బనానా చిప్స్

కావాల్సిన పదార్థాలు :

పచ్చి అరటికాయలు - 2 రెడ్ చిల్లీ పౌడర్ - 1/4స్పూన్ బ్లాక్ పెప్పర్ -1/4స్పూన్ చాట్ మసాలా - 1/4స్పూన్ ఉప్పు - రుచికి సరిపడా నూన్ - 2 స్పూన్స్ జీలకర్ర పొడి - చిటికెడు

తయారీ విధానం:

1. ముందుగా అరటికాయల తొక్కలు తీయాలి. ఆపై వాటిని చిప్స్ కట్టర్ సహాయంతో ముక్కలు చేయాలి.

2. ఇప్పుడు ఈ ముక్కలపై కొద్దిగా నూనె, పసుపు, ఉప్పు వేసి అన్నింటినీ మిక్స్ చేయాలి.

3. ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్‌లో ఒక పొరలుగా పరచాలి. కొద్దిగా నూనెను చిలకరించి, 160 డిగ్రీల సెల్సియస్ వద్ద ఎయిర్ ఫ్రై చేయండి.

4. చిప్స్ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు, వాటిపై కారంపొడి, చాట్ మసాలా, నల్ల మిరియాలు, జీలకర్ర పొడి చల్లి ఈ గిల్ట్ ఫ్రీ స్నాక్‌ని మిక్స్ చేయండి. 5. సింపుల్ బనానా చిప్స్ రెడీ.