వెజ్ కర్డ్ శాండ్‌విచ్
కావలసిన పదార్థాలు:
బ్రెడ్ స్లయిసెస్ - నాలుగు
చిక్కటి పెరుగు - అరకప్పు
క్యారెట్ - ఒకటి
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - ఒకటి
మిరియాల పొడి - రెండు చెంచాలు
కరివేపాకు - ఒక రెమ్మ
కొత్తిమీర - కొద్దిగా
బటర్ - రెండు చెంచాలు
ఉప్పు - తగినంత
ఆలివ్ ఆయిల్ - ఒక చెంచా
తయారీ విధానం:
క్యారెట్ ను సన్నగా తురుమాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తమీరలను కూడా సన్నగా తురమాలి. ఓ బౌల్ లో వీటన్నిటితో పాటు ఆలివ్ ఆయిల్, ఉప్పు, పెరుగు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. బ్రెడ్ స్లయిసెస్ ని బటర్ వేసి ఎర్రగా కాల్చుకోవాలి. ఆ తరువాత వీటిని కావలసిన ఆకారంలో కట్ చేసుకుని, మధ్యలో ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పెట్టి సర్వ్ చేయాలి. కావాలంటే ముందే మిశ్రమాన్ని బ్రెడ్ మధ్యలో పెట్టి కూడా కాల్చుకోవచ్చు. సమ్మర్ లో తినడానికి ఈ శాండ్ విచ్ లైట్ గా ఉండి చక్కని శక్తినిస్తుంది. దాహం కూడా వేయదు.
- Sameera
