శ్రీరాముడు అందరివాడు
posted on Apr 21, 2021
శ్రీరాముడు అందరివాడు
ఆయన జననం లోక కళ్యాణం
ధైర్యశాలీ ధీశాలి ధీరుడు
ఎదురులేనివాడు
ఎదుర్కొనువాడు
గుణంలో శ్రేష్టుడు
రూపంలో సత్యవాక్ పరిపాలకుడు
మత్స్యర్యం లేనివాడు
అందరికీ మేలుచేసే మనసున్నవాడు
తల్లిదండ్రుల పట్ల భక్తిభావంగలవాడు
పెద్దల పట్ల వినయవిధేయతలు గలవాడు
ఏకపత్నీవ్రతుడు
అందమున్నవాడు
అసూయలేనివాడు
అన్నదమ్ముల పట్ల ఆప్యాయత గలవాడు
కష్టలెన్నెదురైనా ఓర్పుతో నేర్పుగా విజయం పొందిన సాహసికుడు
అందరికీ లోకంలో ఆదర్శప్రాయుడు
అందరివాడు శ్రీరాముడు
కె. ఉదయ్ కిరణ్