ఉల్లికాడల పకోడీ
కావలసిన పదార్థాలు:
ఉల్లికాడలు - ఆరు
పచ్చిమిర్చి - ఒకటి
అల్లం ముక్క - చిన్నది
శనగపిండి - అరకప్పు
కారం - అరచెంచా
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
ధనియాల పొడి - అరచెంచా
గరం మసాలా - అరచెంచా
సోంఫు పొడి - అరచెంచా
నూనె - వేయించడానికి సరిపడా
తయారీ విధానం:
ఉల్లికాడల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అల్లాన్ని, పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. వీటన్నిటినీ ఓ బౌల్ లో తీసుకుని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, సోంఫు పొడి, గరం మసాలా వేసి కలపాలి. తరువాత శనగపిండి వేసి... కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. బాగా కాగిన నూనెలో పకోడీల్లా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని టొమాటో సాస్ తో తింటే చాలా బాగుంటాయి.
- sameera
