పెసర అప్పడాలు
కావలసినవి:
పావు కేజీ పెసరపిండి
అరకేజీ నూనె
ఇంగువ - టీ స్పూను
బియ్యపు పిండి - 50 గ్రాములు
కారం - 2 స్పూన్లు
తయారీ :
ముందుగా ఇంగువ కొంచెం నీటిలో నానబెట్టాలి. పెద్ద గిన్నెలో పెసరపిండి, కారం, ఉప్పు, ఇంగువ చేర్చిన నీరు పేసి బాగా కలిపి ఒక రాత్రంతా నాన బెట్టాలి. ఈ పిండి ముద్దను కొద్ది కొద్దిగా నూనే వేస్తూ బాగా దంచాలి. తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకొని వరిపిండిలో అద్దుతూ అప్పడాలు ఒత్తుకోవాలి. వీటిని ఎండలో బాగా ఆరబెట్టాలి. ఎండిన పెసర అప్పడాలను శుభ్రంగా ఉన్న డబ్బాలో నిల్వ చేసుకోవాలి. తర్వాత కావలసినప్పుడల్లా వేయించుకోవాలి. భోజనంలో, ఫలహారాల్లో నంచుకోవడానికి ఇవి బాగుంటాయి.
