షామీ కబాబ్
కావలసిన పదార్థాలు:
మటన్ ఖీమా - అరకిలో
కోడిగుడ్లు - రెండు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - ఐదు
శనగపప్పు - వంద గ్రాములు
వెల్లుల్లి రేకులు - ఐదు
జీలకర్ర - ఒక చెంచా
యాలకులు - నాలుగు
దాల్చిన చెక్క - చిన్నది
అల్లం ముక్క - చిన్నది
మిరియాలు - ఆరు
ఎండుమిర్చి - నాలుగు
నూనె/నెయ్యి - వేయించడానికి సరిపడా
తయారీ విధానం:
శనగపప్పుని రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నీళ్లు ఒంపేయాలి. ఖీమాలో నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి బాగా ఉడికించాలి. తరువాత మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, ఎండుమిర్చి కలిపి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ రెండు పేస్టులనూ బాగా కలపాలి. ఆపైన కోడిగుడ్డు సొన కూడా వేసి కలిపి పక్కన పెట్టాలి. ఉల్లిపాయ, పచ్చి మిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని మటన్ మిశ్రమంలో కలిపేయాలి. ఆపైన కొద్దికొద్దిగా తీసుకుని కబాబ్స్ లాగా ఒత్తుకోవాలి. వీటిని నూనెలో కానీ నేతిలో కానీ డీప్ ఫ్రై చేసుకోవాలి.
- Sameera
