ఆలూ పాపడ్
కావలసిన పదార్థాలు:
బంగాళాదుంపలు - ఒక కిలో
కారం - రెండు చెంచాలు
గరం మసాలా - ఒక చెంచా
ఉప్పు - తగినంత
నూనె - ఒక చెంచా
ఇంగువ - కొద్దిగా
తయారీ విధానం:
బంగాళాదుంపల్ని శుభ్రంగా కడిగి, నీళ్లు పోసి ఉడికించాలి. తర్వాత తొక్క ఒలిచేసి మెత్తగా చిదుముకోవాలి. ఇందులో కారం, ఉప్పు, గరం మసాలా, ఇంగువ, నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకుని... కావాల్సిన సైజులో అప్పడాల్లా ఒత్తుకోవాలి. చపాతీ పీట మీద పాలిథీన్ షీట్్ వేసి, దానికి కాస్త నూనె రాసి, దానిమీద ఒత్తితే చక్కగా వస్తాయి. ఇలా ఒత్తుకున్న అప్పడాలను ఎండలో పెట్టాలి. బాగా ఎండిన తరువాత డబ్బాలో వేసి దాచుకుని, అవసరమైనప్పుడు తీసి నూనెలో వేయించుకోవాలి.
- Sameera
