టమోటా సాంబారు
కావలసినవి:
టమోటాలు - 8
కరివేపాకు - ౩ రెబ్బలు
సాంబారు పొడి - ౩ స్పూన్లు
ఉల్లిపాయలు - 4
కొత్తిమీర - 2 స్పూన్లు
పచ్చిమిర్చి - ౩
కందిపప్పు - అరగ్లాసు
పచ్చికొబ్బరి - 1 ముక్క
పసుపు - చిటికెడు
ఉప్పు - తగినంత
తయారుచేసే విధానం:
* స్టౌమీద బాణలి పెట్టి పచ్చిశనగపప్పు వేసి వేగనిచ్చి, ధనియాలువేసి వేపుతూ మిరపకాయలు, మెంతులువేసి అన్నీ వేగాక కరివేపాకువేసి దించి చల్లార్చి, జీలకర్ర చేర్చిపోడిచేయ్యాలి. టమోటాలు, ఉల్లిపాయలు, కొబ్బరిముక్కలు తరిగి మెత్తగారుబ్బి, ఉప్పు, పసుపువేసి, ఉడికించాలి. కందిపప్పు ముందుగానే ఉడికించి వుంచాలి. ఇప్పుడు కందిపప్పులో టమోటాముద్దవెయ్యాలి. సాంబారు మరిగే టప్పుడు కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పచ్చిమిర్చి, సాంబారుపొడివేసి దించాలి. వేరే గిన్నెలో తాలింపువేసి ఇందులో కలపాలి.
