ఉగాది కళ
posted on Apr 23, 2018
ఉగాది కళ
పగలు, రాత్రుల మధ్య
కరిగిపోయే కాలంతో
ప్రకృతికీ విసుగేస్తుంది
ఆ చిరాకుకి విరామ చిహ్నాలే
ప్రకృతి వైపరిత్యాలు
అందుకే సృష్టికర్త
ప్రకృతికి తలంటోస్తాడు
కొత్తబట్టలు (చివుళ్ళు) వేస్తాడు
పూలతో అలంకరిస్తాడు
కోకిల కచేరి ఏర్పాటుచేస్తాడు
రాగరంజితమైన ప్రకృతిని
మనిషి ఉగాది అనుకుంటాడు
మమేకమవుతాడు, తాదాత్మ్యత నొందుతాడు
అన్నాళ్లూ చుట్టుకున్న యాంత్రికతను తరిమివేసి
సహజత్వంతో మిస మిసలాడతాడు
జీవితపుస్తకంలో కొత్త పుటను ప్రారంభిస్తాడు
రచన : శ్రీ ప్రతాప వెంకట సుబ్బరాయుడు గారు