స్టఫ్డ్ బేసన్ మిర్చి
కావాల్సిన పదార్థాలు:
-పచ్చి మిరపకాయలు (మందపాటి మిరపకాయలు, పొడవుగా కట్ చేసి, గింజలు కోసుకోవాలి)
-నూనె - డీప్ ఫ్రైకు సరిపడా.
-శనగపిండి
-నీళ్లు
-అల్లం పేస్ట్
-వెల్లుల్లి పేస్ట్
-ఉప్పు-రుచికి సరిపడా
-ఓమా
-బేకింగ్ సోడా
తయారీ విధానం:
-స్టఫ్డ్ బేసన్ మిర్చి తయారు చేయడానికి ముందుగా పచ్చిమిర్చిని బాగా కడిగి సగానికి కట్ చేసుకోవాలి.
-ఒక గిన్నె తీసుకుని అందులో శనగపిండి వేసి నీళ్లు పోయాలి. పిండిని చిక్కగా ఉండలు లేకుండా కలపాలి. మరీ పలచగా ఉండకూడదు.
-అందులో అల్లం వెల్లుల్లిపేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. మిర్చిలు కొంచెం బొద్దుగా రావాలంటే బేకింగ్ సోడా కూడా కలుపుకోవచ్చు.
-అందులో కొంచెం ఓమా వేస్తే రుచి బాగుంటుంది.
-సిద్దం చేసుకున్న పిండిలో పచ్చిమిర్చి ముంచి బంగారు వర్ణంలోకి వచ్చే వరకు నూనెలో వేయించాలి.
-దీన్ని పుదీనా కొత్తిమీర చట్నీ లేదా డ్రై అల్లం చట్నీతో సర్వ్ చేయండి.