నివురు!!
posted on Jul 17, 2024
నివురు!!
బ్రతుకునెన్నో ఎన్నెన్నో
నిరంతర నిరాశల
శిశిరాలు ఆవహించి
నిశాశ్మశానశయ్యల్లో నిద్రించనీ!
మరల మరల
వినూత్న కోరికల
వసంతాలు హృదినపూచి
జీవనవికాసం వర్ధిల్లనీ!
నిత్య సంఘర్షణల
నైరాశ్యపు నిప్పులు
ధైర్యపుటాశావర్షపు ఝరిలో
మునిగి నివురవనీ!
నిస్పృహావశేషములు
ధరాగర్భంలో కలిసి
ధీర్ఘయామినిలో
మూగరోదనతో మిగిలిపోనీ!
- రవి కిషొర్ పెంట్రాల