొగ్రఫి మాత్రం కొన్ని వాస్తవాల్ని తప్పుగా ఇచ్చినా, అమెరికా లోని ఆనంది జీవిత వివరాలు, ఆమె జీవితం గురించిన వివరాలు ఇవ్వకపోయినా, ఆమె నిజాయితీ తో నిబద్ధతతో రాసిందని పేరు. ఆనంది గోపాలరావ్ల వైవాహిక జీవితాన్ని వివరించినప్పుడు, గోపాల్రావ్ వ్యక్తిత్వాన్ని మరీ మసి పూసి చూపెట్టకుండా, ఇంత అసాధారణ జీవితాన్ని వారిద్దరూ ఎదుర్కొన్నపుడు సహజంగా వచ్చే మార్పుల్లా, జరిగే పర్యవసానాలకింద చిత్రించింది. గోపాల్రావ్ ప్రవర్తనలో అమెరికా వెళ్ళాకా మార్పు వచ్చినా, ఆనంది జీవితాన్ని తీర్చి దిద్దటంలో, ఆమెకు కావాల్సిన ఆర్ధిక సహాయం కోసం ప్రతి మిషనరీకీ తిరిగి, వివరించి చివరికి సక్సెస్ సాధించటంలోని పట్టుదల ఆమె కెంతో సహాయం చేసాయి. ఆ విషయాన్నైతే విస్మరించలేం కదా అని ఆమె అభిప్రాయం. ఏమైనా ఒక గృహిణిగా ఆమెకున్న పరిమితుల్లో, పైగా కేవలం స్వయంకృషితోనే చదువుకుని ఇన్ని భాషలూనూ, వాటన్నిటినీ అంటే తన పరిమితుల్ని వివరిస్తూ, ఇంకెవరూ ఆనంది జీవితాన్ని పుస్తకీకరించడానికి ముందుకు రాకపోవటం వల్లే తను ఆ పని చెయ్యల్సి వచ్చిందని ముందు మాటలో చెప్పి మరీ రాయటం, గోపాల్రావ్ రాసిన ఉత్తరాల్ని మార్చకుండా ఉన్నవున్నట్లు జతపర్చడంలో ఆమె నిజాయితీ కనిపిస్తాయి. కాశీబాయి ఆనందిని ఒక అభ్యుదయ, ఆర్య హిందూ స్త్రీగా ప్రొజెక్ట్ చేసింది. ఇందరు రాసినా అనంది బయొగ్రఫీ, అందరూ కూడా వివిధ కారణాలవల్ల వారి వ్యక్తిగత పక్షపాతాన్ని వారి రచనలో చొరబడకుండా రాయలేకపోయారు. ఆ కోణంలో పరిశీలించినపుడు కాశీబాయి మాత్రమే ఆనంది జీవితాన్ని కొంతయినా సరిగా పొర్ట్రె చెయ్యడంలో కృతకృత్యురాలాయినట్లు లెక్క.   -Sharada Sivapurapu

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? నిరుపమా దేవి (1883-1951)

    మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? నిరుపమా దేవి (1883-1951)     బెర్హంపూర్లో పుట్టిన ఈమెకు విద్యాభ్యాసం ఇంట్లోనే. పెళ్ళయిన సంవత్సరం లోపే అంటే 14 ఏళ్ళకల్ల భర్తను పోగొట్టుకుని జీవితమంతా విధవ రాలిగా గడిపేసింది. ఈమె అన్నగారూ, శరత్ చంద్ర చట్టోపాధ్యాయ్ కలిసి నడిపే ఒక పత్రికలోకి కధలు రాయమని ఈమెను ఇద్దరూ ప్రోత్సహిస్తారు. కొంచం ఆదరించి ప్రేమించే కుటుంబ సభ్యులున్నా కూడా, చెయ్యగల్గిన సహాయం ఏమీ లేదు ఒక విధవరాలికి. సంఘ సంస్కర్తలెప్పుడూ, సమాజంకన్నా ఒకడుగు ముందుంటారట. అలా ముందుకేసిన ఒకడుగు పరిమితిలో ఆమె విద్యాభ్యాసం (ఇంటనే)జరగడమూ, రాయమని ప్రోత్సహించడమూ సాధ్య పడ్డాయి అంతటి పేరున్న రచయిత అయిన శరత్ చంద్రకు కూడా. అలా కధలనుంచి, నవలల వరకూ ఎదిగి, స్వర్ణకుమారి (బంగ్లా లో మొట్ట మొదటి నవల రాసిన రచయిత్రి, రబీంద్రనాత్ ఠాగోరు అక్కగారు) తరవాత నవల్లు రాసిన బంగ్లా స్త్రీగా ఈమె పేరు తెచ్చుకుంది. ఈమె రాసిన పది దాకా నవలల్లో అన్నీ కూడా కుటుంబ గాధావిష్కరణలే, బాగా పేరు తెచ్చిన నవల దీదీ అనే నవల. అవి స్వాతంత్ర్యోద్యమం పుంజుకుంటున్న రోజులు కాబట్టి ఆమె ఎన్నో కవితలు, పాటలు కూడా రాసిందట. అన్నీ కూడా అప్పటి పత్రికల్లో అచ్చయ్యేవి. ఆమె చేసిన సాహిత్య సేవకు గుర్తింపుగా ఆమెకు Calcutta University నుంచి "భుబన్మోహిని గోల్డ్ మెడల్ 1938, ఇంకా జగత్తారిణీ గోల్డ్ మెడల్ 1943" పురస్కారాలు లభించాయి. స్వర్ణకుమారీ దేవి మొదటి నవలా రచయిత్రి అయినా, ఆమె నవలలు, చారిత్రిక అంశాలపై గానీ, వాస్తవ దూరమైన, ఊహాజనిత ప్రేమ గురించి కానీ సాగాయి. అసలు స్వర్ణ కుమారి రాసినవి మాత్రమే కాకుండా అప్పటి వరకూ వచ్చిన నవలల మూలాంశాలు సాధారణంగా అవే. అప్పటి మానవ సంబంధాలే కధాంశాలుగా సాగిన నవలలకి బంగ్లాలో శ్రీకారం చుట్టింది మాత్రం నిరుపమా దేవి. నిరుపమా దేవి ఆడవారిపై రుద్దబడిన సాంఘిక దురాచారాల గురించి, బలవంతపు పెళ్ళిళ్ళ గురించి, భర్తల వివాహేతర సంబంధాల గురించి, విధవలైన స్త్రీలపై ఆచారాల పేరిట జరిగే అత్యాచారాల గురించి ధైర్యంగా రాసిన మొట్టమొదటి కొద్దిమంది స్త్రీ రచయిత్రుల్లో ఒకరు. శరత్ చంద్ర కూడా అదే టైంలో అవే అంశాల మీద కధలూ నవల్లు రాశాడు కాని, నిరుపమా దేవి రచనల్లో, ఒక స్త్రీ ధృక్కోణం నుంచి స్త్రీల సమస్యలు బయటపడి ఇంకాస్త వాస్తవిక ధృక్పధంతో సాగుతాయి. ఆమె నవలల్లోని విధవ స్త్రీ పాత్రలు కౄరమైన సంఘ నియమాలను ఎదిరించి ప్రేమలో పడి, సంఘం చేత నలిపేయబడ్డ వారు. కొన్ని సార్లు మతాంతర ప్రేమలు కూడా ఆమెకు వస్తువులే. అసలు స్త్రీలు చదువుకోవడానికి స్వేచ్ఛ లేని రోజుల్లో విధవ అయుండి ఇలాంటి ప్రేమల గురించి రాస్తే సమాజం ఏమైపోవాలి? కానీ ఇలా రాయడానికి ఎంత ధైర్యం కావాలి? ఆ ధైర్యాన్ని, స్పూర్తినీ నిరుపమాదేవి తన తరవాతి రచయిత్రులకు అందించింది. పధ్నాలుగు ఏళ్ళకే విధవ అయిందని ఒక వాక్యంలో చెప్పేస్తాము కాని, ఒక పూర్తి జీవితాన్ని, అసంపూర్ణంగా గడుపుతూ, సామాజిక స్పృహతో రాయడానికి ఎంత మనోస్థైర్యం కావాలని అలోచిస్తే అర్ధమవుతుంది వాళ్ళు పడ్డ కష్టం. కాల్పనిక నవలా సాహిత్యానికి శరత్ చంద్ర అప్పటికే రారాజుగా వెలుగుతున్న రోజుల్లో వీరు రాయడం, వీరికి శరత్ చంద్ర కూడా అభిమాని అవడం చాలా సంతోషం కలిగించే విషయం. నిరుపమా దేవి రాసిన ప్రతి కధా, నవలా స్త్రీల జీవితం లోని ఒక విలక్షణమైన అంశాన్ని గురించి రాసినవే. బాల్యంలోనే విధవ అయి వైవాహిక జీవితాన్ని అనుభవించక పోయినా, వివాహితల సమస్యల గురించి, భర్తల అక్రమ సంబంధాలు, భార్య ఉండగానే రెండవ పెళ్ళిళ్ళు వల్ల స్త్రీలు పడ్డ మానసిక సంఘర్షణ స్త్రీ కోణం నుంచి రాసిన తీరు అద్భుతం. ఎన్నో పాత్రలు సమాజ నియమాలను ఉల్లంగిస్తూ ప్రవర్తించినా, అన్నిట్లోనే తిరుగుబాటు ఒక్కటే పరిష్కారంగా చూపదు. ఉదాహరణకి 'దీదీ' అనే నవలలోని స్త్రీ పాత్ర చిన్న వయసులోనే పెళ్ళి చేసుకొని అత్తవారింటికి వస్తుంది. పట్నంలో చదువుకుంటున్న, అభ్యుదయ భావాలు కల భర్త, అక్కడ, ఉన్న తల్లిని కూడా పోగొట్టుకుని అనాధ అయిన ఒక పేద పిల్లపై జాలిపడి చేరదీస్తాడు. ఆ తరవాత అమెను వివాహం చేసుకుంటాడు. కాని ఈమె మాత్రం తన అత్తవారింట ఉండిపోతుంది. మంచం పట్టిన మామగారికి సేవ చేస్తుంది. ఆ ఇంటి సం రక్షణ భారాన్నంతా మోస్తుంది. వాళ్ళ పొలాలు, పనివాళ్ళు, ఆస్తుల వ్యవహారాలన్నీ చూస్తుంది. ఇది ఎంతవరకూ సాగుతుందంటే, ఆఖరికి భర్త కూడా అన్ని విషయాలకూ ఆమె మీద ఆధారపడేంత. రెండవ భార్యని కూడా స్వంత చెల్లిలిలాగానే ప్రేమించేంత. ఇదంతా చేయడం వల్ల ఆమె జీవితంలో మార్పు రాదు. కానీ ఓపికతో వ్యవహరించి, తనకన్యాయం చేసిన సమాజాన్నీ కుటుంబాన్నీ విడవకుండా, ఎదురుతిరగకుండా అందులోనే ఉంటూ తనపై సానుభూతినీ, తద్వారా ప్రేమనీ పొందేట్టు చేసుకోవడం, ఒక Passive revolution, నిశ్శబ్ద పోరాటం. ఆమె చెప్పదల్చుకున్న, చూపెట్టదల్చుకున్న అన్యాయాన్ని ఇంకా ఎఫ్ఫెక్టివ్ గా జనాలకి చూపెట్టటం. బిధిలిపి అనే నవల లోని ముఖ్య పాత్ర తనకంటే వయసులో చాలా పెద్దవాడైన పురుషుడితో ప్రేమలో పడుతుంది. శ్యామిలీ అనే నవల ఒక గుడ్డి అమ్మాయి ప్రేమ కధ. అనుకర్ష అనే నవలలోని ఒక భక్తురాలు ఒక సాధువుతో ప్రేమలో పడుతుంది. ఇలా ఆమె రచనల్లోని పాత్రలు చాలా విలక్షణంగా, తామున్న కాలానికి అందనంత దూరంగా ప్రవర్తిస్తుంటారు. ఒకవేళ అటువంటి సంఘటనలూ, సందర్భాలూ ఆరోజుల్లో ఉన్నా వాటి గురించి రాసిన ధైర్యం చేసింది , మిగతావారు రాయడానికి ధైర్యం చేసేందుకు బాట వేసింది నిరుపమా దేవి తన రచనల ద్వారా. తన జీవితపు చివరి రోజుల్లో వైష్ణవ సంప్రదాన్ని పాటిస్తూ, మధురలో తన శేష జీవితాన్ని గడిపిందట.             -Sharada Sivapurapu

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? మహాశ్వేతా దేవి

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? మహాశ్వేతా దేవి   మహాశ్వేతా దేవి (Jnanapeeth Awardee) గురించి నా పరిచయం వల్ల తెలుసుకోవడం కంటే మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఒక వేళ మీరు ఆమె రచనలు ఏవైనా సరే చదవకపోతే వెంటనే బజారెళ్ళి ఆమె రాసిన ఏ ఒక్క నవలైనా, కధైనా చదవమని. అది వెంటనే కుదరదనుకుంటే, ఆమె రాసిన కధల ఆధారంగా తీసిన "రుఢాలి", కానీ, "హజార్ చౌరసి కీ మా", కానీ "సంఘుర్ష్", కానీ "మాటీ మాయ్", సినిమాలు కానీ చూడమని. ఇవన్నీ కూడా ఎవార్డ్స్ గెలుచుకున్న సినిమాలే. అద్భుతమైన కధాంశాలే. నిజానికి ఒక లైఫ్ టైంలో ఆవిడ రాసిన పుస్తకాలు చదవటం నాలాంటి వాళ్ళ వల్ల అయ్యే పని అయితే కాదు. ఆమె వందకు దగ్గరగా నవల్సు రాసింది. ఇరవైకి పైగా కధా సంకలనాలు రాసింది. ఆమె రచనలన్నిటిలోనూ వ్యక్తమయ్యేది ఒక విప్ల్వాత్మక తిరుగుబాటు, గిరిజనులకు, దళితులకు, స్త్రీలకు జరిగే అన్యాయాలకు వ్యతిరేకంగా చేసే పోరాటం. ఎంత చెప్పినా ఆమె గురించి, ఎలా చెప్పినా ఆమె ప్రతిభకి గానీ గిరిజన సంక్షేమానికి అంకితం చేసిన ఆమె జీవితం గురించి కానీ, ఆమె అంకిత భావానికి కానీ నేను న్యాయం చెయ్యలేను. ఆమెకొచ్చిన ఎవార్డ్స్ వల్ల ఆమెకు గౌరవం రావడం కాదు ఆమె వల్ల ఆ ఎవార్డ్స్కి గౌరవం వచ్చిందనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం పద్మశ్రీ నుంచి, భారత రత్న బిరుదులు ఏ పద్ధతి ఇస్తున్నారో చూస్తే వాటి మీద గౌరవం శూన్యమైపోయింది. ఇప్పుడు నేనిచ్చే బిరుదుల లిస్ట్ కేవలం తెలుసుకోవడం కొరకు ఇస్తాను. కానీ ఇవి ఆమె గొప్పతనానికి ఏ మాత్రం చిహ్నాలు కావు. ఆమె రాసిన ఒక్క కధ చదివితే చాలు, ఆమె ప్రతిభ ఏంటో తెలియడానికి. ఆమె కలం కదలికల్లో జీవితం కధలా నిలుస్తుందో, కధే జీవితంలా మన ముందుంటుందో తెలుసుకోవటం కష్టం.     1979: Sahitya Akademi Award (Bengali): – Aranyer Adhikar (novel)     1986: Padma Shri[2]     1996: Jnanpith Award – the highest literary award from the Bharatiya Jnanpith     1997: Ramon Magsaysay Award – Journalism, Literature, and the Creative Communication Arts[2][7]     1999: Honoris causa – Indira Gandhi National Open University (IGNOU)     2006: Padma Vibhushan – the second highest civilian award from the Government of India     2010:Yashwantrao Chavan National Award     2011: Bangabibhushan – the highest civilian award from the Government of West Bengal     2012: Hall of Fame Lifetime Achievement Sahityabrahma – the first Lifetime Achievement award in Bengali Literature from 4thScreen-IFJW. . 2014: 1st Mamoni Raisom Goswami National Award for Literature constituted by Assam Sahitya Sabha and sponsored by Numaligarh Refinery Limited, Assam ఆమె జీవితమంతా గిరిజనులకి, ఆడవారికి, దళితులకి ధార పోసింది. అందుకే ఆమెకు "Mother of Shabars” అనే పేరు. లోధాస్ ఇంకా శబరులు బెంగాల్లోని గిరిజనులు. ఆమె రచనల్లో ప్రతిబింబించేది వీరి జీవిత చిత్రాలే, కామందుల, దళారుల, ఉన్నత కుల వర్గాల చేతుల్లో నలిగిపోయే వీరి జీవితాలే. వీరి జీవితాలే ఆమె కధాంశాలు. ఇక్కడ “Breast Stories" అనే కధా సంకలనంలోని ఒక కధ గురించి మీకు చెప్పాలి. ఆడవాళ్ళ శరీరం వస్తువుగా మారి, అమ్మకానికి, జరుగుబాటుకి పనికొచ్చే సాధనంగా ఎలా మారుతుందో ఈ కధ చిత్రిస్తుంది. భర్త అవిటివాడై సంపాదించలేని పరిస్తితిలో ఉన్న ఒక స్త్రీ కేవలం నిండుగా ఉన్న తన పాలిండ్లనే వాడుకుని, ఒక ధనిక కుటుంబంలోని పిల్లలకి పాతికేళ్ళపాటు పాలిచ్చి పెంచి తన కుటుంబానికి ఆధారంగా నిలబడుతుంది. కానీ రొమ్ము కేన్సర్ వచ్చి ఇక పాలివ్వలేని పరిస్తితిలో దిక్కు మొక్కు లేక, పట్టించుకునే నాధుడు లేక కృంగి కృశించి చచ్చిపోతుంది. ఎంతో హృదయవిదారకమైన డిపిక్షన్. అలాగే రుఢాలి అనే కధని సినిమాగా తీసారు. రుఢాలి అంటే, ధనికుల ఇళ్ళలో ఎవరైన చనిపోతే ఏడవటం వాళ్ళ సంస్కారం కాదు, అందుకని ఏడవటానికి మనుషుల్ని పెట్టుకుంటారు. వీరినే రుఢాలీ అంటారు. ఇంటివారి బదులు వీళ్ళే గుండెలు బాదుకుని పెద్దగా ఏడుస్తారు, కొద్దిగా డబ్బు, కొంచం బియ్యం వగైరాల కోసం. ఇదొక వృత్తి. ఇది ఎంత అద్భుతమైన, విలక్షణమైన కధో చదివితే తెలుస్తుంది. రాజస్థాన్లోని ఒక చిన్న గ్రామంలో జరిగే కధ ఇది. బహుసా చాలా మంది ఈ సినిమా చూసే ఉంటారు. శనిచరి, శనివారం పుట్టిందని, పుట్టగానే తండ్రిని చంపేసిందని ఆపేరు పెడతారు. తల్లి డబ్బున్న ఒక నాటకాల కంపెనీ ఆసామితో శనిచరి చంటిపిల్లగా ఉన్నపుడే లేచిపోతుంది. ఇక ఊరివాళ్ళు శనిచరి అనే పేరు ఖరారు చేసేస్తారు. బంధువులే పెంచి గంజు అనే అతనికి ఇచ్చి పెళ్ళి చేస్తారు. ఇతనొక తాగుబోతు, ఇతనికొక రోగిష్టి తల్లి. ఒక కొడుకు పుడతాడు బుధ్వా అని. ఖామందు రామవతార్ కొడుకు, లక్ష్మన్ సింగ్ శనిచరిని తన కుటుంబాన్ని వదిలి తన ఉంపుడుకత్తెగా ఉండమని కోరతాడు. తన కుటుంబాన్ని వదలదు, కాని మనసులో ఒక అవ్యక్తమైన ప్రేమ ఉంటుంది లక్ష్మన్ సింగ్ అంటే. మంచంలోంచే ఈమెని పీడించి, పీడించి అత్త చనిపోతుంది. ఆతరవాత మొగుడు కూడా అర్ధాంతరంగా చనిపోతాడు. విషయం ఏంటంటే చిన్నప్పట్నించి కూడా ఏంజరిగినా శనిచరికి ఏడుపు రాదు. తనను తను ఎంతో ఫోర్స్ చేసుకుంటుంది, ఏడవటానికి, ఎంతో ఉద్రేకపడుతూ, కనీసం ఊరివారందరికీ శనిచరి కూడా ఏడవగలదని చూపెట్టటానికి. కానీ ఆమెకు కన్నీళ్ళు రావు, కష్టాలు పడి పడి కన్నీరు ఇంకిపోతుంది. ఊరివారికి ఆశ్చర్యం, ఈమె సమస్య. కొడుకు ఈమె కిష్టం లేకపోయినా ఒక వేశ్యని ప్రేమించి పెళ్ళిచేసుకుంటాడు. ఊరివాళ్ళకి ఇంకొక విషయం దొరుకుతుంది శనిచరిని దుయ్యబట్టడానికి. కాని కామందు ఈమె అంటే ఉండే ఇష్టం వల్ల, ఊరినించి వెలి వేయమని కొందరు ఫిర్యాదులు చేసినా ఊరుకుంటాడు. కోడలితో గొడవ పడినప్పుడు, కడుపుతోటున్న ఆమె కోపంతో గర్భస్రావం చేసుకుంటుంది. అప్పుడు కూడా శనిచరి ఏడవదు. చివరకు కొడుకు చెప్పకుండా ఎటో వెళ్ళిపోతాడు. ఈ సమయంలో భిక్ని అనే రుఢాలి ఈమెను కలుస్తుంది. ఈమె కధoతా వింటుంది. కానీ ఆమె కధని శనిచరికి చెప్పే లోపు ఆమెకు ఒకరిదగ్గరనుంచి కబురొచ్చి రెండ్రోజుల్లో వస్తానని వెళ్తుంది. అప్పుడు శనిచరికి భిక్ని లేని కారణంగా రుఢాలిగా ఏడ్వటానికి రమ్మని, రామవ్తార్ చనిపోతున్నడని, కబురొస్తుంది. కానీ అసలు ఈమెకు ఏడవటమే రాదు. అలాంటప్పుడు రుఢాలిగా ఏంచేస్తుంది? అయినా అస్సలు జరుగుబాటు లేక వెళ్తుంది. అక్కడ ఆమెకు ఒక కబురొస్తుంది. భిక్ని చనిపోయినట్టు. అప్పుడే తెలుస్తుంది, భిక్ని ఎవరో కాదు ఆమె తల్లి అని. చిన్నప్పుడెప్పుడో తల్లి వదిలి వెళ్ళినప్పట్నుంచి ఏడవటం మానేసిన శనిచరికి అప్పుడు ఏడుపు వస్తుంది. గుండెలు పగిలేలా ఏడుస్తుంది. ఈ కధని అద్భుతంగా పిక్చరైస్ చేసారు. జీవితానికి అద్దం పట్టే మహాశ్వేతాదేవి కధలు ఎవరైనా చదవకపోతే వెంటనే కొనుక్కుని చదవాల్సిన కధలు. ఏ సన్నివేశం కూడా కల్పించినట్టుగా ఉండదు, జీవితాన్ని అచ్చం అలాగే వర్ణించినట్టుగా ఉంటాయి ఆమె కధలు. ఈ సినిమాలో నటించిన డింపుల్ కపాడియా కు నేషల్ ఫిల్మ్ ఎవార్డ్, ఉత్తమ నటిగా వచ్చింది, అలాగే హజార్ చౌరాసి కీ మా ( Mother of 1084) లో నటించిన జయా బాధురీకి కూడా ఫిల్మ్ ఫేర్ ఎవార్డ్ వచ్చింది. ఈ కధ కూడా మీకు వివరించాలని చాల ఉత్సుకత ఉంది కానీ చెప్పను. ఇలా చెప్తూ పోతే ఆవిడవి చాలానే కధలు చెప్పాల్సి వస్తుంది, కాబట్టి మీరే వెతికి పట్టుకోండి. చదవండి, చదివి ఆమె సృష్టించే భావోద్వేగ ప్రవాహంలో పడి కొట్టుకుపొండి. ఈ వ్యాసం ముగించేముందు ఆమె వ్యక్తిగత జీవితం గురించి కూడా కొన్ని వివరాలు తెలుసుకుందాము. మహాశ్వేతాదేవి ఢాకా లో పుట్టింది. కానీ పార్టిషన్ తరవాత బెంగాల్లో స్థిరపడింది. ఆమె తల్లితండ్రులిద్దరూ సాహిత్య ప్రియులే. తండ్రి నవలా రచయిత, తల్లి కూడా రచయిత్రి, సంఘ సేవకురాలు. ఆమె అంకుల్ స్థాపకుడూ, Editor of Economic and Politial Weekly of India. భర్త బిజొన్ భట్టాచార్య పేరు మోసిన నాటక రచయిత. ఆమె కొడుకు నాబారున్ భట్టాచార్య బెంగాల్లో పేరుమోసిన రచయితల్లో ఒకరు. అతని నవలల్లోని ఆధ్యాత్మికతకీ, మేధస్సుకి గుర్తింపబడినవాడు. ఈరకమైన కుటుంబంలోంచి వచ్చిన ఆమె రాయటంలో అయితే ఆశ్చర్యం లేదు గాని, గిరిజనుల కోసం ఆమె చేసిన పోరాటాలయితే మాత్రం కేవలం వారి గురించి రాసేసి చేతులు దులుపుకోకుండా వారి పక్షాన నిలబడి వారిని పీడించిన ప్రతి వర్గంతోనూ ప్రభుత్వంతో సహా ఆమె పోరాటం చెయ్యడం, తన జీవితాన్ని వారి హక్కుల పరిరక్షణకై నిరంతరంగా ధారపొయ్యటం మాత్రం అసాధారణ విషయమే. ఈ విషయంలో ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే. 2006 లో ఫ్రాంక్ఫర్ట్ బుక్ ఫైర్ లో ఏ దేశానికైనా అరుదుగా లభించే అవకాశం, రెండవసారి ఆహ్వానం భారత దేశానికి వచ్చిన సందర్భంలో ఆమె మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న వారంతా కన్నీటిపర్యంతం అయ్యారట. ఆమె రచనలే కాకుండా ఆమె ఉపన్యాసం కూడా అంతే శక్తిమంతమైనదని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఒకసారి ఆమెను గుజరాత్లో ఒక గిరిజన సమావేశం సందర్భంగా ఆహ్వానించినపుడు, ఆమెకు ఒక మంచి హోటల్లో బస ఏర్పాటు చేస్తే ఆమె చాలా ఇబ్బంది పడిపోయిందట. చేసేది లేక, ఆమెను ఆహ్వానించిన జర్నలిస్ట్ ఆమెను తన ఇంటికి పిలిచి, ఇంట్లో భార్య కూడా లేని కారణంగా ఏంపెట్టాలో తెలియక ఇబ్బంది పడుతూ, ఎండిపోయిన బ్రెడ్ ముక్కలూ, పచ్చడీ ఉల్లిపాయలే గతి అనుకుని భయపడుతూ, ఏం మాట్లాడాలో కూడా తెలియక "మీ పళ్ళు గట్టిగా ఉన్నాయా?" అని అడిగాడట (ఎండిన బ్రెడ్ ముక్కలు తినడం కోసం) తనను చూడగానే వేసిన ఈ అసందర్భ ప్రశ్నకు అంతవరకూ చిరాకుగా ఉన్న ఆమె పగలబడి నవ్విందట. మా ఇంట్లో మీకు సౌకర్యంగా ఉండక పోవచ్చు ఇక్కడ సదుపాయాలు సరిగా లేవని అంటే, "మీరు మా ఇంటికి వచ్చి చూడండి" మీ ఇల్లు నాకు లక్జురీ అందట ఆమె. అదీ ఆమె వ్యక్తిత్వం. ఇక ముందు మీరు మీ జీవితంలో ఏంచెయ్యదల్చుకున్నారన్న ప్రశ్నకు ఆమె ఇలా సమాధానం ఇచ్చింది. "Fight for the tribals, downtrodden, underprivileged and write creatively if and when I find the time".     ....Sivapurapu Sharada

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? స్వర్ణకుమారీ దేవి బెంగాలీ

  మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? స్వర్ణకుమారీ దేవి బెంగాలీ   స్వర్ణకుమారీ దేవి దేబేంద్రనాథ్ కూతురు, రబీంద్రనాథ్ ఠాగూర్ కన్నా అయిదేళ్ళు ముందు పుట్టింది. ఆమె రాయని ప్రక్రియ లేదు. నవల (13 నవలలు), నాటకం, వ్యాసం, పాట, కవిత్వం, కధలు ఇలా. అంతే కాదు పాత్రికేయురాలు, సంగీతంలో ప్రతిభ, సమాజ సేవకురాలు. ఎన్నో మొదటిసారి రాసిన ఘనత ఆమెది. విశ్వం, భూమి, సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలూ, వాటి పుట్టు పూర్వోత్తరాలు, తేలికగా ఆడవారికి అర్ధమయ్యే భాషలో, చాలా ఆసక్తికరంగా రాసేదట. దీని కోసం ఆమె ఎన్నో పుస్తకాలు చదివేదట. మొదటిసారి సంగీత రూపకం రాసిన ఘనత, మొదటిసారి నవల రాసిన ఘనత కూడా ఆమెదే బెంగాలీలో. ఈమెకు కూడా విద్యాభ్యాసం ఇంట్లోనే. అదింకా ఆడపిల్లల చదువు సంధ్యలు, బయటికి వెళ్ళడం మీద ఆంక్షలున్న రోజులు కదా. దేబేంద్రనాథ్ కుటుంబం దీనికి భిన్నమేమీ కాదు. అప్పుడప్పుడే వదులవుతున్న సంకెళ్ళని వాడుకుంటూ ఎదిగిన పిల్లే స్వర్ణకుమారి కూడా. పధెనిమిది ఏళ్ళ వయసులో అన్న ద్విజేంద్రనాథ్ స్థాపించిన భారతి పత్రికకు జ్యోతిరింద్రనాథ్ తో పాటుగా సంపాదకీయం నిర్వహించింది ఆమె. ఆమె రాసే సైన్సు వ్యాసాలన్నీ అందులోనే అచ్చయ్యేవి. భారతి ఆరోజుల్లో మేధావుల మేగజిన్. ప్రాధమిక విద్యాభ్యాసం కూడా లేకుండా ఆమె రాసిన అద్భుతమైన సైన్స్ ఎస్సేస్ అన్నీ కలిపి భూగర్భ్ అనే సంకలనంగా తీస్కొచ్చారు. అవి ఆమె ఉన్న కాలానికి ఎంతో ముందైనవి, సరళమైన భాషలో, ఆరోజుల్లో సైన్స్ జోలికి కూడా పోని ఆడవారికి తేలికగా అర్ధమయ్యే బెంగాలీ భాషలో రాయడం ఎంతో గొప్ప విషయం. ఈ వ్యాసాలు రాసే క్రమంలో బెంగాలీ లో కొత్త సైంటిఫిక్ పదాలు, ఇంగ్లీష్లో వాడే పదాలకు సమాంతరంగా ఆమె వాడిందట. ఈరోజున మార్స్ గ్రహం మీద లైఫ్ ఉందా అని పరిశోధనలు జరగడం మనకు తెలుసు. కానీ ఆరోజుల్లోనే లైఫ్ ఆన్ మార్స్ గురించి ఆమె వ్యాసాలు రాసింది. అలాగే భూమి మనుగడకి వచ్చిన ముప్పుని గురించి మనం ఇంకా సీరియస్గా ఆలోచించలేకపోతున్నాము. కాని అప్పుడే ఆమె ఏం రాసిందో చూడండి. “The earth is apprehensive as to who will bring its dooms day. If it dies once and for all, the problem ends. The earth is dying every minute like a coward fearing death at every step, for it, life seems to depend on the word of the people and words do not cost”. భౌతిక శాస్త్రాధ్యయనంకి స్త్రీల ఉన్నతికి సంబంధం ఉందని ఆమె విశ్వసించింది. ఇది పురుషులు మాత్రమే అధ్యయనం చెయ్యగలిగిన, చెయాల్సిన శాస్త్రం అన్న భావన తొలగించడంలోనే ఆమె విజయం. అధ్యయనం చెయ్యగలమన్న భావనతో వచ్చే విశ్వాశం యొక్క శక్తిని ఆమె నమ్మింది. ఆ శక్తి ఇవ్వడానికి ఆమె కృషి చేసింది. ఆమెకు జానకీనాథ్ ఘోషాల్ తో వివాహం జరుగుతుంది. జానకీనాథ్ ఘోషాల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఈ కారణంగా స్వర్ణకుమారి కూడా అప్పటి రాజకీయాల్లో చురుగ్గా ఉంది. స్వదేశీ ఉద్యమంలో పాలు పంచుకుంటుంది. అయితే ఎవరో కొందరికి తప్ప అప్పటి ఉద్యమంలో స్త్రీల పాత్ర గాంధీ గారి చరఖాతో ఇంట్లోనే ఉండి మిగతా బాధ్యతలు నిర్వర్తిస్తూ నూలు వడకటానికే పరిమితమయ్యింది చాలావరకూ. స్వర్ణకుమారి పరిస్తితి కూడా ఇందుకు భిన్నమైనది కాదు. ఆమె కృషి అంతా ఇల్లు కేంద్రంగానే జరిగింది. ఆమె శక్తి సమితి అనే సంస్థని స్థాపించి, దాని ద్వారా అమ్మాయిలకి, భర్త పోయిన స్త్రీలకి విద్య నేర్పించింది. అనాధ విధవ స్త్రీల కోసం కూడా ఒక షెల్టర్ పెట్టింది. ఈ సంస్థని నడపటం కోసం, ధనం సేకరించడం కోసం ఆమె బంగ్లా సిల్క్, ధాక సిల్క్ చీరల ప్రదర్శనలేర్పాటు చేసేది. Handicrafts fairs organise చేసేది. నాటకాలు రాసి వాటిని ప్రదర్శించేదట. విధవల పునర్వివాహానికి ఆమె తండ్రి వ్యతిరేకి. రబీంద్రనాథ్ కూడా ఈ విషయంలో తన అభిప్రాయం వ్యక్తపరచకుండా తన ఒక నవలలో కేరక్టర్ చివరికి భక్తి, అధ్యాత్మికతలో మునిగి, రాజకీయం మగవారికి వదిలేసినట్టుగా చూపిస్తాడు. కాని స్వర్ణకుమారీ దేవి ఈ విషయంలో వారిద్దరికన్నా ఒకడుగు ముందుకేసి వివాహమొకటే కాకుండా, వారు స్వతంత్రంగా స్వేఛ్చగా బ్రతకాలంటే విద్యావకాశాలు, ఆర్ధిక స్వతoత్రతా అవసరమని భావిస్తుంది. నిజానికి ఒకసారి పెళ్ళి అనే వ్యవస్థకి బలయినవారే కాబట్టి వారిని మళ్ళీ అందులోకే నెట్టడం, మిగతా పరిస్తితులలో ఏ మార్పూ లేకుండా అనేది ప్రయోజనం లేనిదే కదా. ఆమె రాసిన నవలలన్నీ కూడా బంకిం చంద్ర చట్టర్జీ నవలలంత పాపులర్. ఆమె రాసిన ఒక కధల సంకలనం (ఆంగ్లంలోకి తర్జుమా చేసింది) వెనక పేజీ మీద రాసిన రెవ్యూ లో ఈ విధంగా రాస్తారు. “Mrs.Ghoshal is a sister of Rabindranath Tagore to whom the Noble Prize was recently awarded. If the poet's merits are great, those of his sister are scarcely less, and both East and West will agree that it is a charming revelation of the workings of a woman's heart. In its sweet simplicity and delicacy of tough, faded readers will experience a new sensation.” రబీంద్రనాథ్ ఠాగోర్ కన్నా ఏమాత్రం తీసిపోదని ఒక పక్క పొగుడుతూనే, ఇంకో పక్క స్వీట్ అండ్ చార్మింగ్ అని అభిప్రాయాన్ని వ్యక్తపరచడం, సిగ్గువిడిచిన సామ్రాజ్యవాదానికీ, నిస్సంకోచ పురుషాధిక్య మనస్తత్వానికి చిహ్నమని అనిపిస్తుంది. పైగా అప్పటి సాహిత్యాకాశంలో వెలుగుతున్న కొద్దిమంది పురుషుల్లో ఆమె సోదరుడు కూడా ఒకరు. ఆమె ఆంగ్ల వనితకాదు, పురుషుడూ కాదు, రబీంద్రనాథ్ ఠాగూరూ కాదు. ఇన్ని రకాల వివిక్షలతో ఆమె ఆంగ్ల రచనలని స్వీకరించింది అప్పటి బ్రిటిష్ పురుష ప్రపంచం. ఎందుకంటే బ్రిటిష్ వారికి వారిది చాలా గొప్ప సంస్కృతని, స్త్రీలని వారి సంస్కృతిలో గొప్పగా చూస్తారని ఒక దురభిప్రాయం. ఇది కొంచం బలపడటానికి కారణం అప్పుడు భారతదేశంలో ఉన్న సతి అనే ఆచారం. పురుషుల్ని, వీరులనుకున్న వారిని ఎలాగూ వారణిచి వేసి వారి సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇక స్త్రీలని చూస్తే దయనీయమైన స్తితి. ఈ రెండు అంశాలూ బ్రిటిష్ వారి చిన్న చూపుకి కారణం భారతదేశం మీదా, భారతదేశ సంస్కృతి మీదా. ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సైనికులకు సాయంగా వెళ్ళిన భారత సైనికుల పోరాట పటిమ ఈ పరిస్తితిని కొద్దిగా మార్చి కాంగ్రెస్ అభిలషిస్తున్న స్వయం పరిపాలన సాధ్య పడొచ్చని ఆశ పడ్డ మాట నిజం, కానీ అలా జరగలేదు. సిగ్గులేని బ్రిటిష్ పాలకులు మొండిచేయి చూపెట్టారు. స్వర్ణకుమారి రాసిన 'ఎ మ్యుటినీ' అనే కధలో ఈ విషయాలన్నీ చర్చిస్తుంది. సతి అనే ఆచారం ప్రకారం భర్త చితిలో తాను కాలి చనిపోవడానికి కావల్సిన గుండె నిబ్బరం, ఆత్మ స్థైర్యం చూపెట్టే స్త్రీ, వీరులైన పురుషులకి, యుద్ధంలో ఒక ఆశయం కోసం, పర పరిపాలన పీడనుండి స్వదేశీ విముక్తి కోసం, ఆత్మ త్యాగానికి సిద్ధపడే వారికి ఆమె ధైర్యం, ఒక స్పూర్తి, ఆదర్శం కాదా అని ఒక వైపైతే . ఆ రకంగా భర్త చితితో పాటు కాలిపోవడానికి ఇష్ట పడని స్త్రీలను బంధువులంతా కలిసి బలవంతంగా చితిపై కాల్చి చంపేసే ఆచారం ఎంత కౄరమైనది, భర్త తరవాత గౌరవంగా జీవించ లేని పరిస్తితి ఉన్న సమాజం ఎంత వెనకబడ్డది? ఎ మ్యుటినీ అనే కధలో జరిగే చర్చ ఇది. ఈ చర్చ చెయ్యడానికి స్త్రీగా ఆమె జీవితంలో ఆమెకు ఎంత్ర స్వతంత్రం ఉంది, ఎంత సమానత్వం ఉంది తనదైన సమాజంలో పురుషులతో బాటు తనకు అని ఆమె సందేహిస్తుంది. అలా చర్చించేటప్పుడు తన సమాజంలో ఆడదానిగా తనకున్న తక్కువ స్థానం గురించి ఆమె బాధ పడుతుంది. అసలు చూస్తే, తారాబాయి షిండే (పోయిన వారం మనం తెలుసుకున్న రచయిత్రి) స్వర్ణకుమారి ఇద్దరు సమకాలీకులే. కాని ఈమె తారాబాయి షిండే లాగా పురుషాధిక్యతని ప్రశ్నించలేదు. ఒక ధనిక, ఉన్నత కుటుంబంలో పుట్టడం, ఎన్నో ఆంక్షల మధ్య, ఆచారాలు, పరవు, ప్రతిష్టల బరువుతో పెరగడం ఈమె కున్న ప్రతిబంధకాలు ఒక రకంగా. నిజానికి ఠాగూర్ కుటుంబంలో ఇంకొక వ్యక్తికి, వారి ప్రతిభకు సమానంగా గుర్తింపు రాలేదు. ఎవరూ కూడా ఆయన నీడ నుండి బయట పడలేదు, ఎంతో ప్రతిభావంతులైయుండి కూడా. ఆమె రాసిన ఒక బెంగాలీ నవల (“An unfinished song” in English) అచ్చయినప్పుడు ఆమె సోదరుడు (supposed to be రబీంద్రనాథ్ ఠాగూర్) తన ఒక ఇంగ్లీష్ స్నేహితుడికి ఈ రకంగా రాసారట. “She is one of those unfortunate beings who has more ambition than ability. But just enough talent to keep her alive for a short period. Her weakness has been taken advantage of by some unscrupulous literary agents in London and she has had her stories translated and published. I have given her no encouragement but have not been successful in making her see things in the proper light.” (Source: Teresa Hubel's essay “ A mutiny of silence: Swarna Kumari Devi's Sati, a review of international english literature) ఇలాంటి నిజాలు బయటికి రావు, వచ్చినా నమ్మశక్యంగా ఉండవు. స్త్రీలు ప్రగతి పధంలో అడుగులేస్తే ప్రతిఘటన ఇంట్లోనే ఉంటుందనటానికి ఇంతకంటే క్లాసిక్ ఎక్సాంపుల్ ఇంకేముంటుంది? అయితే ఆమె మాత్రం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికీ భారత దేశంలోని పితృవాద పురుషాధిక్యతకూ మధ్య ఆనాటి అభ్యుదయ మహిళల ప్రతిభ అనేక సందర్భాలలో నిస్సందేహాత్మకంగా మరుగున పడిపోయిందని గమనించింది. ఇలాంటి ఫిర్యాదులని అప్పటి సమాజానికి అర్ధమయ్యే రీతిలో మహిళలు చెప్ప గల్గటానికి ఆమె రచనల ద్వారా కృషి చేసింది. ఆమె చెయ్యడమే కాకుండా మిగతా స్త్రీలు కూడా ఆ దశకి చేరుకోడానికి కావల్సిన స్పూర్తినీ, విజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేసింది. ....Sivapurapu Sharada

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? మహలఖా బాయి చందా

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? మహలఖా బాయి చందా     మొఘల్ వంశంలోని ఆసఫ్ జాహీ సుల్తానుల చరిత్రలో ఎంతో ఒడిదుడుకులతో నడుస్తున్న కాలమది. ఔరంగాబాదులో పుట్టింది మహలఖా బాయి చందా. ఆమె రాజ్ కున్వర్ అనే రాజ్ పుటాని స్త్రీకి మొగల్ సామ్రాట్టు మొహమ్మద్ షా దగ్గర సైన్యంలో పనిచేసే బహదుర్ ఖాన్ కి పుట్టింది. అయితే ఈమె పిన తల్లికి పిల్లలు లేక ఈమెను పెంచుకుంది. పినతల్లి భర్త నవాబ్ రుకుండ్ దౌలా దక్కన్ నిజాం వద్ద Prime Minister. ఈయన చందా బీబీ పై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని పధ్నాలుగేళ్ళకల్లా ఆమెకు గుర్రపు స్వారీ, శస్ట్ర విద్య నేర్పించాడు. అంతే కాదు ఈమె నిజాం 2 తో పాటుగా యుద్ధాల్లో పాల్గొనేదట. మంచి పేరు, బాణాలు సంధించటంలో. చిన్నప్పుడుఎప్పుడూ మగవేషంలోనే ఉండేదట. యుద్ధ విద్యలే కాకుండా చక్కటి విద్యాభ్యాసం చెప్పించాడు. ఆమె అరబ్బీ, ఉర్దూ, బోజ్ పూరి భాషల్లో సిద్ధహస్తురాలు. ఉత్తరాదిన ముఖ్యంగా లక్నవ్ లో వేశ్యలకు మంచి గౌరవమే ఉండేదట సమాజంలో. వేశ్యల్లో మూడు రకాలు ఉన్నారు. ఒకటి, డబ్బు తీసుకొని ఒకరితో ఉండిపోయి, కొన్ని కొన్ని సార్లు వారినే వివాహం కూడా చేసుకుని జీవించేవారు. రెండు, ఒకే చోట ఉండి వృత్తి చేసుకునేవారు. మూడు, వేరే వేరే ఊళ్ళకి మకాంలు మారుస్తూ వృత్తి చేసుకునే వారు. మహలఖా బాయి ఏ కోవకు చెందినదో తెలియదు. అసలు వేశ్య అవునో కాదో కూడా కరెక్ట్ గా తెలియదు. ఒక చోట వేశ్య అని రాసినా ఇంకో చోట అటువంటి ప్రస్తావన కూడా లేదు. అయితే వేశ్యలకు గౌరవనీయ స్థానం ఎందుకు వచ్చిందంటే, వారి వద్దకు వచ్చే విటులకు సమాజంలో ఉన్న స్థానం వల్ల ఒకటయితే , రెండు, సాధారణ గృహిణుల్లా కాకుండా, వీరికి విద్యాభ్యాసం, సంగీతం, నృత్యం లాంటి కళల్లో శిక్షణ, ప్రవేశం, నైపుణ్యం ఉండటం, వారి వద్దకు వచ్చే విటులతో సమంగా కవిత్వాన్ని ఆస్వాదించడం, రాయటం రావటం వల్ల. ధనికులు, ఉన్నత వర్గాలు తమ ఇళ్ళల్లోని మగ పిల్లల్ని వీరి వద్దకు కొన్ని సభ్యతా, సంస్కారాలు నేర్చుకోవటానికి పంపే వారంటే చూడండి సమాజంలో వీరికున్న ఆదరణ. చిన్న పిల్లగా మహలఖా బాయి చందాకు సిరాజ్ అలహాబాదీ అనే కోర్ట్ పొయెట్ కవిత్వం అంటే చాలా ఇష్టమట. ఆమె స్వతహాగా మంచి గాయని. ఆమె పాటలు ఆమె రాసుకుని బాణీ కట్టి పాడేదట. మాటల్లో చతురత, హాస్యం, ఉత్సాహం, చక్కని అందం ఆమె సొంతం. ఆమె కవిత్వం నవాబ్ మీర్ ఆలం అనే కవి దగ్గర నేర్చుకుంది. దీవాన్ అంటే గజల్సు సంకలనం. 39 గజల్సు, ప్రతి గజలుకు 5 ద్విపదలు, 'దీవాన్ ఎ మహలఖా' అనే సంకలనం. ఆమె రాసి సంతకం చేసిన దివాన్ ఎ చందా 125 గజల్సు సంకలనం ఆమె ఎంతగానో అభిమానించిన కేప్టైన్ మాల్కం కి బహుమతిగా ఇచ్చింది మీర్ ఆలం ఇంట్లో జరిగిన ఒక నృత్య కార్యక్రమంలో. ఇప్పుడది బ్రిటిష్ మ్యూసియం లో భద్రంగా ఉంది. మహ్ లఖా అనేది ఒక బిరుదు. చంద్రుని పోలికలో ఉన్నది అని అర్ధమట. ఆమెకు కొన్ని సందర్భాలలో జాగీర్లుగా ఇప్పటి చందానగార్, అడిక్ మెట్, హైదర్ గూడా, సయ్యద్ పల్లి ప్రాంతాలు ఇచ్చారట. ఆమె ప్రేమించింది రాంభా రావ్ అనే ఒక మరాఠా సైన్యాధికారి. ఇతను రెండవ నిజాం తరపున మరాఠా రాజ్యంతో పోరాటం చేసాడు. Captain Sir John Malcolmఅంటే ఈమెకు చాలా అభిమానం. ఈమె ఎవరినీ పెళ్ళి చేసుకోలేదు. నిజాము Prime Ministersకు ఉంపుడుకత్తె గా ఉండిపోయింది. అందువల్లే ఈమెను వేశ్య అని కొన్ని చోట్ల పేర్కొనడం జరిగిందనుకుంటా. ఏమైతేనేం ఈమె నిజాం రెండు, మూడు దగ్గర కోర్ట్ లో ఉన్న ఏకైక స్త్రీ. చాలా powerful and influential lady. ఈమెను ముఖ్యమైన పాలనా వ్యవహారాల్లో కూడ పాలకులు సంప్రదించేవారంటేనే ఈమె ఎంత ప్రతిభాశాలో తెలుస్తుంది కదా. ఆమె ఉన్న ఇల్లు ఇప్పుడు Government Degree College for girls గా మార్చారట నాంపల్లి హైదరాబాదులో. మహలఖాబాయి జీవిత చరిత్ర రాసిన సమీన షౌకత్ ప్రకారం మహలఖాబాయి జీవితంలో అత్యున్నత స్తితికి కవయిత్రిగా, గాయనిగా చేరుకుంది హైదరాబాదులోనే. రాచ కుటుంబీకులు, ఇతర ఉన్నత పదవుల్లోఉన్న వాళ్ళు, ముఖ్యులు ఇలా చాలా మంది ఆమె అభిమానులే. కళల పట్ల ఆమెకున్న అభిమానం వల్ల చాలా డబ్బు ఖర్చు చేసింది వాటి ఉన్నతికి. మహ లఖా ఒక గ్రంధాలయం స్థాపించి ఎన్నొ గ్రంధాలను, manuscripts పొందు పరిచింది. కవిత్వంతొ పాటు ఇతర కళాత్మక వస్తువుల్ని, శాస్త్ర పరిజ్ఞానానికి సంబంధించిన వాటిని సంగ్రహించి అందరికి అందుబాటులోకి తెచ్చింది. ఒక నృత్య, సంగీత పాఠశాల పెట్టి ఎంతొ మంది ఆడపిల్లలకి శిక్షణ ఇప్పించింది. తను ఇస్లాం నే నమ్మినా తల్లి హిందూ అయిన కారణంగా హిందూ వేదాంతం వల్ల కూడా ప్రభావితమైంది. రాజస్థానీ కట్టడాల శైలిలో తన అసలు తల్లికి ఇప్పటి మౌలా ఆలి లో సమాధి కట్టించింది. చాలా చక్కటి నిర్మాణమది. ఇప్పటికీ అందంగా maintain చెయ్యబడుతోంది. మరణించిన తరవాత ఆమెను కూడా అక్కడే సమాధి చేసారు. మీర్జా హాది రుసువా రాసిన ఉమ్రావ్ జాన్ అదా కి స్పూర్తి మహ్ లఖా అని చెప్తారు. ఎందుకంటే ఈమె కథక్ నృత్య రీతిలో నాట్యం చేస్తూ వివిధ రాగాలను మిళాయించి ఆలపించేదట. ఇప్పటికీ కొన్ని ప్రార్ధనా మందిరాలు ఆమె కట్టించినవి ఉన్నాయట ఆమె గుర్తుగా. ఆమె చనిపోయిన తరవాత ఆమె ధనం, ఆస్తులు, నగలు అన్నీ పేద స్త్రీలకు పంచి పెట్టారట. వేశ్యలకు కవిత్వం కొత్తేమీ కాదు అయితే అది ఎప్పుడూ, భద్ర పర్చడం జరగలేదు. అదృష్టవశాత్తూ మహలఖాబాయి రచనలు దాచడం జరిగింది. ఆమె రాసిన వన్నీ గజల్సు. సమీనా షౌకత్ ప్రకారం మహలఖా బాయి మొదటి ఉర్దూ కవయిత్రి.. దెక్కనీ ప్రాంతం (గోల్కొండ) హైదరాబాదు, బీదరు ప్రాంతాల్లో ఉర్దూ కవిత్వం గజల్ ప్రక్రియలో బాగా వృద్ధి చెందింది. ఈ ప్రభావంతోనే ఉత్తరాదిన కూడా తరవాత గజల్ ప్రక్రియ అభివృద్ధి చెందిందట. మహలఖాబాయి రాసిన గజలు ఒకటి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువదించాను. ఎంతవరకూ దాని ఒరిజినల్ అందం మిగిలిందో తెలియదు కానీ, ప్రయత్నించాను చూడండి. Hoping to blossom (one day) into a flower. Hoping to blossom (one day) into a flower, Every bud sits, holding its soul in its fist. Between the fear of the fowler and (approaching) autumn, The bulbul’s life hangs by a thread. Thy sly glance is more murderous than arrow or sword; It has shed the blood of many lover. How can I liken a candle to thy (glowing) cheek? The candle is blind with the fat in its eyes. How can Chanda be dry lipped. O Saqi of the heavenly wine! She has drained the cup of thy love. పువ్వుగా వికసించాలని (ఒకరోజు) ఆశిస్తూ ఏదో ఒకరోజు పువ్వుగా వికసించాలని ఆశిస్తూ ఆత్మను గుప్పిట పట్టుకు కూర్చుంటుంది ప్రతి మొగ్గ ఆకురాలు కాలం, వేటగాడి భయాల మధ్య, పికిలిపిట్ట ప్రాణం ఒక తాడుకు వేలాడుతుంది. కత్తికన్నా, బాణం కన్నా ప్రాణాంతకమైనది నీ ఓరచూపు; ఎంతోమంది ప్రేమికుల రక్తం కార్పించింది. వెలుగుతుందని కొవ్వొత్తిని నీ అధరాలతో ఎలా పోల్చను? కళ్ళనిండా కొవ్వు నింపుకున్న గుడ్డిది కొవ్వొత్తి. చందా ఎండిన పెదాలతో ఎలా ఉండగలదు, స్వర్గాన్నుంచి మధువు తెచ్చే ఓ సాఖీ! మధు పాత్రలోని నీ ప్రేమనంతా ఆమె ఒంపేసింది.     ....Sivapurapu Sharada

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? ఆశాపూర్ణా దేవి - బెంగాలి

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? ఆశాపూర్ణా దేవి - బెంగాలి   ఆశాపూర్ణా దేవి జ్ఞానపీఠ్ ఎవార్డ్ గ్రహీత, కలకత్తాలో పుట్టింది. రచయిత్రులందరూ తెలుసుకోవాల్సింది, గర్వించాల్సిందీ, గుర్తుంచుకోవాల్సిందీ ఏంటంటే ఈమె మొట్టమొదటిగా జ్ఞానపీఠ్ ఎవార్డ్ కై ఎంపికైన రచయిత్రి. పెద్ద కుటుంబం, ఆడపిల్లలు, మగపిల్లలు, చుట్టాలు. అతి చాందస కుటుంబం. ఆడపిల్లలనేకాదు మగపిల్లలకు కూడా ఇంట్లోనే ట్యూటర్ ని పెట్టి చదువు చెప్పించారట. ఆడపిల్లలకి అది కూడా నిషిద్ధమే అయినా, తల్లి విద్యావంతుల కుటుంబం నుంచి రావటం, పుస్తకాలంటే ఉన్న పిచ్చి ప్రేమ వల్ల, మగపిల్లల పక్కన కూర్చునే రాయటం చదవటం సొంతంగా నేర్చుకున్న పరిస్తితి. వీరంతా కనపడిన పుస్తకమల్లా పోటీ పడి చదవటం, చర్చించుకోవటం, శ్లోకాలు అప్పచెప్పుకోవటం లాంటివే కాలక్షేపాలు. ఇదే ఉత్సాహంలో పదమూడేళ్ళ వయసులో ఒక కవిత రాసి రహస్యంగా ఒక పత్రికకి పంపిందట ఆశాపూర్ణ. ఆ కవిత అచ్చేయడమే కాకుండా, ఇంకా కధలూ కవితలూ రాసి పంపమని కోరాడట ఆ పత్రిక సంపాదకుడు. అలా మొదలయిన ఆమె డెబ్భైఏళ్ళ సాహిత్య ప్రస్థానం చనిపోయేవరకూ తారాస్థాయిలోనే కొనసాగిందట. పదిహేనేళ్ళకి పెళ్ళయింది. అయితే గృహిణిగా తన బాధ్యతలు నిర్వహిస్తూ ఆమె చేసిన కృషి అనితర సాధ్యం. గాంధీ గారి స్వతంత్ర పోరాటం, రాజకీయంగా అనిశ్చిత పరిస్తితులు, మారుతున్న సమాజం, మత ఘర్షణలు, వేర్పాటు వాదాలు అన్నీ కలగలిపి ఉన్న వాతావరణంలో పెరిగిన ఆమెకు చిన్నప్పటినుండే కొన్ని జీవితాశయాలు, సాహిత్యాభిలాష, ఆడవారిపై సమాజంలో ఉన్న చిన్న చూపు, సంప్రదాయాల పేర వారికి జరుగుతున్న అన్యాయాల పట్ల నిర్దిష్టమైన అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఆమె 242 నవల్లు, 37 కధా సంకలనాలు, కధల సంఖ్య 3000, 62 చిన్న పిల్లల పుస్తకాలు రచించిందట. ఈమె రచనల సంఖ్య మీద కొన్ని తేడాలు కనిపించినా వికీపీడియా సంఖ్యనే నేను తీసుకున్నాను.ఒకసారి కళ్ళు తిరుగుతాయి ఈ సంఖ్యలు చూస్తే. ఎలా సాధ్యమా, గృహిణి గా బాధ్యతలని నిర్వర్తిస్తూ అనేది అలోచనకందని విషయం. ఆమె రచనలన్నీ కుటుంబ జీవితం మీదా, ఆడవారి సమస్యలు, స్వేఛ్చకోసం చేసే వారి పోరాటాలమీదా, కేంద్రీకృతమైనవి. మహాశ్వేతా దేవితో సమానమైన రచయిత్రిగా ఈమెను బెంగాలు పాఠకులు గుర్తించినా, ఈమె ప్రతిభ దేశమంతా గుర్తింపబడలేదు. ఈమెకూ మహాశ్వేతా దేవికీ ఉన్న భేదమల్లా, ఈమె రచనలు కుటుంబల్లోని స్త్రీ పురుష సంబంధాలు, సమస్యలూ అయితే, మహాశ్వేతాదేవి ఈ పరిధి దాటి రచనలు చేసింది. ఇంత ఎక్కువగా రాసిందని ఆమె రచనల్లో వైవిధ్యం లేదనో, ఒకే మూసలో పోసినట్లు ఒకే రకమైన కధలూ, నవల్లూ అనుకుంటే పొరపాటే. అద్భుత కధా రచియిత్రిగా ఆమె పేరు బెంగాలు, అస్సాం రాష్ట్రాల్లో తెలియనివారు ఆమె కధలు చదవని పాఠకులు లేరంటే అతిశయోక్తి కాదట. ఈమె కొచ్చిన ఎవార్ద్స్ కుదిస్తే ఇది. అతి ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకేడమీ ఫెల్లోషిప్ కూడా ఆమెకు వచ్చింది. రాయటం చదవటం ఇంట్లో నేర్చుకుని, కేవలం స్వయంకృషితో ఇంత గుర్తింపు తెచ్చుకోవటం ఎంతో గొప్ప విషయం.     The Lila Prize from the University of Calcutta (1954)     The Bhutan Mohini Dasi Gold Medal (1966):     The Raindrop Memorial Prize from the Government of West Bengal (1966)     The Jnanpith Award (1976) for Prothom Protishruti[3]     The Haranath Ghosh Medal from the Bangiya Sahitya Parishad (1988)     The Jagattarini Gold Medal from the University of Calcutta (1993) 26 ఏళ్ళ వయసు వరకూ ఈమె కేవలం చిన్నపిల్లల కోసమే రాసిందట. ఆ తరవాతే ఆమె పెద్దవాళ్ళ నవలలు రాయటం మొదలు పెట్టింది. ఆమె ప్రతిభ తెలియడానికి ఒక కధని ఇక్కడ ప్రస్తావిస్తాను. చిన్న మస్త అనే కధలో ముఖ్య పాత్ర జయాబొతి ఒక విధవరాలు. తన కొడుకే తన ప్రాణంగా, ప్రపంచంగా బ్రతుకుతుంటుంది. పెద్దవాడయ్యాకా అతనికి పెళ్ళి చేస్తుంది. కోడలు వస్తుంది. వీరిద్దరికీ, చిన్న చిన్న విషయాలపైనే గొడవలు రావడం మొదలవుతుంది. తన విధవతనాన్ని ఎత్తి చూపుతూ కోడలు అన్న మాటలకు ఎంతో మనసు కష్టపడ్డ జయబొతి దేవుడిని తన కోడలికి తగిన పాఠం నేర్పమని వేడుకుంటుంది. కొన్నాళ్ళకి దురదృష్టవశాత్తూ, కొడుకు ఏక్సిడెంట్లో చనిపోతాడు. ఇద్దరికీ ప్రపంచం తలకిందులవుతుంది. అతి కష్టం మీద ఈ దుఖమ్నుంచి కోలుకుంటుంది జయబొతి. కానీ కధ ఇక్కడ అంతమవదు. జీవితంలో దెబ్బతిన్నాకా పొగరణిగిపోయిన కోడలిని ఎంతో ప్రేమ ఒలకపోస్తూ భోజనానికి రమ్మన్నపుడు కోడలు ప్రవర్తించిన తీరు చూసి ఒక సన్నటి చిరునవ్వు, విజయగర్వంతో కూడినది ఆమె పెదవులపై మెరుస్తుంది. జయబొతిలో కొడుకు పోయిన దుఖం, విధవరాలుగా పడ్డ కష్టాలు, అంతకన్నా మించి, కోడలు తనమీద సానుభూతి కూడా లేకుండా అవమానించిందన్న, కోపం, పగ ఇన్ని ఇమోషన్స్ ఉన్నాయి. చివరగా, కేవలం కోడలి మీద పగతో అలోచిస్తే, ఆమెకూ తగిన శాస్తి జరిగిందని, విధవరాలుగా తను పడ్డ కష్టం ఏమిటో తెలిసొస్తుందన్న సంతోషం. ఇవన్నీ ఒకదానికొకటి పరస్పర విరుద్ధ భావోద్వేగాలే. అదే కదా మనిషికి ఎప్పుడూ సంఘర్షణ. ఎప్పటికీ ఇలాంటి ఏదో ఒక మానసిక సంఘర్షణలో పడి కొట్టుకపోవడమే మనిషి కలవాటు. అయితే మనం ఇక్కడ ఆలోచించాల్సింది స్త్రీల సమస్యల పట్ల సానుభూతి ఉండి వారి పరిస్తితులు మారాలని, సమాజం మారాలని ఆశించిన ఆశాపుర్ణాదేవి ఇలా రాసి పాఠకులని, ఆమె రచనలని ఎంతో ఇష్టపడే పాఠకులని ఆమె ఎందుకు నిరాశ పర్చినట్టు? ఒక తల్లి పాత్రని అలా చిత్రించి ఆడవారిని ఆమె ఎందుకు ఇబ్బంది పెట్టినట్టు. ఆమె అభిమానులు కొందరు ఈ కధ చదివాకా ఆమె రచనలు చదవటం మానుకున్నారట. కానీ ఆడవారు కూడా, రాగ ద్వేషాలకి అతీతులేంకారు. ఆడవారి సమస్యల గురించి మాట్లాడితే, సీరియళ్ళలో ఆడ విలన్ల మాటేమిటి, భార్యా పీడితులైన, బాధితులైన భర్తల మాటేమిటని కొందరు అడుగుతారు. అసలు ఆడదాన్ని దేవతగా గుర్తించే ముందు ఒక మామూలు మనిషని గుర్తించడం ముఖ్యం కదా. ఆమె దేనికీ అతీతురాలు కాదు. అతీతం అనుకున్నపుడే ఆడవారిలోని దుర్గుణాలు మరీ ఎక్కువగా బాధిస్తాయి. నా ఉద్దేశ్యంలో ఒక రచయిత్రిగా ఇలాంటి స్టాండ్ తీసుకోవటానికి ఆరోజుల్లో చాలా గట్స్ కావాలి. అవి ఆమెకు పుష్కలంగా ఉన్నాయి. ఆమె కధలే కాదు, కధలను మలిచే తీరు కూడా అంతే ప్రతిభావంతంగా లోతుగా అలోచింపచేసేవిగా ఉంటాయట. మీకెప్పుడైన ఆశాపూర్ణాదేవి అనువాదాలు చదివే చాన్స్ వస్తే మాత్రం మిస్సవకండి. ఆమె ఒక అద్భుతమైన రచయిత్రి.       ....Sivapurapu Sharada

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? సంచియ హొన్నమ్మ - కన్నడ రచయిత్రి

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి?   సంచియ హొన్నమ్మ - కన్నడ రచయిత్రి       అగ్ర వర్ణాల వాళ్ళో, విద్య అందుబాటులో ఉన్న వాళ్ళో, లేదా భక్తి పారవశ్యంలోఉన్న వాళ్ళో, కవిత్వాలు రాసారు, ఆశువుగా పాటలూ, పదాలూ పాడారు. కానీ ఇవేమీ లేని ఒక పనిమనిషి కవిత్వం రాసే స్థాయికి ఎదగడం చెప్పుకోదగ్గ విషయం కదూ అపుడైనా, ఇప్పుడైనా. సంచియ హొనమ్మ, మైసూరు రాజు చిక్క దేవరయ (1672-1704) దగ్గర పనిమనిషి. రాణి దేవజమ్మణ్ణి కి ఇష్ట సఖి. రాజ ప్రాసాదంలో ఆమె పని, రాజ కుటుంబీకులకి పాన్ లు అందించడం. అందుకు ఆ సరంజామా అంతా ఒక సంచిలో వేసుకుని ఆమె అందరి దగ్గరికి వెళ్తూ వస్తూ ఉండేదిట, అందుకు ఆమె పేరు కూడా సంచియ (అంటే కన్నడలో సంచి అనే అర్ధము) అని వచ్చిందట. ఆమె ఎంత తెలివైనదంటే, ఆస్థాన కవి సింగరాచార్య, పదాలతో ఆమె కున్న పట్టుని గమనించి ఆమెను శిష్యురాలికింద స్వీకరించి, చదవటం రాయటం నేర్పాడట. ఆమె ఉత్సాహం, నేర్పరితనానికి ముగ్ధుడై ఆమెకి కవిత్వం రాయటం రాయటానికి కావల్సిన మెలకువలు కూడా నేర్పాడట. పైగా ఆమెను ముద్దుగా సరస సాహిత్యాది వరదేవత అని పిలిచేవాడట. కన్నడనాట 9 వ శతాబ్దం నించి 12 వ శతాబ్దం వరకూ జైనుల రచనలు, తీర్ధంకరుల గురించి, వారి జీవిత గాధల గురించి, రాజుల గురించి రాయబడ్డాయి. పన్నెండవ శతాబ్దం నించి పదహేనవ శతాబ్దం వరకూ వీరశైవం ప్రభావం ఉంది కన్నడ సాహిత్యంపై. బసవ, అల్లమ ప్రభు, అక్కమహాదెవై వీరశైవాన్ని ప్రచారం చేసిన కవులు. పదిహేనవ శతాబ్దం నించి పదిహేడవ శతాబ్దం వరకూ వైష్ణవ భక్తి ప్రభావం కనపడుతుంది. పదహారవ శతాబ్దంలో, వైష్ణవ కవులకి విజయనగర సామ్రాజ్యంలోని రాజులు ముఖ్యంగా క్రిష్ణ దేవరాయలు బాగా ఆదరించి ప్రొత్సహించాడు. రాయల ఆస్థానంలో తెలుగు కన్నడ, సంస్కృత కవులు ముగ్గురూ సమంగా భాసిల్లారు. విజయనగర సామ్రాజ్యం తరవాత కన్నడ సాహిత్యం ఇటు మైసూరు, కేలడి, అంటే ఇప్పటి శివమొగ్గ దిస్ట్రిక్ట్ లో ఉన్న రాజుల ప్రాపకంతో విలసిల్లింది. పదిహేడవ శతాబ్దంలోనే ఇటు అంగ్లేయుల ప్రభావం వారి సాహిత్య ప్రభావం కన్నడ సాహిత్యంపై పడి భక్తి ముఖ్యాంశంగా సాగిన సాహిత్యం సామాజిక, లౌకిక విషయాలపై కూడా మొగ్గు చూపింది. ఈ క్రమంలో కనిపిస్తుంది హొనమ్మ సాహిత్యం కూడా. హోనమ్మ హదిబధీయ ధర్మ (Hadabadeya Dharma – The Duties of a Devoted Wife) అనె కవితా సంకలనం రాసింది. ఇది ముఖ్యంగా ఒక వివాహిత నెరవేర్చవలిసిన ధర్మాలు, తన భర్త పట్ల, కుటుంబం పట్ల. ఎలా నడుచుకుంటే, భర్త ఇస్టాయిష్టాలనుబట్టీ సంసారం సాఫీగా సాగుతుంది అని వివరించింది. అయితే హొనమ్మ తను ఉన్నప్పటి సమాజాన్ని వ్యతిరేకించలేదు. అప్పటి సామాజిక విలువల్ని గౌరవిస్తూనే, అప్పటి కట్టుబాట్లలో ఉన్న లోపాలు/అతిలు మాత్రం ఎత్తి చూపింది. ఆమె చాలా విశ్వాసపాత్రురాలు, రాజకుటుంబానికి. ఒక సేవకురాలుగా పనిచేస్తూ చదవటం, రాయటం నేర్చుకుని, కవిత్వం రాసి సాహిత్య చరిత్రలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకుందంటే, ఇంతకాలం చరిత్రలో నిలిచిందంటేనే ఆమె ప్రతిభ ఏంటో అర్ధమవుతుంది. ఇప్పటికీ ఆడపిల్లలకి ఆమె చెప్పిన జాగ్రత్తలు వివాహం ముందు చెప్పే అలవాటు ప్రజలుకుందంటే కొంచం ఆశ్చర్యం కదూ. హొన్నమ్మ రాసిన ఈ పోయెం చూద్దాం. ఆనాటి ఆడవాళ్ళ పరిస్తితికి ఇది ఎలా అద్దం పడుతుందో చూడండి. ఎప్పటి సమాజం కూడా ఒక రకమైన నిర్లక్ష్యంతోఆడదై పుట్టాక కష్టాలు అనుభవించక తప్పుతుందా, సీతమ్మవారే తప్పించుకులేకపోయింది అనే కర్మ సిద్ధాంతాన్ని స్త్రీల జీవితాలకి కన్వీనియంట్గా అన్వయించుకుని వదిలేసింది. ఆడపిల్లల తండ్రులుగా బాధ పడే పురుషులు ఇప్పుడున్నట్టే అప్పుడూ ఉన్నారు, అయినా ఏదైనా చెయ్యాలని, పరిస్తితుల్ని మార్చాలని, పురుషులు మారాలని మాత్రం అనుకోలోదు. పురుషులు కూడా (హృదయం ఉన్న కొందరు) సైలెంట్ గానే బాధ పడ్డారు. Garathiya Haadu - Song of a Married Woman Wasn't it woman who bore them, Wasn't it woman who raised them, Then why do they always blame woman, These boors, these blind ones, In the womb they are the same, When they are growing they are the same Later the girl will take,tead of spending on yourself with love, what's given The boy will take has share by force. For money's sake, for trust, And friendship's sake Don't give a girl to a walking corpse, Bereft of virtue, youth and looks. Don't say “we are poor people, where Can we get jewels from?” Instead of spending on yourself Provide your daughters with clothes and ornaments. ఒక వివాహిత పాట వారిని గర్భాన మోసింది ఆడది కాదా వారిని పెంచి పెద్ద చేసింది ఆడది కాదా మరి ఎందుకు ఎల్లప్పుడూ ఆడదే దూషించబడుతుంది ఈ మూర్ఖులు, అంధుల చేత? గర్భంలో ఉన్నపుడు వారొకటే, పెరుగుతున్నపుడూ వారొకటే, తరవాతే అమ్మాయి తనకు దక్కేది ప్రేమతో తీస్కుంటుంది, అబ్బాయి మాత్రం బలంతో లాక్కుంటాడు. ధనం కోసమో, నమ్మకం కోసమో స్నేహం కోసమో ఏ బిడ్డనీ గుణం, యవ్వనం, అందం లేని, నడిచే శవానికివ్వద్దు. మేము బీదవారము, ఆభరణాలెలా కొనగలమని అనవద్దు, మీమీద ధనము ఖర్చు చేయక మీ బిడ్డలకు నగలు, బట్టలు కొనిపెట్టండి. xxxxx కట్నం ఇవ్వాల్సొస్తుందని ఆడపిల్లని ఇవ్వాళ కడుపులోనో, పుట్టాకా గొంతు నొక్కేసోనో చంపేస్తున్నారు. లేకపోతే ఏ దారే పోయే దానయ్యకైనా, నిలబడితే మగాడిలా కనిపిస్తే చాలనుకుని ఇచ్చి పెళ్ళి చేసి ఆతరవాత ఇంక ఆ ఆడపిల్ల మొహం చూడటానికికూడా ఇష్టపడటంలేదు. అదే ఆడపిల్ల కాస్త కాళ్ళుచేతులూ ఆడించగల్గినప్పట్నుంచీ పుట్టింట్లో చాకిరి చేసి, ఆ తరవాత మెట్టింట్లో చాకిరి చేసి చివరికి చీపురు పుల్లంత విలువకూడా లేకుండానే బ్రతుకు గడిపేస్తుంది. ఈ పరిస్తితిలో వీసమంత మార్పు కూడా ఇన్ని వందల ఏళ్ళ బట్టి రాలేదు. విలువుండాలంటే డబ్బు, పదవి, అధికారం ఇవన్నీ ఉండాలి. అప్పుడే పూజింపబడుతుంది ఆడది స్వార్ధం కోసమే అయినా. ఇప్పటిదాకా మనం తెలుసుకున్న రచయిత్రులు సామాజిక స్పృహను తమ రచనల్లో ప్రతిబింబించారంటే సమాజాన్ని ధిక్కరించి ప్రశ్నించాల్సిన అవసరం, అణచివేత, వివక్ష, బలయిపోయిన నేపధ్యంలో వాళ్ళ జీవితాలు గడిపారు కాబట్టి సమాజంలో ఉన్న అవకతవకలు ఎత్తిచూపాల్సిన అవసరాన్ని కూడా అంతే బలంగా అనుభూతి చెందారు, అదే రాసారు. కాని సంచియ హొన్నమ్మ రాజ ప్రాసాదంలో రాణీ గారి ఇష్టసఖిగా సుఖంగా జీవితం గడుపుతున్నా, రాజ ప్రాసాదం బయట జీవితం ఆమె చూసింది అర్ధం చేసుకుంది, స్పందించింది. అందుకే కన్నడ సాహిత్య చరిత్రలో రాసిన హొన్నమ్మ పేజీ ఒక అనూహ్యమైన సామాజిక స్ప్రుహతో రెప రెప లాడుతూనే ఉంటూంది ఎప్పటికీ .     ....Sivapurapu Sharada      

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి?తారాబాయి షిండే (1850-1910)

  తారాబాయి షిండే (1850-1910) సూరత్ లో జరిగిన ఒక సంఘటన కలకలం రేపింది. బ్రాహ్మణ కులంలో ఒక విధవరాలు గర్భంతోటుందని ఊరంతా, రచ్చబండల దగ్గరా, నీళ్ళ బావుల దగ్గరా ఆడా మగా అంతా గుస గుసలు. ఇది విన్న ఒక పోలీసు వాళ్ళింటికి అసలు విషయం కనుక్కోవడానికి వెళ్తాడు. మొదటనిపించింది, పోలీసుకేం సంబంధం, అవసరం అని. కానీ చూడండి ఇతను వెళ్ళి విషయం కనుక్కుంటే అది నిజమని తేలుతుంది. ఆమె ఒక 24 ఏళ్ళ విజయలక్ష్మి అనే విధవరాలు. రహస్యం బట్టబయలవుతుంది. కొన్నాళ్ళ తరవాత చెత్త కుప్పలో గొంతు కోసి చంపేసిన శిశువు. మళ్ళీ పోలీసు విచారణ మొదలవుతుంది. కేసు పెట్టి విజయలక్ష్మిని కోర్ట్ లో హాజరు పరుస్తారు. ఆమె తన నేరం ఒప్పుకుంటుంది. సమాజానికి భయపడి విధవ అయిన తను బిడ్డని సాకలేదు కాబట్టి పనిమనిషి సాయంతో బిడ్డను చంపేసానని. మొదట ఆమెకి మరణ శిక్ష విధించినా, తరవాత ఆజన్మ కారాగార శిక్షగా మారుస్తారు. న్యాయం పేరిట ఇక్కడ ఎంత అన్యాయం జరిగిందో చూడండి. తమకు పెళ్ళి జరిగిందని, భర్త చనిపోయాడనీ కూడా తీలియని వయసులో జరిగిన విషయాలు, తల్లో, తండ్రో నువ్విప్పుడు విధవవి అని చెప్తే గాని తెలియని పసిపిల్లలకి గుండు చేసి, తెల్ల చీర కట్టి, వారిని ఇళ్ళనే జైళ్ళలో బంధించి, చప్పిడి కూడు పెట్టి, గాడిద చాకిరి చేయించిన సమాజంలో, వీరికి పురుషుల సానుభూతే కాదు పునిస్త్రీల సానుభూతి కూడా లేదు. వీరికి పిల్లలు కూడా పుట్టి ఉంటే వాళ్ళు కూడా సెకండ్ క్లాస్ సిటిజన్సే ఆ ఇంట్లో. ఎంతో సంచలనం సృష్టించిన విజయలక్ష్మి కేసులో సమాజం కేవలం శిశు హత్య గురించి మాత్రమే బాధ పడుతున్నట్లు తోస్తుంది. ఆమె గర్భానికి కారణమైన వాడి మీద కేసులేదు, నింద లేదు, అపవాదులేదు. ఒక యుక్తవయసులో ఉన్న విధవ ఇంట్లో ఎప్పటికీ ఒక థ్రెట్ కుటుంబ పరువు ప్రతిష్టలకి. పూర్తిగా తనది కాని తప్పుకి ఆడది శిక్షింపబడుతుంది. మగాడూ, సమాజం ఎటువంటి బాధ్యతా లేకుండా తప్పించుకుంటాయి ఎప్పటిలాగే. ఏకపక్ష పురుష పక్షపాత నిబంధనల్లో స్త్రీల వ్యక్తిత్వాన్నీ, జీవితాల్నీ, నిలువునా పాతిపెట్టే పురుష స్వామ్య సమాజంలో ఒక స్త్రీ తన సహజ లైంగిక వాంఛలని అణిచివేసుకుని, తనను, తనమీద కన్నేసే వెధవల బారినుండి, ఇంట్లోనూ బయటా అనుక్షణం తన శీలాన్ని కాపాడుకోవాల్సిందే. కేవలం చాకిరీ లోనూ, బానిస బ్రతుకులోనూ ఆనందాన్ని వెతుక్కుంటూ చచ్చేవరకూ తనను తాను బ్రతికించుకోవాల్సిందే. సమాజ ఆరోగ్యం మొత్తం ఆడవారి భుజస్కంధాలపైన పడేసి, తను మాత్రం బాధ్యతారహితంగా తప్పించుకుని తిరిగాడు మగాడు. ఈ విషయం మనల్ని బాధించినట్లే తారాబాయి షిండేని కూడా బాధిస్తుంది. ఈ సంఘటన, కేసు విచారణ జరిగిన తీరుకి స్పందిస్తూ తారబాయి రాసిన "స్త్రీ పురుష్ తులనా" మరాఠీ, "A comparison between men and women" english లో సుమారు 50 పేజీల వ్యాసం 19th Centuryలో India లో మొట్టమొదటి సంపూర్ణ స్త్రీవాద రచనగా పేరు పడ్డది. 500 కాపీలతో ముద్రించబడిన ఈ రచనకి సహజంగానే ఎటువంటి స్పందనా రాలేదు. ఆ తరవాతెప్పుడో తవ్వకాల్లో బయటపడిన ఈ రచన మళ్ళీ వందేళ్ళ తరవాత వెలుగులోకి వచ్చింది. ఈమె రాసిన వ్యాసం గురించి చదివే ముందు ఆమె జీవిత విశేశాలు తెలుసుకుందాము. తండ్రి బాపూజీ హరి షిండే చదువుకున్నవాడు, అభ్యుదయ భావాలున్నవాడు. తారాబాయికి, మరాఠీ, ఇంగ్లీష్, సంస్కృతం నేర్పిస్తాడు. జ్యొతీ రావు ఫూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ ఫౌండింగ్ మెంబర్గా చురుకైన పాత్ర పోషించిన వాడు. అంటరానితనానికి, కులవ్యవస్థకీ, ఉన్నతకులాల దోపిడీకి వ్యతిరేకంగానూ, స్త్రీ విద్య, వితంతు వివాహాల కోసం పనిచేసినవాడు. తారాబాయి కూడా, జ్యోతీ రావు ఫూలే, సావిత్రీ బాయి ఫూలేలతో బాటుగా సమాజోద్ధరణకి పని చేసింది. జ్యోతీ రావు ఫూలే మొట్ట మోదటగా 1848 లో కేవలం ఆడపిల్లల కోసం స్థాపించిన స్కూల్ నడపటానికి సాయం చేస్తుంది. ఆడవారి దుస్తితిని వివరిస్తూ, ఓపికగా తన పుస్తకం చదవమని, సానుభూతితో ఆడవాళ్ళ దుఖాల్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించమని చెప్తుంది. తను కులాల గురించి కానీ, ధనిక పేద వర్గాల గురించి కానీ ప్రస్తావించట్లేదనీ, కేవలం స్త్రీ పురుషుల మధ్య సమాజం చూపే భేద భావాల్ని మాత్రమే ఎత్తి చూపుతున్నానని చెప్తుంది. ఆమె రచనలో ఆడవారి వెనుకబాటుతనానికి కారణమైన పురుషాధిక్య భావాల్నీ, పితృస్వామ్య సమాజ రీతుల్నీ, స్త్రీల జీవితాల్ని కట్టిపడేసే పురాణాల్నీ, శాస్త్రాల్నీ, వాటిని రాసిన వారి హక్కుల్నీ ప్రశ్నిస్తుంది. మూలాల్నన్నిటినీ శోధించి, అన్వేషించి, కారణాలు ఎత్తి చూపుతుంది. 18వ శతాబ్దం వరకూ ముక్తాబాయి, బహినా బాయి, జానాబాయి, కన్ హోపాత్రా లాంటి స్త్రీలు కేవలం భక్తి మార్గంలోనే వారికి జరుగుతున్న అన్యాయాలకీ, కష్టాలకీ, దుఖానికీ సాంత్వన వెతుక్కున్నారు. కానీ ఈమె చేసింది అసలైన స్త్రీవాద ఉద్యమం. ఈనాటి భావాలకీ అద్దం పట్టే తిరుగుబాటు. నిజానికి ఆమె రచనా శైలి అంత గొప్పగా ఏమీ ఉండదు. కానీ ఆమె మాటల్లో ఆమె రచన ఎంత కూలంకషంగా ఆడవాళ్ళ ప్రతి చిన్న సమస్యకూ ఎలా స్పందిస్తుందో చూడండి. అలాగే ఆరోజుల్లో సమాజాన్ని ధిక్కరిస్తూ సాగే ఆమె రచన చాలా పదునుగా, నిర్వివాదంగా, మగవారు సమాధానం లేక ఏ కొంగు చాటునో దాక్కొనే పరిస్తితిని ఆమె కల్పిస్తుంది. విజయలక్ష్మి లాంటి విధవలకి అసలు ఆ నిస్సహాయ స్తితి ఎందుకు కలిగిందో కారణాలను వివరిస్తుంది. భారత దేశంలో విగ్రహ రూపంలో దేవతగా పూజింపబడే స్త్రీకి, రక్షించే దేవతకి, వరాలిచ్చి కాపాడే దేవతకి, ప్రాణంతో, శరీరంతో ఉంటే, పుట్టినప్పట్నుంచి మగవాడి వల్ల దుర్భరమయ్యే బ్రతుకు, మగవాడినుంచి కాపాడాల్సి ఉండే పరిస్తితి, ఎందుకని ప్రశ్నిస్తుంది. పాలకులుగా, న్యాయ వ్యవస్థలోను, పత్రికా ప్రపంచంలోనూ, విద్యావేత్తలుగాను, పండితులుగానూ, సమాజాన్ని సద్గతిలో నడిపించే శాశనాల్ని రాసే వారిగానూ పురుషులు ఆదినుంచి సగభాగమైన స్త్రీని ఎందుకు తొక్కిపెట్టారని ప్రశ్నిస్తుంది. ఆమె మాటల్లోనే చెప్పాలంటే : “ఓ మూర్ఖులారా, ఆడవాళ్ళు సుకుమారులు, బిడియస్తులు, సహజంగా చంచల స్వభావులు. మీరు ధీరులు, తెలివైవ వారు, పండితులు. అందుకేనా ఇంకా పుట్టి అమ్మ పాలైనా కుడవక ముందే ఆడవాళ్ళని రకరకాలుగా ఈసడిస్తున్నారు. మీరు బలవంతులైనంత మాత్రాన, ఆడవారిని అడ్డమైన పేర్లతో అవమానించడం ఒప్పవుతుందా? మీరు మాత్రం పేరుకు ముందు శ్రీ,, శ్రీమాన్, సర్ అని చేర్చుకుంటున్నారే. చిన్నప్పట్నుంచి, ఆడవారి మీద సర్వ హక్కుల్నీ మీ చతుల్లో పెట్టుకుంటారే. ఆడవారిని పరదాలోనో, నోరు మూయించో ఇంట్లో చీకటి కొట్లల్లో బంధించి, భయపెట్టి, బానిసల్లా చూస్తున్నారే. చదువు ఆడవారికి కాదు. వారు మీలాగా, స్వేఛ్చగా తిరుగలేరు. తిరిగినా వారు కలిసే స్త్రీలనుంచి వారు పొందే జ్ఞానం ఏముంది? జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలినట్లు, వారికి జ్ఞానం ఎలా పెరుగుతుంది? మీ పెద్దల పెద్దలు ఎవరైనా, ఏమైనా ౠజువు తేగలరా, దేముడు వారికి భర్తకంటే ముందే చనిపోవడం మంచిదని చెప్పినట్టు? ఎవరు ఎంత కాలం బ్రతకాలో, ఎంత కాలం బ్రతుకుతారో ఎవరి చేతుల్లో ఉంది? ఆ నారాయణుడి చేతుల్లో తప్ప. రాజైనా యముడి పిలుపు రాగానే అన్నీ అనుభవిస్తూ ఆనందంగా జీవిస్తున్నా, రాజ్య భారాన్ని మోస్తూ బాధ పడుతున్నా, వెళ్ళవలసిందే కదా. ఒక అబల అయిన ఆడదాని మాట యముడు వింటాడా? బ్రహ్మ రాతని ఆడది మార్చగలదా? ఏ ఆడదీ రెండో సారి పెళ్ళి చేసుకోడానికి వీలు లేదు కదా ఒక సారి భర్త పోతే. ఒక్క సావిత్రి తప్ప ఎవరూ యముడితో పోరాడి భర్తని తిరిగి పొందలేదు. భార్యగా తన అయిదవతనాన్ని నిలుపుకోలేదు. ఎవరూ పొగిడే వారు లేకపోతే, నన్ను నేనే పొగుడు కుంటానన్న సామెతలాగా, మీరెప్పుడూ వీరులే, తిని కూర్చోవడంలో. పురుషులంతా పండితులో, విద్వత్తు కల్గిన వారో అయితే, మీలో ప్రేమా కరుణా ఎందుకు లేవు, సాటి మనుషులైన స్త్రీల మీద. అడవిలోని పులులకీ సిమ్హాలకీ మీరు అప్పించుంటారు మీ కరుణంతా. మీ ప్రాణం మీకు తీపయినట్టు, స్త్రీకి మాత్రం తన ప్రాణం తీపి కాదా? ఆమె జీవితం మీకు ఈగలాగా, దోమలాగా కనిపిస్తుందా? మొగుడు పోయిన ఆడదాన్ని మట్టితో తుప్పుతో తయారు చేస్తే మిమ్మల్ని స్వఛ్చమైన బంగారంతో తయారు చేసాడా? మొగుడు పోగానే ఆమె అందమైన శిరోజాల్ని, ఆభరణాల్ని తీసేస్తారు మీ కళ్ళు చల్లబడటంకోసం. అంతే అప్పట్నుంచి ఆమె ఎవరిదీ కాదు. మూలన ఒక పనికిరాని పాత కుండ మాత్రమే. ఆమె ఇక ఏ శుభకార్యాలకూ వెళ్ళకూడదు. ఆమె ముఖం చూడటమే ఒక అపశకునం పాపం. ఆమె ఏమైనా చంపిందా మొగుణ్ణి? దేముణ్ణి ప్రార్ధించిందా మొగుణ్ణి తీస్కుపొమ్మని? నిజంగా మొగుడు పెట్టే నరకం భరించలేకపోయినా ఆమె ఆ పని చెయ్యలేదు, ఎందుకంటే, ఇది ఇంకా ఘోరమైన నరకం. మగాడెందుకు వెంటనే పెళ్ళి చేసుకుని ఆనందంగా జీవితం గడుపుతాడు? శాస్త్రాలు రాసిన వాళ్ళు వాళ్ళ ఆగ్రహాన్నంతా ఆడవారిమీదే ఎందుకు చూపెట్టారు? ఏ స్త్రీ అయినా వారిని పీడించినట్లయితే, మొత్తం స్త్రీ జాతిమీదే కక్ష కడతారా? ఇవే నిబంధనలు మగవారికి కూడా ఉన్నట్లయితే అది వేరు. భార్య పోయిన మగాడిని కూడా సంఘం వెలివేస్తే ఎలా ఉంటుంది? ఇలాంటివి మగాళ్ళకి పెట్టకపోవడం వల్ల పురుషులు వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకున్నట్టవలేదా? మగవాడిగా పుట్టడమే అదృష్టం. డబ్బు కూడా ఉంటే ఇంక వాడి సుఖానికి ఢోకా ఉండదు. ఎనభై ఏళ్ళొచ్చినా, మీసాలకి రంగేసుకుని, పెట్టుడు పళ్ళు పెట్టుకుని, నిటారుగా నిలబడ్డానికి కర్ర పట్టుకుని కోటు వేసుకుని పైపంచ వేసుకుని పెళ్ళికి సిద్ధ పడి, ఒక చిన్న పిల్లని పెళ్ళిచేసుకున్నాక చావు వస్తే, ఆ పిల్ల మళ్ళీ విధవగా జీవితాంతం బతకాల్సిందే కదా? మగాడిలాగా ఆమె చెయ్యగలదా? జీవితాంతం మొగుడి గుణ గణాలను మెచ్చుకుంటూ ఇంట్లో మిగిలిన వారందరికీ బానిసగా చచ్చే వరకూ బతకాల్సిందే. మొగుడు చావు బతుకుల్లో ఉంటే అతడిని బతికించుకోడానికి ఎంతో తపనపడి, సేవలు చేసి బ్రతికించుకోవాలని చూస్తుంది. అదే ఆమె మంచం పడితే మొగుడు ఎప్పుడు పోతుంది అని చూస్తాడు. ఆమె బాధ్యతని చచ్చే వరకూ వదలటానికి లేదు. అదే మగాడికి జీవితం విసుగనిపిస్తే, శాస్త్రోక్తంగా ముహూర్తం చూసుకుని మరీ సన్యాసం పుచ్చుకోవచ్చు.” అంటరాని కులాల ఆడపిల్లల స్కూల్ ఆమె నడిపింది. ఉన్నత కులాల అనాధ విధవ స్త్రీల కోసం ఒక ఆశ్రమం నడిపింది. మొత్తానికి తను కూడా ఒక విధవ అయి ఉండి, సాటివారిని కష్టాల్లో ఆదుకోడానికి, వారిలో వారి పరిస్తితుల పట్ల సరైన అవగాహన ఏర్పడటానికి కృషిచేసింది. ఆమెకి ఎటువంటి ఎవార్డ్సూ రాలేదు. ఆమె చేసిన కృషికి ఎవార్డ్సిచ్చి సత్కరించే సమాజం కాదు అప్పటి పురుషాధిక్య సమాజం. అలాగే ఆమె ఏ ఇతర రచనలూ చేయలేదు. కేవలం తండ్రి అభ్యుదయ భావాల కారణంగా ఆమెకు ఆమాత్రం వెసులుబాటు కలిగింది. ఏమైనా ఒక రచయిత్రినే కాదు, ఒక గొప్ప ఆదర్శానికి తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తిని పరిచయం చేసినందుకు సంతోషంగా ఉంది. పితృస్వామ్య సమాజం స్త్రీకి తయారు చేసిన ఒక ఆదర్శ పతివ్రతా ధర్మం, పతివ్రతా లక్షణాలు, ఏంటంటే, పరిమితి లేని సహనం, ఓర్పూ, క్షమా, దయా, సేవా భావం అనడం కన్న బానిస మనస్తత్వం అంటే బాగుంటుంది, ఎదురుతిరగకూడని బలహీనతను ఓర్పుగా చిత్రించి ఈ లక్షణాలు ఉన్న ఆడవాళ్ళే పతివ్రతలని నమ్మించి, అలాంటి స్త్రీలను పురాణ గాధల్లో సృష్టించి, వారిని పూజనీయులుగా చేసి, యుగ యుగాలుగా మోసం చేస్తూ వచ్చింది. ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా స్త్రీలకు వోటు హక్కు, ఉన్నత విద్యావకాశాలు 19వ శతాబ్దంలోనే వచ్చాయంటే, మతంతో, సంస్కృతి తో సంబంధం లేకుండా మగవాడెప్పుడూ ఆడదాన్ని డోర్మాట్ లాగే వాడుకున్నాడన్న విషయం ఋజువవుతుంది. ఏవో కొన్ని సంస్కారవంతమైన కుటుంబాల్లో తప్పించి, ధనిక పేద తేడాల్లేకుండా, కుటుంబంలోనే ఆడవారికి వివక్ష, పోరాటం తప్పట్లేదు. ఈ సందర్భంలో ఇంకొక విషయం మీతో పంచుకోవాలనిపిస్తోంది. వాటర్ సినిమా తీసిన దీపా మెహ్తా ఇదే ఇతివృత్తాన్ని చూపెట్టే ప్రయత్నం చేసింది. అందులో హీరో ఒక విధవతో (పెళ్ళయినట్టుగా కూడా గుర్తులేని ఎనిమిదేళ్ళ బాలిక ఇంట్లోంచి పారిపోయి వారణాసిలోని ఒక విధవాశ్రమంలో చేరుతుంది. అక్కడ జరిగిన కధే ఈ సినిమా) ప్రేమలో పడతాడు. ఈ సినిమా తీస్తున్నందుకు వచ్చిన వ్యతిరేకతకి, ఆమె ప్రాణానికి వచ్చిన బెదిరింపుల వల్ల ఆమె లొకేషన్ శ్రీ,లంకకు మార్చి సినిమా తీసింది. దీనికి పదిహేను ఎవార్డ్సూ పదకొండు నామినేషన్సూ వచ్చాయి. అదే సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన ఇంకొక నటి, రాజ్యసభ సభ్యురాలు, హేమ మాలిని ఈ రకంగా మధురలో తమ జీవితం దుర్భర పరిస్తితుల్లో గడుపుతున్న విధవ స్త్రీల గురించి నిరసనగా మాట్లాడి వివాదంలో పడింది. వచ్చే వారం ఇంకొక రచయిత్రి పరిచయంతో కలుద్దాం. Sivapurapu Sharada  

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? కుర్రతుల్ ఐన్ హైదర్

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? కుర్రతుల్ ఐన్ హైదర్     కుర్రతుల్ ఐన్ హైదర్ అలీగర్ సాహిత్య అకాడమీ ఇంకా జ్ఞానపీఠ్ ఎవార్డు గ్రహీత, ఉత్తర్ ప్రదేశ్ లో పుట్టింది. తల్లి తంద్రులిద్దరూ కూడా రచయితలే. ఆమె ఒక నవలా రచయిత్రి, జర్నలిస్ట్. ఆమె ముప్ఫై దాకా నవలలు, కధా సంకలనాలు, ఇంకా ఇతర రచనలూ చేసారు. విషయం ఏంటంటే ఉర్దూలో ఇంకా కవిత్వమే రాజ్యం చేస్తున్నపుడు ఆమె, కధలూ, నవలా సాహిత్యం రాసింది. ఆమెను "Grand Dame of Urdu Literature” అంటారట. ఈమె పార్టిషన్ టైములో పాకిస్తాన్ వెళ్ళింది కాని తరవాత అక్కడ్నుంచి, ఇంగ్లాండ్ కి ఆతరవాత తిరిగి ఇండియాలో స్థిరపడింది. ఇక ఆమె కొచ్చిన ఎవార్డ్స్ విషయానికొస్తే చాలా పెద్ద లిస్టే. Sahitya Academy Award in 1967 Soviet Land Nehru Award 1969 Ghalib Award in 1985 JnanpeeTh Award in 1989 for Akire Shah ke hamsafar Saahitya Academy Fellowship in 1994 Bahadur Shah Zafar Award in 2000 Padmasree by Goverment in 1984 Padma Bhushan in 2005 ఆమె Managing Editor గా Imprint Magazine, Bombay లోనూ, Member of Editorial Staff గా Illustrated Weekly of India లోనూ పనిచేసారు. ఆమె రచనలు ఎన్నో ఇంగ్లీష్ లోకీ, ఇతర భాషల్లోకీ అనువదించపడ్డాయి. Guest Lecturer to University of California, Wisconcin, Arizona ఇంకా Visiting Professor, Urdu, Aligarh Muslim University లోనూ పనిచేసారు. హైదర్ రాసిన నవలల్లో మాగ్నం ఓపస్ గా భావించబడే నవల ఆగ్ కా దరియా (The River of Fire in English) అనేది అతి పెద్ద నవల. ఈ నవల రెండు వేల ఏళ్ళ చరిత్రలో జరిగిన సాంస్కృతిక, విప్లవాత్మక మార్పుల నేపధ్యంలో తిరిగి తిరిగి ఇంచు మించు అవే పేర్లతో పుట్టే తన ముఖ్య పాత్రల జీవితాల్లోని, మనసుల్లోని సంఘర్షణల్నీ, దైనందిన జీవితాల్నీ , సమాజంలోని మార్పుల్నీ అనుసంధానం చేసుకుంటూ సాగుతుంది. ముందు నుంచీ ఉన్న హిందుత్వం, బయటనించీ వచ్చిన ఇస్లామ్నీ, కొత్తగా పుట్టిన బౌద్ధాన్నీ, ఇంకా ఎప్పటికప్పుడు మారుతూ వస్తూన్న భక్తి తత్వాల్నీ, సూఫీ తత్వాన్నీ ఆకళింపు చేసుకుంటూ, తమ తమ ఆచార వ్యవహారాల్లో ప్రజలు ఎలా వాటిని కలుపుకుంటూ భిన్నత్వంలో ఏకత్వం ఎలా సాధించారో, ఇన్ని విభిన్న సంస్కృతుల్లో, సముద్రంలో నీటి చుక్కల్లా ఎలా కలిసిపోయారో చెబుతుంది. తమవి కాని ఆచార వ్యవహారాలు, జీవన విధానాల పట్ల ఇక్కడి ప్రజలు అతి సహజంగా ఒక టాలరెన్స్, సహనం కలిగి ఉన్నారు. ఈ టాలరెన్స్ మాత్రమే దేశాన్ని ఛిన్నా భిన్నం కాకుండా కాపాడుతూ వస్తున్న ఒక మౌలిక ప్రాతిపదిక. ఆమె మాట్లాడుతున్నది, ఇప్పటి పాకిస్తాను, బంగ్లాదేశ్ కొంత ఆఫ్గనిస్తాను వరకూ విస్తరించి ఉన్న భారత దేశం. అయితే ఈ మౌలిక ప్రాతిపదికకు భంగం కలిగించే విధంగా దేశాన్ని, మతం పేరిట, భాష పేరిట ముక్కలు చేసారు. మౌర్యుల పాలననుంచి, మొఘల్ పాలన, తరవాత ఆంగ్లేయుల పాలన, స్వతంత్రం అనంతరం పాలకుల నుంచి సాధారణ ప్రజలుగా మారి ముస్లింలు దేశ విభజన తరవాత మైనారిటీగా మిగిలి తమ అస్తిత్వాన్ని వెతుక్కుంటున్న పరిస్తితులను వివరిస్తూ ఈ నవల సాగుతుంది. శతాబ్దాలుగా భిన్న సంస్కృతుల ప్రజలు అత్యంత శాంతియుతంగా సంస్కృతుల్లో పరస్పరంగా మార్పులు చేసుకుంటూ వస్తూ, కొన్ని కొన్ని ఆచారాలు ప్రధమంగా ఎవరు పాటించినవో తెలియనంతగా మారి సహజీవనం చేసిన దేశం ఇది. ఇక్కడ ఏ వొక్క మతం అన్ని ప్రశ్నలకీ సమాధానం ఇవ్వలేదు. మతం ఇచ్చిన అస్తిత్వాన్నీ, గుర్తింపునూ ఎవ్వరూ వదులుకోరు. నిజానికి ఎవరి మతం ఎవ్వరూ వదులుకోవక్కరలేదు. నిజంగా దేవుడే ఉన్నట్లయితే, ఇన్ని మతాలకు వేరు వేరుగా అయితే ఉండడు. కేవలం ఆ విశ్వాశాన్ని ప్రకటించే పద్ధతులే భిన్నమైనవి. ఈ భిన్నత్వాన్ని అర్ధం చేసుకుని గౌరవిస్తూ శాంతియుత సహజీవనం చెయ్యడమొకటే మార్గం. కులాతీత సమాజాన్ని కోరుతున్నామనే వారెవరూ కూడా వారికి కులం ఇచ్చిన గుర్తింపును వదులుకోడానికి సిద్ధంగా లేరు. కులమేదైనా మతమేదైనా, మానవత్వం, వేరే కులం, మతం పట్ల టాలరెన్స్, గౌరవం ఉన్న నేపధ్యంలో ఇన్ని గొడవలు జరిగే అవకాశం లేదు. తేనె పట్టులో తేనెటీగలు విడి విడిగా తమ తమ గదుల్లో ఉంటూ తేనె సేకరించి ఎలా దాస్తాయో అలా తమ తమ ప్రత్యేకతలను కాపాడుకుంటూనే కలిసి బ్రతకాలంటుంది. భేద భావాలు లేకుండా అన్ని మతాల్లోంచీ, అన్ని తత్వాల్లోంచీ కావల్సిన సమాధానాలు వెతుక్కోవాల్సిందే. హిందూ వేదాంతం లోంచి, బౌద్ధ మత సిద్ధాంతం నుంచి, సూఫీ తత్వం, భక్తి తత్వాలన్నిటినీ కలిపి చూసినపుడు మాత్రమే శాంతియుత సహజీవనానికి అవసరమైన టాలరెన్స్ ఎలా రావాలో అర్ధమౌతుంది. మతప్రాదిపదిక మీద దేశాన్ని విభజించి (మొదట అంగ్లేయులు చేస్తే, తరవాత భాషా ప్రాతిపదిక మీద మనమే రాష్త్రాల విభజన చేసుకున్నాం) , సరిహద్దులు గీసి వీరు వేరు, వారు వేరు అని చెప్పాకా, అన్ని మతాలనీ సమానంగానే చూసే రాజ్యాంగంకి Secularism అని పేరు పెట్టడం ఎంత వరకూ సబబు? ఈ రకమైన Nationalism (with borders defined and with belief in separatism) ఇంతవరకూ అందర్నీ కట్టి ఉంచిన Pluralism అనే సూత్రానికి వ్యతిరేకం కాదా అని ఆవిడ వాదన. సెక్యులరిజం ముసుగులో జరిగే ఈ విభజన విద్వేషాలను రెచ్చగొట్టడంలోనే సఫలీకృతమయ్యింది. దేశం బాబ్రి మసీదు కూలగొట్టడాన్నీ, గుజరాత్ అల్లర్లనూ ఎన్నింటినో చూసింది, తట్టుకుని నిలబడింది. గజనీ దండయాత్రల్నీ, ధ్వంసమైన ఆలయాల్నీ, దోచుకోబడిన సంపదనీ తట్టుకుంది సహించింది. అయితే ప్రజల్లో ఉన్న సంఘీ భావం కుటిల రాజకీయానికి లేదు. అందుకనే, ఇంకా విభజించి పాలించడమనే నీతి సూత్రాన్ని పాటిస్తోంది. ఒరిజినల్ గా ఉర్దూలో రాసిన ఈ నవల, కంటెంట్ కే కాదు, భాషకు కూడా అంతే పేరు తెచ్చుకుంది. అంత చక్కటి ఉర్దూ ఆమె ఉన్న రోజుల్లో రాయడం విశేషమేనట. ఈ నవలని One Hundred Years of Solitude by Gabriel Garcia Marquez, Columbian author తో కంపేర్ చేస్తారు. ఎందుకంటే రెండూ కూడా ద పాస్ట్ రిపీట్స్ ఇట్సెల్ఫ్ అన్న మెయిన్ థీం మీదే సాగుతాయి. రెండిటిలోనూ ఎప్పటికీ పారుతున్న నది అవిచ్చిన్నంగా సాగే జీవన సరళికి సింబాలిక్ గా ఉంటుంది. మనుషులు మళ్ళీ మళ్ళీ పుట్టడం, మారుతున్న పరిస్తితులతో నిరంతరంగా మార్పు చెందుతున్నా కూడా అంతర్గతంగా అన్నిటినీ బంధించి ఉంచే మారని ఒకటేదో నవ లల్లో ముఖ్య అంశంగా ఉంటుంది. అయితే సాధారణ ప్రజా జీవితాలు భిన్న సిద్ధాంతాల వల్ల ఎలా ప్రభావితమయ్యాయన్నదాన్నీ, ఈ సాధారణ ప్రజల దృష్టి కోణం నుంచి నిరు పేదల జీవితాలెలా ప్రభావితమౌతూ వచ్చాయన్నదాన్ని ఎంతో నిశితంగా ఈ నవల చర్చించిన విధానం దీన్ని One Hundred Years of Solitude కన్నా గొప్ప నవల చేసిందని పాఠకుల అభిప్రాయం. వ్యక్తిగతానుభవాలనుంచి స్త్రీల పరిస్తితుల పట్ల అవేదనతో రాయడం కాకుండా, రెండు వేల ఏళ్ళ చరిత్రలో జరుగుతూ వస్తున్న దాన్ని దేశ ప్రజల జీవితాల్నీ సమాంతరంగా వర్ణిస్తూ ఈ నవలని రాయడం ఆమె అసాధారణ ప్రజ్ఞనీ, మేధస్సు నీ సూచిస్తుంది. ఏరకంగా చూసినా ఇది చరిత్ర అంటే కొంత ఇష్టం, అవగాహన ఉన్న ప్రతి పాఠకుడూ చదవాల్సిన ఒక గొప్ప నవలగా అభివర్ణింపబడింది. నిషేధాల, నిరోధాల పరదాలనుంచి బయటికి వస్తే ఆడవాళ్ళు తమ ప్రతిభను, అలోచనా విధానాన్నీ సమాజానికి ఉపయోగపడే విధంగా ఎలా మలుచుకోగలరో చూపటానికి హైదర్ జీవితం ఒక అద్భుతమైన ఉదాహరణ. వచ్చే వారం ఇంకొక గొప్ప రచయిత్రి పరిచయంతో కలుద్దాం.             ......Sivapurapu Sharada

కవిత్వాన్ని తెలుగునేలపై జల్లిన కవి గుంటూరు శేషేంద్రశర్మ

    కవిత్వాన్ని తెలుగునేలపై జల్లిన కవి గుంటూరు శేషేంద్రశర్మ                         ఆధునిక కవిత్వంలో అతనిదొక విలక్షణ మార్గం. అటు మార్క్సిజాన్ని, ఇటు వేద సారాన్ని నింపి సమ సమాజ స్థాపనకోసం కవిత్వాన్ని తెలుగునేలపై జల్లిన కవి. వస్తువును కవిత్వంగా మార్చే తీరులో శేషేంద్ర ఓ ముద్ర. ఓ ప్రత్యేకమైన సంతకం. ఒక విశ్వనాథ, ఒక శ్రీశ్రీ లాగా ఒక శేషేంద్ర కూడా జీనియస్. ఛందస్సు రహస్యాలను, వచనకవిత్వంలోని నూతన వరవడులను చిక్కగా పట్టుకొని గాఢంగా ప్రయోగించిన శబ్ద శిల్పి శేషేంద్ర. సిద్ధాంతాల దృష్ట్యా వివాదాస్పదుడైనా, కవిత్వానికి మాత్రం పట్టం కట్టిన కవి శేషేంద్ర.             శేషేంద్ర శర్మ నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి దగ్గరున్న నాగరాజుపాడులో అక్టోబరు 20, 1927లో జన్మించారు. తండ్రి సుబ్రహ్మణ్యశర్మ, తల్లి అమ్మాయమ్మ. వీరిది వ్యవసాయ కుటుంబం. చిన్నప్పుడే శేషేంద్ర రుగ్వేదం, యజుర్వేదం, శబ్దమంజరి, ధాతుపాఠాలను నేర్చుకున్నారు. అలాగే కుమార సంభవంలోని కొన్ని సర్గలు, మేఘసందేశంలోని ప్రథమభాగం, అభిజ్ఞాన శాకుంతలం, అమరకోశం, ఆంధ్రనామ సంగ్రహ వంటి సంస్కృత గ్రంథాలను చదువుకున్నారు. నెల్లూరు వి.ఆర్. కళాశాలలో ఇంటర్మీడియట్ చదువారు. గుంటూరు ఎ.సి. కాలేజ్ లో బి.ఎ. చేశారు. ఆ రోజుల్లోనే "సొరాబు" అనే కావ్యాన్ని రాశారు. తర్వాత మద్రాసులోని లా కాలేజ్ లో చేరారు. అప్పుడే తాపి ధర్మారావు పనిచేస్తున్న "జనవాణి" పత్రికలో జర్నలిస్టుగా కొంతకాలం పనిచేశారు. పిఠాపురంలో డిప్యూటీ పంచాయితీ అధికారిగా ఉద్యోగంలో చేరారు, తిరుపతి, కందుకూరు, పొదిలిలో కూడా పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాదు కార్పొరేషన్ లో అసిస్టెంటు కమీషనరుగా, డిప్యూటి కమీషనరుగా, సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాదు ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, గ్రీస్, తూర్పు ఆఫ్రికా దేశాలలో కూడా పర్యటించి వచ్చారు. శేషేంద్ర భార్య జానకి, పిల్లలు :  వసుంధర , రేవతి ( కుమార్తెలు ), వనమాలి , సాత్యకి ( కుమారులు )           శేషేంద్రశర్మ ముప్పైకి పైగా కావ్యాలు రాశారు. చంపూ వినోదిని, ఋతఘోష, శేషజ్యోత్న, మండేసూర్యుడు, నా దేశం నా ప్రజలు, నీరై పారిపోయింది, గొర్రిల్లా, సముద్రం నా పేరు, ప్రేమ లేఖలు, రక్తరేఖ, కవిసేన మేనిఫెస్టో, ఆధునిక మహాభారతం, వంటి ఎన్నో అద్భుతమైన కావ్యాలు రాశారు. షోడశి అనే విమర్శ గ్రంథాన్ని, విహ్వల పేరుతో కథలను, సాహిత్య కౌమిది పేరుతో వ్యాసాలను వెలువరించారు. వీరి కవిత్వం గాఢతతో సామాన్యులకు అర్థం కాకపోయినా కవిత్వ రహస్యాలను అలంకరించుకొని హుందాగా ఉంటుంది. అందుకే వీరిని శిల్ప కవి అని కూడా అంటారు. శేషేంద్ర కవిత్వంలో ప్రతీకలు, పద చిత్రాలు, వాక్య నిర్మాణ రీతులు, అభివ్యక్తిలో కొత్త పోకడలు కనిపిస్తాయి.         వర్గ చైతన్యాన్ని, నూతన అభివ్యక్తిని నింపుకున్న కావ్యం "మండే సూర్యుడు". "ఆకాశం నుంచి తెగి సూర్యుడు నెత్తుటేరుల్లో పడ్డాడు". అని కవి ఈ కావ్యాన్ని ప్రారంభిస్తారు. "ఈ దేశం నా ప్రతిభ కొక సమాధి, ఎంత వడివడిగా నడిచినా సరే ఎప్పుడూ దూరం అంతే" అని శ్రమ జీవులకు తగిన ఫలితం అందడం లేదంటారు. అలానే "నా దేశం - నా ప్రజలు" లో "లేస్తొంది ఉషఃకాంతుల్లోంచి ఒక హస్తం, ఆ హస్తం కాలం అనే నిరంతరం శ్రామికుడి సమస్తం" అంటారు. అంటే పీడిత ప్రజలపై సాగుతున్న దోపిడీని వర్ణిస్తూ, సందేశాన్ని ఇస్తుంది. గాఢమైన అభివ్యక్తితో కవిత్వాన్ని విస్తరింపజేయడం శేషేంద్ర ప్రత్యేకత. అలానే వీరి "గొర్రిల్లా" కావ్యంలో "నమ్మండి మనిషి బాధని తొడలమీద వేసుకొని పొట్టచీల్చే రోజు వస్తుంది గొరిల్లా" "రైతులారా, రాజకీయ వర్షం పడుతోంది, మోసపోయి మీ విత్తనాలు చల్లకండి" అని శక్తివంతమైన కవిత్వ వాక్యాలతో ప్రకాశిస్తుంది "గొర్రిల్లా" కావ్యం. అలానే 1986లో వచ్చిన "ఆధునిక మహాభారతము" పది పర్వాల మహా కావ్యం. భారతంలోని పర్వాల వలే కాకుండా ప్రజాపర్వం, సూర్యపర్వం... అనే పేర్లు పెట్టారు శేషేంద్ర ఈ కావ్యానికి. అలానే "జనవంశమ్" కావ్యాన్ని ఆరుకాండలతో రచించారు.             శేషేంద్రశర్మ1975లో వచ్చిన "ముత్యాల ముగ్గు" సినిమాలో "నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది" అనే ఒకే ఒక్క పాటను రాశారు. శేషేంద్ర ముప్పైకి పైగా రనచలు చేసినా ఎంత సనాతనుడో అంత ఆధునికుడు. ఎంత ప్రాచీనుడో, అంత అధునికుడు.1993లో సుబ్రహ్మణ్య భారతి రాష్ట్రీయ సాహిత్య పురస్కారం, 1994లో తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు, 1999లో వీరికి సాహిత్య అకాడమీ అవార్డు వంటివి ఎన్నో వచ్చాయి. 2004లో వీరి "నా దేశం నా ప్రజలు" కావ్యం నోబుల్ పురస్కారానికి నామినేట్ అయింది. "నేనింతా ఒక పిడికెడు మట్టే కావచ్చు. కాని కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్న పొగరుంది" అని చెప్పిన శేషేంద్ర హైదరాబాదులో మే 30, 2007లో గుండెపోటుతో మరణించారు.            "నవ్వుల జల్లులు కురిశాయి నా మీద, పుష్పవాణి పలికింది             బిడ్డా...పువ్వుల్ని తెలియనివారే అందరూ ఈ లోకంలో              -------------   ----------------   ----------------              పుష్పవతులైన మానవీయ జాతివారందరూ మాతృదేవతలే              భార్య కూడా భర్తకు మాతృదేవతయే             ఇది కీలక రహస్యం - ఇది కీలక సత్యం"                      ఇది శేషేంద్ర రాసిన చివరి కవిత.                                                                                           .......డా. ఎ.రవీంద్రబాబు   For More Details

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? జహనారా ఇమామ్

    మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి?   జహనారా ఇమామ్     జహనారా ఇమామ్ గురించి చదివాకా శతాబ్దాల వెనకటి రచయిత్రులని వెతికే పని పక్కనబెట్టి ఈమె గురించి తెలుసుకోవాలి అందరూ అని అనిపించింది. అసలు ఈమె గొప్పదనం ఏంటో కూడా తెలుసుకుందాం. ముషిదాబాద్ వెస్ట్ బెంగాల్లో ఈమె పుట్టింది. పార్టిషన్ తరవాత ఈస్ట్ పాకిస్తాన్ లోకి వచ్చింది వీళ్ళు ఉన్న చోటు. ఈస్ట్ పాకిస్తాన్లో బంగ్లా culture influence ఎక్కువ. అది పాకిస్తాన్ కు నచ్చని విషయం. అందువల్ల తన ప్రజలమీదే అణిచివేత చర్యలు. స్వతంత్రం వచ్చిన తరవాతి పరిస్తితి ఇది ఈస్ట్ పాకిస్తాన్ లో. ఈ రాజకీయ నేపధ్యంలోనే ఈమె వైవాహిక జీవితం , ఇద్దరు మగపిల్లలు వారి యుక్త వయసు వచ్చే వరకూ నడుస్తూ వచ్చింది. ఈమె ఒక well-to-do middle class అమ్మాయి. తండ్రి సివిల్ సర్వెంట్. చదువులో ఈమె చురుకుదనం చూసిన తండ్రి ఆమె చదువుకు ఎట్టి ఆటంకాలనూ లెక్క చేయలేదు. ఆ రోజుల్లో ముస్లిం అమ్మాయిలు చదువుకోవటం సమాజం అంతగా హర్షించే విషయం కాదు. చదువు తరవాత టీచర్ గా ఉద్యొగంలో చేరింది. పెళ్ళి తరవాత ధాకా లో స్థిరపడింది. అక్కడ మళ్ళా సిద్ధేశ్వరి గల్స్ స్కూల్ లో హెడ్ మిస్ట్రెస్ గా చేరింది. అక్కడ ఆమె కార్యశీలత ఆ స్కూల్ని ధాకాలో ఉన్న ఉత్తమ పాఠశాలల్లో ఒకటిగా నిలబెట్టింది. విద్యారంగంలోనే ఆమె కృషి అంతానూ. తను చదువుకు ఎదుర్కొన్న సమాజ వ్యతిరేకత ఆమెకి ఆడపిల్లలకు చదువు ఎంత ముఖ్యమో తెలుసుకునేలా చేసింది. ఆమె ఎన్నో రచనలు బెంగాలిలో చేసింది. ఎన్నొ పుస్తకాలను ఇంగ్లీష్ నుంచి బెంగాలిలోకి అనువదించింది. ఉపాధ్యాయ శిక్షణా కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేసింది. 1971 లో బంగ్లా ఉద్యమం ఊపందుకుంది. పాకిస్తాన్ నుంచి బంగ్లా ప్రజలు విడిపోదల్చుకున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించి తిరిగుబాటు జెండా ఎగరేసారు ప్రజలు. ఆ సమయంలో జహనార ఇంటిపై కూడా నల్ల జెండా ఎగురుతూ ఉండేదట. ఆమె కుటుంబ సభ్యులందరికీ పాకిస్తాన్ నుంచి విడిపోవాలి, బంగ్లాదేష్ కి స్వేఛ్చ కావాలన్న విషయంపై ఏకాభిప్రాయం. పధెనిమిదేళ్ళ పెద్ద కొడుకు రూమి ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించాడు. పాక్ ఆర్మీ పై తిరిగుబాటు దాడులు గొరిల్లా వార్ పద్ధతిలో చేసే వాడు. అతనికి ఇంట్లో వాళ్ళ పూర్తి మద్దతు ఉండేది. కొడుకుని పాక్ ఆర్మి కళ్ళ నుంచి దాచడానికి రహస్యంగా ఇంట్లో దాక్కున్నపుడు ఆమె చాలా అవస్థ పడేదట, ఆ విషయం ఎవరికీ తెలియకుండా ఉండటం కోసం. కానీ అక్కడ ఈమె కుటుంబం ఒకటే కాదు, అన్ని కుటుంబాల్లోని యువకులూ ఉద్యమంలో పాల్గొనేవాళ్ళే. కర్ఫ్యూ విధించినపుడు వీధుల్లో ప్రజలు వేలకు వేలు తిరుగుబాటు జెండాలతో marches చేస్తుంటే, స్వాతంత్రం కావాలన్న నినాదాలతో ఆ ప్రాంతాలన్నీ మార్మోగిపోయేవట. ఆర్మీ కాల్పుల్నీ, పోతున్న ప్రాణాల్నీ కూడా లెక్క చేయకుండా ప్రజలు కర్ఫ్యూ ప్రాంతాల్లో పాక్ ధిక్కార నినాదాలు చేసేవారట. ఉద్యమంలో జరిగే రోజువారీ సంఘటనలను, ఆమె తన డైరీలో రాసేది. అయితే దీని అందం ఏంటంటే ఇంట్లో మంచం పట్టిన మామగారికి సమయానికి టీ, టిఫిన్ ఏర్పాట్లు చేయడం నుంచి బయట కర్ఫ్యూ లో ప్రజల ఇక్కట్ట్లు, జరిగే సమావేశాలు వాటి సమాచారాలతో సహా, తన కొడుకు సమయానికి ఇంటికి రానప్పుడు ఆమె పడే వేదన, బయట పరిస్తితి తెలుసుకోవటానికి ఆమె తన స్నేహితులకు ఫోన్ చేస్తే వచ్చిన జవాబులు, వారి పిల్లలు, అన్నా, తమ్ముళ్ళ గురించి వారు పడే అందొళనలతో ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నది జరుగుతున్నట్టుగా తెలుకుంటున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇది ఎన్నో ఇతర భాషలలోకి తర్జుమా అయ్యింది.   Ekattorer Dingulee (Days of 1971), బంగ్లా దేశ్లో బెస్ట్ సెల్లర్ బుక్ ఇది. Englishలో Of Blood and Fire పేరుతొ అనువదింపబడింది. ఇది చదువుతుంటే, Anne Frank రాసిన డైరీ, The Diary of a Young girlగుర్తుకువచ్చి తీరుతుంది ఎవరికైనా. 1971 లో పాక్ సైన్యం విరుచుకు పడ్డంలో ఆమె తన కొడుకునీ భర్తనీ కోల్పోతుంది. ఎవరో ఇచ్చిన సమాచారం మేరకు ఇంటికి వచ్చిన పాక్ సైన్యం ఆమె భర్తనూ ఇద్దరు కొడుకులనూ తీస్కెల్తారు. భర్త చిన్న కొడుకూ తిరిగి వస్తారు కానీ సైన్యం చిత్రహింసలకు గురయిన భర్త కు గాయాల బాధ తట్టుకోలేక గుండె నొప్పి వస్తుంది. ఆసుపత్రిలో బంగ్లా మొత్తం బ్లాకౌట్ అవటంతో, కరెంటు లేక, వైద్య సహాయం అందక చనిపోతాడు. పెద్ద కొడుకు ఎప్పటికీ తిరిగి రాలేదు. మిగిలిన చిన్న కొడుకు తనూ. అతనిని కూడా స్వతంత్రం వచ్చిన తరవాతి కొత్త ప్రభుత్వ సేవకి పంపించేస్తుంది. ఒకత్తీ మిగులుతుంది. ఆమె రాసిన డైరీ తప్పించి ఆమె అసలు సాహితీ ప్రస్థానం, బంగ్లాదేశ్ కి స్వాత్రంత్ర్యం (16/12/1971) వచ్చినప్పట్నుంచే మొదలవుతుంది. ఆమెకు ఎన్నో ఎవార్డ్స్ వచ్చాయి. వాటిల్లో ముఖ్యమైనవి : 1.Award by Bangla Writers Assocaition in 1988. 2.Bangla Academy Literary Award 1991 for Bangla Literature. 3.Greatest Freedom Fighter of 14th century (as per Bangla Calender). 4.Independence Award and Rokeya Award 1997 and 1998 posthumously. అన్నిటికన్నా గొప్ప బిరుదు, ప్రజలంతా ఆమెను ప్రేమతో పిలుచుకునేది "షహీద్ జనని" Mother of martyrs అని. ఆమెను సుచిత్రా సేన్ ఆఫ్ బంగ్లాదేశ్ అని కూడా అంటారట. ఆమె చాలా అందమైనది. స్వతంత్రం వచ్చాకా ఆమె ఘటక్-దలాల్ నిర్మూల్ కమిటీ ఒకటి స్థాపించి, యుద్ధ నేరాలకి బాధ్యులైన వారిని విచారించి శిక్షలు ప్రజా కోర్ట్ ల తీరులో అమలు జరుపుతుంది. అయితే దీనితో ఇబ్బంది పడ్డ ప్రభుత్వం ఆమెపై దేశద్రోహ నేరం మోపుతుంది. ఆమె మరణించాక, ఆమెపై కేసులన్నీ కొట్టేసారు. జమాత్-ఈ-ఇస్లాం అనే ప్రో పాకిస్తాని సంస్థ సైన్యంతో కలిసి బంగ్లా స్వాతంత్ర ఉద్యమాన్ని దెబ్బ తీసే విధంగా పని చేస్తుంది. అయితే ముస్లింస్ ను ఆకర్షించటం కోసం వారిపై నిషేధాన్ని ఎత్తివేస్తుంది ప్రభుత్వం. జహనారా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రజా కోర్టుల్లో ఆమె తీర్పులకి ప్రజల మద్దతు బాగా ఉంది. ఎందుకంటే ప్రతి కుటుంబంలోనుంచి కనీసం ఒక వ్యక్తి అయినా స్వతంత్రం కోసం ప్రాణాలు కోల్పోయిన వారే. పాక్ సైన్యం చిత్రహింసలకు గురయి మరణించినవారే. చనిపోయిన వారి సంఖ్య 3 లక్షలనుంచి 3 మిల్లియన్ అని అంచనా అంటే ఎంత మారణకాండే జరిగిందో ఊహించవచ్చు. ఎంత కౄరమైన అణిచివేత. అసలెంత మాత్రం ఆశ్చర్యం లేదు ప్రజా కోర్టులు తీర్పులిచ్చాయంటే. దీనిని అతి దారుణ మారణ కాండగా వర్ణించవచ్చేమో. త్రోట్ కేన్సర్ వచ్చిన పదమూడేళ్ళకి 1994 లో ఆమె చనిపోయింది. అయితే ఆమె సాహితీ ప్రస్థానానికి కేన్సర్ ఏమాత్రం అడ్డు రాలేదు. తన కొడుకునీ భర్తనీ త్యాగం చేసి, బంగ్లా ఆడవారి ఉన్నతికై పాటుపడి, తన చిన్న కొడుకుని కూడా దేశ సేవకే అర్పించి తాను కూడ ప్రజా సంక్షేమంకోసం ప్రత్యక్షంగా, సాహిత్య పరంగా ఎంతో సేవ చేసిన జహనారా అమెరికా లోని డెట్రాయిట్లో మరణిస్తే, ఆమె కోరిక మేరకు ఆమెను ధాకా లో సమాధి చేసారు. ఆమె అంత్యక్రియలకు రెండున్నర లక్షలమంది ప్రజలు తరలి వచ్చారట. ఇప్పటికీ ఆమె వర్ధంతిని బంగ్లా దేశ్ ప్రధాని, చీఫ్ జుస్టిస్లతో సహా హాజరయి ఘనంగా జరుపుతారు. మళ్ళీ కలుసుకుందాం ఒక వారంలో ఇంకొక అద్భుత రచయిత్రి పరిచయంతో.            Sivapurapu Sharada