నువ్వే నా ప్రపంచం
posted on Dec 29, 2020
నువ్వే నా ప్రపంచం
కాలం మారిపోయింది
నాకు నీ మీదున్న ప్రేమ గతంగా మారిపోలేదు.
ప్రపంచం పరుగెడుతుంది
నేను నీ జ్ఞాపకాలతో అక్కడే ఉండిపోయాను.
దూరం పెరిగిపోయింది
నీకు దగ్గరవుతానన్న నమ్మకం దూరమవలేదు.
కాలం మారినా, దూరం పెరిగినా
నీ మీదున్న ప్రేమ పోదు
నీ జ్ఞాపకాలు దూరం కావు.
ఎందుకంటే
ప్రపంచం.. నువ్వే నా ప్రపంచం
నీకే నా జీవితం అంకితం.
గంగసాని