నీ ప్రేమకై
posted on Aug 18, 2018
posted on Aug 18, 2018
నీ ప్రేమకై
పువ్వునైనా కాకపోతిని నిన్ను అలంకరింపగ
నవ్వునైనా కాకపోతిని నీ మోమున వికసింపగ
సమిధనైనా కాకపోతిని నీకు వెలుగునివ్వగ
శయ్యనైనా కాకపోతిని నీ సేద తీర్చగ
మన్నునైనా కాకపోతిని నీ పాద స్పర్శ తగలగ
కవినైనా కాకపోతిని నిన్ను వర్ణింపగ
మనిషినై యుంటిని నీ ప్రేమకై మరల జన్మించగ.
- నవీన