దేశం- సర్వస్వం
posted on Apr 24, 2021
బానిసగా బతకాలని ఏ జీవి కోరుకోదు
భవిష్యత్తు అంధఃకారం నింపుకోవాని కోరికేదేశానికుండదు
మనదేశం మాత్రమెందుకో ఎందరెందరో పరాయిపాలకుల ఏలుబడిలో కాలమెల్లదీసిందెందుకో?
అష్టదిక్కులనుండి అంతా ఆక్రమించి
వచ్చిన ప్రతివాడిచేతిలో దోపిడికి చిరునామయ్యింది
సర్వసంపదలకు నిలయం నా దేశం
పచ్చని పంటలతో అన్నపూర్ణగా అవనికెక్కింది
అఖండ భారతావని ఎందరో వీరులకు పుట్టినిల్లు
అలాంటి నా దేశం మువ్వన్నెల జెండా నీడలోకి వచ్చిన చరిత్ర చూస్తే
ప్రతి భారతీయుడు ఐక్యతమత్మ్యం అనే నినాదం గుండెనింపుకుని సాగాలనేదే మనదేశ అశోకచక్రంలో గుర్తుకు సార్థకత
మనలో మనకు భేదాలొద్దు
భారతీయతే మనందరికి ముద్దు
జనగనమణ వందేమాతరం దేశభక్తి గీతాలే ఐక్యతరాగాలు
సోధరభావం సమరసబావం
పోరాడి తెచ్చిన స్వతంత్ర్యానికి బలం
అది అమరుల త్యాగఫలం ఎప్పుడు వాడిపోనిదై దేశమాత కీర్తి నిలపగా మనమంతా కలిసి నిలువగా
- సి. శేఖర్(సియస్సార్)