డబ్బు చేసే నాటకం
posted on Dec 12, 2020
డబ్బు చేసే నాటకంలో మనుషులు
మమతలు కపటాలు అంటూ
భావాలు పలికిస్తూ ఉంటారు.
ఇందులో ముఖ్యంగా అవసరం ఉన్నప్పుడు మాత్రం వినయాన్ని
అవసరం తీరాక చులకనగా పరిస్థితులను బట్టి డబ్బు మనుషుల భావాలను
లిఖిస్తుంది శాసిస్తుంది.
ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే
ఎంత సంపాదించినా ప్రశాంతత లేకుంటే వృధా
అవసరానికి మించి చేసేది ఏది మనకి సుఖాన్ని ఇవ్వదు
- Malleshailu