సొరకాయ మజ్జిగపులుసు
కావలసిన పదార్థాలు:
సొరకాయ - ఒకటి
పెరుగు - ఒక కప్పు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
దాల్చిన చెక్క - చిన్నది
లవంగాలు - నాలుగు
ఆవాలు - ఒక చెంచా
జీలకర్ర - అరచెంచా
అల్లం పొడి - అరచెంచా
మెంతిపొడి - ఒక చెంచా
ఇంగువ - పావు చెంచా
పసుపు - ఒక చెంచా
నూనె - రెండు చెంచాలు
ఉప్పు - తగినంత
తయారీ విధానం:
సొరకాయను శుభ్రంగా కడిగి ముక్కలు కోసుకోవాలి. పెరుగులో కొద్దిగా నీళ్లు కలిసి బాగా చిలికి పక్కన పెట్టాలి. ఉల్లిపాయ, పచ్చి మిరపకాయల్ని ముక్కలుగా కోసి మజ్జిగలో వేయాలి. స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. కాగాక లవంగాలు, దాల్చిన చెక్క వేయాలి. కాస్త రంగు మారాక ఆవాలు, జీలకర్ర వేయాలి. చిటపటలాడాక సొరకాయ ముక్కలు వేయాలి. ముక్క కాస్త సాఫ్ట్ గా అయ్యే వరకూ వేయించి... అల్లం పొడి, , మెంతిపొడి, పసుపు వేసి బాగా కలపాలి. ఓ నిమిషం పాటు వేయించి ఇంగువ, ఉప్పు వేయాలి. మరో నిమిషం వేయించాక మజ్జిక వేసి బాగా కలపాలి. మజ్జిక వేడెక్కే వరకూ ఉంచి దించేసుకోవాలి. ఎక్కువ సేపు ఉంచితే విరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే మరీ వేడెక్కనివ్వకూడదు.
- Sameera
