సొజ్జ అప్పాలు
వీటిని హల్వా పురీ అనికూడా అంటారు.
కావలసిన పదార్ధాలు :
బొంబే రవ్వ - 1 కప్పు
చక్కెర - 2 కప్పులు
ఇలాచి పొడి - 1/4 చెంచాలు
మైదా - 1 కప్పు
ఉప్పు - చిటికెడు
నెయ్యి - 2 చెంచాలు
తయారుచేసే విధానం :
* ముందుగా కప్పు రవ్వ కొద్దిగా వేయించి పెట్టుకోవాలి.
* ఇప్పుడు వేయించుకొని పెట్టుకున్న రవ్వలో 2 కప్పుల చెక్కెర, 2 1/2 కప్పుల నీరు పోసి ఉడికించి హల్వా గట్టి పడ్డాక స్టౌవ్ ఆఫ్ చేసి చల్లారబెతుకోవాలి.
* తరువాత మైదాలో కొద్దిగా ఉప్పు, నూనె వేసి పలుచగా కలిపి 4 గంటలు సుమారు నానబెట్టుకోవాలి.
* అది చేతిలోకి తీసుకొని పరిస్తే మెత్తగా పలుచగా ఉండాలి. అలా మెత్తని మైదా ముద్ద కొద్దిగా తీసుకొని చేతిలో పలుచగా పరుచుకొని హల్వాని ముద్దగా చేసుకుని.. ఆ ముద్ద చుట్టూ మైదాని కూర్ఫాలి.
* ఆ ముద్దని పలుచని పోలధిన్ పై వేసి బొబ్బట్టులా (లేక) చిన్న పురీలా ఒతుకోవాలి. ఇలా 4, 5 ఒత్తుకొని నూనె బాగా వేడెక్కాక స్టౌవ్ ని సిమ్ లో పెట్టి ఒకొక్కటిగా ఈ పూరీలను వేయించుకుని.. బంగారు వర్ణం వచ్చే వరకు వేగాక..... టిష్యూ పేపర్ పైకి తీసుకోవాలి. చాలారుచిగా ఉంటాయి. ఈ హల్వా పూరీలు 2 రోజులు నిల్వ కూడా ఉంటాయి.
