సమ్మర్ స్పెషల్ పుచ్చకాయ జ్యూస్
సమ్మర్ సీజన్ వచ్చేసింది. ఈ సీజన్లో కూల్ డ్రింక్స్, జ్యూస్లు లాంటి శీతల పానియాలు తాగడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే ఈ వేసవికాలంలో చల్లగా ఉండే పుచ్చకాయ జ్యూస్ మీకోసం..
కావలసిన పదార్ధాలు:
* ఐస్ క్యూబ్స్
* రెండు కప్పుల పుచ్చకాయ ముక్కలు
తయారీ విధానం:
* ముందుగా ఐస్ ముక్కల్ని మొత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
* అందులో పుచ్చముక్కలు కూడా వేసి ఒక నిమిషం పాటు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
* చివరిగా అందులో కొంచెం తేనె వేసి గ్రైండ్ చేసుకోవాలి.
* అంతే ఎంతో రుచిగా ఉండే పుచ్చకాయ జ్యూస్ రెడీ.
