శనగపప్పు వడలు (దీపావళి స్పెషల్)
కావలసిన పదార్థాలు:
పచ్చిశనగపప్పు - పావుకిలో
నూనె - అరకిలో
జీలకర్ర - 2 టీ స్పూన్లు
ఉప్పు - తగినంత
ఉల్లిపాయలు - 4
పచ్చిమిర్చి - 6
తయారు చేసే పద్ధతి:
* నానబెట్టిన శనగపప్పును కడిగి ఉంచుకోవాలి.
* అందులోంచి ఒక గుప్పెడు పప్పు తీసి ఉంచి, మిగిలినదానికి తగినంత ఉప్పువేసి కొంచెం బరకగా రుబ్బుకోవాలి.
* దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, పక్కన ఉంచిన శనగపప్పు, జీలకర్ర కలపాలి.
* బాణలిలో నూనె కాగనిచ్చి, నిమ్మకాయంత ఉండలు చేసి, పాలిథిన్ కవర్ పై వడలు వత్తి, ఎర్రగా వేయించుకోవాలి.
* పిండిలో తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేస్తే, శనగపప్పు వడలు మరింత రుచిగా ఉంటాయి.
* నంజుకోడానికి అల్లప్పచ్చడి, కొబ్బరి పచ్చడి, శనగపప్పు-కొబ్బరి పచ్చడి ఏదైనా బాగుంటుంది.
