టమాటో బాత్
కావాల్సిన పదార్ధాలు:
బొంబాయి రవ్వ - ఒక కప్పు
టమాటాలు - రెండు
క్యారెట్ తరుగు - పావు కప్పు
ఉల్లిపాయ తరుగు - అర కప్పు
బటాని - పావు కప్పు
పచ్చిమిర్చి - ఒకటి
అల్లం తరుగు - ఒక టేబుల్ స్పూన్
కరివేపాకు - ఒక రెబ్బ
కొత్తిమీర తరుగు - రెండు టేబుల్ స్పూన్స్
జీడి పప్పు - కొద్దిగా
ఆవాలు - ఒక టేబుల్ స్పూన్
సెనగపప్పు - ఒక టేబుల్ స్పూన్
మినపప్పు - ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్
పసుపు - అర టీ స్పూన్
ఉప్పు - సరిపడా
నూనె - రెండు టేబుల్ స్పూన్స్
నెయ్యి - పావు కప్పు
నీళ్ళు - మూడు కప్పులు
తయారీ విధానం:
* బొంబాయి రవ్వని సన్నని మంట మీద మంచి సువాసన వచ్చే దాక వేపుకుని పక్కన పెట్టుకోవాలి.
* మరొక కళాయి లో ఒక స్పూన్ నెయ్యి, రెండు స్పూన్స్ నూనె వేసి అందులో జీడిపప్పు ఎర్రగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
* అదే నూనె లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, సెనగపప్పు,కరివేపాకు, అల్లం తరుగు వేసి ఎర్రగా వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి 2 నిమిషాల పాటు వేపుకోవాలి.
* ఆ తరవాత టమాటో ముక్కలు వేసి 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత అందులో క్యారెట్ తరుగు, బటాని, పుసుపు, ఉప్పు వేసి వాటిని 80% కుక్ చేసుకోవాలి.
* ఇప్పుడు అందులో నీళ్ళు పోసి వాటిని బాగా మరగనివ్వాలి. నీళ్ళు మరిగాక అందులో రవ్వ వేసి బాగా కలిపి మూత పెట్టి 3 నిమిషాలు ఉడికించుకోవాలి.
* ఆఖరులో కొత్తిమీర, జీడిపప్పు, మిగిలిన నెయ్యి వేసి బాగా కలిపి దించేయడమే.