శిశిరోత్సాహం
posted on Jun 4, 2022
దివి భువి
ఏకం చేసేటంతటి
ఉత్సాహం నిత్యం
నీ తోడు ఉండాలంటే...
కాలమనే
మాను నుండి
సాలు సాలుకు
ఓ కమ్మ అనుభవాల
సారంతో పండి ఎండి
నేల రాలుతున్న అప్పుడల్లా...
సడలి పోతున్న
నిబ్బరానికి హరిత వర్ణపు
లేలేత ఈప్సితాలను
నింపుకుంటూ...
మానుకో మొన్నటికో తప్ప
రేపటికి ఎన్నటికీ
శిశిరం రాదనే ధైర్యాన్ని
వూతంగా చేసుకొని...
ముందుకు సాగిపోవటమే
గొప్ప శిశిరోత్సాహం
కడవరకు ...!!
కవిత రాయల