కీర, పైనాపిల్ సలాడ్
కావలసిన పదార్ధాలు:
పైనాపిల్ - రెండు
కీర దోసకాయలు - రెండు
సోయాసాస్, నిమ్మరసం - 6 చెంచాలు
వెల్లుల్లి - 2 రెబ్బలు
ఉల్లిపాయలు - రెండు
పచ్చిమిర్చి - రెండు
పంచదార - 4 చెంచాలు
తాయారుచేయు విధానం:
* పైనాపిల్, కీర చెక్కుతీసి ముక్కలు కట్ చేయాలి.
* పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు కట్ చేసుకోవాలి.
* మిర్చి, పైనాపిల్, కీర ముక్కలను బౌల్ లో వేసి కలిపి వాటికి ఉప్పు, పంచదార, నిమ్మరసం, వెల్లుల్లి తురిమి చేర్చి బాగా కలపాలి.
* సర్వ్ చేసే ముందు ఉల్లిముక్కలను వేసి కలుపుకోవాలి.
