ఏది ఎటు
posted on Jun 11, 2022
ఏది బలం ??
పిడికిలి బిగింపులోనా ...
పట్టు విడవటమా...!!
నీ విలువ ఎక్కడ ??
మాట వినిపించేటపుడా...
మౌనాన్ని భూషణంగా
ధరించేటపుడా...!!
నీ సంతోషం ఎక్కడ ??
నీకై నీవే అనే
నిజం తెలుసుకున్నప్పుడా ...
సంతోషపెట్టని ఆటంకపు
క్షణాలను వెంటాడి వెంటాడి
వేసారినను ముగుంపులేని
వెతుకులాటలలోనా ...??
ఎంత దూరం ??
ఎంతకాలం ??
ఎటువైపు ??
ఏమో
శూన్యానికి శూన్యానికి
మధ్య ఎంత విశ్వం
పరుచుకుందో...!!
నీకు నీవే అందనంతగా
ఎటో వైపు పరిగెడితే జ్ఞాపకాల
బరువును దింపుకోగలవా...!!
ఈ ముగింపు తెలియని
పయనం ఏ దిక్కుకో
ఎవరికి ఎరుక ...??
రచన: కవిత రాయల