ఇది కధ కాదు కదా
posted on Oct 31, 2020
ఇది కధ కాదు కదా
నువ్వు చెక్కిన శిలకు కన్నీళ్లోస్తే
భయమెందుకు!
నీ తపన ఈ శిలకు ప్రాణంపోయాలనే గాని,
ఓ రాయిని నొప్పించాలని కాదు కదా!
నీ కనులకు మెలుకొవస్తే
కలవరమెందుకు!
రేయి పగలు నీకనులకే గాని
నీ కలకు కాదు కదా!
నీ బ్రతుకు చిత్రాన్ని
భగవంతుడు ముందే గీసేశాడని
ఆలోచనెందుకు.
తను సృష్టించాడే గాని,
నువ్విలాగే బ్రతికేయమని
నిన్నేమి శపించలేదు కదా!
శిలకొచ్చిన కన్నీళ్ళు కృతజ్ఞత కాబోలు,
నీకొచ్చిన కల నీ భవిష్యత్తు కాబోలు,
శపించబడని ఈజన్మ గతజన్మ వరం కాబోలు.
జీవితమంటే ఆస్వాదించటమే కాదు,
త్యాగాలు కూడా ఉంటాయి.
కలవరపెట్టే కలలే కాదు,
కన్నీళ్ళతో కూడా సంతోషపడే
కమ్మని అనుభవాలు కూడా ఉంటాయి.
ఎందుకంటే ఇది కధ కాదు కదా!
- Syed Tajuddin