పెసరట్లతో కూర
కావలసిన పదార్ధాలు :-
పెసలు (లేదా) పెసర పప్పు - 1 గ్లాసు
ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు
టమాటా ముక్కలు - 1 కప్పు
అల్లం వెల్లుల్లి పేస్టు - 2 చెంచాలు
ఉప్పు - తగినంత
పచ్చిమిరపకాయలు - 2
అల్లం - చిన్నముక్క
జీలకర్ర - 1 చెంచా
పసుపు - కొద్దిగా
నూనె - కూరకి సరిపడ
కారం - 1 చెంచా
ధనియాలపొడి - కొద్దిగా
గరం మసాలా - కొద్దిగా
కరివేపాకు - 8 ఆకులు
తయారీవిధానం :-
* పెసలు (లేదా) పెసర పప్పు 1 గంట నానబెట్టి కడిగి.. పచ్చిమిర్చి, అల్లం, అరచెంచా జీలకర్ర వేసి రుబ్బుకోవాలి.
* మూకుడులో సన్నగా చిన్నగా తరిగిన ఉల్లి ముక్కలు అల్లం వెల్లుల్లి ముద్ద... కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిరప ముక్కలు వేసి.. నూనెలో వేయించుకోవాలి.
* ఈ కూర దగ్గర పడేదాకా వేయించుకుని ఉప్పు, పసుపు వేయాలి. పులుపు మరికాస్త కావాలనుకుంటే చింతపండు రసం వేసుకోవాలి.
* ధనియాలపొడి, కారం, గరంమసాలా వేసి ఉడకనివ్వాలి.. ప్రక్క స్టవ్ మీద మరీ పలుచగా కాకుండా మరీ దళసరిగా కాకుండా మధ్యస్థంగా పెసరట్లు చిన్నగా బాగా దోరగా కాలేలావేసుకుని...
* 2, 3 అట్లు వేసుకున్నాక.. వాటిని చిన్న ముక్కలుగా తెంపుకుని.. ఈ కూరలో వేసి బాగా కలిపి.. కూరపైన కొత్తిమీర, పాలమీగడ (లేక) నేయి వేసి అలంకరించుకోవాలి. ఈ కూర అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.
- భారతి
