మొలకలతో పోహా
కావాల్సిన పదార్థాలు:
అటుకులు- 2 కప్పులు
అన్ని రకాల మొలకలు - 2కప్పులు
ఉడికించిన బంగాళదుంప- సగం కప్పు
ఉల్లిపాయలు- 2
వేయించిన వేరుశనగలు - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 5
కరివేపాకు- 2 రెమ్మలు
పసుపు - 1 స్పూన్
చాట్ మసాలా - పావు టీస్పూన్
చక్కెర - 1టేబుల్ స్పూన్
నిమ్మరసం- 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర - పావు కప్పు
తురిమిన కొబ్బరి - 2 టేబుల్ స్పూన్స్
నూనె - 2 టేబుల్ స్పూన్స్
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం:
పోహాను కడిగి పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు ఉడికించిన మొలకలు, బంగాళదుంపను చాటా మసాలతో కలపండి.
కడాయిలో నూనె వేడి చేసి అందులో ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి.
తర్వాత తరిగిన ఉల్లిపాయలను వేసి రెండు నిమిషాలు వేయించాలి.
ఇప్పుడు ఉప్పు, పసుపు, పంచదార వేయాలి.
తర్వాత కడాయిలో సిద్దంగా ఉంచిన మొలకలను వేయాలి.
అందులో వేరుశనగలను వేయాలి. పైనా నీళ్లు చల్లి మూతపెట్టి ఒక నిమిషం ఉడికించాలి.
తర్వాత నిమ్మరసం, కొత్తిమీర, కొబ్బరి తురుము వేయాలి.
తేలికగా కలపాలి.
అంతే మొలకల పోహా రెడీ.