టోఫు పనీర్ స్నాక్!
కావలసిన పదార్ధాలు:-
టోఫు పనీర్ - 200 గ్రాములు
పసుపు - 1/2 చెంచా
మిరియాల పొడి - 1/2 చెంచా
కారం - 1 చెంచా
జీలకర్ర - 1/2 చెంచా
ధనియ పొడి - 1/2 చెంచా
పెరుగు - 2 చెంచాలు
ఉప్పు - తగినంత
నూనె - తగినంత
తయారీ విధానము:-
ముందుగా టోఫు పన్నీర్ ను చతురస్రాకారంగా, చక్కని , క్యూబ్స్ గా కట్ చేసుకోవాలి. తరువాత ఒక పాత్ర లో , పైన చెప్పిన ఉప్పు, కారం, మిరియాల పొడి, జీరా ధనియ పొడి అన్ని వేసి, పెరుగు కూడా వేసి బాగా కలపాలి, ఈ కలిపిన మిశ్రమం లో , పనీర్ క్యూబ్స్ ను వేసి చక్కగా, మసాలా అంట్టేట్టు చూసుకోవాలి.
ఇప్పుడు, పాన్ ను వేడి చేసి, పనీర్ క్యూబ్స్ ఒక్కక్కటి పాన్ మీద వేసి, చుట్టూ నూనె వేస్తూ దోర గా ఫ్రై చేయాలి, ఇలా తయారు చేసున్న పనీర్ క్యూబ్స్ ను , టమాటో తో స్నాక్స్ గా అందిస్తే, ఎంతో రుచికరంగా ఉండటమే కాక, ఇది పిల్లలకు , మంచి బలవర్ధకమైన ఆహరం కూడాను.
-Bhavana
