గ్రీన్ ఎగ్ మసాలా!
కావాల్సిన పదార్థాలు:
గుడ్లు - 4 (ఉడికించినవి)
అల్లం - కొద్దిగా
వెల్లుల్లి - కొద్దిగా
జీడిపప్పు - 10
మిరపకాయలు-4
పెరుగు - 5 టేబుల్ స్పూన్లు
పుదీనా - కొద్దిగా
కొత్తిమీర - కొద్దిగా
నూనె - కొద్దిగా
జీలకర్ర - అర చెంచా
కరివేపాకు - కొద్దిగా
ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినవి)
ధనియా పొడి - 1 టేబుల్ స్పూన్
పసుపు - కొద్దిగా
గరం మసాలా - అర టీస్పూన్
నల్ల మిరియాల పొడి - అర చెంచా
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం :
గ్రీన్ ఎగ్ మసాలా తయారు చేసే ముందు ముందుగా మిక్సీ జార్ లో అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, పచ్చిమిర్చి, పెరుగు, పుదీనా, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణాలి పెట్టి అందులో నూనె పోయాలి. నూనె వేడి అయ్యాక అందులో జీలకర్ర, కరివేపాకు,ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న పేస్టును అందులో వేయాలి. పది నిమిషాల పాటు ఉడించిన తర్వాత...అందులో ధనియాల పొడి, పసుపు, గరం మసాలా పొడి, ఉప్పు వేయాలి. అన్నింటిని బాగా కలపాలి. ఒక పది నిమిషాల తర్వాత అందులో ఉడికించిన గుడ్లకు గాట్లు వేసి అందులో వేయాలి. ఇలా మరో 10 నుంచి 15 నిమిషాలు సన్నని మంటపై ఉడికించాలి. నీళ్లన్నీ ఇంకిపోయి..నూనె పైకి తేలేవరకు వేయించిన తర్వాత...కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకుంటే రుచికరమై గ్రీన్ ఎగ్ మసాలా రెడీ.