వెజిటబుల్ ఉప్మా
కావలసిన పదార్థాలు:
గోధుమరవ్వ - ఒక కప్పు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
క్యారెట్ - ఒకటి
క్యాప్సికమ్ - ఒకటి
బేబీకార్న్స్ - రెండు
పచ్చి బఠాణీలు - పావుకప్పు
అల్లం తురుము - ఒక చెంచా
వెల్లుల్లి తురుము - ఒక చెంచా
నూనె - రెండు చెంచాలు
ఆవాలు - అరచెంచా
మిన్నప్పప్పు - అరచెంచా
శనగపప్పు - అరచెంచా
పసుపు - చిటికెడు
ఉప్పు - తగినంత
కరివేపాకు - ఒక రెమ్మ
నీళ్లు - తగినన్ని
తయారీ విధానం:
ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్, బేబీ కార్న్స్ ని ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. వేడెక్కాక అల్లం, వెల్లుల్లి తురుము వేయాలి. పచ్చి వాసన పోయాక కరివేపాకు, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేయాలి. కాస్త రంగు మారాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. వేగాక కూరగాయ ముక్కలు, పచ్చి బఠాణీ వేయాలి. ఓ క్షణం పాటు వేయించి మూత పెట్టేయాలి. ముక్కలు మగ్గేవరకూ సన్నని మంట మీద ఉంచాలి. తరువాత నీళ్లు పోసి, ఉప్పు, పసుపు వేసి మూత పెట్టేయాలి. ముక్కలు ఉడికి, నీళ్లు మరుగుతున్నప్పుడు గోధుమరవ్వ వేయాలి. రవ్వ ఉడికేవరకూ ఉండలు కట్టకుండా సన్నని మంట మీద ఉడికించాలి. నీళ్లన్నీ ఇగిరిపోయి, ఉప్మా దగ్గరగా అయ్యాక దించేసుకోవాలి.
-sameeran
