మనిషి-మానవత్వం

మనిషి-మానవత్వం

 

ఏ వ్యక్తిని పలకరించిన
హృదయతలపులు తెరచుకోవడం లేనేలేదు
పనివుంటే వింత పలకరింత
లేని చిరునవ్వు పులుముకుని
కళ్ళలో ఓ కాంతిని వెలిగించి
ఆ క్షణం మమకారం పరోపకారం మమత మానవత్వం వెలిగిపోతుంటది
కోటి నక్షత్రాలు కాంతులతో

అవసరం మనిషిని మరోలా మార్చేస్తుంది 
ఎంతవారైనా తీరం దాటేదాకా
తలవంచాల్సిందే 
తట్టుకుని నెట్టుకురావాల్సిందే

సంతోషం సంబరంగా మారాలంటే
జీవనగమనంలో గమ్యం చేరాల్సిందే
పదిమందికి దారికావాలంటే
పరీక్షలనెన్నో నెగ్గాల్సిందే

మరోచరిత్ర సృష్టించాలంటే
మనిషిని మనిషిగా గౌరవించాల్సిందే
ఓపిక మంత్రం జపిస్తూ 
సహాయపడుతూ సాగాలి
సౌజన్యం నిండగ 
ఐక్యతతో మెలగాలి

అడుగుల్లో జంకులేక ముందుకు సాగాలి
అవనినంత వెలిగించగ
అలుపులేక గెలుపుకై సాగగ
పుడమినంత మొలిపించగ
మానవత్వ కుసుమాలు
పరిమళాలు వెదజల్లగ

 

- సి. శేఖర్