నాలో...నేనే
posted on Apr 9, 2019
నాలో...నేనే
ఎవరో తనుఎవ్వరో...
నా అందానికే అందం తెచ్చిన
చిత్రకారుడెవరో?
ఆ చేతి వాటం ఏంటో?
నా అందాన్ని నేను చూసి
నాలో నేను నాతో నేను
సరి పోల్చుకుంటున్నా...
నాలో నేనే మురిసిపోతున్నా...
ఆకాశమంతటి కాన్వాస్ పై
ఇంద్రధనస్సులోని రంగులను
అవని అంతటి సహనశీలియైన
అమ్మవంటి వనిత రూపానికి
నా కుంచె తో ప్రాణం పోశా...
ఇలలో కలలో నీకన్నా అందం
ఇంకెక్కడైనా ఉందా? అంటూ
నాలో నేనే మురిసిపోతున్నా!!
-కుంచె చింతాలక్ష్మీనారాయణ.